కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో 20 పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.
1.సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్
ఖాళీలు: 9 (జనరల్-6, ఓబీసీ-2, ఎస్సీ-1)
2.సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్
ఖాళీలు: 3 (జనరల్)
3.అసిస్టెంట్ ఎఫిగ్రాఫిస్ట్, ఖాళీ: 1 (ఓబీసీ)
4.టెక్స్‌టైల్ డిజైనర్, ఖాళీలు: 2 (జనరల్)
5.కోర్ట్ మాస్టర్, ఖాళీలు: 2 (ఓబీసీ-1, ఎస్టీ-1)
6.ట్యూబ్‌వెల్ ఆపరేటర్, ఖాళీ: 1 (జనరల్)
7.ఫాం అసిస్టెంట్, ఖాళీ: 1 (జనరల్)
8.జూనియర్ కెమిస్ట్, ఖాళీ: 1 (జనరల్)
వయోపరిమితి: పై అన్ని విభాగాల్లోని పోస్టులకు పోటీ పడే అభ్యర్థులకు అక్టోబర్ 3, 2016 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోసడలింపు ఉంటుంది.
విద్యార్హతలు
సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ పోస్ట్‌కు కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్‌కు అగ్రికల్చర్ డిగ్రీతోపాటు ఆగ్రోనమీ/ప్లాంట్ బ్రీడింగ్/జెనెటిక్స్‌లో పీజీ ఉండాలి.
అసిస్టెంట్ ఎఫిగ్రాఫిస్ట్ పోస్ట్‌కు తమిళం/మలయాళం/తెలుగు/కన్నడలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. అలాగే బ్యాచిలర్స్ డిగ్రీలో ప్రాచీన భారతదేశ చరిత్రను ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. (లేదా) హిస్టరీలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిలో ప్రాచీన భారతదేశ చరిత్ర, తమిళం/మలయాళం/తెలుగు/కన్నడ సబ్జెక్టు చదివి ఉండాలి. వీటితోపాటు ఆర్కియాలజీ/ఎపిగ్రఫీలో పీజీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
టెక్స్‌టైల్ డిజైనర్ పోస్టుకు టెక్స్‌టైల్ డిజైన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/టెక్స్‌టైల్ డిజైన్ ఒక సబ్జెక్ట్‌గా బ్యాచిలర్ ఇన్ ఫైన్‌ఆర్ట్స్ చదివి ఉండాలి. వీటితోపాటు ఈ రంగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి (లేదా) టెక్స్‌టైల్ డిజైన్ ఒక సబ్జెక్ట్‌గా మూడేళ్ల డిప్లొమా ఇన్ ఫైన్‌ఆర్ట్స్‌తోపాటు ఈ రంగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
కోర్ట్ మాస్టర్ పోస్టుకు ఏదైనా డిగ్రీతోపాటు కోర్ట్స్/ట్రిబ్యునల్స్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి.
ట్యూబ్‌వెల్ ఆపరేటర్ పోస్ట్‌కు ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఐటీఐ సర్టిఫికెట్, మూడేళ్ల అనుభవం ఉండాలి. వీటితోపాటు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థలో ఎలక్ట్రీషియన్ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
ఫాం అసిస్టెంట్ పోస్టుకు ఇంటర్/తత్సమాన కోర్సుతోపాటు అగ్రికల్చర్‌లో సర్టిఫికెట్/ట్రైనింగ్ కోర్సు పూర్తిచేసి ఉండాలి. అగ్రికల్చర్ ఫాంలో ఏడాది పని అనుభవం ఉండాలి (లేదా) బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేసి ఉండాలి.
జూనియర్ కెమిస్ట్ పోస్టుకు కెమిస్ట్రీ/డెయిరీ కెమిస్ట్రీ/ఆయిల్ టెక్నాలజీ/ఫుడ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి (లేదా) కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్‌గా బీఎస్సీ/బీఎస్సీ ఆనర్స్ ఇన్ కెమిస్ట్రీతో పాటు అనలిటికల్ వర్క్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం
అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఓఎంఆర్/కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తారు. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్
ఆయా పోస్టులను బట్టి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి 150/200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత (నెగటివ్ మార్క్) విధిస్తారు. తర్వాత ఆయా పోస్టుల అవసరాన్ని బట్టి టైపింగ్/డేటా ఎంట్రీ/కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ వంటి పరీక్షలు కూడా ఉంటాయి.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు http://ssconline.nic.in/sscselectionpost ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ సమయంలో రూ.100 రుసుమును నెట్‌బ్యాంకింగ్/క్రెడిట్‌కార్డ్/డెబిట్ కార్డ్/ఎస్‌బీఐ చలానా ద్వారా చెల్లించాలి. అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మన్ అభ్యర్థులను ఫీజు చెల్లింపు నుంచి మినహాయించారు. పూర్తిచేసిన దరఖాస్తును ప్రింట్ తీసుకుని అవసరమైన అన్ని ధ్రువపత్రాల జిరాక్స్‌లను జతచేసి, సెల్ఫ్ అటెస్ట్ చేసి నిర్దేశిత అడ్రస్‌కు పంపాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు, ఫీజు చెల్లింపునకు చివరి తేది: అక్టోబర్ 3, 2016
వెబ్‌సైట్: http://www.sscwr.net
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ)లో 20 పోస్టులు
Published Wed, Sep 7 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
Advertisement
Advertisement