new jobs
-
5 లక్షల కొత్త కొలువులు!
సాక్షి, హైదరాబాద్: లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడుల సాధన ద్వారా రాష్ట్రంలో 5 లక్షలకు పైగా కొత్త ఉగ్యోగాలను సృష్టించాలని తమ ప్రభుత్వం భావిస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. ఔటర్ రింగు రోడ్డుతో పాటు కొత్తగా నిర్మితమయ్యే రీజినల్ రింగు రోడ్డు నడుమ ఫార్మా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందని వెల్లడించారు. తద్వారా విభిన్న రంగాల్లో సుమారు 50 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో గత ఏడాది 150కి పైగా ప్రాజెక్టుల్లో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు సాధించామని వివరించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం ప్రారంభమైన రెండురోజుల ‘బయో ఆసియా 2025’ సదస్సును సీఎం ప్రారంభించి మాట్లాడారు. లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ ‘ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ ఫార్మాసిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే దిగ్గజ ఫార్మాస్యూటికల్ కంపెనీలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జర్మన్ కంపెనీ మిల్టెనీ బయోటెక్ జీనోమ్ వ్యాలీలో సెల్, జీన్ థెరపీని ప్రారంభించింది. కొత్తగా 4 బహుళ జాతి లైఫ్ సైన్సెస్ కంపెనీలు కూడా తెలంగాణలో అడుగు పెడుతున్నాయి. గడిచిన 25 ఏళ్లలో ఫార్మా, తయారీ, ఐటీ, డిజిటల్ హెల్త్ రంగాల్లో వపర్‌హౌస్‌గా హైదరాబాద్ ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో పేరొందిన అనేక ఫార్మా, హెల్త్‌కేర్, లైఫ్ సైన్స్, బయోటెక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలపై కృషి చేసే సంస్థలను ప్రోత్సహిస్తూ శాస్త్ర, సాంకేతిక నిపుణులను తయారు చేయడంతో పాటు జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేసుకున్నాం. ఏటా జరిగే బయో ఆసియా సదస్సులు హైదరాబాద్‌ను ప్రపంచ లైఫ్‌సైన్సెస్ రాజధానిగా నిలబెట్టాయి. ఆరోగ్య రక్షణ రంగం భవిష్యత్తును నిర్దేశించటంతో పాటుం ప్రపంచానికి మార్గదర్శనం చేసే కార్యక్రమంగా ‘బయో ఆసియా’ దేశ విదేశాలను ఆకర్షిస్తోంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఫ్యూచర్, ఏఐ సిటీల్లో భారీ ప్రాజెక్టులు ‘రాబోయే పదేళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నాం. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో సేవల రంగాన్ని ప్రోత్సహిస్తూ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీలో అనేక భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాం. దేశంలోనే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకంతో హైదరాబాద్ ఈవీ రాజధానిగా అవతరించింది. ఆర్టీసీలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెడుతున్నాం. ఔటర్, ట్రిపుల్ ఆర్‌ను రేడియల్ రోడ్లతో అనుసంధానం చేసి ప్రపంచంలోనే అతిపెద్ద మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. ‘చైనా ప్లస్ వన్’ అవసరాలు తీర్చే కేంద్రంగా అభివృద్ధి చేసి ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తాం. తెలంగాణలో మెగా డ్రైపోర్టును అభివృద్ధి చేసి ఏపీలోని ‘సీ పోర్టు’తో రైలు, రోడ్డు మార్గాల ద్వారా అనుసంధానిస్తాం. తెలంగాణను బయో సైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా అభివృద్ధి చేస్తాం..’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హార్ట్ ఆఫ్ ది లైఫ్ సైన్సెస్‌గా జీనోమ్ వ్యాలీ: మంత్రి శ్రీధర్‌బాబు రాష్ట్రంలో కొత్తగా లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. సంబంధిత పరిశ్రమల భాగస్వామ్యంతో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచ స్థాయి నిపుణులను తయారు చేసేలా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా కోర్సులకు రూపకల్పన చేస్తామని చెప్పారు. ‘లైఫ్ సైన్సెస్ రంగంలో రెండు దశాబ్దాల క్రితం మొదలైన తెలంగాణ ప్రస్థానాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం. రాబోయే రోజుల్లో జీనోమ్ వ్యాలీని ‘‘హార్ట్ ఆఫ్ ది లైఫ్ సైన్సెస్’’గా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం ద్వారా 51 వేల మంది ప్రత్యక్షంగా, 1.5 లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తయారయ్యే జనరిక్ మందుల్లో 20 శాతం, వాక్సీన్ల ఉత్పత్తిలో 40 శాతం వాటా తెలంగాణ కలిగి ఉంది. 200కు పైగా దేశాలకు ఏటా 5 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఏఐ, క్వాంటం, రోబోటిక్స్ తదితర నూతన టెక్నాలజీల సాయంతో రోగుల అవసరాలకు అనుగుణంగా, వారికి త్వరగా స్వాంతన చేకూరేలా ఔషధాల సామర్థ్యాన్ని పెంచే పరిశోధనలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి వ్యయంతో మౌలిక సదుపాయాల పరంగా హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చి దిద్దుతాం. అసోసియేషన్ ఆఫ్ కాంట్రాక్టు రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ (సీఆర్డీఎంవో) తన ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తుంది..’ అని మంత్రి చెప్పారు. ఆ్రస్టేలియాలోని క్వీన్స్లాండ్ గవర్నర్ జానెట్ యంగ్, వివిధ ఫార్మా, లైఫ్ సైన్సెస్ సంస్థల ప్రతినిధులు రాజీవ్‌శెట్టి, డాక్టర్ సాధన జోగ్లేకర్, జీవీ ప్రసాద్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు ప్రసంగించారు. -
కొత్త ఉద్యోగానికి సై
న్యూఢిల్లీ: వృత్తి నిపుణుల్లో ఎక్కువ మంది ఈ ఏడాది కొత్త ఉద్యోగం కోసం అన్వేషించనున్నారు. ఈ అన్వేషణ ఇంతకుముందెన్నడూ లేనంత కఠినంగా ఉండనున్నట్టు ప్రొఫెషనల్ నెట్వర్క్ ప్లాట్‌ఫామ్ లింక్డెన్ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో తెలిపింది. అర్హతలు ఉన్న నిపుణులను గుర్తించడం సవాలుగా 69 శాతం మంది హెచ్ఆర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలన కోసం హెచ్ఆర్ నిపుణులు రోజులో 3–5 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారు. 49 శాతం మంది గతంలో కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అన్ని అర్హత ప్రమాణాలు సరితూగే దరఖాస్తుదారులు సగం కంటే తక్కువే ఉంటున్నట్టు 55 శాతం హెచ్ఆర్ నిపుణులు చెబుతున్నారు. ‘‘ఉద్యోగ మార్కెట్ కఠినంగా మారుతోంది. ఉద్యోగాన్వేషణ మరింత ఆలోచనాత్మకంగా ఉండాలని ఇది సంకేతమిస్తోంది. మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా సవాళ్లతో కూడిన ఉద్యోగ మార్కెట్లోనూ కొత్త అవకాశాలను సొంతం చేసుకోవడమే కాకుండా, కెరీర్లో మంచి వృద్ధిని చూడొచ్చు’’అని లింక్డెన్ ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్, కెరీర్ ఎక్స్పర్ట్ నిరజిత బెనర్జీ అన్నారు. గతేడాది నవంబర్ 27 నుంచి, డిసెంబర్ 16 మధ్య ఈ అధ్యయనం జరిగింది. ఇందులో 22,010 మంది నిపుణులు పాల్గొన్నారు. భారత్‌తోపాటు, స్పెయిన్, ఐర్లాండ్, బ్రెజిల్, యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ, ఆస్ట్రేలియా, జపాన్, స్వీడన్, సింగపూర్, నెదర్లాండ్స్ తదితర దేశాల్లో అధ్యయనం కొనసాగింది. ఈ ఉద్యోగాల్లో వృద్ధి ఎక్కువ.. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్, రోబోటిక్స్ టెక్నీషియన్, క్లోజింగ్ మేనేజర్ ఈ ఏడాది భారత్‌లో ఎక్కువ వృద్ధి చెందే ఉద్యోగాలుగా లింక్డెన్ తెలిపింది. భారత్‌లో ప్రతి ఐదుగురు వృత్తి నిపుణుల్లో ముగ్గురు కొత్త రంగంలో, కొత్త విభాగంలో ఉద్యోగానికి సంసిద్ధంగా ఉండగా.. కొత్త అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుగా నైపుణ్యాలను నేర్చుకోనున్నట్టు 39 శాతం మంది చెప్పారు. భవిష్యత్తులో ప్రతి ఉద్యోగానికి సంబంధించిన విలువను కృత్రిమ మేథ (ఏఐ) పెంచనున్నట్టు ఈ అధ్యయనం తెలిపింది. మహిళలు మరిన్ని ఉద్యోగ పాత్రల్లోకి అడుగుపెట్టున్నట్టు పేర్కొంది. నవంబర్‌లో పెరిగిన ఉపాధి ఈపీఎఫ్ఓ సభ్యత్వంలో 4.88 శాతం పెరుగుదల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ)లో సభ్యత్వం నవంబర్‌లో 4.88 శాతం (2023 నవంబర్‌తో పోల్చి) పెరిగింది. ఉపాధి పెరుగుదలను సూచిస్తూ సమీక్షా నెల్లో ఈపీఎఫ్ఓలో 14.63 లక్షల నికర సభ్యత్వం నమోదయినట్లు తాజా పేరోల్ గణాంకాలు పేర్కొన్నాయి. ఇక 2024 అక్టోబర్‌తో పోల్చితే నికర సభ్యత్వం నెలవారీగా 9.07 శాతం పెరగడం గమనార్హం. నవంబర్‌లో నికర మహిళా సభ్యుల చేరిక 3.13 లక్షలు. అక్టోబర్‌తో పోల్చితే ఇది 12.16 శాతం అధికం. వార్షిక పెరుగుదల 11.75 శాతం. నెలలో 20.86 శాతం నికర సభ్యుల చేరికతో మహారాష్ట్ర ముందుంది. మహారాష్ట్ర తర్వాత ఐదు శాతానికిపైగా సభ్యత్వ నమోదులతో కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లు నిలిచాయి. -
కొలువులకు కొత్త టెక్నాలజీల దన్ను
ముంబై: కొత్త సాంకేతికతల దన్నుతో దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం నూతన సంవత్సరంలోనూ జోరుగా వృద్ధి బాటలో ముందుకు సాగనుంది. 2025లో కొత్త ఉద్యోగాల కల్పన 20 శాతం పెరగనుంది. మానవ వనరుల సేవల సంస్థ ఫస్ట్‌మెరీడియన్ బిజినెస్ సర్వీసెస్ సీఈవో (ఐటీ స్టాఫింగ్) సునీల్ నెహ్రా ఈ విషయాలు తెలిపారు. డిజిటల్ పరివర్తన వేగవంతం కావడం, కొత్త సాంకేతికతల్లో నైపుణ్యాలున్న వారికి డిమాండ్ పెరగడం వంటి అంశాల కారణంగా 2024లో దేశీ ఐటీ, టెక్ రంగాల్లో కొత్త ఉద్యోగావకాశాలు 17 శాతం పెరిగినట్లు చెప్పారు.కొత్త సంవత్సరంలోనూ పరిశ్రమ వృద్ధి మరింత పుంజుకోగలదని పేర్కొన్నారు. అప్లికేషన్ డెవలపర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డెవాప్స్ ఇంజినీర్లు, ఏఐ, ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో నిపుణులకు ఉద్యోగావకాశాలు బాగుంటాయని నెహ్రా చెప్పారు. 2024లో ప్రధాన ట్రెండ్‌గా నిల్చిన కృత్రిమ మేథ (ఏఐ) 2025లో కూడా మరింత వేగవంతమవుతుందన్నారు. డేటా అనలిస్టులు, డేటా ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు తదితర నిపుణులకు డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. జెన్–ఏఐలో పది లక్షల అవకాశాలు.. 2028 నాటికి జెనరేటివ్ ఏఐ (జెన్–ఏఐ) పరిశ్రమలో 10 లక్షలకు పైగా కొత్త కొలువులు వస్తాయని, స్థూల దేశీయోత్పత్తి వృద్ధికి ఇది గణనీయంగా తోడ్పడగలదని నెహ్రా తెలిపారు. జెనరేటివ్ ఏఐ ఇంజినీర్, అల్గోరిథం ఇంజినీర్, ఏఐ సెక్యూరిటీ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగాలకు వేతనాలు గణనీయంగా పెరగవచ్చని పేర్కొన్నారు. మిడ్–లెవెల్ ఉద్యోగులకు వేతన వృద్ధి 25–30 శాతం శ్రేణిలో ఉంటుందని వివరించారు.వ్యాపారాలు వృద్ధి చెందుతూ, కొత్త ఆవిష్కరణలు చేసే కొద్దీ నూతన ప్రాజెక్టుల కోసం హైరింగ్ చేసుకోవడం, డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోవడం, సాంకేతిక పురోగతులను అందిపుచ్చుకునేందుకు పోటీపడటం మొదలైన ధోరణులు పెరుగుతాయని తెలిపారు. 2018–19 నుంచి 2023–24 మధ్య కాలంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్‌లో (జీసీసీ) 6,00,000 ఉద్యోగాలు వచ్చినట్లు నెహ్రా చెప్పారు. 2030 నాటికి ఈ నిపుణుల సంఖ్య 25 లక్షల నుంచి 28 లక్షల వరకు పెరుగుతుందన్నారు. మరిన్ని విశేషాలు.. ⇒ 2025లో బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఇన్సూరెన్స్), టెలికం వంటి టెక్‌యేతర రంగాల్లో కూడా ఐటీ/టెక్నాలజీ నిపుణుల నియామకాలు పెరుగుతాయి. మధ్య స్థాయి నుంచి భారీ స్థాయి సంస్థల వరకు చాలా మటుకు కంపెనీలు తమ ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు కేటాయించే బడ్జెట్లు సగటున 15–20 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. అంతేగాకుండా ఉద్యోగులు సైతం కొత్త తరం టెక్ కొలువులకు కావాల్సిన నైపుణ్యాలను సాధించేందుకు తమంతట తాముగా కూడా చొరవ తీసుకుంటారు. ⇒ దేశీ ఐటీలో తాత్కాలిక ఉద్యోగుల సంఖ్య మూడు రెట్లు పెరిగి 2030 నాటికి 2.4 కోట్ల స్థాయికి చేరుతుంది. టెక్నాలజీ రంగంలో ఎప్పటికప్పుడు మారిపోతున్న అవసరాలను పరిష్కరించుకునేందుకు, కావాల్సినప్పుడు అందుబాటులో ఉండే వర్కర్లపై ఆధారపడే ధోరణి పెరుగుతుండటం ఇందుకు కారణం. ⇒ భారతీయ ఐటీ రంగం చాలా మటుకు స్థిరపడినప్పటికీ, ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఏఐ, సైబర్‌సెక్యూరిటీ వంటి వర్ధమాన రంగాల్లో నిపుణుల కొరత ఉంటోంది. అలాగే, అంతర్జాతీయంగా ఆర్థిక అస్థిరత ప్రభావం కూడా మన ఐటీ రంగంపై పడతోంది. ⇒ డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియాలాంటి కార్యక్రమాలు ప్రయోజనకరంగానే ఉంటున్నాయి. కానీ, వ్యయాలపరంగా ఒత్తిళ్లు పెరుగుతున్న తరుణంలో ఉద్యోగులకి కొత్త నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు, కస్టమర్లకు మరింత విలువైన సేవలు అందించేందుకు వినూత్న వ్యూహాలు అవసరమవుతాయి. సాంకేతిక పరివర్తనకు సంబంధించి మరింతగా ముందుకెళ్లేందుకు ఇవి కీలకంగా ఉంటాయి. -
హ్యుండై విస్తరణ ప్లాన్.. మరిన్ని కొత్త ఉద్యోగాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా సంస్థ హ్యుండై అనుబంధ కంపెనీ హ్యుండై మోటార్ ఇండియా తమిళనాడు ప్లాంటును విస్తరించాలని నిర్ణయించింది. ప్రీ–ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను ఈ మేరకు దాఖలు చేసింది. దీని ప్రకారం కాంచీపురం జిల్లాలోని ఈ కేంద్రంలో రూ.1,500 కోట్లతో ఆధునీకరణ పనులు చేపడతారు.విస్తరణ పూర్తి అయితే 5.4 లక్షల చదరపు మీటర్లున్న ప్లాంటు స్థలం 7.21 లక్షల చదరపు మీటర్లకు పెరుగుతుంది. కొత్తగా 155 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధునీకరణ పనులకు కొత్తగా స్థలం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. మొత్తం 538 ఎకరాల్లో ఈ కేంద్రం నెలకొని ఉంది.ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 8.5 లక్షల యూనిట్లు. అయిదేళ్లలో విస్తరణ పనులు పూర్తి అవుతాయని సంస్థ భావిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రయాణికుల వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ పెట్టుబడి కీలకమని హ్యుండై వెల్లడించింది. -
కొలువుల బడ్జెట్ మాత్రం కాదు!
‘‘కేంద్ర బడ్జెట్లో ఘన మైన లక్ష్యంతో కేటాయించిన రూ. 2 లక్షల కోట్ల ప్యాకేజీ వచ్చే ఐదేళ్లలో 4.1 కోట్ల మంది యువ తకు లబ్ధి చేకూర్చనుంది. అంతేకాకుండా ఈ బడ్జెట్ ప్రత్యేకంగా విద్య, ఉద్యో గాలు, నైపుణ్యాల వృద్ధి కోసం రూ. 1.48 లక్షల కోట్లు వ్యయం చేయనుంది’’ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యో గాల కల్పన, నైపుణ్యాల అభివృద్ధితోపాటు ఎమ్ఎస్ఎంఈ రంగం గురించి కూడా బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. కేంద్ర బడ్జెట్–2024 అనేక విధాలుగా ప్రత్యేకమైందే. కాని అది కీలక మైన ఉద్యోగాల కల్పనలో విఫలమవడం ఖాయం. ఇది ఉద్యోగాలు సృష్టించే బడ్జెట్ కాదు.ఉద్యోగ కల్పన దిశగా 2.1 కోట్ల మంది ఫ్రెషర్స్‌కు ప్రయోజనం చేకూర్చేలా ఒక నెల జీతం లేదా మూడు ఇన్స్టాల్మెంట్స్లో రూ. 15,000 ఇవ్వనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొ న్నారు. దీనివల్ల వచ్చే ఐదేళ్లలో నెలకు రూ. 15 వేల వేతనంతో 2.1 కోట్ల కొత్త ఉద్యోగాలు పుట్టు కొస్తాయని ఆమె అంచనా వేశారు. ఇది ఊహా జనిత అంచనా మాత్రమే. ఇది ఉద్యోగాలు లభించే ప్రాంతాలకు యువత వలస పోయేట్లు మాత్రమే చేస్తుంది. కానీ వాస్తవంలో ఎలాంటి కొత్త ఉద్యోగాల సృష్టి జరిగే అవకాశం కచ్చితంగా లేదు.మరో స్కీమ్ ఏమంటే.. తయారీ రంగం, అదేవిధంగా వ్యవస్థీకృత రంగంలో కొత్తగా ఉద్యో గాలు కల్పించే కంపెనీలకు మేలు చేసేలా ఆ యా ఉద్యోగుల పీఎఫ్‌ను ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. వ్యవస్థీకృత రంగ ఉద్యోగాల వేత నంలో పీఎఫ్ అనేది చాలా తక్కువ మొత్తం. దీని వల్ల వేతన వ్యయం కొంత తగ్గుతుంది. యజ మాని మంచి వ్యక్తి అయితే ఆ మొత్తాన్ని ఉద్యోగికి ఇచ్చి వేతనం పెంచే ప్రయత్నం చేస్తాడు. అంతే కాని పీఎఫ్ ఇచ్చే స్కీమ్ ఏ రకంగానూ కొత్త ఉద్యో గాల కల్పనకు ప్రోత్సాహం ఇచ్చేది కాదు.ఐటీఐలను అప్‌గ్రేడ్ చేయడం వల్ల నైపు ణ్యాలు పెరుగుతాయి. ఎందుకంటే.. వాస్తవ నైపు ణ్యాలు ఐటీఐల్లో లభించడం లేదు. ఉద్యోగంలో చేరిన తర్వాతే అవసరమైన స్కిల్స్ నేర్చుకుంటు న్నారు. ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన తర్వాత సదరు అభ్యర్థికి సరైన ఉద్యోగం లభించకుంటే.. ఆ ఐటీఐ చదువు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.అదే విధంగా అప్రెంటిస్ స్కీమ్, ఇంటర్న్ షిప్ స్కీమ్స్ కూడా సప్లయ్ వైపు తీసుకున్న చర్యలే తప్ప కొత్త ఉద్యోగాలు సృష్టించేవి కాదు. వాస్తవానికి వ్యాపారం విస్తరించినప్పుడే కొత్త ఉద్యోగాల కల్పన అనేది సాధ్యమవుతుంది. కొత్త మార్కెట్లు లేదా కొత్తగా డిమాండ్ పెరగడం వల్ల వ్యాపారాల విస్తరణ జరుగుతుంది. ఆర్థిక మంత్రి ఊహించినట్లు సప్లయ్ సైడ్ చర్యల వల్ల కొలు వుల సృష్టి జరగదు. ఉద్యోగాల కల్పన అనేది డిమాండ్‌ను పెంచే ప్రోత్సాహకాల వల్లనే సాధ్య మవుతుంది. అసలు మొత్తంగా ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమే సరిగా లేదు. ఎందుకంటే... స్కిల్స్ పెంచడం, అప్రెంటిస్, ఇంట ర్న్‌షిప్ అవకాశాలు కల్పించడం వల్ల నైపుణ్యా లున్న యువత సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఇలా స్కిల్స్ పెంచుకున్న యువతకు తక్షణమే ఉద్యోగాలు చూపించలేకపోతే అది మరింత వైఫ ల్యంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వం వ్యవ స్థలో డిమాండ్ పెంచే చర్యలు తీసుకోవాలి.కొత్త ఉద్యోగాలు భారీగా సృష్టించేది ఎవరు? ఐటీ రంగం కాని, పెద్ద పెద్ద కంపెనీలు కాని కాదు. వీరంతా ఇప్పుడు ఆటోమేషన్‌ను విని యోగిస్తున్నారు. వీరు భారీ సంఖ్యలో కొలువులు ఆఫర్ చేసే పరిస్థితి లేదు. ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది ఎమ్ఎస్ఎంఈ రంగమే! బడ్జె ట్లో ముద్రా లోన్ మొత్తాన్ని పది లక్షల రూపా యలకు పెంచారు. కానీ బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనకంజ వేస్తుండటంతో అవి అవస రమున్న వారికి చేరడంలేదు. ఎంఎస్ ఎంఈలలో పెట్టుబడులు పెంచేలా రుణ గ్యారెంటీ స్కీమ్ మరొకటి కూడా ఉంది. కానీ దురదృష్టవ శాత్తు ప్రభుత్వం పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు భారీగా పన్ను రాయితీలు ఇస్తోంది. ఎంఎస్ఎంఈలకు మాత్రం తిరిగి చెల్లించే రుణాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.ఎంఎస్ఎంఈ రంగంలో వృద్ధితోపాటు లాభాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ఈ రంగానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా అవసరం. వ్యాపార విస్తరణకు, వృద్ధికి, మను గడకు సబ్సిడీ అందించాలి. జీఎస్టీ ఒకరకంగా ఎంఎస్ఎమ్ఈ రంగాన్ని దారుణంగా దెబ్బతీసింది. కాని ఆర్థిక మంత్రి ఈ రంగం మనుగడ కోసం ఏమీ చేయడంలేదు. వడ్డీ రాయితీ తప్పితే ఎంఎస్ఎంఈ రంగానికి ఎలాంటి సబ్సిడీ అందు బాటులో లేదు. అంతిమంగా చెప్పేదేమంటే... ఎక్కువ మందికి ఉపాధి కల్పించే, అధికసంఖ్యలో ఉద్యోగాలు సృష్టించే ఎంఎస్ఎమ్ఈ రంగ వృద్ధి, విస్తరణకు అవసరమైన ప్రోత్సా హాన్ని అందించడంలో బడ్జెట్ 2024–25 విఫల మైంది!!– టి. మురళీధరన్, వ్యాసకర్త, టీఎమ్ఐ గ్రూపు ఫౌండర్ చైర్మన్ -
3–4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు: మోదీ
ముంబై: రిజర్వు బ్యాంక్ నివేదిక ప్రకారం గడిచిన మూడు నాలుగేళ్లలో దేశంలో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిరుద్యోగితపై బూటకపు ప్రచారాలు చేస్తున్న వారి నోళ్లను ఆర్బీఐ నివేదిక మూయించిందన్నారు. ముంబై శివారులోని గోరేగావ్‌లో మోదీ శనివారం రూ, 29 వేల కోట్ల విలువైన రోడ్డు, రైల్వే, పోర్టు ప్రాజెక్టులను ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు పెట్టుబడిదారులు ఎంతో ఉత్సాహంగా స్వాగతించారన్నారు. ఎన్డీయే సర్కారు మాత్రమే సుస్థిరతను అందించగలదని ప్రజలకు తెలుసన్నారు. ‘ఉపాధిపై ఆర్బీఐ ఇటీవలే సవివర నివేదికను ప్రచురించింది. గడిచిన మూడు– నాలుగేళ్లలో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. ఉద్యోగాలపై అబద్ధాలను ప్రచారం చేసే వారి నోళ్లను ఆర్బీఐ గణాంకాలు మూయించాయి’ అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు నిరుద్యోగాన్ని ప్రధానంగా ప్రస్తావించడాన్ని దృష్టిలో పెట్టుకొని మోదీ ఇలా చురకలు అంటించారు. -
అంచనాలను మించి పెరిగిన అమెరికా నియామకాలు
అమెరికాలో ఉద్యోగ వృద్ధి మే నెలలో అంచనాలను అధిగమించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గత నెలలో 2,72,000 ఉద్యోగాలను జోడించింది. ఏప్రిల్‌లో నమోదైన 1,65,000 నియామకాల కంటే మే నెలలో భారీగా పెరిగినట్లు ఆ దేశ కార్మిక శాఖ తెలిపింది.బ్రీఫింగ్ డాట్‌కామ్ (briefing.com) ప్రకారం.. విశ్లేషకులు అంచనా వేసిన 1,85,000 పెరుగుదల కంటే ఇది గణనీయంగా ఎక్కువ. 2023 డిసెంబర్ తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి. కాగా ఉద్యోగ వృద్ధితోపాటు నిరుద్యోగం కూడా స్పల్పంగా పెరిగింది. నిరుద్యోగ రేటు 3.9 శాతం నుంచి 4.0 శాతానికి పెరిగిందని ఆ శాఖ పేర్కొంది.అయితే వడ్డీ రేట్లను తగ్గించడానికి సరైన సమయం కావడంతో ఊహించిన దానికంటే ఎక్కువ గణాంకాలు ఫెడరల్ రిజర్వ్ గణనను క్లిష్టతరం చేస్తాయి. ద్రవ్యోల్బణాన్ని స్థిరంగా నియంత్రించేందుకు డిమాండ్ తగ్గుతుందనే ఆశతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఇటీవలి నెలల్లో రేట్లను 23 ఏళ్ల గరిష్ట స్థాయికి చేర్చింది.ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలను జోడించడంతో, ఫెడ్ రేటు కోతలను మరికొంత కాలం నిలుపుదల చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మే నెలలో హెల్త్ కేర్, గవర్నమెంట్ వంటి రంగాలతో పాటు విశ్రాంతి, ఆతిథ్యం వంటి రంగాల్లో ఉపాధి పెరిగిందని కార్మిక శాఖ నివేదిక తెలిపింది. -
ఈ స్కిల్ మీలో ఉంటే చాలు.. ఉద్యోగం రెడీ!
2024లోనూ ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న క్రమంలో.. డిజిటల్ ఇంజినీరింగ్, బిజినెస్ ప్లాట్‌ఫామ్ సేవల సంస్థ 'ఫుల్క్రమ్ డిజిటల్' (Fulcrum Digital) మాత్రం కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు శుభవార్త చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ డొమైన్లలో 700 మందిని నియమించుకోవాలని యోచిస్తోందని ఫుల్క్రమ్ డిజిటల్ కంపెనీ ఛైర్మన్ 'రాజేష్ సిన్హా' తెలిపారు. కంపెనీ కార్యకలాపాలను మరింత సులభతరం చేయడానికి ఏఐ టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడానికి సంస్థ ఆసక్తి చూపుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాకుండా, డేటా సైన్టిస్ట్, సాఫ్ట్వేర్ డెవలపర్స్ వంటి టెక్నాలజీలలో నైపుణ్యం కలిగిన వారిని కూడా సంస్థ ఈ ఏడాది నియమించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. న్యూయార్క్‌కు చెందిన ఫుల్క్రమ్ డిజిటల్ సాఫ్ట్వేర్ కార్యాలయాలు లాటిన్ అమెరికా, యూరప్, ఇండియాలలో కూడా ఉన్నాయి. ఇదీ చదవండి: ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను!.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కొత్త టెక్నాలజీ అవసరం.. రోజు రోజుకి కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. కాబట్టి ఉద్యోగులు కూడా తప్పకుండా కొత్త టెక్నాలజీలలో నైపుణ్యం పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను నేర్చుకోగలుగుతారో.. అప్పుడే సంస్థల్లో మనగలుగుతారు. లేకుంటే ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. టెక్నాలజీలలో నైపుణ్యం లేకపోవడం వల్ల, ఇతర కారణాల వల్ల గత నెలలో ఏకంగా 32వేలమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఉద్యోగి తన నైపుణ్యం పెంచుకోవాలి. -
కొత్త ఉద్యోగాలు పెరగనున్నాయ్.. ఇదిగో సాక్ష్యం!
కరోనా వైరస్ కారణంగా చాలా కంపెనీలు భారీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొత్తగా ఉద్యోగులను చేర్చుకోవడం లేదా ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేయడం గానీ పూర్తిగా ఆపేసాయి. అంతే కాకుండా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించగా.. మరికొన్ని సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ వెసలుబాటు కల్పించి ఇంటికే పరిమితం చేశాయి. కాగా ఇప్పుడు ఉద్యోగులు ఆఫీసుల బాట పడుతున్నారు.. నియామకాల జోరు కూడా పెరుగుతోంది. నివేదికల ప్రకారం, 2023 డిసెంబర్ చివరి నాటికి కొత్త ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందని, ఇప్పటికే ఖాళీ ఉన్న పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయడానికి కంపెనీలు సన్నద్ధమవుతాయని తెలుస్తోంది. నౌకరి హైరింగ్ అవుట్ లుక్ (Naukri Hiring Outlook) రూపొందించిన ఒక నివేదికలో 1200ల కంటే ఎక్కువ నియామక సంస్థలు, కన్సల్టెంట్స్ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: భారత్ ఎన్సీఏపీ ప్రారంభం నేడే.. దీనివల్ల ఉపయోగాలెన్నో తెలుసా? రానున్న రోజుల్లో దాదాపు 92 శాతం నియామకాలు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. ఇందులో కూడా కొత్త ఉద్యోగాల సంఖ్య పెరిగే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్ వంటి వాటిలో ఉద్యోగాలు మెండుగా ఉండనున్నాయి. ఈ ఏడాది చాలా సంస్థలు తమ ఉద్యోగులకు చాలా తక్కువ మొత్తంలో ఇంక్రిమెంట్స్ కల్పించాయి, కాగా మరికొన్ని కంపెనీలు ఇంక్రిమెంట్ ఊసే ఎత్తలేదు. అంతే కాకుండా చాలా రోజుల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటుపడిన ఉద్యోగులను తప్పకుండా ఆఫీసులకు రావాలని బడా సంస్థలు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. ఇవన్నీ కూడా కొత్త ఉద్యోగాలు కల్పించడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. -
గుడ్ న్యూస్.. ఆ రంగాల్లో 50వేల కొత్త ఉద్యోగాలు!
Jobs In Festival Season: త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగాలు ఇప్పటికే క్రెడిట్-కార్డ్ అమ్మకాలు, పర్సనల్ ఫైనాన్స్ అండ్ రిటైల్ బీమాలలో పెరుగుదలను ఆశిస్తున్నాయి. దీంతో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని నివేదికలు చెబుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 50వేల ఉద్యోగాలు.. నివేదికల ప్రకారం, ఈ ఏడాది ద్వితీయార్థంలో దాదాపు 50వేల తాత్కాలిక ఉద్యోగాలు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. సంస్థలు కూడా కొత్త ఉద్యోగులను చేర్చుకోవడాయికి ఆసక్తి చూపుతున్నాయి. మునుపటి ఏడాదికంటే కూడా ఈ సారి ఈ రంగాల్లో ఉద్యోగాలు 15 శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. క్రెడిట్ కార్డ్ లావాదేవీలు పెరగడం, పర్సనల్ ఫైనాన్స్ అప్లికేషన్లు పెరగటమే కాకుండా రాబోయే 5 లేదా 6 నెలల్లో డైనమిక్ జాబ్ మార్కెట్‌కు సిద్ధంగా ఉన్నామని టీమ్‌లీజ్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ హెడ్-BFSI కృష్ణేందు ఛటర్జీ తెలిపారు. ఇదీ చదవండి: అందులోని వాహనాల ఖరీదే వేలకోట్లు.. ఆ ప్యాలెస్ గురించి తెలిస్తే షాకవుతారు! పండుగ సీజన్లో తాత్కాలిక ఉద్యోగుల డిమాండ్ అహ్మదాబాద్, పూణే, బెంగళూరు, కోల్‌కతా వంటి టైర్ 1 నగరాల్లో మాత్రమే కాకుండా టైర్ 2 అండ్ టైర్ 3 నగరాలైన కొచ్చి, వైజాగ్, మధురై.. లక్నో, చండీగఢ్, అమృత్సర్, భోపాల్, రాయ్‌పూర్‌లలో కూడా ఎక్కువగా ఉండనుంది. ఇదీ చదవండి: ఇదో చెత్త కారు.. రూ. 4 కోట్ల మసెరటిపై గౌతమ్ సింఘానియా ట్వీట్ వేతనం వివరాలు.. నిజానికి ఈ టెంపరరీ ఉద్యోగుల ఆదాయం మునుపటి ఏడాదికంటే కూడా 7 నుంచి 10 శాతం పెరిగాయి. కావున ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగుళూరులో జీతాలు నెలకు రూ. 20,000 నుంచి రూ. 22,000 వరకు.. అదే సమయంలో చెన్నైలో రూ. 15వేల నుంచి రూ. 17వేల వరకు & కలకత్తాలో రూ. 13వేల నుంచి రూ. 15వేల వరకు ఉండనున్నాయి. దీన్ని బట్టి చూస్తే జీతాలు కూడా ఓ రకంగా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. -
మహిళా ఇంజనీర్లకు టాటా టెక్నాలజీస్ ప్రాధాన్యం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ మరింత మంది మహిళలను రిక్రూట్ చేసుకోవాలని భావిస్తోంది. కార్యాలయాల్లో లింగ వైవిధ్యాన్ని పాటించే క్రమంలో ’రెయిన్బో’ కార్యక్రమం కింద 2023–24 ఆర్థిక సంవత్సరంలో 1,000 మంది పైగా మహిళా ఇంజనీర్లను తీసుకునే యోచనలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. అలాగే, నాయకత్వ బాధ్యతలను చేపట్టేలా మహిళా ఉద్యోగులను తీర్చిదిద్దే దిశగా ఆరు నెలల లీడర్‌బ్రిడ్జ్–వింగ్స్ ప్రోగ్రామ్‌ను రూపొందించినట్లు వివరించింది. ఉద్యోగినులు నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని టాటా టెక్నాలజీస్ వివరించింది. సంస్థలో సమ్మిళిత సంస్కృతిని పెంపొందించేందుకు, ఉద్యోగులు చురుగ్గా పాలుపంచుకునేందుకు మరిన్ని కొత్త ప్లాట్‌ఫామ్‌లను కూడా ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. -
గుడ్ న్యూస్: 15,000 ఉద్యోగాలు.. ప్రారంభమైన సాఫ్ట్వేర్ కంపెనీ క్యాంపస్ నిర్మాణం
జర్మనీకి చెందిన మల్టీనేషన్ సాఫ్ట్వేర్ కంపెనీ శాప్ (SAP) ల్యాబ్స్ బెంగళూరులో రెండో క్యాంపస్ నిర్మాణాన్ని తాజాగా ప్రారంభించింది. 15,000 మంది ఉద్యోగులు పని చేసేందుకు సరిపోయేలా ఈ క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. శాప్ ల్యాబ్స్ ఇండియా ఎండీ, సీనియర్ వైస్ ప్రెసిడింట్ సింధు గంగాధరన్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో 41.07 ఎకరాల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. ఇది 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ‘శాప్ ల్యాబ్స్ ఇండియా 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం బెంగళూరులో 15,000 ఉద్యోగాలను సృష్టించే కొత్త 41 ఎకరాల క్యాంపస్‌తో భారతదేశంలో మా పెట్టుబడులను మరింతగా పెంచుతున్నాం’ అని శాప్ ల్యాబ్స్ ఇండియా ఎండీ, సీనియర్ వైస్ ప్రెసిడింట్ సింధు గంగాధరన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం శాప్ ల్యాబ్స్‌కు అతిపెద్ద ఆర్అండ్డీ హబ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ మొత్తం ఆర్అండ్డీ విభాగంలో 40 శాతం వాటా దీని నుంచి ఉంది. కొత్త క్యాంపస్ నిర్మాణం భారతదేశం పట్ల తమ నిబద్ధతను మరింత బలపరుస్తుందని శాప్ కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: ట్విటర్ క్రాష్: ఇష్టమొచ్చినట్లు ఉద్యోగులను పీకేస్తే ఇలాగే ఉంటుంది! -
ఆకాశ ఎయిర్‌లో వెయ్యి కొలువులు
న్యూఢిల్లీ: కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి సుమారు 1,000 మంది ఉద్యోగులను తీసుకోవాలని ఆకాశ ఎయిర్ భావిస్తోంది. తద్వారా మొత్తం సిబ్బంది సంఖ్యను 3,000కు పెంచుకోనుంది. దాదాపు ఏడు నెలల క్రితం కార్యకలాపాలు ప్రారంభించిన ఆకాశ ఎయిర్ ఈ ఏడాది ఆఖరు నాటికి అంతర్జాతీయ రూట్లలోనూ సర్వీసులు మొదలుపెట్టాలని యోచిస్తోంది. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో వినయ్ దూబే ఈ విషయాలు తెలిపారు. (మళ్లి పెరిగిన బంగారం ధర: వెయిట్ చెయ్యాలా? కొనుక్కోవాలా?) అంతర్జాతీయ సేవలకు సంబంధించి అనువైన దేశాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ‘మూడు అంకెల స్థాయిలో’ విమానాల కోసం ఆర్డరు ఇవ్వనున్నట్లు దూబే వివరించారు. ఆకాశ ఎయిర్ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం ఆర్డరు ఇచ్చింది. ప్రస్తుతం కంపెనీ దగ్గర 19 విమానాలు ఉండగా .. వచ్చే ఆర్థిక సంవత్సరం మరో తొమ్మిది అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్‌లో వచ్చే విమానంతో కలిపి ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య 20కి చేరుతుంది. తద్వారా విదేశాలకు సర్వీసులు ప్రారంభించేందుకు అర్హత లభిస్తుంది. తమకు ఇప్పుడు అదనపు విమానాలు లేకపోయినప్పటికీ ముందుగానే సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాల్సి వస్తుందని, వారికి శిక్షణనివ్వాల్సి ఉంటుందని దూబే తెలిపారు. ప్రస్తుతం తాము రోజుకు 110 ఫ్లయిట్స్ నడుపుతున్నామని.. ఈ వేసవి సీజన్ ఆఖరు నాటికి వీటిని 150కి పెంచుకుంటామని ఆయన చెప్పారు. (శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ , అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా!) (CrickPe: ఫాంటసీ క్రికెట్ యాప్ ‘క్రిక్‌పే’ లాంచ్... అదీ ఐపీఎల్‌కు ముందు) (హురున్ రిచ్ లిస్ట్ 2023: రేఖా ఝున్‌ఝున్‌వాలా ఎంట్రీ! సూపర్!) -
లేఆఫ్స్ వేళ ఫ్రెంచ్ కంపెనీ సంచలనం.. కొత్తగా 12 వేల మందికి ఉద్యోగాలు!
అన్ని రంగాలకు చెందిన పెద్ద పెద్ద కంపెనీలు లేఆఫ్స్ పేరుతో వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో ఫ్రెంచ్కు చెందిన మల్టీ నేషన్ కంపెనీ థేల్స్ గ్రూప్ సంచలన విషయం వెల్లడించింది. ఏరోస్పేస్, రక్షణ, భద్రత, డిజిటల్ ఐడెంటిటీ, సెక్యూరిటీ రంగాల్లో ఈ ఏడాదిలో 12 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు పేర్కొంది. కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12 వేల మందిని నియమించుకోనుండగా ప్రత్యేకంగా ఫ్రాన్స్‌లో 5,500, భారత్‌లో 550, యునైటెడ్ కింగ్డమ్లో 1,050, ఆస్ట్రేలియాలో 600, అమెరికాలో 540 మంది కొత్త ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా భారత్‌లో ఇంజినీరింగ్ ఆపరేషన్స్ కోసం ఉద్యోగులను నియమించుకుంటోంది. (ఇదీ చదవండి: Layoffs: నా చిన్నారి పాపకు నేనేం చెప్పను? తొలగించిన గూగుల్ ఉద్యోగిని ఆవేదన!) థేల్స్ గ్రూప్ తన అన్ని వ్యాపార విభాగాల్లోనూ నియామకాలు చేపడుతోంది. భారత్‌లోని నోయిడా, బెంగళూరులో ఉన్న సైట్ల కోసం శాశ్వత, ఒప్పంద ప్రాతిపదికన రిక్రూట్ చేస్తోంది. ముఖ్యంగా హార్డ్‌వేర్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సిస్టమ్స్ ఆర్కిటెక్ట్‌లు, డిజిటల్ టెక్నాలజీ నిపుణులు, ప్రాజెక్ట్ మేనేజర్ల కోసం చూస్తోంది. (ఇదీ చదవండి: సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్! దీంతో ఎలా బతుకుతున్నారు సార్?) -
వేగవంత అభివృద్ధి ఉపాధిని సృష్టిస్తోంది
న్యూఢిల్లీ: మౌలిక, అనుబంధ రంగాల్లో వడివడిగా అభివృద్ధి అడుగులు పడుతుండటం వల్లే దేశంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన 71,426 మందికి శుక్రవారం నియామక పత్రాలను ప్రధాని మోదీ ఎలక్ట్రానిక్ పద్ధతిలో అందజేశారు. రోజ్‌గార్ మేళాలో భాగంగా శుక్రవారం ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా ఎంపికైన సిబ్బందితో మోదీ కొద్దిసేపు మాట్లాడారు. ‘ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత, వేగం తెస్తూ కచ్చితమైన కాలవధితో రిక్రూట్మెంట్ చేస్తున్నాం. కొత్తగా వేలాది మందికి ఉద్యోగాలతో కొనసాగుతున్న ఈ రోజ్‌గార్ మేళానే మా ప్రభుత్వ పనితీరుకు చక్కని నిదర్శనం’ అని వ్యాఖ్యానించారు. విధిలో బాధ్యతగా మెలగండి నూతన ఉద్యోగాల్లో కొలువుదీరే సిబ్బందిని ఉద్దేశించి మోదీ కొన్ని సూచనలు చేశారు. ‘ వ్యాపారి తన వినియోగదారుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తాడు. ఇదే మంత్రం మీ మదిలో ప్రతిధ్వనించాలి. ప్రజాసేవకు అంకితం కావాలి. కార్యనిర్వహణలో పౌరుడి సేవే ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. ప్రజాసేవే ముఖ్యం’ అని సూచించారు. ‘ప్రతీ గ్రామం భారత్‌నెట్ ప్రాజెక్టులో భాగస్వామి అయిననాడు అక్కడ ఉపాధి కల్పన ఎక్కువ అవుతుంది. టెక్నాలజీని అంతగా అర్థంచేసుకోలేని వారు ఉండేచోట వారికి ఆన్లైన్ సేవలు అందిస్తూ కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అవకాశం చిక్కుతుంది. ఇలాంటి కొత్త వ్యాపారాలు చేసేందుకు రెండో శ్రేణి, మూడో శ్రేణి పట్టణాలు అక్కడి అవకాశాలను అందిపుచ్చుకునే నిరుద్యోగ యువతకు నూతన గుర్తింపును తీసుకొస్తున్నాయి’ అని అన్నారు. ‘భవిష్యత్తులో దేశంలో వివిధ రంగాల్లో మరింతగా ఉపాధి కల్పనకు రోజ్‌గార్ మేళా ఒక ఉత్ప్రేరకంగా పనిచేయగలదు. దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యే యువతకు సరైన ఉపాధి అవకాశాలు దక్కాలి’ అని ఈ సందర్భంగా ప్రధాని కార్యాలయం పేర్కొంది. -
సెప్టెంబర్ క్వార్టర్లో 78 వేల కొలువులు
న్యూఢిల్లీ: పండుగల సీజన్, వివిధ రంగాల్లో డిమాండ్ తోడ్పాటుతో ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీ ఫ్లెక్సీ స్టాఫింగ్ పరిశ్రమలో కొత్తగా 78,000 కొలువులు వచ్చాయి. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే 6 శాతం పెరిగాయి. ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) ఫ్లెక్సీ స్టాఫింగ్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. జనరల్ స్టాఫింగ్, ఐటీ స్టాఫింగ్ కలిపి ఈ గణాంకాలు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. నిర్దిష్ట కాలానికి లేదా ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి నిర్ణీత కాల వ్యవధికి తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవడాన్ని ఫ్లెక్సీ స్టాఫింగ్గా వ్యవహరిస్తారు. నివేదిక ప్రకారం ఐటీ కాకుండా మిగతా విభాగాల్లో (ఎఫ్ఎంసీజీ, ఈ–కామర్స్, తయారీ, రిటైల్, లాజిస్టిక్స్, బ్యాంకింగ్, ఆతిథ్య, పర్యాటక, బీమా, మౌలిక సదుపాయాల కల్పన మొదలైనవి) నియామకాలు జులై–సెప్టెంబర్‌లో 7.3 శాతం పెరిగాయి. అటు ఐటీలో మాత్రం ఒక మోస్తరుగా 2.2 శాతమే వృద్ధి నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లలో మందగమన ప్రభావాన్ని సూచిస్తూ దేశీ ఐటీ సంస్థలు కూడా కొత్త నియామకాలను తగ్గించుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. నాలుగు త్రైమాసికాలు.. 2.32 లక్షల ఉద్యోగాలు .. నివేదిక ప్రకారం 2022 అక్టోబర్ నుండి 2023 సెప్టెంబర్‌వరకూ నాలుగు త్రైమాసికాల్లో ఐఎస్ఎఫ్లో సభ్యత్వం ఉన్న 110 పైచిలుకు కంపెనీలు 2.32 లక్షల కొలువులు ఇచ్చాయి. గడిచిన 10 ఏళ్లలో ఇవి 90 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాయి. లాక్డౌన్లు పూర్తిగా తొలగించాక వచ్చిన తొలి పండుగ సీజన్లో ఉద్యోగులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని స్టాఫింగ్ పరిశ్రమ ముందుగానే ఊహించిందని, తదనుగుణంగానే ఆయా సంస్థలకు సిబ్బందిని సమకూర్చగలిగిందని ఐఎస్ఎఫ్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు. వార్షిక ప్రాతిపదికన చూస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్త ఉద్యోగాల కల్పన 20 శాతం వృద్ధి చెందిందని ఆయన చెప్పారు. -
దిక్కుతోచని స్థితిలో గిగ్ వర్కర్లు
ముంబై: తాజా నైపుణ్యాలను అలవరుచుకోవడం లేదా కొత్త ఉపాధిని వెతుక్కోవడమనే సవాలును ఎదుర్కొంటున్నట్టు కాంట్రాక్టు పనివారు (గిగ్ వర్కర్లు) అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో ఏర్పాటైన స్లార్టప్ ప్లాట్‌ఫామ్ సీఐఐఈ.కో ఒక నివేదికను విడుదల చేసింది. పనివాతావరణం తమకు సవాలుగా ఉన్నట్టు సర్వేలో పాల్గొన్న వర్కర్లలో 52 శాతం మంది చెప్పారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం లేదంటే మరో ఉద్యోగం వెతుక్కోవాల్సిన సవాలును ఎదుర్కొంటున్నట్టు వీరు తెలిపారు. స్వల్పకాల ఆదాయం కోసం ప్లాట్‌ఫామ్‌లలో కాంట్రాక్టు పనికోసం చేరిన వారు దీర్ఘకాలం పాటు, ఎటువంటి వృద్ధి లేకుండా కొనసాగాల్సి వస్తున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. ‘‘మేము అభిప్రాయాలు తెలుసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరు సమీప కాలంలో ఉద్యోగాలు మారే విషయమై స్పష్టమైన ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. అధిక వేళలపాటు పనిచేయాల్సి రావడం, నైపుణ్యాలను పెంచుకునే వాతావరణం లేకపోయినా కూడా మూడింట రెండొంతుల మంది ఉద్యోగాలు మారే విషయమై ప్రణాళికతో లేరు’’అని ఈ నివేదిక ప్రస్తావించింది. నైపుణ్యాల అంతరం దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. ఇలా అయితే నష్టం.. యూనివర్సిటీల నుంచి వస్తున్న ఉద్యోగార్థులకు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు మొదటి ఉద్యోగ వేదికలుగా ఉంటున్నట్టు ఈ నివేదిక తెలిపింది. వారు ఈ ఉద్యోగాలకే అతుక్కుపోయి నైపుణ్యాలు పెంచకోకుండా, మెరుగైన సంస్థల్లో కొలువులు పొందలేకపోతే.. అది మానవనరులను సరిగ్గా ఉపయోగించుకోలేని పరిస్థితికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటర్నెట్ సుదుపాయం ఉన్నా కానీ, నేడు గిగ్ వర్కర్లలో 50 శాతం మంది రిఫరల్ రూపంలోనే పనిని పొందుతున్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా 4,070 మంది గిగ్ వర్కర్ల నుంచి సీఐఐఈ అభిప్రాయాలు తెలుసుకుని ఈ నివేదిక రూపొందించింది. -
హెచ్4 వీసాదారులకు ఊరట
వాషింగ్టన్: అమెరికాలోని హెచ్–4 వీసాదారులు ఆటోమేటిక్‌గా ఉద్యోగాలు చేయడానికి వీలు కల్పించే ఒక బిల్లును కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఎందరో భారతీయులతో పాటు, విదేశాల నుంచి వచ్చే జీవిత భాగస్వామ్యులకు మేలు జరుగుతుంది. భర్త లేదా భార్యల వెంట అమెరికాకి వెళ్లే వారు వెంటనే హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చు. హెచ్–1బి, హెచ్–2ఏ, హెచ్–2బీ, హెచ్–3 తదితర వీసాలపై అమెరికా వెళ్లే వారి జీవిత భాగస్వామికి, పిల్లలకి హెచ్–4 వీసా ఇస్తారు. ఇన్నాళ్లూ హెచ్–4 వీసాదారులు ఉద్యోగాలు చేయాలంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ)కి దరఖాస్తు చేసుకోవాలి. దానిని పరిశీలించి ఇమ్మిగ్రేషన్ శాఖ వర్క్ పర్మిట్ ఇవ్వడానికి ఆరు నెలల నుంచి ఏడాది పడుతుంది. అప్పుడే వారు ఉద్యోగం చేయడానికి వీలు కలిగేది. ఈ బిల్లు కాంగ్రెస్‌లో ఆమోదం పొందితే ఇక వర్క్ పర్మిట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఉద్యోగాలు చేసే అవకాశం లభిస్తుంది. అమెరికాలో ఉద్యోగాలు చేసే కార్మికులకు కొరత ఉండడంతో ఆటోమేటిక్‌గా ఉద్యోగం చేసే అవకాశం లభించేలా ఈ బిల్లుకి రూపకల్పన చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కరోలిన్ బూర్డెక్స్, మారియా ఎల్విరల సలాజర్‌లు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దేశంలో కార్మికుల కొరత వ్యాపారాలపై ప్రభావం చూపిస్తోందని వలసదారులకి ఆటోమేటిక్‌గా ఆ హక్కు వస్తే ఇరుపక్షాలకు మేలు జరుగుతుందని వారు చెప్పారు. వీసాలు వృథా కాకుండా బిల్లు ఎవరూ వినియోగించుకోకుండా మిగిలిపోయిన 3 లక్షల 80 వేలకు పైగా కుటుంబ, ఉద్యోగ ఆధారిత వీసాలు వృథా కాకుండా కొందరు కాంగ్రెస్ ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వీసాలు వినియోగించుకోవడానికి వీలు కల్పించేలా ఒక బిల్లును కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే గ్రీన్ కార్డు బాక్లాగ్ల సంఖ్య తగ్గి భారత్, చైనా నుంచి వచ్చి అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి అవకాశం లభిస్తుంది. ఇమ్మిగ్రేషన్ శాఖ లెక్కల ప్రకారం గత ఏడాది 2,22,000 కుటుంబ ఆధారిత వీసాలు, 1,57,000 ఉద్యోగ ఆధారిత వీసాలు ఎవరూ వినియోగించుకోకుండానే మిగిలిపోయాయి. -
ఫ్రెషర్లకు హెచ్‌సీఎల్ బంపర్ ఆఫర్..!
రానున్న రోజుల్లో హెచ్‌సీఎల్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డిమాండ్ తగ్గట్టుగా వచ్చే ఆర్థిక సంవత్సరం 2023 వరకు సుమారు 30 వేల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకొనున్నట్లు కంపెనీ హూమన్ రిసోర్స్ ఆఫీసర్ వీవీ అప్పారావ్ వెల్లడించారు. ప్రతి సంవత్సరం కంపెనీలో సుమారు 40 నుంచి 50 శాతం మేర ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఒక ప్రకటనలో వీవీ అప్పారావు పేర్కొన్నారు. గత సంవత్సరంలో హెచ్‌సీఎల్ సుమారు 14 వేల మంది ఫ్రెషర్లను నియామకం చేసింది. 2021 సంవత్సరానికిగాను సుమారు 20 వేల నుంచి 22 వేల మంది ప్రెషర్లను తీసుకోవాలని హెచ్‌సీఎల్ భావిస్తోందని వీవీ అప్పారావు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 40-50 శాతం కొత్త నియామాకాలతో 2023 ఆర్థిక సంవత్సరానికి సుమారు 30 వేల మంది కొత్త వారికి ఉద్యోగాలను హెచ్‌సీఎల్ కల్పించనుందని వీవీ అప్పారావు తెలిపారు. కంపెనీలో ప్రస్తుతం సుమారు 1.76లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం హెచ్‌సీఎల్ 35 శాతం కొత్త వారిని, 65 శాతం అనుభవం కల్గిన ఉద్యోగులను నియమిస్తోంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఫ్రెషర్ల సంఖ్యను 70 శాతానికి పెంచాలని కంపెనీ భావిస్తోందని వీవీ అప్పారావు తెలిపారు. తాజాగా కంపెనీలో అట్రిషన్‌ను ఎదుర్కోవడం కోసం కంపెనీలోని ఉత్తమ ఉద్యోగులకు బెంజ్ కార్లను ఇవ్వాలని హెచ్‌సీఎల్ నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రసిద్ధ కాలేజీల నుంచి హెచ్‌సీఎల్ ఎక్కువ ఫ్రెషర్లను నియామాకం చేసుకోనుంది. ఈ ఏడాది ఐఐటీల నుంచి సుమారు 206 మందిని నియమించుకుంది. గత ఏడాది ఐఐటీలనుంచి ఫ్రెషర్ల భర్తీ సంఖ్య 134 గా ఉంది. కాగా దేశవ్యాప్తంగా పలు టాప్ 200 కాలేజీల నుంచి ఫ్రెషర్లను నియమించుకోవడానికి హెచ్‌సీఎల్ సన్నాహాలు చేస్తోందని హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ వీవీ అప్పారావు పేర్కొన్నారు. -
రిటైల్ 4.0తో కోటికి పైగా కొత్త కొలువులు
న్యూఢిల్లీ: రిటైల్ రంగానికి సంబంధించి ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాలు రెండూ కలిస్తే గణనీయంగా కొత్త కొలువులు వచ్చేందుకు, ఎగుమతులనూ పెంచుకునేందుకు అవకాశం లభించనుంది. కన్సల్టింగ్ సంస్థ టెక్నోపాక్తో కలిసి దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు ఉన్నాయి. రిటైల్ 4.0 పేరిట రూపొందించిన ఈ నివేదిక ప్రకారం ఆన్లైన్ + ఆఫ్‌లైన్ విధానంతో కొత్తగా 1.2 కోట్ల మేర కొత్త కొలువులు రాగలవు. అలాగే రిటైల్ ఎగుమతులు 125 బిలియన్ డాలర్ల దాకా పెరగగలవని అంచనా. గడిచిన దశాబ్దకాలంలో భారత రిటైల్ మార్కెట్ మూడు రెట్లు వృద్ధి చెందింది. 2019–20లో భారత స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో రిటైల్ రంగం వాటా 10% దాకా ఉండగా, 3.5 కోట్ల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ‘కోవిడ్–19 అనేది ఒక అగ్నిపరీక్షలాంటిది. డిజిటల్ మాధ్యమాన్ని అందిపుచ్చుకో వడం, వేగవంతంగా ఆన్లైన్ వైపు మళ్లడం ద్వారా దేశీ రిటైల్ రంగం ఈ సంక్షోభం నుంచి మెరుగ్గానే బైటపడగలిగింది‘ అని నివేదిక పేర్కొంది. మార్కెట్ వృద్ధి..: నివేదిక ప్రకారం .. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి దేశీ రిటైల్ మార్కెట్ 1.5 లక్షల కోట్ల డాలర్లకు చేరనుంది. 2.5 కోట్ల మేర కొత్త కొలువులు రానున్నాయి. ఇందులో సగభాగం వాటా ఆఫ్‌లైన్+ఆఫ్‌లైన్ విధానానిదే ఉండనుంది. 1.2 కోట్ల కొలువులు, 125 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులు దీన్నుంచి రానున్నాయి. అలాగే, మొత్తం రిటైల్ రంగం కట్టే పన్నుల్లో ఈ విభాగం వాటా 37 శాతం దాకా ఉండనుంది. సాంకేతికత ఊతం..: రాబోయే రోజుల్లో రిటైల్ రంగం వృద్ధి చెందడంలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందని నివేదిక ఆవిష్కరణ సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. దేశీయంగా రిటైల్ వ్యాపారానికి అనువైన పరిస్థితులు కల్పించేందుకు కేంద్రం జాతీయ రిటైల్ వాణిజ్య విధానాన్ని రూపొందించే ప్రయత్నాల్లో ఉందన్నారు. రిటైల్ 4.0 ప్రయోజనాలు పొం దేందుకు రిటైల్ వర్గాలతో పాటు విధాన నిర్ణేతలు, అనుబంధ పరిశ్రమలు కలిసి రావాలని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ అభిప్రాయపడ్డారు. -
గుడ్ న్యూస్ : 1000 ఇంజీనీర్ ఉద్యోగాలు
సాక్షి, ముంబై: ప్రముఖ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ పేపాల్ ఇంజనీర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 2021లోభారీగా ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు వెల్లడించింది. సాఫ్ట్వేర్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, డేటా సైన్స్, రిస్క్ అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ స్ట్రీమ్స్ ఎంట్రీ, మిడ్-లెవల్ , సీనియర్ రోల్స్‌లో ఈ నియామకాలు జరుగుతాయి.హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని డెవలప్మెంట్ సెంటర్లలో దాదాపు వేయి మందిని కొత్తగా ఉద్యోగాల్లో చేర్చకోనున్నామని పేపాల్ తాజాప్రకటనలో తెలిపింది కరోనా మహమ్మారి కారణంగా డిజిటల్ చెల్లింపులకుడిమాండ్ పెరిగిందనీ, ఈ నేపథ్యంలో తమ కేంద్రాల కీలకంగా మారనుందని పేపాల్ తెలిపింది. పేపాల్‌కు ప్రస్తుతం భారతదేశంలోని మూడు కేంద్రాలలో 4,500 మందికి పైగా ఉద్యోగులున్నారు. అమెరికా తరువాత భారతదేశంలోని సాంకేతిక కేంద్రాలు అతిపెద్దవన్నారు. దేశంలో డిజిటల్ చెల్లింపులకు పెరుగుతున్న ఆదరన నేపథ్యంలో వినియోగదారులు, వ్యాపారుల అవసరాలను తీర్చడంపై దృష్టిపెట్టామన్నారు. ఈ క్రమంలో తాజా నియామకాలు కీలక పాత్ర పోషిస్తాయని పేపాల్ ఇండియా ప్రతినిధి గురు భట్ అన్నారు. కాగా దేశీయంగా ఏప్రిల్ 1 నుంచి తమ సర్వీసులు నిలిపేయనున్నట్లు గత నెలలో పేపాల్ ప్రకటించింది. భారత వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టనున్నాం. ఇకపై భారతీయ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు , భారతీయ వ్యాపారాలను అంతర్జాతీయంగా విస్తరించేందుకు కృషి చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కొత్త ఉద్యోగాలు వస్తున్నాయ్
సాక్షి, అమరావతి: ‘కొత్త కొలువులు వస్తున్నాయి. 2021లో దేశంలో 53 శాతం కంపెనీలు కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు సంసిద్ధమవుతున్నాయి.’ అని ‘ఇండియాస్ ట్యాలెంట్ ట్రెండ్స్– 2021’ నివేదిక వెల్లడించింది. బ్రిటన్ ప్రధాన కేంద్రంగా ఉన్న ‘మైఖేల్ పేజ్’ అనే రిక్రూటింగ్ ఏజెన్సీ దీన్ని విడుదల చేసింది. 2021లో ఇతర ఆసియా–పసిఫిక్ దేశాల కంటే భారత్‌లో కొత్త ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. ఆసియా–పసిఫిక్ దేశాల్లోని 42 శాతం కంపెనీలు కొత్త ఉద్యోగాలు కల్పించనున్నాయని అంచనా వేసింది. కరోనా నుంచి కోలుకుని మెల్లగా గాడిలో పడిన దేశ ఆర్థిక వ్యవస్థ జోరందుకోనుందని పేర్కొంది. ఈ నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ.. ► టెక్నాలజీ రంగంలో ఉన్న కంపెనీల్లో ఏకంగా 74 శాతం కంపెనీలు తాము ఉద్యోగుల సంఖ్యను 14 శాతం పెంచుతామని తెలిపాయి. రిమోట్ వర్కింగ్‌కు అవకాశాలు కల్పిస్తామని ఆ కంపెనీలు చెప్పాయి. ► డేటా సైంటిస్టులు, గ్రోత్ హ్యాకర్స్, పెర్ఫార్మెన్స్ మార్కెటర్స్, సేల్స్–బిజినెస్ డెవలపర్స్, రీసెర్చ్ డెవలపర్స్, లీగల్ కౌన్సిల్ మొదలైన ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువ ఉంటుందని పేర్కొంది. ► కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న ఆ 53 శాతం కంపెనీల్లో 60 శాతం కంపెనీలు ఉద్యోగుల జీతాలు పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాయి. ఇక వాటిలో 55 శాతం కంపెనీలు ఉద్యోగులకు బోనస్‌లు ఇచ్చేందుకు సిద్ధపడుతుండగా.. 43 శాతం కంపెనీలు ఒక నెల కంటే ఎక్కువ జీతం బోనస్‌గా ఇవ్వనుండటం విశేషం. ► జీతాల పెంపుదలలో టెక్నాలజీ, ఆరోగ్య సేవల రంగం మొదటి స్థానంలో ఉంది. టెక్నాలజీ రంగంలో 15 శాతం నుంచి 25 శాతం, ఆరోగ్య సేవల రంగంలో 15 నుంచి 20 శాతం వరకు జీతాలు పెరిగే అవకాశాలున్నాయి. రిటైల్ రంగంలో 7.6 శాతం, ఈ–కామర్స్/ఇంటర్నెట్ సేవల రంగాల్లో 7.5 శాతం, తయారీ రంగంలో 5.9 శాతం, నిర్మాణ రంగంలో 5.3 శాతం జీతాలు పెరగవచ్చు. ► ఈ కంపెనీలు తమ ఉద్యోగుల్లో మూడోవంతు మందికి పదోన్నతులు కల్పించనున్నాయి. -
బీమా రంగంలో కొత్తగా 5వేల ఉద్యోగాలు!
జూన్ త్రైమాసికంలో వివిధ ఇన్స్యూరెన్స్ కంపెనీలు దాదాపు ఐదు వేల మందిని కొత్తగా నియమించుకోనున్నాయి. లాక్డౌన్ అనంతరం వ్యాపారం ఊపందుకుంటుందన్న అంచనాలతో అటు లైఫ్, ఇటు జనరల్ బీమా సంస్థలు నియామకాలకు సై అంటున్నాయి. ఈ త్రైమాసికంలో దాదాపు 1500 మందిని నియమించుకోవాలని పీఎన్బీ మెట్‌లైఫ్ సిద్దమవుతోంది. ఏడాది చివరకు ఈ నియామకాలను 3వేలకు పెంచుకోవాలని భావిస్తోంది. కెనరా హెచ్ఎస్బీసీ, ఓబీసీ లైఫ్ సంస్థలు చెరో వెయ్యిమందిని నియమించుకునే యత్నాల్లో ఉన్నాయి. టాటా ఏఐజీసంస్థ సైతం కొత్తగా వెయ్యిమందిని, టాటా ఏఐఏ లైఫ్ కొత్తగా 500 మందిని నియమించుకునే ప్రణాళికలో ఉన్నాయి. ఇప్పటికే 300 నియామకాలు చేపట్టిన రిలయన్స్ నిప్పన్ లైఫ్ మరో 400 మందిని రిక్రూట్ చేసుకునేందుకు తయారైంది. కరోనా సంక్షోభానంతరం బీమా తీసుకునేవాళ్లు పెరుగుతారని కంపెనీలు భావించి తదనుగుణంగా నియామకాలు చేపడుతున్నాయని టీమ్‌లీజ్ రిక్రూటింగ్ సంస్థ అధిపతి అజయ్ షా అభిప్రాయపడ్డారు. దీనికితోడు ఈ రంగంలో చోటుచేసుకున్న కొత్త కలయికలు, విలీనాలతో ఉద్యోగాలు పెరగనున్నాయన్నారు. లాక్డౌన్ అనంతరం తిరిగి ఎకానమీలో వ్యాపార కార్యకలాపాలు ఆరంభమై, వేతన జీవులకు సమయానికి జీతాలు వచ్చే పరిస్థితులు నెలకొంటే ముందుగా బీమా ఉత్పత్తుల వైపు చూస్తారని ఎక్కువమంది ఇన్స్యూరెన్స్ నిపుణులు భావిస్తున్నారు. ప్రజలకు తమ ఆరోగ్యాలు, తమవారి జీవితాలపై శ్రద్ధ పెరగడం బీమా రంగం మరింత దూసుకుపోయేందుకు దోహదం చేస్తాయంటున్నారు. -
అమెజాన్‌లో 50,000 ఉద్యోగాలు
బెంగళూరు: దేశీ ఈ–కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా 50,000 మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అనేక ఉత్పత్తులకు ఆన్లైన్ డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకున్న నేపథ్యంలో గిడ్డంగి, డెలివరీ నెట్వర్క్ విభాగాల్లో సీజనల్ ఉద్యోగుల అవసరం ఉందని వెల్లడించింది. -
ఉపాధి హామీ కింద కొత్తగా 95 పనులు
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం కింద కొత్తగా 95 పనులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న పనులకు ఆదనంగా ఈ ఏడాది నుంచి ఈజీఎస్ కింద ఈ పనులను చేపట్టనుంది. ఈ మేరకు కొత్తగా గుర్తించిన పనులు, అంచనా వ్యయం, వేతనం, సామగ్రి, పనిదినాలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.రఘునందన్‌రావు మార్గదర్శకాలు జారీ చేశారు. ఆయా పనుల్లో వినియోగించాల్సిన సామగ్రి, వేతనం, పనిదినాలపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
స్థానికులకే 75% ఉద్యోగాలపై నిబంధనలు జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కర్మాగారాలు, ఫ్యాక్టరీల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన చట్టానికి సంబంధించి ప్రభుత్వం సోమవారం నిబంధనలు జారీ చేసింది. వీటిని కర్మాగారాలు, పరిశ్రమలు తప్పనిసరిగా పాటించాలి. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు, కర్మాగారాలు, పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) కింద నడిచేవాటితోపాటు జాయింట్ వెంచర్స్‌లో ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందులో సాంకేతిక, అత్యంత నైపుణ్యం, నైపుణ్యం ఉన్న, నైపుణ్యం లేని వారిని కూడా తీసుకోవాలి. జనవరి నుంచి మూడు త్రైమాసికాల్లో నియామకాలు చేయాలి. ఈ నియామకాలకు సంబంధించి జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన నోడల్ ఏజెన్సీ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో కార్మిక ఉపాధి కల్పన ట్రైనింగ్– ఫ్యాక్టరీస్ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, ఇండస్ట్రీస్ కమిషనర్ మెంబర్‌గా, ఫ్యాక్టరీస్ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఏపీలో పదేళ్లుగా నివశిస్తున్న ఎవరైనా ఈ చట్టం కింద ప్రయోజనం పొందొచ్చు. రేషన్ కార్డు, వాటర్ బిల్లు, విద్యుత్ బిల్లు, ఓటర్ ఐడీ కార్డ్, గ్యాస్ కనెక్షన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ పుస్తకం, ప్రభుత్వం ఇచ్చిన ఏదైనా గుర్తింపు ఉండాలి. ఇవి లేకపోతే స్థానిక తహసీల్దార్ ఇచ్చిన ధ్రువపత్రాన్ని నివాసానికి తగిన రుజువుగా పరిగణించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. కంపెనీల్లో స్థానికంగా నివశిస్తున్నవారికి 75% ఉపాధి కల్పించాలి. నైపుణ్యం లేని వారని కంపెనీలు భావిస్తే నోడల్ ఏజెన్సీకి సమాచారం ఇవ్వాలి. నోడల్ ఏజెన్సీ అభ్యర్థులకు తగిన శిక్షణ ఇప్పించి నైపుణ్యాల మెరుగుదలకు కృషి చేస్తుంది. కంపెనీలు, సంస్థల యజమానులు ప్రభుత్వానికి అవసరమైన సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే చట్టంలోని సెక్షన్ ఐదు ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చినట్టు భావించి చర్యలు తీసుకుంటారు. నిబంధనలు పాటించడంలో విఫలమైతే యజమాని నేరం చేసినట్లు భావించి మొదటిసారి రూ.25 వేలు, రెండోసారి అయితే రూ.50 వేలు జరిమానా విధిస్తారు. -
10వేల ఉద్యోగాలిస్తాం: జొమాటో సీఈవో
సాక్షి, ముంబై: ప్రముఖ ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ సెర్చ్ సేవల సంస్థ జొమాటో శుభవార్త చెప్పింది. త్వరలోనే తాము లాభాల్లోకి మళ్ల నున్నామని, దీంతో మరింత మంది ఉద్యోగులను చేర్చుకోనున్నామని ప్రకటించింది. టెక్నాలజీ, ప్రొడక్ట్, డేటా సైన్సెస్ టీమ్స్ కోసం ఈ నియామకాలు కొనసాగుతాయన్నారు. గత ఐదేళ్లలో తమ వ్యాపారం పదిరెట్లు పెరగడంతో వేలాది మందికి ఉపాధి కల్పించడం సాధ్యపడిందని చెప్పారు. ఇదిలావుంటే గురుగ్రామ్‌లోని కంపెనీ హెడ్ ఆఫీస్‌లో పనిచేసే 540 మంది ఉద్యోగులను శనివారం తొలగించింది. కస్టమర్ సర్వీస్ అవసరం తగ్గడం వల్ల కొంతమందిని తీసేసిన మాట నిజమేనని, అయితే గతంలోకంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని జొమాటో ఫౌండర్, సీఈఓ దీపిందర్ గోయల్ వెల్లడించారు. ఆగస్ట్ నెలలో 60 మందిని తొలగించిన అనంతరం, ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి. అటు ఈ సంవత్సరం తాము 1200 మందిని కొత్తగా నియమించుకున్నామని, మరో 400 మంది ఆఫ్ రోల్ పొజిషన్లో ఉన్నారని జొమాటో తెలిపింది. ప్రస్తుతం తాము టెక్నాలజీ, ప్రోడక్ట్, డేటా సైన్స్ టీమ్స్‌ను నియమించుకుంటున్నామన్నారు. అయితే ఉద్యోగుల తీసివేత నిర్ణయం బాధాకరం అయినప్పటికీ తప్పలేదని, ఉద్యోగాలు కోల్పోయినవారికి సీనియారిటీ ప్రకారం రెండు నెలల జీతం, వచ్చే ఏడాది జనవరి చివరి వరకు పలు ప్రయోజనాలను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఉద్యోగం నుంచి తొలగించిన వారి కోసం జాబ్ ఫెయిర్ నిర్వహిస్తామని తెలిపింది. అలాగే ఉద్యోగాల కోత ఖర్చులు తగ్గించుకునేందుకు కాదని కంపెనీ స్పష్టం చేసింది. మరోవైపు జొమాటో తన తొలి లాభాలను ఛేదించే దిశగా ఉందని సీఈఓ గోయల్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 10రెట్ల వృద్ధి చెందడానికి సిద్ధంగా ఉన్నామని గోయల్ చెప్పారు. ఈ క్రమంలో 2 లక్షల 30వేల మంది పార్టనర్స్‌తో తొలిసారి రూ. 200 కోట్ల మార్క్‌ను అధిగమించామని తెలిపారు. కొత్త నగరాల్లోకి వేగంగా విస్తరించడం, ఔట్లెట్లు 'డార్క్ కిచెన్'లను విస్తరించడం కారణంగా వేలాది ఉద్యోగాలను సృష్టించడంతో పాటు లాభాల బాటపట్టామని తెలిపారు. గత మూడు నెలల్లో నష్టాలు 50 శాతం తగ్గాయి. ఏ క్షణమైనా లాభాలు మొదలుకావొచ్చని గోయల్ ప్రకటించారు. గత సంవత్సరంలో ఆరు రెట్లు పెరిగిన ఆహార పంపిణీ వ్యాపారంలో, తామింకా భారీగా పెట్టుబడులు పెడుతున్నామన్నారు. దీంతో ఒక్క సెప్టెంబరులోనే 10వేల కొత్త ఉద్యోగాలను జోడించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని గోయల్ చెప్పారు. కాగా 2008లో మొదలైన జొమాటో ఇప్పుడు 24 దేశాల్లోని పది వేల నగరాల్లో ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తోంది. మనదేశంలోని 500 నగరాల్లో 2.5 కోట్ల మందికి ఆహారం డెలివరీ ఇస్తోంది. ఎనలిస్టుల అంచనాల ప్రకారం జొమాటో వాల్యుయేషన్ 3.6 బిలియన్ డాలర్ల 4.5 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. సిలికాన్ వ్యాలీ వెంచర్ ఫండ్ సికోనియా క్యాపిటల్, టెమాసెక్ హోల్డింగ్స్, ఇండియన్ ఈ–కామర్స్ కంపెనీ ఇన్ఫో ఎడ్జ్ జొమాటోలో ఇన్వెస్ట్ చేశాయి. Milestone alert: Our delivery partners' monthly income has crossed ₹200 crore for the first time. And we have just hit 2,30,000 delivery partners in India. In September alone, we aim to add 10,000 new jobs as a result of direct employment/contracts with Zomato.🚀 pic.twitter.com/uGyGG37TK9 — Deepinder Goyal (@deepigoyal) September 5, 2019 -
ఐటీ రంగంలో 30 లక్షల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న ఐదున్నర ఏళ్లలో, అంటే 2025 సంవత్సరం నాటికి ఐటీ రంగంలో మరో 30 లక్షల కొత్త ఉద్యోగాలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేయగా, ఏయే రంగాల్లో పెరుగుతాయో పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క నైపుణ్యం ఉన్న సాంకేతిక సిబ్బందే కాకాండా రెండు భాషలు, మూడు భాషలు వచ్చి, వాటిపై సరైన పట్టు ఉన్నవారికి కూడా ఉద్యోగాలు లభిస్తాయని, ఈ భాషా ప్రవీణుల్లో మహిళలే ఎక్కువ చేరే అవకాశం ఉందని భారత ఐటీ రంగానికి చెందిన ‘నాస్కామ్’ అధ్యక్షులు దేబ్జాని ఘోష్ చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా విశ్లేషకులు, మొబైల్ టెక్, రోబోటిక్, వర్చువల్ రియాలిటీ, త్రీ డీ రంగాల్లో కొత్త ఉద్యోగాలు ఉంటాయని ఘోష్ అంచనా వేస్తున్నారు. ఈ రంగాల్లో ఉద్యోగులు వివిధ పాత్రలు పోషించాల్సి ఉన్నందున, వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులు అవసరం అవుతుందని ఆమె అన్నారు. అయితే ఈ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల మంది ఉద్యోగులు అవసరం అవుతారని, అయితే నైపుణ్యం కలిగిన వారు అంతమంది అందుబాటులోని లేరని ప్రపంచ ఆర్థిక ఫోరమ్ అభిప్రాయపడింది. పది టెక్నాలజీ సంస్థల్లో 55 రకాల జాబులు నిర్వహించాల్సి ఉంటుందని, కొరతను ముందుగానే ఊహించిన భారత్, ఆ దిశగా కొత్త నైపుణ్యాభివద్ధికి కషి చేస్తోందని కూడా ఫోరమ్ ప్రశంసించింది. -
ఉద్యోగాంధ్ర
రాష్ట్ర చరిత్రలో నూతన శకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు.. రాష్ట్రంలోని నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేలా ఒకేసారి లక్షలాది ఉద్యోగ నియామకాలకు నాంది పలికారు.. ఈ పరిణామంతో ప్రజల లోగిళ్లకు ప్రభుత్వ పథకాలు చేరడానికి మార్గం సుగమం అవుతోంది.. ప్రభుత్వ వ్యవస్థ కూతవేటు దూరానికి తరలివస్తోంది.. సర్కారు విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలో సువర్ణయుగం ప్రారంభమైంది. సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 4.01 లక్షల కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టి రికార్డు సృష్టించారు. ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థను మరింత దగ్గర చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల ఇళ్లకే చేర్చే కార్యక్రమాలకు ఈ ఉద్యోగ నియామకాల ద్వారా శ్రీకారం చుడుతున్నారు. అదీ ఒకేసారి ఇన్ని లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు అందుతుండడం ఒక అపూర్వఘట్టం. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డు. ఈ ఉద్యోగ నియామకాలతో పరిపాలనా వ్యవస్థ రూపురేఖలే పూర్తిగా మారిపోనున్నాయి. స్థానిక పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం మరింత సన్నిహితం కావడమే కాకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా వారి ఇళ్ల వద్దకే చేరనుండడం విశేషం. ఈ ఉద్యోగాల్లో 1,33,494 శాశ్వత ఉద్యోగాలు కావడం గమనార్హం. గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ సేవలందించేందుకు ఈ శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయాల సేవలు ప్రజలకు అందుబాటులోకి తేవడానికి వీలుగా ఈ ఉద్యోగ నియామకాలను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టింది. శాశ్వత ఉద్యోగాలతో పాటు గ్రామ, పట్టణ ప్రాంతాల్లో దాదాపు 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమిస్తున్నారు. తద్వారా 2,67,506 మంది నిరుద్యోగ యువతకు స్థానికంగానే స్వచ్ఛంద సేవకునిగా ఉద్యోగ అవకాశం లభించనుంది. శాశ్వత ఉద్యోగాల్లో నియామకమయ్యే వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతన, భత్యాలు అందనుండగా వలంటీర్లకు ప్రతినెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించనున్నారు. ప్రజలకు ఇక త్వరితగతిన సేవలు దాదాపు దశాబ్దం కాలంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు లేక ఉపాధి అవకాశాలూ కానరాక రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది. వీరిని ఆదుకొంటామని, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ఉద్యోగ నియామకాలు చేపడతామని ఎన్నికలకు ముందు నుంచే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటిస్తూ వచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకు వస్తామని, వాటి ద్వారా శాశ్వత ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే అందించేలా వలంటీర్లను నియమిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన నెలన్నరలోనే వాటికి కార్యరూపం ఇవ్వడం విశేషం. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరగలేదని, ఈ ప్రభుత్వం తమ జీవితాలకు వెలుగులు ప్రసాదించిందని నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తోంది. మరోపక్క క్షేత్ర స్థాయిలో కొన్ని దశాబ్దాలుగా ఉద్యోగ నియామకాలు లేక ప్రభుత్వ కార్యక్రమాల అమలు కుంటు పడుతోంది. ప్రస్తుతం ఈ ఉద్యోగ నియామకాలతో ప్రభుత్వ కార్యక్రమాల అమలు ఊపందుకోవడంతో పాటు పాలనా వ్యవహారాలు పరుగులు తీయడానికి, ప్రజలకు సమర్థవంతంగా సేవలందించడానికి దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్రామాల్లో 99,144, పట్టణాల్లో 34,350 ఉద్యోగాలు ప్రభుత్వం ఒకేసారి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తుండడంతో యువతలో ఒక్కసారిగా ఉత్సాహం పెల్లుబుకుతోంది. ఈ ఉద్యోగాల సాధన ద్వారా తమ జీవితాల్లో కొత్త వెలుగులు సంతరించుకుంటాయని భావిస్తున్నారు. ‘గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూశాం. గత ప్రభుత్వ హయాంలో ఆశించిన నోటిఫికేషన్లు లేవు. వచ్చినా ఆ పోస్టులు పూర్తిగా భర్తీ చేయలేదు. ఇప్పుడు ఒక్కసారిగా లక్షల్లో ఉద్యోగాలు అందుబాటులోకి రావడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది’ అని విజయవాడలో శిక్షణ పొందుతున్న పలువురు నిరుద్యోగులు అభిప్రాయపడ్డారు. మొత్తం 1,33,494 శాశ్వత ఉద్యోగాల్లో 34,350 పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల ద్వారా అందుతుండగా.. మిగతా 99,144 పోస్టులు గ్రామ సచివాలయాల ద్వారా అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి కాకుండా పట్టణాల్లో 74,185, గ్రామాల్లో 1,93,321 వలంటీర్ల పోస్టులు యువతకు వరంగా మారుతున్నాయి. పంచాయతీ వ్యవస్థ పరిపుష్టం ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న గ్రామ సచివాలయాల ఉద్యోగాల వల్ల పంచాయతీ వ్యవస్థ మరింత పరిపుష్టం కానుంది. పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థలకు కేంద్రం 1994లోనే అనేక అధికారాలు కల్పించినా.. నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ అధికారాలను వాటికి దక్కకుండా తన గుప్పెట్లోనే పెట్టుకుంది. ఆ తర్వాత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంచాయతీలకు అధికారాలు బదలాయించారు. అయితే తదనంతర ముఖ్యమంత్రులు వాటి ద్వారా ప్రజలకు సేవలందించేందుకు వీలుగా సిబ్బందిని నియమించలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఉద్యోగ నియామకాలకు యుద్ధ ప్రాతిపదికన శ్రీకారం చుట్టారు. తద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు మేలు చేకూర్చడంతో పాటు వైఎస్ జగన్ మానస పుత్రికలైన నవరత్నాల పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించడంలో ఈ నూతన ఉద్యోగ వ్యవస్థ కీలక భూమిక పోషించనుంది. అదే సమయంలో పంచాయతీల స్వయం ప్రతిపత్తి దెబ్బతినకుండా గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు పంచాయతీ కార్యదర్శే కన్వీనర్‌గా వ్యవహరించేలా, వీరందరినీ పర్యవేక్షిస్తూ సెలవులు ఇచ్చే అధికారం సర్పంచులకే ఉండేలా వ్యవస్థను తీర్చిదిద్దారు. ప్రభుత్వం నియమించే గ్రామ వలంటీర్లు ఈ సచివాలయ పరిధిలోకి వస్తారు. కూతవేటు దూరంలో ప్రభుత్వ యంత్రాంగం గ్రామ, పట్టణ వార్డు సచివాలయాల్లో లక్షలాది ఉద్యోగుల నియామకం, అంతకు రెట్టింపు సంఖ్యలో వలంటీర్ల ఏర్పాటుతో రాష్ట్రంలోని ప్రజానీకానికి ప్రభుత్వ యంత్రాంగ సేవలు కూతవేటులో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఉద్యోగ నియామకాలను ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానంతో భర్తీ చేయడానికి చర్యలు చేపట్టింది. ఇప్పటికే వలంటీర్ల ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. శాశ్వత ఉద్యోగాలకు కావలసిన అర్హతలను, ఇతర నైపుణ్యాలను నిర్దేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పట్టభద్రులు, ఇంజనీర్లు, పాలిటెక్నిక్ డిప్లొమో పూర్తి చేసిన వారు, డిగ్రీలో సోషల్ వర్క్, నర్సింగ్‌లో ఫార్మా డీ చేసిన అభ్యర్థులు వీటికి అర్హులు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాల కల్పనలో మొన్నటి దాకా బిహారే నయం బాబు వస్తేనే జాబు వస్తుందంటూ 2014 ఎన్నికల ముందు ఊరూ వాడా ఊదర గొట్టిన చంద్రబాబు.. సీఎం పదవి చేపట్టిన తర్వాత కొత్తగా జాబులు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను సైతం పీకేశారు. బాబు ఐదేళ్ల పదవీ కాలంలో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోగా, ఖాళీగా ఉన్న నాలుగవ తరగతి పోస్టులను ఏకంగా రద్దు చేశారు. దీంతో గత ఐదేళ్లలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. ఉద్యోగాల కల్పనలో బిహార్ రాష్ట్రం కన్నా ఆంధ్రప్రదేశ్ అధ్వాన్నంగా తయారైందని 2017–18 లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో 13.4 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 22.8 శాతం నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోందని సర్వే వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో పురుషుల కన్నా మహిళా నిరుద్యోగుల సంఖ్య భారీగా ఉన్నట్లు స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో 27 శాతం మహిళల్లో నిరుద్యోగం ఉండగా. పురుషుల్లో 20.4 శాతం నిరుద్యోగులున్నారని సర్వే గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలో పట్టభద్రుల్లో అత్యధికంగా 23.6 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని, డిప్లమా/ సర్టిఫికెట్ హోల్డర్లలో 17.6 శాతం నిరుద్యోగులుగా ఉన్నారని సర్వే పేర్కొంది. సెకండరీ, ఉన్నత విద్యలో బిహార్ కన్నా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే నిరుద్యోగులున్నారని, దేశ సగటు కన్నా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని స్పష్టం చేసింది. దీంతో పాటు జాతీయ కుటుంబ సర్వే – 4 ప్రకారం చూసినా రాష్ట్రంలో ఉద్యోగాలు లేని వారి సంఖ్య బాగా పెరిగింది. రాష్ట్రంలో 2005–06లో 15 – 49 ఏళ్ల మధ్య వయస్సు వారిలో ఉద్యోగాలు లేని పురుషులు 0.8 శాతం ఉండగా 2015–16 లో ఇది 3.9 శాతానికి పెరిగినట్లు జాతీయ కుటుంబ సర్వే స్పష్టం చేసింది. ఇదే వయస్సు గల వారిలో ఉద్యోగాలు చేస్తున్న పురుషులు 2005–06లో 87.5 శాతం ఉండగా 2015–16 నాటికి 79.6 శాతానికి తగ్గిపోయినట్లు ఆ సర్వే స్పష్టం చేసింది. ఇదే వయస్సు గల వారిలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలు 2005–06లో 50 శాతం ఉండగా, 2015–16 నాటికి 33 శాతానికి పడిపోయిందని సర్వే వెల్లడించింది. ఇదో సువర్ణావకాశం మన ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 1.33 లక్షల మందికి ఉపాధి దొరకడం మంచి పరిణామం. దీంతో పాటు ఈ ఉద్యోగులు తమ గ్రామ ప్రజలకు అంకిత భావంతో సేవలు అందిస్తా్తరు. దీనివల్ల సమర్థవంతమైన పరిపాలన ప్రజలకు అందుతుంది. తమ ప్రాంత ప్రజలకే సేవలందిస్తున్నామనే భావన వల్ల అవినీతికి అవకాశం ఉండదు. ఇదే సమయంలో ఇప్పటికే పంచాయతీలలో సేవలు అందిస్తున్న వారికి ఉద్యోగ భరోసా కల్పిస్తే గ్రామ పరిపాలనలో అసంతృప్తికి అవకాశం ఉండదు. మొత్తం మీద గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. రాషŠట్ర చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగులకు ఇదో సువర్ణావకాశం. – టీఎంబీ బుచ్చిరాజు, చైర్మన్. ఆర్ విక్టర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శరవేగంగా తీసుకుంటున్న చర్యలు నిరుద్యోగుల్లో ఆనందం కలిగిస్తున్నాయి. 4 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడం రాష్ట్ర చర్రితలో సువర్ణాక్షరాల్లో లిఖించదగ్గ రికార్డు. ఇది నిరుద్యోగులకు ఉపాధి కల్పన పట్ల జగన్ మోహన్‌రెడ్డికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు జగన్ సర్కారు బాటలు వేస్తోందని చెప్పవచ్చు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల ఇళ్లకే చేర్చడం విప్లవాత్మక చర్య. – వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల సమాఖ్య అధ్యక్షుడు. -
తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తన పరిపాలనలో విప్లవాత్మక అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి.. ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలను అందించబోతోంది. ఈ వ్యవస్థ ద్వారా ఏకంగా 1,33,494 శాశ్వత ఉద్యోగాలు రానున్నాయని, మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదివారం ట్విటర్లో తెలిపారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు అని ఆయన స్పష్టం చేశారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ.. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నామని, ప్రజల ఆశీర్వాదబలం వల్లే ఇది సాధ్యమవుతోందని పేర్కొన్నారు. ‘తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు. 1,33,494 శాశ్వత ఉద్యోగాలు, మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాం. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నాం. మీ ఆశీర్వాదబలంవల్లే ఇది సాధ్యమవుతోంది’అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
కొత్త ఉద్యోగాలిస్తాం - శాంసంగ్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా కంపెనీల దెబ్బకి దక్షణకొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియాలో వెయ్యికి పైగా ఉద్యోగాలకు ఉద్వాసన పలకనుందన్న వార్తలపై సంస్థ స్పందించింది. ఇవి తప్పుడు వార్తలని కొట్టి పారేసింది. పైగా మరింత మంది ప్రతిభావంతులను ప్రోత్సహించనున్నామని పేర్కొంది. భారతదేశంలో తమ పెట్టుబడులు కొనసాగుతాయనీ, దేశీయ టెలికాం కంపెనీలు 5జీ నెట్‌వర్క్‌కు సిద్ధమైన అనంతరం 5జీ వ్యాపారాన్ని కూడా విస్తరిస్తామని తెలిపింది. ఇది మరిన్ని ఉద్యోగాల కల్పనకు దారి తీస్తుందని శాంసంగ్ ప్రకటించింది. భారత్‌లో తమ వ్యాపారాన్ని విస్తృతం చేస్తామని, ఇందుకోసం పెట్టుబడులు పెడుతూనే ఉంటామని శాంసంగ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఆర్ అండ్ డీలో పెట్టుబడులు, 5జీ నెట్వర్క్ వంటి కొత్త వ్యాపారాల అన్వేషణకు ఉపయోగిస్తామన్నారు. ఈ క్రమంలోనే గతేడాది 2వేలకు పైగా కొత్త కొలువులను ఆఫర్ చేశామంటూ మంగళవారం వివరణ ఇచ్చింది. ఇండియాలో తమ వ్యాపారం విస్తరిస్తున్న క్రమంలో ఉద్యోగాల కల్పనలో తమ పాత్ర ఉంటుందన్నారు. దీర్ఘకాలిక వ్యాపార విజయాన్ని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ఉద్యోగాలను కల్పించనున్నామని ప్రతినిధి తెలిపారు. భారత మార్కెట్ తన 5జీ టెక్నాలజీ రానున్న నేపథ్యంతో తాము నైపుణ్యమున్న ఉద్యోగులకు ఏడాది పొడవునా ప్రాధాన్యత ఇవ్వనున్నామన్నారు. -
పురపాలనలో కొలువుల మేళా!
సాక్షి, హైదరాబాద్: పురపాలనలో కొలువుల మేళాకు తెర లేవనుంది. కొత్తగా ఏర్పడ్డ 84 పురపాలికల్లో గుర్తించిన 558 పోస్టులను భర్తీ చేసేందుకు మున్సిపల్ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ప్రతిపాదిత ఫైలును ప్రభుత్వానికి పంపింది. దీనికి వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర పడే అవకాశముందని తెలుస్తోంది. కొత్త పోస్టుల నియామకాలేగాకుండా.. విలీన పంచాయతీల్లో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఉద్యోగులను కూడా మున్సిపల్ శాఖలో సర్దుబాటు చేసుకోనుంది. కొత్త ఉద్యోగాల నియామకంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా ఏటా రూ.31 కోట్ల భారం పడనుంది. కొత్తగా 84 మున్సిపాలిటీలు పట్టణీకరణ నేపథ్యంలో కేసీఆర్ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 84 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. తద్వారా 173 గ్రామ పంచాయతీలను వీటిలో విలీనం చేయగా.. 131 పంచాయతీలను అప్పటికే మనుగడలో ఉన్న మున్సిపాలిటీల్లో కలిపేసింది. 2013లో మధిర, పెద్ద అంబర్పేట్, బడంగ్పేట్, ఇబ్రహీంపట్నం, అందోల్–జోగిపేట్, కల్వకుర్తి, అచ్చంపేట, బాదేపల్లి, దుబ్బాక, మేడ్చల్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, మీర్‌పేట, జిల్లెలగూడ, జల్పల్లి, బాన్సువాడ మున్సిపాలిటీలు ఏర్పడగా.. గతేడాది అదనంగా 68 పురపాలికలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి మున్సిపాలిటీకి 36 మంది మున్సిపల్ కార్యకలాపాల నిర్వహణకు 36 మంది ఉద్యోగులు అవసరం. అయితే, ఇందులో ఏడు పోస్టులు మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్–3, అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్–3 (ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్), టౌన్ ప్లానింగ్ అబ్జర్వర్ (టీపీబీఓ), జూనియర్ అకౌంటెంట్, హెల్త్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ పోస్టులు మాత్రం విధిగా భర్తీ చేయాల్సి ఉంటుందని తేల్చింది. ఈ లెక్కన ప్రస్తుతానికి 558 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని పురపాలకశాఖ నిర్ణయించింది. బిల్ కలెక్టర్ పోస్టుల్లో 71 పోస్టులు మాత్రం పీఆర్ నుంచి విలీనమయ్యే ఉద్యోగులతో సర్దుబాటు చేసుకోవచ్చని భావిస్తోంది. పీఆర్ టు మున్సిపల్ 4,592 మంది కొత్తగా మున్సిపాలిటీలుగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పురపాలకశాఖలో విలీనం కానున్నారు. ఇప్పటికే ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగుల వివరాలను సేకరించిన మున్సిపల్ శాఖ.. 4,592 మందిని తమ పరిధిలోకి తీసుకునేందుకు ప్రతిపాదనలు తయారు చేసింది. ఇందులో రెగ్యులర్ ఉద్యోగులు సహా కాంట్రాక్టు, ఎన్ఎంఆర్ సిబ్బంది సైతం ఉన్నారు. ఇదిలావుండగా, కొత్త పోస్టులు, పీఆర్ ఉద్యోగుల బదలాయింపునకు సంబంధించి ఆమోదించిన ఫైలు ప్రభుత్వానికి చేరింది. దీనికి త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర పడే అవకాశముంది. -
గుడ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
సాక్షి,న్యూఢిల్లీ: నిరుద్యోగులకు శుభవార్త. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో వెయ్యికి పైగా ఉద్యోగావకాశాలు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఒక అధికారిక ప్రకటన జారీ అయింది. దాదాపు 130 కేటగిరీల్లో గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. దేశంలో ఉద్యోగాలు లేవంటూ మోదీ సర్కార్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాలు/సంస్థలలో 1,136 ఖాళీలు భర్తీ చేసేందకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా గ్రూప్ బి (నాన్ గెజిటెడ్) / గ్రూప్ సి పోస్టులకోసం ఎస్ఎస్సీ నియామకాలు చేపట్టనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబరు 30, 2018. ఒక వ్యక్తి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఒక మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. కంప్యూటర్ ఆధారంగా నిర్వహించే వ్రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నామని పేర్కొంది. మరిన్ని వివరాలు www.ssc.nic.in, లేదా SSC (northern region) website i.e, www.sscnr.net.in. వెబ్సైట్లో లభ్యం. అలాగే అన్ని ఎస్ఎస్సీ ప్రాంతీయ కార్యాలయాల్లో కూడా ఖాళీలు, అర్హత , దరఖాస్తుకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన వివరణాత్మక ప్రకటన అందుబాటులోఉంది. -
ఆ స్కీమ్‌తో లక్ష ఉద్యోగాలు..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పేరిట ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య బీమా పథకంతో రానున్న నాలుగేళ్లలో లక్షకు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల విస్తరణ ద్వారా మరిన్ని ఉద్యోగాలు యువతకు అందివస్తాయని ఆయుష్మాన్ భారత్ సీఈఓ ఇందు భూషణ్ చెప్పారు. ఈ కార్యక్రమం కింద దేశంలోని 10 కోట్ల నిరుపేద కుటుంబాలకు రూ 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఈ కార్యక్రమం అమలు ద్వారా రానున్న నాలుగేళ్లలో లక్షకు పైగా నైపుణ్యాలు, తక్కువ నైపుణ్యాలతో కూడిన ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నామని భూషణ్ తెలిపారు. కేంద్ర స్థాయిలో అమలు పర్యవేక్షక సిబ్బంది, రాష్ట్ర స్ధాయిలో క్లెయిమ్ నిర్వహణ వ్యవస్థ, ట్రస్ట్, క్షేత్రస్థాయిలో బీమా ఏజెన్సీల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సమకూరుతాయని చెప్పారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ సేవల కోసం దాదాపు 25,000 ఆస్పత్రులను ఈ స్కీమ్‌లో చేరుస్తామని తెలిపారు. ఆ యుష్మాన్ భారత్‌తో నెలకొనే డిమాండ్‌ను అధిగమించేందుకు కొత్తగా 300 ప్రైవేట్ ఆస్పత్రులు ప్రారంభమైనా ఒక్కో ఆస్పత్రిలో 200 మంది ఉద్యోగులకు చోటు దక్కినా ప్రత్యక్షంగా 60,000 ఉద్యోగాలు ఆస్పత్రుల్లో అందుబాటులోకి వస్తాయని ఆయన అంచనా వేశారు.పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు. -
ట్రెండ్ రివర్స్: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ నియామకాలు
సాక్షి, ముంబై: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. గత రెండేళ్లుగా ఉద్యోగులను తగ్గించుకుంటూ వస్తున్న తాజాగా నియామకాలకు తెరతీసింది. ఫ్లిప్‌కార్ట్‌లో కీలకమైన పలు రంగాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచుకునేందుకు సిద్ధమైంది. డేటా సైన్స్ అండ్ ఎనలిటిక్స్ సహా ఇతర ఏరియాల్లో ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనుంది. హెచ్ఆర్ కన్సల్టెన్సీ సంస్థల తాజా నివేదికల ప్రకారం ఫ్లిప్‌కార్ట్ లో 700కు పైగా ఉద్యోగావకాశాలను కల్పించనుంది. వీటిలో అధికంగా టెక్నాలజీరంగంలోనే ఈ నియామకాలు చేపట్టనుంది. ముఖ్యంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ & సర్వీస్ డెలివరీ, ఐటీ అప్లికేషన్లు, డేటా సైంటిస్టులు, యూఐ, యూఎక్స్ డిజైనర్లు, ప్రొడక్ట్ సొల్యూషన్ ఇంజనీర్లు, టెక్ప్రోగ్రామ్ ఇంజనీర్లపై దృష్టిపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత సేవలను దేశానికి అందించే వ్యూహంలో భాగంగా భారీగా ఉద్యోగులను నియమించుకోనున్నామంటూ ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి ఒకరు ఈ వార్తలను ధృవీకరించారు. కాగా ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఫ్లిప్‌కార్ట్ గతరెండేళ్లుగా భారీగా ఉద్యోగులపై వేటు వేసింది. దీంతో 2016, 2017ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య గణనీయంగా క్షీణించింది. 2015 చివరి నాటికి 15 వేలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 8వేలకు పడిపోయింది. అయితే ఇటీవల ఫ్లిప్‌కార్ట్ ఇటీవల క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను కూడా నిర్వహించింది. ఈ సందర్బంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చెందిన 20మంది విద్యార్థులను ఎంపిక చేయడం విశేషం. -
ఐటీ @10 లక్షల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం దూకుడుగా ముందుకెళుతోంది. వార్షికాదాయం ఏకంగా రూ.10 లక్షల కోట్లను మించిపోయింది. ఎగుమతుల్లో 24 శాతం వాటాతో దేశానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతోంది. దేశంలో ఐటీ రంగం పురోగతిపై ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్)’రూపొందించిన నివేదికను మంగళవారం ప్రపంచ ఐటీ కాంగ్రెస్ వేదికపై విడుదల చేసింది. దేశ ఐటీ రంగం 2015–16లో 143 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.28 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించగా.. 2016–17లో 154 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.98 లక్షల కోట్లు)కు పెంచుకుందని నాస్కామ్ తెలిపింది. ఇది 2017–18లో 167 బిలియన్ డాలర్ల (10.8 లక్షల కోట్లు)కు పెరుగుతుందని అంచనా వేసింది. డిజిటల్, ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, బీపీఎం వంటి ప్రధాన సేవలు సహా మొత్తంగా ఐటీ రంగానికి ఈ ఆదాయం సమకూరిందని తెలిపింది. లక్షకుపైగా కొత్త ఉద్యోగాలు వచ్చాయని పేర్కొంది. 2017–18లో ఐటీ రంగ వృద్ధి సూచీలివీ.. - విదేశీ ఎగుమతుల ఆదాయంలో 13 బిలియన్ డాలర్ల (7.8 శాతం) వృద్ధి. - ఐటీ ఉత్పత్తుల ఆదాయంలో 20 శాతం (22–25 బిలియన్ డాలర్ల మేర) వృద్ధి. ఏటా 30 శాతం వృద్ధి రేటు నమోదు. - ఈ–కామర్స్‌లో 17 శాతం వృద్ధి. ఆన్లైన్లో హోటల్ బుకింగ్, కిరాణా సరుకులు, ఆహార కొనుగోళ్లకు పెరిగిన డిమాండ్. - దేశీయంగా సాంకేతిక సేవల వినియోగంలో 10 శాతానికి పైగా పెరుగుదల. ఇవీ ప్రతికూల పరిస్థితులు - స్వదేశీ వస్తు రక్షణ విధానం (ప్రొటెక్షనిజం), బ్రెగ్జిట్, కార్మికుల వలస సమస్యలతో ఐటీ రంగంపై ప్రభావం. - అమెరికా పన్నుల సంస్కరణలతో అస్థిరత - అమెరికా బ్యాంకింగ్, ఆర్థిక రంగ సంస్థల వృద్ధి క్షీణత - స్మార్ట్ సిటీలు, ప్రొక్యూర్మెంట్ సంస్కరణలు వంటి ప్రభుత్వ డిజిటల్ కార్యక్రమాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉండటం. - సరైన సాంకేతిక పరిజ్ఞానం లేక ఈ–కామర్స్ రంగం కేవలం ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాలకే పరిమితం కావడం. కొత్త శకంలో ఐటీ రంగం - దేశంలో స్టార్టప్ ఐటీ పరిశ్రమలు 5,200. - 2017లో కొత్తగా ఏర్పాటైన ఐటీ స్టార్టప్‌లు 1000కిపైగానే.. - స్టార్టప్‌ల విలువ 4000 కోట్ల డాలర్లు (సుమారు రూ. 2.59 లక్షల కోట్లు) - దేశంలో ఈ–కామర్స్ విలువ 3,850 కోట్ల డాలర్లు (సుమారురూ.2.49 లక్షల కోట్లు). ఈ రంగంలో ఏటా 17 శాతం వృద్ధి.. 700 కోట్ల డాలర్ల (సుమారు రూ.45 వేల కోట్లు) ఆదాయం. పెట్టుబడులు 180 శాతం పెరిగాయి. - డిజిటల్ చెల్లింపులు 14,500 కోట్ల డాలర్లు (సుమారు రూ.9.41 లక్షల కోట్లు). ఇది జీడీపీలో 6 శాతం - మొబైల్ వ్యాలెట్ చెల్లింపులు రూ.53,200 కోట్ల నుంచి రూ.79,300 కోట్లకు పెరిగాయి. - 90 శాతానికి పైగా భారతీయ ఐటీ పరిశ్రమలు విదేశాల్లో విక్రయాలు జరుపుతున్నాయి. - 50 శాతానికిపైగా ఐటీ పరిశ్రమలు తమ కార్యకలాపాల్లో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)ను వినియోగిస్తున్నాయి. - దేశంలో 700కిపైగా ఐటీ స్టార్టప్‌లు 25–30 శాతం వృద్ధి సాధించాయి. - హెల్త్ టెక్, ఫైనాన్షియల్ టెక్ రంగాలు, కృత్రిమ మేధస్సు, బ్లాక్ చైన్ సాంకేతికత శరవేగంగా వృద్ధి సాధిస్తున్నాయి. వేళ్లూనుకుంటున్న డిజిటల్ వ్యవస్థ - ప్రపంచవ్యాప్తంగా 320 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులుండగా.. దేశంలో 46.5 కోట్ల మంది ఉన్నారు. దేశంలో ఇంటర్నెట్ వినియోగం 8 శాతం వృద్ధి సాధించింది. - ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 330 కోట్లుకాగా.. దేశంలో 30 కోట్లకుపైగా ఉన్నారు. 2020 నాటికి 80 కోట్లకు చేరుతారని అంచనా. - దేశంలో మొబైల్ డేటా వినియోగం గత ఏడాదిన్నరలో ఏడు రెట్లు పెరిగింది. స్థానిక భాషల్లో డేటా వినియోగం 10 రెట్లు పెరిగింది. ప్రతి నెలా 22.5 కోట్ల మంది యూట్యూబ్‌లో వీడియోలు వీక్షిస్తున్నారు. గూగుల్ ప్లే నుంచి యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవడంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంది. -
పది పోతే వంద ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: కొత్త టెక్నాలజీ వల్ల ప్రస్తుత ఉద్యోగాల్లో పదింటికి కోత పడినా వంద కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని కేంద్ర ఐటీ, న్యాయ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. దేశంలో ఫేస్బుక్, వాట్సాప్, ట్వీటర్ల వాడకం పెరుగుతుండ టంతో అనేక అంతర్జాతీయ డిజిటల్ టెక్నా లజీ కంపెనీలు భారత్‌లో అడుగుపెడుతున్నాయన్నారు. వరల్డ్ ఐటీ కాంగ్రెస్–2018కు హాజరవడానికి సోమవారం హైదరాబాద్ వచ్చిన మంత్రి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా కార్యక్రమం సామాన్యునికి కూడా ఆధునిక టెక్నా లజీ ఫలాలు అందిస్తోందని చెప్పారు. మరో ఐదేళ్లలో దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను రూ.లక్ష కోట్ల స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కొత్త టెక్నాలజీల వల్ల ఐటీ ఉద్యోగాలు పోతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు, కొత్త ఉద్యోగాలకు సన్నద్ధం చేసేందుకు నాస్కామ్, ఐటీ కంపెనీలు ఫ్యూచర్ స్కిల్స్ ప్లాట్‌ఫాం సిద్ధం చేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సమాచార రక్షణ బిల్లు గురించి మాట్లాడుతూ.. జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ బిల్లు సిద్ధం చేస్తోందని, అవినీతిపరులు, టెర్రరిస్టులకు ప్రైవసీ వర్తించదని స్పష్టం చేశారు. 40 లక్షల మందికి కొత్త నైపుణ్యాలు.. ఫ్యూచర్ స్కిల్స్ ప్లాట్‌ఫాం ఏర్పాటుకు సంబంధించి మంత్రి సమక్షంలో నాస్కామ్, కేంద్ర ఐటీ శాఖ అవగాహన పత్రం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఫ్యూచర్ స్కిల్స్ ప్లాట్ ఫాం ద్వారా వచ్చే మూడు నాలుగేళ్లలో 40 లక్షల మందికి కొత్త నైపుణ్యాలు, టెక్నాలజీలపై శిక్షణిస్తామని నాస్కామ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చువల్ రియాలిటీ, బిగ్ డేటా అనలటిక్స్ వంటి 8 కొత్త టెక్నాలజీలు.. 55 కొత్తతరం ఉద్యోగాల శిక్షణ, సర్టిఫికేషన్ ఫ్యూచర్ స్కిల్స్ ద్వారా అందిస్తామన్నారు. సిలికాన్ వ్యాలీ సంస్థ ఎడ్కాస్ట్ భాగస్వామ్యంతో ప్లాట్‌ఫాం నిర్మాణం జరిగిందని.. ఎడక్స్, రెడ్‌హ్యాట్, హ్యాకర్ ర్యాంక్, ఎడ్జ్ నెట్వర్క్స్ వంటి సంస్థలు వేర్వేరు హోదాల్లో సహకరిస్తున్నాయని వివరించారు. కంపెనీల అవసరాలు, ఉద్యోగుల అర్హతల ఆధారంగా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, ఇందుకు కంపెనీలు నామమాత్రపు ఫీజు వసూలు చేస్తాయని ప్లాట్‌ఫాం అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన మోహిత్ టుక్రాల్ చెప్పారు. -
అమెజాన్ కీలక నిర్ణయం: 20 సెంటర్లు, భారీ ఉద్యోగాలు
వాషింగ్టన్: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ ఎత్తున విస్తరించేందుకు రచిస్తున్న ప్రణాళికల్లో వేగం పెంచింది. ఇందులో భాగంగా తాను ఏర్పాటు చేయనున్న కొత్త కార్యాలయాల జాబితాను వెల్లడించింది. అమెరికా ప్రధాన మెట్రో నగరాలు న్యూ యార్క్ సిటీ, లాస్ ఏంజిల్స్, వాషింగ్టన్ డీసీతో పాటు ముఖ్యంగా నార్త్ కరోలినా, కొలంబస్, ఒహియో లాంటి చిన్న నగరాల్లో కూడా అమెజాన్ సెకండ్ హెడ్ క్వార్టర్స్‌ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. కెనడాలోని ఓ ప్రధాన నగరం సహా 20 ముఖ్య నగరాల్లో అమెజాన్ కార్యాలయాలను ప్రారంభించనుంది. 238 ప్రతిపాదనలను సమీక్షించిన తర్వాత అమెజాన్ ఎంపిక చేసిన నగరాల జాబితాను గురువారం విడుదల చేసింది. 5 బిలియన్ డాలర్లు పెట్టుబడులతో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనున్నామనీ, తద్వారా సుమారు 50వేల ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నామని అమెజాన్ ప్రకటించింది అమెరికా, కెనడా, మెక్సికో దేశాల నుంచి 238 సెంటర్లను పరిశీలించిన అమెజాన్ చివరికి ఈ ఎంపిక చేసింది. టెక్నాలజీ హబ్‌గా ఎస్టాబ్లిష్ అయిన బోస్టన్, పిట్స్బర్గ్ సహా కొలంబియా, ఓహియా నగరాలు ఈ జాబితాలో ఉండటం విశేషం. అమెరికా బయట కెనడా అతిపెద్ద నగరం టొరాంటో ఈ జాబితాలో ఉంది. -
ఐటీలో 2 లక్షల ఉద్యోగాలు!!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది ఐటీ రంగం ఉద్యోగాలతో కళకళలాడనుంది. ఈ పరిశ్రమలో దాదాపు 2 లక్షల మందికి ఉపాధి లభించనుందని అంచనాలున్నాయి. ‘ఫైనాన్షియల్ సర్వీసెస్, డిజిటల్ బిజినెస్‌లలో మెరుగుదల.. ప్రత్యేకించి డిజిటైజేషన్, ఆటోమేషన్‌లలో ఇన్వెస్ట్మెంట్ల పెరుగుదల.. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం వంటి అంశాలు వ్యాపార వృద్ధికి దోహదపడతాయి’ అని టీమ్‌లీజ్ సర్వీసెస్ ఐటీ స్టాఫింగ్ జనరల్ మేనేజర్ ఆల్కా ధింగ్రా వివరించారు. కొత్త కంపెనీల వల్ల కూడా నియామకాలు పెరగొచ్చని, దాదాపు 20 శాతానికిపైగా ఎక్కువ కంపెనీలు ఈ ఏడాది నియామకాలు చేపట్టే అవకాశముందని పేర్కొన్నారు. 2018లో దేశీ ఐటీ పరిశ్రమలో దాదాపు 1.8–2 లక్షల కొత్త ఉద్యోగాలు ఉంటాయని అంచనా వేశారు. దేశం డిజిటల్ ఇండియా దిశగా పరుగులు పెడుతోన్న తరుణంలో ఈ పరిశ్రమకు డిజిటల్ నైపుణ్యాలు కలిగిన 50 శాతం ఎక్కువ మంది ఉద్యోగులు అవసరమౌతారని తెలిపారు. డిజిటల్ ఇండియా వల్ల డిజిటల్ టెక్నాలజీస్, ఏఐ, రోబోటిక్స్‌లలో ఉద్యోగాలు పెరగొచ్చన్నారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి పలు అంశాల కారణంగా ఇండియన్ జాబ్ మార్కెట్ మార్పు దిశగా పయనిస్తోంది. ఈ మార్పును అధిగమించి మనుగడ సాగించాలంటే నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ఒక్కటే మార్గం’ అని నిపుణులు హెచ్చరించారు. టీమ్‌లీజ్ అంచనా -
ఐదేళ్లలో ఐదు కోట్ల ‘కొత్త తరహా’ ఉద్యోగాలు
న్యూఢిల్లీ: మారుతున్న టెక్నాలజీల కారణంగా భవిష్యత్తులో కొత్త కొత్త ఉద్యోగాలు రానున్నాయని ఒక నివేదిక పేర్కొంది. రానున్న రెండేళ్లలో ఉద్యోగ మార్కెట్లో మందగమనం చోటు చేసుకుంటుందని ఫిక్కి–నాస్కామ్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ తాజా నివేదిక పేర్కొంది. కంపెనీలు తమ వ్యాపార మోడళ్లను పునర్వ్యవస్థీకరించడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలుండటమే దీనికి కారణమని పేర్కొంది. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే... ♦ ప్రస్తుతం భారత ఉద్యోగ మార్కెట్ సంధి దశలో ఉంది. ♦ ప్రపంచీకరణ, పెరుగుతున్న జనాభా, కొత్త కొత్త టెక్నాలజీలు.. భారత ఉద్యోగ మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావమే చూపిస్తాయి. ♦ ప్రస్తుతం అసలు లేని కొత్త ఉద్యోగాలు 2022 కల్లా వస్తాయి. 60 కోట్లుగా ఉండే భారత ఉద్యోగుల్లో దాదాపు 9 శాతం మంది ఈ తరహా కొత్త ఉద్యోగాలు చేస్తారు. అంటే 5.4 కోట్ల కొత్త తరహా ఉద్యోగాలు వస్తాయి. ♦ ప్రస్తుతం 3.8 కోట్లుగా ఉన్న వ్యవస్థీకృత తయారీ, సేవల రంగాల్లోని ఉద్యోగుల సంఖ్య మరో ఐదేళ్లలో 4.6–4.8 కోట్లకు పెరుగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కొత్త కొలువుల జూమ్
సాక్షి, హైదరాబాద్: హైటెక్ నగరంలో కొత్త కొలువుల ‘జూమ్’ అంటున్నాయి. యువత ఆ కొలువుల వైపు పరిగెడుతోంది. ఆశించిన స్థాయిలో ఐటీ జాబ్స్ పెరగకపోయినా... సేవా, నిర్మాణ, ఇంజనీరింగ్, సేల్స్, మార్కెటింగ్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సేవా రంగాల్లో శరవేగంగా విస్తరిస్తోన్న గ్రేటర్ నగరంలో కొత్త కొలువులు నిరుద్యోగులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పలు మెట్రో నగరాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడవడం విశేషం. ప్రముఖ కొలువుల వెబ్సైట్ నౌకరిడాట్కామ్ తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. దేశంలోని ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్ తదితర మెట్రో నగరాల్లో పలు రంగాలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెలుగుచూశాయి. ఆయా సిటీల్లో ప్రధానంగా బ్యాంకులు, ఆర్థిక, ఇన్సూరెన్స్ తదితర సంస్థల్లో ఉపాధి కల్పన, ఉద్యోగాల వృద్ధిరేటు 21 శాతం మేర నమోదవగా.. ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో 4 శాతం వృద్ధిరేటు తగ్గినట్లు తేలింది. ఇక ఐటీ అనుబంధ రంగాలు, బీపీఓ విభాగంలో 8 శాతం వృద్ధిరేటు తగ్గడం గమనార్హం. గ్రేటర్ స్థానం 4 విశ్వనగరం బాటలో దూసుకుపోతున్న గ్రేటర్ నగరంలో సేవారంగం శరవేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగేతర సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, భారీ యంత్ర పరికరాలు, నిర్మాణ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఇక ఇంజనీరింగ్, ఆటోమొబైల్స్, సేల్స్, మార్కెటింగ్, వాణిజ్య ప్రకటనలు(అడ్వర్టైజింగ్) రంగాలు కూడా ఇటీవలి కాలంలో ఇతోధికంగా పురోగమిస్తున్నాయి. గ్రేటర్లో మొత్తంగా ఈ రంగాల్లో సగటున ఏటా 6 శాతం మేర ఉపాధి అవకాశాలు పెరుగుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో బెంగళూరు నగరం 16 శాతం వృద్ధిరేటుతో తొలిస్థానంలో ఉంది. ఇక రెండోస్థానంలో నిలిచిన ముంబై, కోల్‌కతా మహానగరాల్లో 15 శాతం వృద్ధి నమోదైంది. మూడో స్థానంలో నిలిచిన చెన్నైలో 9 శాతం.. నాలుగోస్థానంలో నిలిచిన హైదరాబాద్‌లో 6 శాతం వృద్ధిరేటు నమోదైనట్లు వెల్లడైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఆయా రంగాల్లో సగటున 9 శాతం తరుగుదల నమోదైనట్లు తేలింది. గ్రేటర్లో ఆయా రంగాల పరిస్థితి ఇదీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు: గ్రేటర్ కేంద్రంగా దేశ, విదేశాలకు చెందిన పలు ఆర్థిక, వాణిజ్య, బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమ కార్యకలాపాలను క్రమంగా విస్తరిస్తున్నాయి. ప్రధానంగా ఇన్సూరెన్స్, పెట్టుబడుల రంగం పురోగమిస్తోంది. వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. భారీ యంత్ర పరికరాలు: గ్రేటర్లో పారిశ్రామికీకరణ ప్రక్రియ వేగవంతం కావడంతో భారీ యంత్ర పరికరాల పరిశ్రమలు వేగంగా విస్తరిస్తున్నాయి. టీఎస్ ఐపాస్‌తో పరిశ్రమలకు ఏకగవాక్ష అనుమతులు మంజూరు చేస్తుండటంతో పరిశ్రమల సంఖ్య పెరుగుతోంది. ఆటోమొబైల్స్: గ్రేటర్ జనాభా కోటి కాగా... వాహనాల సంఖ్య సుమారు 50 లక్షలు. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి వాహనం ఉందన్నమాట. ఈ నేపథ్యంలో నూతన వాహనాల కొనుగోలు, వాటి నిర్వహణ, మరమ్మతులకు సంబంధించిన ఆటోమొబైల్ రంగం వృద్ధి చెందడమే కాదు.. పలువురికి ఉపాధి బాట చూపుతోంది. ఇంజనీరింగ్: మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ సంబంధిత పరిశ్రమలు, ఇన్ఫ్రా కంపెనీలకు నగరం చిరునామాగా మారడంతో ఈ రంగాల్లో ఇటీవలికాలంలో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. నిర్మాణ రంగం: గ్రేటర్ శివార్లలో విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు విస్తరించడంతో ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందినవారు నగరానికి వలసవస్తున్నారు. వీరికి గృహ వసతి అత్యవసరంగా మారింది. శివార్లలో అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు, వేతన జీవులు స్వతంత్ర గృహాల కొనుగోలుకు ప్రాధాన్యతనిస్తుండటంతో నిర్మాణ రంగం పుంజుకుంటోంది. సేల్స్: కాదేది అమ్మకానికి అనర్హం.. పిజ్జా, బర్గర్ మొదలు.. కాళ్లకు వేసుకునే షూజ్, సాక్సులు, గృహోపకరణాలు, అలంకరణ వస్తువులకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఇంటి వద్దకే కావాల్సిన వస్తువులు అందించే సేల్స్ రిప్రజెంటేటివ్‌లకు పలు సంస్థలు భారీగా కొలువులు, వేతనాలు, కమీషన్లు ఆఫర్ చేస్తుండటం విశేషం. మార్కెటింగ్, వాణిజ్య ప్రకటనలు: ఇక వివిధ వస్తువులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, నిర్మాణ రంగ సంస్థల్లో మార్కెటింగ్ చేసేవారికి కొత్త కొలువులు స్వాగతం పలుకుతూనే ఉన్నాయి. ఇక దేశ, విదేశాలకు చెందిన మల్టీబ్రాండెడ్ వస్తువులకు వాణిజ్య ప్రకటనలు తప్పనిసరి అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రకటనల రంగం శరవేగంగా విస్తరిస్తోంది. -
ఫేస్బుక్లో కొత్తగా ఉద్యోగాలు: వాటికోసమే..
వ్యాపార ప్రకటనల విషయంతో తీవ్ర విమర్శలు పాలవుతున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తన అడ్వర్టైజింగ్ సిస్టమ్‌ను, ప్లాన్లను మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు తమ సోషల్ మీడియా ప్లాట్ఫామలో వచ్చే వ్యాపార ప్రకటనలను సమీక్షించడానికి కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటోంది. 1000 మందికి పైగా ఉద్యోగులను ఫేస్బుక్ తన వ్యాపార ప్రకటనలను సమీక్షించడానికి తీసుకుంటున్నట్టు తెలిసింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం ఉందనే దానిపై కాంగ్రెస్ విచారణ చేపట్టిన నేపథ్యంలో ఫేస్బుక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ ఎన్నికల సందర్భంగా ఫేస్బుక్లో రష్యన్ యాడ్స్ ఎక్కువగా ఉండటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అవి ట్రంప్‌కు అనుకూలంగా వచ్చాయని లిబరల్స్ ఆరోపిస్తుండగా... ట్రంప్ మాత్రం ఫేస్‌బుక్‌ను యాంటీ ట్రంప్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రకటనల కోసం ఫేస్బుక్ లక్షకు పైగా డాలర్లను తీసుకుంది. తమపై వస్తున్న ఈ ఆరోపణలకు గాను, ఎవరినైనా బాధించి ఉంటే మన్నించడంటూ ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ నిన్ననే(సోమవారమే) క్షమాపణ కూడా చెప్పారు. రాజకీయ ప్రకటన ఖర్చు నిబంధనలను సమగ్రంగా సమీక్షించనున్నామని జుకర్ బర్గ్ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి తమ టూల్స్‌ను ఎవరూ వాడుకోవడానికి వీలులేదంటూ పేర్కొన్నారు. ప్రకటన కొనుగోలు ప్రక్రియలో కూడా ఫేస్బుక్ పలు అప్డేట్లను ప్రవేశపెట్టింది. కంటెంట్‌పై కఠినతరమైన నిబంధనలు తీసుకురావడం, అడ్వర్టైజర్లు తమ ప్రామాణికతను ప్రదర్శించడానికి నిబంధనలను మెరుగుపరచడం వంటి వాటిని తీసుకొచ్చింది. -
టెకీలకు ఈ కొలువులే హాట్
సాక్షి,న్యూఢిల్లీ: క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేట్ల జాబ్ రోల్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భిన్న రంగాల్లో దూసుకొచ్చిన నూతన టెక్నాలజీల కారణంగా సంప్రదాయ కొలువుల స్ధానంలో కొత్త రోల్స్ ముందుకొచ్చాయి. బిగ్ డేటా అనలిటిక్స్, కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ మార్కెటింగ్, మొబైల్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వంటి నూతన విభాగాల్లో తాజా టాలెంట్‌ను కొలువుతీర్చేందుకు కంపెనీలు క్యాంపస్‌ల బాట పడుతున్నాయి. గతంలో ఈ విభాగాల్లో వివిధ పొజిషన్స్‌లో ప్రైమరీ, మిడ్‌లెవెల్ ప్రొఫెషనల్స్‌కు ఆఫర్ చేసేవారు. అయితే ఎంట్రీ లెవెల్లోనే గ్రాడ్యుయేట్లను ఎంపిక చేసుకుని ఆయా విభాగాల్లో శిక్షణ ఇవ్వాలని కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది ఈ నైపుణ్యాల్లో దేశవ్యాప్తంగా 12,000 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రొవెడర్ సింప్లీలెర్న్ పేర్కొంది. ఇక డిజిటల్ మార్కెటింగ్‌లో 12,480 మంది ఫ్రెషర్స్‌కు, మొబైల్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో 11,700 మంది ఫ్రెషర్స్‌కు అవకాశాలున్నాయని వెల్లడించింది. గతంలో క్యాంపస్ రిక్రూట్మెంట్లు జరిగే క్లౌడ్ కంప్యూటింగ్, క్వాలిటీ మేనేజ్మెంట్, ఐటీ సేవల ఉద్యోగాల కన్నా ఈ సంఖ్య దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. ఐటీ సేవలు, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగం నుంచి ఈ ఉద్యోగాలు సమకూరనున్నాయని సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కాశ్యప్ దలాల్ పేర్కొన్నారు. కస్టమర్లకు సేవలు అందించే క్రమంలో ఈ టెక్నాలజీలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని అన్ని కంపెనీలు గుర్తించడంతో ఆయా జాబ్ రోల్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఇతర జాబ్లకు ఇచ్చే ప్రారంభ వేతనమే వీటికి ఉన్నప్పటికీ రెండు మూడేళ్లలో ఈ జాబ్రోల్స్లో కుదురుకునే అభ్యర్థులకు వేతన ప్యాకేజ్ భారీగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
జీఎస్టీతో వారికి 5 లక్షల ఉద్యోగాలు
ఇండోర్ : స్వాతంత్య్రానంతరం దేశంలో అమలుకాబోతున్న అతిపెద్ద పన్ను సంస్కరణ జీఎస్టీ. ఇంకో నెలలో ఇది అమల్లోకి రాబోతుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు జీఎస్టీ బిల్లులను ఆమోదించే ప్రక్రియలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ అమలు, కంప్యూటర్ ఆపరేటర్ల కోసం ఐదు లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించనుందని కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రిన్యూర్‌షిప్ సహాయమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ తెలిపారు. జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చిన అనంతరం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీతోపాటు ఫైనాన్స్ సంబంధిత సబ్జెట్స్ లో అవగాహన కలిగి ఉన్న కనీసం ఐదు లక్షల మంది కంప్యూటర్ ఆపరేటర్లు అవసరం పడతారని కేంద్రమంత్రి చెప్పారు. విద్యానగర్ ఏరియాలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభించిన అనంతరం ఆయన రిపోర్టర్లతో మాట్లాడారు. దేశంలో ఉద్యోగాలు పోతున్నాయన్న ఆరోపణలపై స్పందించిన మంత్రి, ప్రభుత్వం ఔత్సాహిక నైపుణ్యాలను అందించడం, స్వయం ఉపాధి కలిగిచడంపై దృష్టిపెట్టినట్టు తెలిపారు. దేశంలోని తమ యువతను ఉద్యోగం కోరే వారి లాగా, ఉద్యోగం ఇచ్చే వారిలాగా చూడాలనుకుంటున్నట్టు చెప్పారు. -
విద్యుత్ ఉద్యోగులకు కేసీఆర్ వరాలు
-
నిరుద్యోగులకు శుభవార్త
హైదరాబాద్: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. రెవెన్యూ శాఖలో త్వరలో 2109 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. రెవెన్యూ శాఖతో పాటు విద్యా, ఆర్ అండ్ బీ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆర్ అండ్ బీ శాఖలో 12 ఉద్యోగాలను, విద్యాశాఖలో 85 ఎంఈఓ పోస్టులను భర్తీ చేయడానికి అనుమతించారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. -
కొత్త జిల్లాల్లో కొత్త బలగం
-
కొత్త జిల్లాల్లో కొత్త బలగం
