వచ్చేనెల 6 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ | I set counseling next mounth 6th | Sakshi
Sakshi News home page

వచ్చేనెల 6 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌

Published Fri, Jun 30 2017 2:23 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

I set counseling next mounth 6th

 7 నుంచి 11 వరకు వెబ్‌ ఆప్షన్లు
 14న సీట్ల కేటాయింపు


సాక్షి, హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు వచ్చే నెల 6 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిíßంచాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో సాంకేతిక విద్య కమిషనర్‌ వాణీప్రసాద్, క్యాంపు అధికారి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూలును ఖరారు చేశారు. వచ్చేనెల నెల 6 నుంచి 10 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు కమిటీ వెల్లడించింది. 7 నుంచి 11 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 12న ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు.

వారికి వచ్చేనెల 14న సీట్లు కేటాయించనుంది. ప్రస్తుతం ఐసెట్‌లో అర్హత సాధించిన వారు 69,900 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఎన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయనేది మరో రెండు మూడు రోజుల్లో తేలనుంది. కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అది పూర్తి కాగానే సీట్ల సంఖ్య తేలనుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సిన వివరాలు, వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవాల్సిన తేదీలు, హెల్ప్‌లైన్‌ కేంద్రాల వివరాలను ్టటజీఛ్ఛ్టి.nజీఛి.జీn వెబ్‌సైట్‌లో పొందొచ్చు. స్పెషల్‌ కేటగిరీ వారికి మాసాబ్‌ ట్యాంకులోని సాంకేతిక విద్యా భవన్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది. ఈసారి కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులకు ఆధార్‌ తప్పనిసరి. బయోమెట్రిక్‌ వివరాలను సేకరిస్తారు.

వెంటతెచ్చుకోవాల్సిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు
హా ఐసెట్‌ ర్యాంకు కార్డు, హా హాల్‌టికెట్, హా ఆధార్‌ కార్డు, హా డిగ్రీ మార్కుల మె మో, పాస్‌ సర్టిఫికెట్, హా ఇంటర్మీడియట్‌ తత్సమాన మార్కుల మెమో కమ్‌ పాస్‌ సర్టిఫికెట్, హా పదో తరగతి మార్కుల మెమో, హా 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లు, హా 2017 జనవరి 1న లేదా ఆ తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, హా స్పెషల్‌ కేటగిరీ సర్టిఫికెట్లు హా నాన్‌ లోకల్‌ అభ్యర్థులైతే వారి తల్లిదండ్రులు 10 ఏళ్లు తెలంగాణలో నివసించిన నివాస ధ్రువీకరణ పత్రం, హా రెగ్యులర్‌గా చదువుకోని వారైతే 7 ఏళ్ల నివాస ధ్రువీకరణపత్రం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement