
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.83 లక్షలకుపైగా ఉద్యోగ ఖాళీలున్నాయని సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 38,02,779 పోస్టులుండగా 2018మార్చి 1 నాటికి అందులో 31,18,956 ఉద్యోగులున్నారని పేర్కొన్నారు. 2019–20 ఏడాదికి గాను కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ)లు సుమారు 1.34 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు చేశాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment