అందుకో ఉద్యోగం... ఇదిగో వ్యూహం | Job Point on SSC-CGLE | Sakshi
Sakshi News home page

అందుకో ఉద్యోగం... ఇదిగో వ్యూహం

Published Thu, Jan 30 2014 1:51 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Job Point on SSC-CGLE

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ).. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్‌ఈ) కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి కేటగిరీ పోస్టులను భర్తీ చేయనుంది. పరీక్షకు దాదాపుగా మూడు నెలల సమయం మిగిలి ఉంది. అందుబాటులో ఉన్న సమయాన్ని ప్రభావవంతంగా వినియోగించుకుంటే ఐదంకెల జీతంతో కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌ను దక్కించుకునే చక్కని అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో సీజీఎల్‌ఈ ప్రిపరేషన్ ప్లాన్, తదితర అంశాలపై విశ్లేషణ..


 
 సీజీఎల్‌ఈ ద్వారా ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఎంపిక ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. అవి.. మొదటి, రెండు దశల్లో నిర్వహించే రాత పరీక్ష. చివరి దశ పర్సనాలిటీ టెస్ట్. ఈ మూడు దశల్లో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాన్ని ఖరారు చేస్తారు.
 రాత పరీక్షను టైర్-1, టైర్-2 అనే రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఇంగ్లిష్/హిందీ భాషల్లో ఉంటుంది.
 

 

 టైర్-1 పరీక్షా విధానం:
 సమయం: రెండు గంటలు
 అంశం    ప్రశ్నలు    మార్కులు    
 జనరల్ ఇంటెలిజెన్స్+రీజనింగ్     50    50
 జనరల్ అవేర్‌నెస్     50    50
 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్     50     50
 ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్     50     50
 మొత్తం     200     200
 టైర్-2 పరీక్షా విధానం:
 అంశం    ప్రశ్నలు    మార్కులు    సమయం
 క్వాంటిటేటివ్ ఎబిలిటీ    100    200    2 గం.
 ఇంగ్లిష్ లాంగ్వేజ్-
 కాంప్రెహెన్షన్    200    200    2 గం.
 స్టాటిస్టిక్స్    100    200    2 గం.
 (స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్
 అభ్యర్థులకు మాత్రమే)
 
టైర్-1లో నెగిటివ్ మార్కింగ్ 0.25. టైర్-2లో ఇంగ్లిష్, స్టాటిస్టిక్స్ విభాగాలకు 0.50, క్వాంటిటేటివ్ ఎబిలిటీకి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
 
 చివరి దశ:
 చివరి పర్సనాలిటీ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో అభ్యర్థి విద్యార్హతలు, సొంత రాష్ట్రం, ఆసక్తి, కరెంట్ అఫైర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలాధారంగా ప్రశ్నలు ఉంటాయి. కొన్ని పోస్టుల నేపథ్యాన్ని బట్టి ఎంపికైన అభ్యర్థులకు నైపుణ్య పరీక్షను కూడా నిర్వహిస్తారు. ఈ క్రమంలో అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల డేటా ఎంట్రీ సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ఇందులో భాగంగా గంటకు 8 వేల పదాలను టైప్ చేయాల్సి ఉంటుంది. అవసరమైన పోస్టులకు శారీరక సామర్థ్య పరీక్షలను కూడా నిర్వహిస్తారు. అవి..ఇన్‌స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్/ ఎగ్జామినర్/ప్రివెంటివ్ ఆఫీసర్/ఇన్‌స్పెక్టర్-సబ్‌ఇన్‌స్పెక్టర్-సీబీఎస్).
 
 నిర్వహించే ఈవెంట్స్:
 వాకింగ్ టెస్ట్: 1600 మీటర్లు-15 నిమిషాలు (మహిళలు 1 కిలోమీటర్-20 నిమిషాలు)
 సైక్లింగ్: 8 కిలోమీటర్లు-30 నిమిషాలు (మహిళలు-3 కిలోమీటర్లు-25 నిమిషాలు)
 
 
 నోటిఫికేషన్ సమాచారం
 అర్హత: ఏదైనా డిగ్రీ. కంపైలర్ పోస్టులకు మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/ ఎకనామిక్స్‌లతో డిగ్రీ. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2 -స్టాటిస్టిక్స్‌తో డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ మ్యాథమెటిక్స్/ఎకనామిక్స్/కామర్స్ (స్టాటిస్టిక్స్ ఒక పేపర్‌గా ఏడాది/రెండేళ్లు/మూడేళ్లు చదివి ఉండాలి). అసిస్టెంట్ పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. నిర్దేశించిన పోస్టులకు శారీరక ప్రమాణాలు ఉండాలి. అవి..
 
 ఇన్‌స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్/ఎగ్జామినర్/ప్రివెంటివ్ ఆఫీసర్/ఇన్‌స్పెక్టర్- సబ్‌ఇన్‌స్పెక్టర్-సీబీఎస్): ఎత్తు: 157.5 సెం.మీ., ఛాతీ: 81 సెం.మీ. (గాలి పీలిస్తే 5 సెం.మీ. పెరగాలి). మహిళలు-152 సెం.మీ. బరువు: 48 కిలోలు
 సీబీఐ-సబ్‌ఇన్‌స్పెక్టర్స్: ఎత్తు: పురుషులు -165 సెం.మీ. మహిళలు-150 సెం.మీ. ఛాతీ: 76 సెం.మీ.
 
 వయసు: జనవరి 1, 2014 నాటికి 18 నుంచి 27 ఏళ్లు. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్‌కు 26 ఏళ్లు. సబ్‌ఇన్‌స్పెక్టర్ (సీబీఐ)-20 నుంచి 27 ఏళ్లు. నిబంధనల మేరకు నిర్దేశిత అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.
 దరఖాస్తు ఫీజు: రూ. 100 (ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/ఎక్స్-సర్వీస్‌మెన్‌కు మినహాయింపునిచ్చారు)


 
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
 పార్ట్-1 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఫిబ్రవరి 12, 2014.
 పార్ట్-2 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2014.
 రాత పరీక్ష తేదీలు: ఏప్రిల్ 27, 2014. మే 4, 2014.
 వెబ్‌సైట్: http://ssc.nic.in


 
 ప్రిపరేషన్ ఇలా...
 జనరల్ ఇంటెలిజెన్స్+రీజనింగ్:
 ఈ విభాగంలో వెర్బల్-నాన్ వెర్బల్ ప్రశ్నలు వస్తాయి. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే తార్కిక విశ్లేషణ అవసరం. డెరైక్షన్స్, అనాలజీస్, ర్యాంకింగ్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, వెన్‌డయాగ్రమ్స్ తదితరాలాధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అడిగే ప్రశ్నలు క్లిష్టంగా కాకుండా మధ్యస్తంగా ఉంటాయి. కాబట్టి ప్రశ్నను సరిగ్గా అవగాహన చేసుకుంటే సులభంగానే సమాధానాన్ని గుర్తించవచ్చు.
 
 ఇంగ్లిష్:
 ఎంపికైన అభ్యర్థులు విధుల్లో భాగంగా ఇంగ్లిష్ భాషను తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఆంగ్ల భాషలో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ స్కోరింగ్ విభాగం కూడా ఇదే. అంతేకాకుండా టైర్-1, 2 రెండు పేపర్లలోనూ ఉంటుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్ సాగించాలి. అంతేకాకుండా ఈ విభాగానికి వెయిటేజీ కూడా ఎక్కువ. కాబట్టి అభ్యర్థులు ఇందులో సాధ్యమైనంత ఎక్కువగా స్కోర్ చేయడానికి ప్రయత్నించాలి. ఇందులో 160 నుంచి 225 మార్కులు స్కోర్ చేసే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. ఈవిభాగంలో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు, కామన్ ఎర్రర్స్, క్లోజ్ టెస్ట్, యాంటోనిమ్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. వొక్యాబ్యులరీని మెరుగుపరుచుకోవడం, రోజూ ఇంగ్లిష్ దిన పత్రికలను చదవడంతో ఇందులో మెరుగైన మార్కులు సాధించవచ్చు. రోజూ ఆంగ్ల దినపత్రికలు చదవడం జనరల్‌అవేర్‌నెస్ పరంగా కూడా ఉపకరిస్తుంది.


 జనరల్ అవేర్‌నెస్:
 జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరీక్షించే విధంగా ఇందులో ప్రశ్నలు ఉంటాయి. ఈ నేపథ్యంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమకాలీనంగా చోటు చేసుకుంటున్న అంశాలను నిశితంగా పరిశీలించాలి. అదే సమయంలో చరిత్ర, జనరల్ సైన్స్, ఆర్థిక రంగం, జాగ్రఫీ, పాలిటీ, శాస్త్ర పరిశోధనలు, స్టాండర్డ్ జీకే నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థులందరూ కనీసం 15 మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 25 నుంచి 30 మార్కులు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి.


 
 క్వాంటిటేటివ్ ఎబిలిటీ:
 ఈ విభాగం టైర్-1,2 రెండు పేపర్లలోనూ ఉంది. కాబట్టి అందుకు తగ్గట్టుగా ప్రిపరేషన్ సాగించాలి. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే గణితంలోని ప్రాథమిక భావనలపై అవగాహన అవసరం.  సమాధానాన్ని వేగంగా, కచ్చితత్వంతో గుర్తించే సామర్థ్యాన్ని సొంతం చేసుకోవాలి. ఈ విభాగంలో సంఖ్యామానం, ప్రొబబిలిటీ, వ్యాపార గణితం, లాభం-నష్టం, శాతం, సూక్ష్మీకరణ, కాలం-దూరం, నిష్పత్తి, సగటు, ఎత్తు-దూరాలు, రేఖా గణితం, ట్రిగ్నోమెట్రీ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. టైర్-1, 2లలో క్వాంటిటేటివ్ విభాగం 250 మార్కులకు ఉంటుంది. ఇందులో కనీసం 170 మార్కులు సాధిస్తేనే చివరి దశకు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. మ్యాథ్స్‌లో బలహీనంగా ఉన్న అభ్యర్థులు కనీసం 150 మార్కులు సాధించే విధంగా కృషి చేయాలి.


 
జనరల్ టిప్స్

క్వాంటిటేటివ్-ఇంగ్లిష్ విభాగాలు టైర్-1, 2 పేపర్లలో ఉన్నాయి. కాబట్టి వీటికి ఎక్కువ వెయిటే జీ ఉంది. కాబట్టి ప్రిపరేషన్‌లో ఈ విభాగాలకు ఎక్కువ సమయం కేటాయించాలి.
టైర్-1, 2 పేపర్లలో క్వాంటిటేటివ్, ఇంగ్లిష్ విభాగాలు ఒకటే అయినా.. వాటిల్లో అడిగే ప్రశ్నలు క్లిష్టతలో తేడా ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించి ప్రిపరేషన్ సాగించాలి.
 టైర్-1లో ఇంగ్లిష్ మినహా (పదో తరగతి స్థాయి) మిగతా విభాగాల ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఉంటాయి.
 టైర్-2లోని క్వాంటిటేటివ్ విభాగంలోని ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో, ఇంగ్లిష్ విభాగంలోని ప్రశ్నలు 10+2 స్థాయిలో, స్టాటిస్టిక్స్ ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఉంటాయి.
 గత ప్రశ్నపత్రాలను విధిగా ప్రాక్టీస్ చేయాలి.
 
 రిఫరెన్‌‌స బుక్స్

 క్వికర్ మ్యాథ్స్- ఎం. థైరా
 ఆబ్జెక్టివ్ మ్యాథ్స్-ఆర్‌ఎస్ అగర్వాల్
 రీజనింగ్-ఆర్‌ఎస్ అగర్వాల్, కిరణ్ ప్రకాషణ్
 ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లిష్-ఎస్ చాంద్ పబ్లికేషన్స్, వర్డ్ పవర్ మేడ్ ఈజీ
 జీకే-మనోరమ ఇయర్‌బుక్,అరిహంత్ పబ్లికేషన్స్,ప్రతియోగితా దర్పణ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement