
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సుమారు 150 చోట్ల కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలోని సంస్థల్లో సీబీఐ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ, జైపూర్, జోధ్‌పూర్, గువాహటి, శ్రీనగర్, షిల్లాంగ్, చండీగఢ్, సిమ్లా, చెన్నై, మదురై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణె, గాంధీనగర్, గోవా, భోపాల్, జబల్‌పూర్, నాగ్‌పూర్, పట్నా, రాంచీ, ఘజియాబాద్, లక్నో, డెహ్రాడూన్‌లలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ రంగంలో అవినీతికి ఆస్కారమున్న సంస్థల్లో సోదాలు చేపట్టినట్లు సీబీఐ అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment