కేంద్ర బలగాల్లో భారీ అవకాశాలు | Notification to be announced for Huge opportunities in central forces | Sakshi
Sakshi News home page

కేంద్ర బలగాల్లో భారీ అవకాశాలు

Published Thu, Feb 5 2015 10:41 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

కేంద్ర బలగాల్లో భారీ అవకాశాలు

కేంద్ర బలగాల్లో భారీ అవకాశాలు

కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో చేసుకున్న అవగాహన ఒప్పందం మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఓ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర సాయుధ బలగాల్లో 62,390 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ),  రైఫిల్ మ్యాన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
 
 ఖాళీల వివరాలు
 ఆంధ్రప్రదేశ్:  5,009
 తెలంగాణ:  2,055
 ఉద్యోగాలు: 62,390  
 అర్హత: పదో తరగతి
 వేతన స్కేల్: రూ.5,200-20,200+రూ.2000 గ్రేడ్ పే.
 
 బీఎస్‌ఎఫ్
     పురుషులు: 17,698
     మహిళలు: 4,819
 ఐటీబీపీ
     పురుషులు: 2,795
     మహిళలు: 306
 
 సీఐఎస్‌ఎఫ్
     పురుషులు: 4,493
     మహిళలు: 507
 
 ఏఆర్
     పురుషులు: 300
     మహిళలు: 300
 సీఆర్‌పీఎఫ్
     పురుషులు: 22,623
     మహిళలు: 1,965
 ఎన్‌ఐఏ
     పురుషులు: 82
     మహిళలు: 4
 ఎస్‌ఎస్‌బీ
     పురుషులు: 5,619
     మహిళలు: 605
 ఎస్‌ఎస్‌ఎఫ్
     పురుషులు: 247
     మహిళలు: 27
 
     అర్హత: పదో తరగతి. వయసు 18-23 ఏళ్లు(2015, ఆగస్టు 1 నాటికి). రిజర్వేషన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
     శారీరక ప్రమాణాలు: ఎత్తు- పురుషులు: 170 సెం.మీ, మహిళలు: 157 సెం.మీ. చాతీ (పురుషులకు మాత్రమే) - 80 సెం.మీ, ఊపిరి పీల్చితే 5 సెం.మీ. వ్యాకోచించాలి. ఎత్తుకు తగ్గ బరువుండాలి.
 
 ఎంపిక విధానం:
 1.    నిర్దేశ శారీరక ప్రమాణాలు ఉన్నాయా.. లేదా అన్నది పరిశీలిస్తారు.
 2.    శారీరక సామర్థ్య పరీక్ష ఉంటుంది. ఇందులో పురుషులైతే 5 కి.మీ. దూరాన్ని 24 నిమిషాల్లో పూర్తిచేయాలి. మహిళలు 1.6 కి.మీ. దూరాన్ని ఎనిమిదన్నర నిమిషాల్లో పూర్తిచేయాలి.
 3.    ఫిజికల్ టెస్ట్‌లో విజేతలకు అభ్యర్థి ఎంపికను అనుసరించి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహిస్తారు.
 4.    అర్హులకు వైద్య పరీక్షలు జరుపుతారు.
 
 దరఖాస్తు విధానం:
     ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తొలి దశ రిజిస్ట్రేషన్‌లో అవసరమైన సమాచారాన్ని నింపాలి. ఫీజు చెల్లించిన తర్వాత రెండో దశ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
     చివరి తేదీ (మొదటి దశ): ఫిబ్రవరి 21, 2015.
     రెండో దశ: ఫిబ్రవరి 23, 2015.
     వెబ్‌సైట్: http://ssconline.nic.in;
     http://ssconline2.gov.in
 
 పరీక్ష విధానం
     పరీక్ష తేదీ: అక్టోబర్ 4, 2015
     ఆన్‌లైన్‌లో రాయాలనుకుంటే ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో అయితే ఇంగ్లిష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా ఉంటుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఇస్తారు. రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి.
     సబ్జెక్టు    ప్రశ్నలు    మార్కులు
     జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్    25    25
     జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్    25    25
     ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్    25    25
     ఇంగ్లిష్/హిందీ    25    25
     మొత్తం    100    100
 
 ప్రిపరేషన్ ప్రణాళిక
 
 ఫిజికల్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే రాత పరీక్షకు అనుమతిస్తారు. కాబట్టి తగిన శారీరక ప్రమాణాలున్నవారు ఇప్పటి నుంచే పరుగు ప్రాక్టీస్ చేయాలి. దీనికి సమాంతరంగా రాత పరీక్షలో విజయానికి కృషిచేయాలి.
     జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్‌పై దృష్టిసారించాలి. వెర్బల్‌లో కోడింగ్, డీకోడింగ్, సిరీస్, అనాలజీ తదితర విభాగాలు ముఖ్యమైనవి. క్లిష్టత స్థాయి చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల ప్రాక్టీస్ చేస్తే పూర్తి మార్కులు సాధించవచ్చు. ఇందులో కనీసం 20 మార్కులు తెచ్చుకోవాలి.
     జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్: తన చుట్టూ ఉన్న పరిసరాలపై అభ్యర్థి అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. భారతదేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళికశాస్త్రం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, రాజ్యాంగం, క్రీడలు తదితరాలతో పాటు వర్తమాన వ్యవహారాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ప్రా థమిక అంశాలను పూర్తిగా నేర్చుకుంటే సరిపోతుంది. తప్పనిసరిగా దినపత్రికలు చదివి,ముఖ్యాంశాలను గుర్తుంచుకోవాలి.
     ఎలిమెంటరీ మ్యాథ్స్: ఆరు, ఎనిమిదో తరగతి పుస్తకాల్లోని అంశాలపై పట్టు సాధించాలి. సూక్ష్మీకరణలు, సంఖ్యా వ్యవస్థ, శాతాల నుంచి ఎక్కువ (15 వరకు) ప్రశ్నలు రావొచ్చు. దీనికి ప్రాక్టీస్ ప్రధానం.
     ఇంగ్లిష్/హిందీ: పదో తరగతి స్థాయిలో వొకాబ్యులరీ, గ్రామర్, కాంప్రెహెన్షన్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. సరిగా ప్రాక్టీస్ చేస్తే తేలిగ్గా 18-20 మార్కులు తెచ్చుకోవచ్చు.
     పరీక్షకు ఎనిమిది నెలల సమయం ఉంది. మొదటి నాలుగు నెలల్లో సిలబస్‌కు సంబంధించిన అంశాల్లోని కాన్సెప్టులపై పట్టు సాధించాలి. అంశాల వారీగా సమస్యల్ని సాధించాలి. పరీక్షలు కూడా రాయాలి. తర్వాతి నాలుగు నెలల్లో దాదాపు 100 గ్రాండ్ టెస్ట్‌లు రాయాలి. సరైన ప్రణాళికను రూపొందించుకోవడంతో పాటు దాన్ని కచ్చితంగా అమలు చేస్తే తేలిగ్గా 70-90 మార్కులు తెచ్చుకోవచ్చు.
 - ఎన్.వినయ్‌కుమార్ రెడ్డి,
డైరెక్టర్ ఐఏసీఈ, హైదరాబాద్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement