MCA course
-
ఎస్ఎస్సీ పోటీ పరీక్షల సన్నద్ధతకై
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఏప్రిల్ 12 నుంచి వారం రోజులపాటు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఉద్యోగ పోటీ పరీక్షలు జరగనున్నాయని, దీనికోసం తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో టి–శాట్ నెట్వర్క్ చానళ్లు పాఠ్యాంశాలు ప్రసారం చేయనున్నాయని సీఈవో ఆర్.శైలేశ్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జనవరి 25న లైవ్ ప్రసారాలతో ప్రారంభమై 27వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు సాధారణ ప్రసారాలు కొనసాగించాలని నిర్ణయించామని, పోటీ పరీక్షలకు ఈ పాఠ్యాంశాలు ఉపయోగపడతాయని శైలేశ్‌రెడ్డి వివరించారు. 25వ తేదీ ఉదయం 11 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే లైవ్‌లో సబ్జెక్టు, సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారని, అభ్యర్థులు తమ సందేహాల కోసం ఫోన్ ద్వారా 040–2354 0326, 2354 0726 టోల్ ఫ్రీ 1800425 4039 నెంబర్లకు కాల్ చేయాలని సీఈవో సూచించారు. జనవరి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 12 వరకు ప్రసారాలుంటాయని వెల్లడించారు.(చదవండి: గిరిజన గురుకుల పరిధిలో లా కాలేజీ) ఓయూ ఎంసీఏ ఫలితాలు విడుదల ఉస్మానియా యూనివర్సిటీ: విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన ఎంసీఏ కోర్సు పలు సెమిస్టర్ల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. ఎంసీఏ 1వ సెమిస్టర్ బ్యాక్లాగ్, 2, 4 సెమిస్టర్ల రెగ్యులర్ పరీక్షల ఫలితాలను వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఉస్మానియా వర్సిటీ వెబ్సైట్లో ఫలితాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. -
ఎంసీఏ ఇక రెండేళ్లే
సాక్షి, అమరావతి: మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సు కాల పరిమితిని రెండేళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఈ కోర్సు కాల పరిమితి మూడేళ్లుగా ఉండేది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తాజాగా ఈ కోర్సును రెండేళ్లకు కుదిస్తూ మార్గదర్శకాలిచ్చింది. దీనిలో చేరేందుకు మేథమెటిక్స్ సబ్జెక్టుతో బీఎస్సీ, బీఏ, బీకాం పూర్తిచేసిన అభ్యర్థులు వర్సిటీలు రూపొందించిన ‘ప్రీరిక్విజైట్’ కోర్సు పాసవ్వాలి. ఏఐసీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ‘ప్రీరిక్విజైట్’ కోర్సును రూపొందించుకోవాలని ఆయా యూనివర్సిటీల వీసీలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. -
వచ్చేనెల 6 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
7 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లు 14న సీట్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు వచ్చే నెల 6 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ నిర్వహిíßంచాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో సాంకేతిక విద్య కమిషనర్ వాణీప్రసాద్, క్యాంపు అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలును ఖరారు చేశారు. వచ్చేనెల నెల 6 నుంచి 10 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు కమిటీ వెల్లడించింది. 7 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 12న ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. వారికి వచ్చేనెల 14న సీట్లు కేటాయించనుంది. ప్రస్తుతం ఐసెట్‌లో అర్హత సాధించిన వారు 69,900 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఎన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయనేది మరో రెండు మూడు రోజుల్లో తేలనుంది. కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అది పూర్తి కాగానే సీట్ల సంఖ్య తేలనుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సిన వివరాలు, వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవాల్సిన తేదీలు, హెల్ప్‌లైన్ కేంద్రాల వివరాలను ్టటజీఛ్ఛ్టి.nజీఛి.జీn వెబ్సైట్లో పొందొచ్చు. స్పెషల్ కేటగిరీ వారికి మాసాబ్ ట్యాంకులోని సాంకేతిక విద్యా భవన్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఈసారి కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి. బయోమెట్రిక్ వివరాలను సేకరిస్తారు. వెంటతెచ్చుకోవాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్లు హా ఐసెట్ ర్యాంకు కార్డు, హా హాల్‌టికెట్, హా ఆధార్ కార్డు, హా డిగ్రీ మార్కుల మె మో, పాస్ సర్టిఫికెట్, హా ఇంటర్మీడియట్ తత్సమాన మార్కుల మెమో కమ్ పాస్ సర్టిఫికెట్, హా పదో తరగతి మార్కుల మెమో, హా 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లు, హా 2017 జనవరి 1న లేదా ఆ తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, హా స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్లు హా నాన్ లోకల్ అభ్యర్థులైతే వారి తల్లిదండ్రులు 10 ఏళ్లు తెలంగాణలో నివసించిన నివాస ధ్రువీకరణ పత్రం, హా రెగ్యులర్‌గా చదువుకోని వారైతే 7 ఏళ్ల నివాస ధ్రువీకరణపత్రం. -
ప్రశాంతంగా టీఎస్ ఐసెట్
91.93 శాతం మంది అభ్యర్థుల హాజరు కేయూ క్యాంపస్: తెలంగాణలోని కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం నిర్వహించిన ఐసెట్–2017 ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 16 రీజినల్ సెంటర్ల పరిధిలో మొత్తంగా 132 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 77,422 మంది అభ్యర్థులకుగాను 71,172 మంది (91.93శాతం) అభ్యర్థులు హాజరయ్యారని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.ఓంప్రకాశ్ తెలిపారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు జరగగా బయోమెట్రిక్ పద్ధతి ద్వారా హాజరు నమోదు చేయనున్నట్లు ముందుగానే ప్రకటించడంతో అభ్యర్థులు ఉదయం 8–30 గంటల నుంచే పరీక్షాకేంద్రాలకు చేరుకున్నారు. ఈ నెల 21న ప్రాథమిక కీని వెబ్సైట్లో అం దుబాటులో ఉంచుతామని, ఈ నెల 30న తుది కీ తోపాటు ఫలితాలను వెల్లడిస్తామని ఓంప్రకాశ్ వెల్లడించారు. టీఎస్ ఐసెట్–2017కు గురువారం ఉదయం 6 గంటలకు కాకతీయ వర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్ హాల్లో ప్రశ్నపత్రాల సెట్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపి రెడ్డి ఎంపిక చేశారు. రెండు బాక్సుల నుంచి ‘ఏ’సెట్ ప్రశ్నపత్రాన్ని ఆయన ఎంపిక చేయగా అన్ని కేంద్రాలకు సమాచారం ఇచ్చారు. -
రూ.10 వేలు ఇస్తాం.. కాలేజీకి రానక్కర్లేదు!
సాక్షి, హైదరాబాద్: ‘ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరాలనుకుంటున్నారా.. అయితే వెబ్ ఆప్షన్లలో మా కాలేజీని ఎంచుకోండి.. మీరు కాలేజీకి రావాల్సిన అవసరం లేదు.. మేమే మీకు రూ.10 వేలు ఇస్తాం’ అంటూ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ప్రలోభ పెడుతున్నాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్ల్దిండ్రుల ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్లు పంపిస్తున్నాయి. ప్రధాన కాలేజీలు తప్ప చిన్న చిన్న కాలేజీలు మా కాలేజీలో చేరండంటే.. మా కాలేజీలో చేరండి అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. కన్వీనర్ కోటాలో చేరితే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది కాబట్టి అందులో నుంచి కొంత మొత్తం ఇస్తామని విద్యార్థులకు ఎర వేస్తున్నాయి. పైగా కాలేజీకి రానవసరం లేదని అటెండెన్స్, మార్కులు తామే వేస్తామంటూ ప్రలోభ పెడుతున్నాయి. ఈ విషయం కాస్తా ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి దృష్టికి వెళ్లింది. అంతేకాదు ఆయన ఓ కాలేజీ యాజమాన్యానికి పేరెంట్లాగా ఫోన్ చేసి అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. ‘ఇదేమీ టెక్నికల్ కోర్సు కాదు కదా.. కాలేజీకి రానవసరం లేదు. మా కాలేజీలో చేర్చితే రూ.10 వేలిస్తాం’ అని యాజమాన్యం చెప్పడంతో పాపిరెడ్డి అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో కాలేజీల్లో విద్యార్థుల హాజరు విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంతోపాటు యాజమాన్యాల తప్పిదాలకు ఎలా చెక్ పెట్టాలన్న అంశంపై దృష్టి పెట్టాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న దాదాపు 250 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 28,228 సీట్లు అందుబాటులో ఉండగా, ఎంసీఏ కాలేజీల్లో 2,181 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి. -
ఐసెట్ షెడ్యూల్ విడుదల
హన్మకొండ(వరంగల్ జిల్లా), న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్-2014 షెడ్యూల్ విడుదలైంది. ఇక్కడి కాకతీయ యూనివర్సిటీ పరిపాలనా భవనంలోని సెనేట్హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐసెట్ చైర్మన్, కేయూ వీసీ బి.వెంకటరత్నం ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 14న ఐసెట్-2014 నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని, మే 23న ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. వివరాలివీ.. అభ్యర్థులు ఈ నెల 24 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 15 వరకు, రూ.2,000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 25 వరకు, రూ.5,000 అపరాధ రుసుంతో మే ఆరు వరకు, రూ.పదివేల అపరాధ రుసుంతో మే 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. - ఏప్రిల్ 21 నుంచే అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. - ప్రవేశ పరీక్ష మే 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుంది. - ప్రిలిమినరీ కీని మే 26న విడుదల చేస్తారు. అభ్యంతరాలను జూన్ 3 వరకు స్వీకరిస్తారు. ఫైనల్ కీ, ప్రవేశపరీక్షల ఫలితాలను జూన్ 9న విడుదల చేస్తారు. - అభ్యర్థులు www.apicet.org.in వెబ్సైట్లో ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర సమాచారంకోసం ్ఛఝ్చజీ: convernericet2014@gmail.com ను సంప్రదించవచ్చు. కొత్తగూడెంలో పరీక్ష కేంద్రం.. ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌మిశ్రా మాట్లాడుతూ.. గత ఐసెట్‌లో రీజినల్ సెంటర్లు 29 ఉండగా, ఈసారి ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతంలోని అభ్యర్థుల సౌకర్యార్థం కొత్తగూడెంలో కొత్తగా సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈసారి ఓఎంఆర్ షీట్‌పై పెన్సిల్‌ను వాడొద్దని, బ్లూ లేదా బ్లాక్ పాయింట్‌పెన్‌నే ఉపయోగించాలని సూచించారు. పరీక్ష హాల్లోకి రావడం నిమిషం ఆలస్యమైనా అనుమతించరని తెలిపారు. సమావేశంలో ఉన్నత సాంకేతిక విద్యా కమిషనర్ అజయ్‌జైన్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ విజయప్రకాశ్, సెక్రటరీ కె.సతీష్‌రెడ్డి, కేయూ రిజిస్ట్రార్ కె.సాయిలు, ఐసెట్ కన్వీనర్ ఓంప్రకాశ్ పాల్గొన్నారు. -
10 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకోసం ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియును ఈనెల 10న ప్రారంభించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నెల 10నుంచి 15వరకు సర్టిఫికెట్ల తనిఖీ, 15నుంచి 21 వరకు వెబ్ఆప్షన్ల నమోదు, 23వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని నోటిఫికేషన్ తెలిపింది. సర్టిఫికెట్ల తనిఖీ కోసం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రా ల వివరాలను ఈనెల 8న https://apicet.nic.in వెబ్సైట్లో పొందుపరుస్తావుని అడ్మిషన్ల క్యాంపు ప్రధా న అధికారి డాక్టర్ కె. రఘునాథ్ తెలిపారు. వికలాంగు లు, సైనికోద్యోగుల పిల్లలు, ఎన్సీసీ, క్రీడలు, ఆంగ్లో ఇండియన్ తదితర ప్రత్యేక కేటగిరీల కింద రిజర్వేషన్ కింద సీటు పొందదలుచుకున్న అభ్యర్థులు హైదరాబాద్ ,. మాసబ్ట్యాంక్వద్ద సాంకేతిక విద్యాభవన్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను వెబ్సైట్లో పొందుపరిచారు. 25,700 మంది వెబ్ఆప్షన్లు నమోదు ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 3, 4 తేదీల్లో 1 నుంచి 40 వేల ర్యాంకు వరకు నిర్వహించిన వెబ్‌కౌన్సెలింగ్‌లో 25,700 మంది అభ్యర్థులు వెబ్ఆప్షన్లు ఇచ్చినట్టు రఘునాథ్ తెలిపారు. 40 వేల లోపు 26వేల మంది ర్యాంకర్లు సర్టిఫికెట్ల తనిఖీకి హాజరైనా, 300 మంది వెబ్ఆప్షన్లు నమోదు చేయలేదన్నారు.