27 జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటుపై తుది ప్రతిపాదనలు పోస్టులు50,970 ఉద్యోగులు 39,252 ఖమ్మంకు అత్యధికంగా 3,191 పోస్టులు.. 2,631 మంది ఉద్యోగులు మల్కాజ్‌గిరికి అత్యల్పంగా 499 పోస్టులు.. 361 మంది సిబ్బంది టాస్క్‌ఫోర్స్‌కు చేరిన నివేదికలు.. పది వేలకుపైగా ఉద్యోగుల కొరత కొత్త నియామకాలకు ప్రభుత్వ యోచన.. త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు! అప్పటివరకు ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఉద్యోగుల పునర్విభజన ప్రక్రియ కొలిక్కి వచ్చింది. దసరా నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినందున అన్ని శాఖలు అందుకు అనుగుణంగా ఉద్యోగులను సర్దుబాటు చేశాయి. శాఖలవారీగా ఉద్యోగుల కేటాయింపులపై తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ ఈ ప్రతిపాదనలన్నీ క్రోడీకరించి నివేదికను తయారు చేసింది. శాఖల వారీగా కొత్త జిల్లాల్లోని పాలనా స్వరూపాన్ని, నిర్ణీత ఉద్యోగుల ప్రణాళికను నిర్దేశించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 50,970 మంజూరీ పోస్టులను, ప్రస్తుతం పనిచేస్తున్న 39,252 మంది ఉద్యోగులను 27 జిల్లాలకు కేటాయించేలా తుది ప్రణాళిక సిద్ధం చేసింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాకు 3,191 పోస్టులు, 2,631 మంది ఉద్యోగులు, అతి తక్కువగా మల్కాజ్‌గిరికి 499 పోస్టులు, 361 మంది ఉద్యోగులను పునర్విభజన చేసింది. మంజూరీ పోస్టులతో పోలిస్తే పది వేలకుపైగా ఉద్యోగుల కొరత ఉన్నట్లు ప్రతిపాదనలు చూస్తే స్పష్టమవుతోంది. కొత్త నియామకాలతో వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే కొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయడంతో తదుపరి అవసరమైన పోస్టుల వివరాలతో మరిన్ని నోటిఫికేషన్లకు రంగం సిద్ధం చేయనుంది. అప్పటివరకు అవసరమైన మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను అందుబాటులో ఉంచుకోవాలని ఇప్పటికే కలెక్టర్లకు టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఏర్పడే 17 జిల్లాలకు ఉద్యోగులను కేటాయించాలంటే జిల్లా కేంద్రాల్లో ఉన్న ఉద్యోగుల సంఖ్య మూడింత లు పెరగటం ఖాయం. ఆ మేరకు కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలనుకున్నా.. ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు. అందుకే పని భారం, పని స్వభావానికి అనుగుణంగా పరిపాలనకు కొత్తరూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదే క్రమంలో సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులు తుది ప్రతిపాదనలు తయారు చేశారు. విలీనానికి అనుగుణంగా కేటాయింపు కొత్త జిల్లాల నేపథ్యంలో ఒకే పనితీరు ఉన్న కొన్ని విభాగాలను జిల్లా స్థాయిలో విలీనం చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. టాస్క్‌ఫోర్స్ కమిటీ అందుకు వీలుగా శాఖల పునర్వ్యవస్థీకరణ, అధికారిక హోదాల మార్పు, కొత్త పేర్లు, జిల్లా కార్యాలయాల్లో ఉండాల్సిన ఉద్యోగుల ప్రణాళికను ఖరారు చేసింది. కొన్ని విభాగాల్లో జిల్లాస్థాయి హోదా ఉన్న అధికారులు లేకపోతే.. తదుపరి కేడర్ ఉన్న అధికారులకు కొత్త జిల్లాల బాధ్యతలు అప్పగించనున్నారు. కేడర్‌లో తేడా ఉన్నప్పటికీ జిల్లా స్థాయి అధికారులను ఒకే పేరుతో పిలిచేందుకు వీలుగా పేర్లను సైతం మార్చనున్నారు. ఉదాహరణకు ప్రజారోగ్య శాఖ పరిధిలో ప్రస్తుతం తొమ్మిది మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జిల్లా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సర్దుబాటులో భాగంగా అర్హులైన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను కొత్త జిల్లాల్లో నియమిస్తారు. కేడర్‌లో తేడా ఉన్నా జిల్లాస్థాయిలో ఈ పోస్టును జిల్లా ప్రజారోగ్య శాఖ అధికారి (డీపీహెచ్ఈ)గా పిలుస్తారు. మరోవైపు జిల్లా స్థాయిలో కొన్ని విభాగాల విలీనంపై ఇప్పటికీ ఆయా శాఖలు భిన్నమైన ప్రతిపాదనలు సమర్పించాయి. ప్రధానంగా సంక్షేమ శాఖల విలీనానికి సంబంధించి మూడు రకాలుగా ప్రతిపాదనలు, ఉద్యోగుల కేటాయింపునకు ఏర్పాట్లు జరిగాయి. దీంతో ముఖ్యమంత్రి తీసుకునే తుది నిర్ణయం మేరకు ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కొత్త జిల్లాలకు ఉద్యోగులను కేటాయించేటప్పుడు సీనియారిటీకి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఒకే కేడర్ ఉన్న ఉద్యోగులైతే స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరందరికీ ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు జారీ చేసేందుకు వీలుగా మార్గదర్శకాలు సిద్ధం చేసింది. ------------------------------------ కొత్త జిల్లా మంజూరీ పోస్టులు ఉద్యోగులు ------------------------------------ హైదరాబాద్ 2,263 1,591 ఆదిలాబాద్ 1,978 1,539 కొమురంభీమ్ 2,588 1,951 నిర్మల్ 1,620 1,304 కరీంనగర్ 2,635 2,083 జగిత్యాల 1,433 1,067 పెద్దపల్లి 1,533 1,215 హన్మకొండ 1,168 924 వరంగల్ 1,688 1,326 భూపాలపల్లి 1,337 1,076 మహబూబాబాద్ 1,199 972 కొత్తగూడెం 2,731 2,077 ఖమ్మం 3,191 2,631 నల్లగొండ 3,109 2,345 సూర్యాపేట 1,551 1,273 యాదాద్రి 1,245 884 మహబూబ్‌నగర్ 2,555 1,994 నాగర్‌కర్నూల్ 2,060 1,460 వనపర్తి 1,702 1,361 రంగారెడ్డి 2,354 1,764 మల్కాజ్గిరి 499 361 శంషాబాద్ 662 463 మెదక్ 1,546 1,104 సంగారెడ్డి 2,253 1,817 సిద్దిపేట 1,560 1,178 కామారెడ్డి 1,682 1,285 నిజామాబాద్ 2,828 2,207 ---------------------------------- మొత్తం 50,970 39,252 ---------------------------------- -
కొత్త కొలువులు
-
కొత్త కొలువులు
- నూతన జిల్లాల్లో అవసరమైన ఉద్యోగ నియామకాలకు సిద్ధం: కేసీఆర్ - అర్హత ఉన్నవారందరికీ ప్రమోషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం - ఎలాంటి పైరవీల్లేకుండా ప్రజలకు పథకాలు అందాలి - ఉమ్మడి రాష్ట్రంలోని అవలక్షణాలేవీ ఉండొద్దు - అనుబంధ శాఖలన్నీ ఒకే గొడుగు కిందకు తేవాలి - శాఖలన్నీ ప్రజలకు అందుబాటులో ఉండాలి - శాంతిభద్రతలు అత్యంత ముఖ్యం.. పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉండాలి - సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవంలో పాల్గొంటా - జిల్లాల పునర్విభజన పురోగతిపై 6న కలెక్టర్ల సదస్సు సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అవసరమైన మేరకు ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అర్హత ఉన్న ఉద్యోగులందరికీ ప్రమోషన్లు ఇచ్చి వారు పూర్తి నిబద్ధతతో ప్రజలకు సేవలందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పైరవీలకు తావులేకుండా సంక్షేమ పథకాల కోసం ప్రజలే నేరుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వ శాఖల పునర్ వ్యవస్థీకరణపై సీఎం శనివారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు, పదోన్నతులు, నియామకాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, సీఎంవో అధికారులు నర్సింగ్ రావు, స్మితా సబర్వాల్, శాంతాకుమారి, భూపాల్‌రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలు, పరిపాలనలో ఉద్యోగులూ భాగస్వాములేనన్నారు. అనుబంధ శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచించారు. నేరాల అదుపునకు పటిష్ట పోలీసు వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా ఏర్పడే మండల కేంద్రాల్లో పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు తగిన సిబ్బందిని నియమించాలన్నారు. ప్రజలకు చేరువగా..: కొత్త జిల్లాల్లో ప్రభుత్వ శాఖల పునర్వ్యవస్థీకరణ ప్రజలకు మేలు చేసేలా కార్యాచరణ ఉండాలని సీఎం ఆదేశించారు. సంక్షేమ పథకాలు పొందే లబ్ధిదారుడి పూర్తి వివరాలు కలెక్టర్ల కంప్యూటర్లో ఉండే విధంగా డిజిటలైజేషన్ చేపట్టాలన్నారు. ప్రభుత్వ శాఖలను పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరించాలన్నారు. ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందుబాటులో ఉండేలా కొత్త జిల్లాల నమూనా ఉండాలన్నారు. సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవంలో పాల్గొంటా: రాష్ట్ర ప్రజలందరూ సంతోషించేలా కొత్త జిల్లాల ఆవిర్భావం జరగాలని సీఎం ఆకాంక్షించారు. దసరా రోజు కొత్తగా ఏర్పడే సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవంలో తాను పాల్గొంటానన్నారు. మంత్రులు, ప్రభుత్వ సీఎస్, డీజీపీ వంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇతర జిల్లాల్లో పరిపాలన ప్రక్రియను ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లాల పునర్విభజన పురోగతిని చర్చించేందుకు ఈ నెల 6న కలెక్టర్ల సదస్సు నిర్వహించాలన్నారు. సాగు, నీటిపారుదలకు అధిక ప్రాధాన్యం: వ్యవసాయం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని సీఎం చెప్పారు. దేశానికే అన్నపూర్ణగా ఉండాల్సిన ప్రాంతం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కరువుతో తల్లడిల్లే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 58 ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో ఒకేఒక్కసారి బడ్జెట్‌కు సాగునీటి పారుదలకు రూ.15,500 కోట్ల బడ్జెట్లో కేటాయించారన్నారు. సమైక్య రాష్ట్రంలో అవే అత్యధిక కేటాయింపులని వివరించారు. ఇప్పుడు తెలంగాణలో ఏడాదికి రూ.25 వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 13 మంది ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు ఉంటే.. నేడు ఒక్క తెలంగాణకే 15 మంది ఉన్నారన్నారు. -
అమెజాన్ లో 1,000 ఉద్యోగాలు
బ్రెగ్జిట్ దెబ్బతో ఉద్యోగాల కల్పనలో మందగమనం ఏర్పడే అవకాశాలున్నాయని భయాందోళనలు నెలకొన్న పరిస్థితుల్లో, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మాత్రం కొత్త ఉద్యోగాల సృష్టిపై దృష్టి పెట్టింది. యూకేలో వెయ్యి కొత్త ఉద్యోగాలను కల్పిస్తామని ప్రకటించింది. అల్ట్రా ఫాస్ట్ డెలివరీ ప్రైమ్ నౌ సేవల వృద్ధిని కొనసాగించడానికి కంపెనీ ఈ ఉద్యోగ అవకాశాలు చేపడతామని అమెజాన్ తెలిపింది. 30శాతానికి పైగా యూకే ప్రజలకు ప్రైమ్ నౌ సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని తాము మార్చలేమని, అంచనాలకు అనుగుణంగానే తమ అమ్మకాలు కొనసాగిస్తామని, అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డౌ గురు చెప్పారు. బ్రెగ్జిట్ ప్రతిఫలం ఎలా ఉంటుందని తమకి తెలియదని, కానీ ప్రస్తుతం ఎలా అయితే బిజినెస్ నిర్వర్తిస్తున్నామో అలానే చేపడతామన్నారు. 2,500 స్థానాలకు రిక్రూట్ మెంట్ డ్రైవ్ చేపడతామని కంపెనీ ఈ ఏడాది మొదట్లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎండిన్ బర్గ్, మాంచెస్టర్, లీసెస్టర్ షైర్, కేంబ్రిడ్జ్, లండన్ ల్లో ఈ ఉద్యోగాలు చేపడతామని అప్పుడే తెలిపింది. కొత్తగా సృష్టిస్తున్న ఉద్యోగులతో కలిపి, అమెజాన్ ను 15,500 మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉండబోతోంది. మరో 74వేల యూకే ఉద్యోగాలకు అమెజాన్ తన మార్కెట్ ప్లేస్ ద్వారా ఉపాధి కల్పిస్తోంది. స్థానిక ఆన్ లైన్ బుక్ రిటైలర్ కొనుగోలుతో, 1998లో మొదట యూకే వ్యాపారాల్లోకి అమెజాన్ ప్రవేశించింది. అప్పటినుంచి అన్ని రకాల రిటైలింగ్, ఇతర సేవలను ఈ ఈ-కామర్స్ సంస్థ చేపడుతోంది. -
కొత్త కొలువులు వెదుక్కుంటూ...
కొత్తవలస రూరల్: ఉన్న ఊళ్లో ఉపాధి కరువై పరిశ్రమలను నమ్ముకున్న కార్మికులు పొట్టపోషణకోసం వలసబాట పట్టారు. వేలాదిమందికి ఉపాధి కల్పించిన మండలంలోని అప్పన్నపాలెం జిందాల్, దేశపాత్రునిపాలెం డెక్కన్ ఫెర్రోఅల్లాయీస్, ఆంధ్రా ఫెర్రో అల్లాయీస్, సాయిరాం కాస్టింగ్, తుమ్మికాపల్లి ఉమా జూట్‌మిల్లులు ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. ఈ కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ కుటుంబాలను పోషించుకునేందుకు తప్పని సరి పరిస్థితుల్లో విశాఖపట్నం వలసపోతున్నారు. కష్టాల్లో ఉన్న కర్మాగారం కనీసం తాము పనిచేసిన కాలానికి జీతాలు కూడా చెల్లించలేదని వాపోయారు. చేతిలో చిల్లిగవ్వలేక తమ కుటుంబాల్లో ఎవరికి అనారోగ్యం చేసినా వైద్యం చేయించుకునేందుకు కూడా ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. కనీసం తమ గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు జిందాల్... అటు ఉమాజూట్ మిల్లులు మూసివేయటంతో వందలాదిగా కార్మికులు విశాఖ పోర్టు, రైల్వే కాంట్రాక్టు, భవననిర్మాణ రంగాలలో రోజువారీ కూలీలుగా మారారు. చాలీచాలని కూలి డబ్బుతో అర్ధాకలితో అలమటిస్తున్నారు. విద్యుత్ రాయితీ ప్రకటించినా... రాష్ర్ట ప్రభుత్వం విద్యుత్ రాయితీ యూనిట్‌కు 1.50 పైసలు ప్రకటించినా జిందాల్ కర్మాగారం తెరిచేందుకు సుముఖత చూపటంలేదు. దీనివల్ల కర్మాగారంలో ఎంప్లాయిస్, కాంట్రాక్టు లేబరు కలిపి 850 మంది వరకూ ఉపాధి కోల్పోయాం. పనికోసం పొట్టచేతపట్టుకుని వలస పోవాల్సిన దుస్థితి నెలకొంది. - బొట్ట రాము, జిందాల్ కాంట్రాక్ట్ కార్మికుడు తక్కువ కూలి ఇస్తున్నారు మిల్లులు మూసేయటంతో మేమంతా మూకుమ్మడిగా రోజువారీ కూలీ పనులకోసం విశాఖపట్నం పోతున్నాం. మా అవసరం చూసి కాంట్రాక్టర్లు రోజుకు 200 నుంచి 250 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అవసరానికి మించి పనివారు ఉండటంతో కూలి గిట్టుబాటు కావటంలేదు. పరిశ్రమల యాజమాన్యాలు తెరవడానికి ప్రయత్నాలు చేయడంలేదు. కార్మికశాఖ కూడా వారి పక్షానే ఉంటోంది. ప్రభుత్వం సైతం మా కష్టాలను పట్టించుకోవడంలేదు. - వై.ఎస్.ఎన్.మూర్తి, జూట్ కార్మికుడు -
యాక్సెంచర్‌లో 95వేల కొత్త ఉద్యోగాలు
న్యూయార్క్ : ఈ ఏడాది ఆగస్టుతో ముగిసే ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా మొత్తం 95,000 నియామకాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్ సంస్థ యాక్సెంచర్ తెలిపింది. కంపెనీ సెప్టెంబర్-ఆగస్టు కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. మే 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో యాక్సెంచర్ 7.8 బిలియన్ డాలర్ల ఆదాయన్ని ఆర్జించగా, నాలుగో త్రైమాసికంలో 7.45-7.70 బిలియన్ డాలర్ల స్థాయిలో ఆదాయాలు ఉండొచ్చని అంచనా వేస్తోంది. మూడో త్రైమాసికం ఆఖరు నాటికి 3,36,000 పై చిలుకు ఉద్యోగులు ఉన్నారు. వీరిలో దాదాపు మూడు లక్షల మంది భారత్‌తోనే ఉన్నారు. మరో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీలో అత్యధికంగా 3,19,656 మంది, ఇన్ఫోసిస్‌లో1.76 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. -
జాబు లేదు.. భృతి లేదు
‘మేం అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. ఉద్యోగం లేనివారికి నిరుద్యోగ భృతి కల్పిస్తాం’, ..‘జాబు రావాలంటే బాబు రావాలి’ అంటూ ఎన్నికల వేళ ఊదరగొట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరా అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా వారి ఊసే పట్టించుకోలేదు. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలనూ ఊడబెరికి..వీధులపాలు చేశారు. చంద్రబాబు హామీలు నమ్మి ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురుచూసిన వేలాది మంది యువత సర్కారు వైఖరిపై రగిలిపోతున్నారు. తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఉన్న ఉపాధి కోల్పోయి పూటగడవని కుటుంబాలు ఆందోళనబాట పడుతున్నాయి. * జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే 60 వేల మంది నిరుద్యోగులు * వాస్తవ సంఖ్య అంతకు నాలుగింతలు... * ఉన్న ఉపాధీ కోల్పోయి వీధిన పడిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు * ఉపాధి కోసం యువత ఎదురుచూపులు * అమలు కాని సీఎం హామీలు * ఊసేలేని నిరుద్యోగ భృతి సాక్షి ప్రతినిధి, ఒంగోలు : చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త ఉద్యోగాలు రావడం సంగతి ఎలా ఉన్నా వేల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. జాబు రావాలంటే బాబు రావాలి అని ఎన్నికల ముందు ప్రకటనలతో హడావిడి చేశారు. చంద్రబాబునాయుడు కూడా ఇంటికో ఉద్యోగం కల్పిస్తానని, లేనిపక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తానంటూ హామీల వర్షం కురిపించారు. చంద్రబాబునాయుడి పాలన వచ్చి ఏడాది అయిన తర్వాత చూసుకుంటే కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా రాకపోగా ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాబు మారాడని నమ్మి ఓట్లు వేసిన ఉద్యోగులు, నిరుద్యోగులు కూడా మోసపోయారు. కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్నవారు తమ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని ఆశలు పెట్టుకుంటే ఉన్న ఉద్యోగాలు పోయాయి. ఇంటికో ఉద్యోగం అంటూ ప్రచారం చేసినా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో మూడు నుంచి నాలుగువేల మంది ఉద్యోగులను రోడ్డున పడేశారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్ట్ అసిస్టెంట్లను తొలగించారు. జిల్లాలో సుమారు 1040 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు బాబు నిర్ణయంతో రోడ్డున పడ్డారు. వచ్చీరావడంతోనే గ్రామాల్లో ఉన్న ఆదర్శ రైతులను తీసేశారు. వ్యవసాయ విస్తరణ అధికారులను తొలగించారు. అలాగే ఐకేపీ కింద సేంద్రీయ వ్యవసాయం చేసే క్లస్టర్ యాక్టివిస్ట్, విలేజ్ యాక్టిస్‌లుగా ఉన్న వారు ఉద్యోగాలు కోల్పోయారు. హౌసింగ్ కార్పొరేషన్లో ఇప్పట్లో గృహనిర్మాణాలు ఏమీలేవంటూ మిమ్మల్ని భరించలేమని అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను, సర్వేయర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించారు. వీళ్లకు ప్రభుత్వం జీతం ఇవ్వకపోయినా లబ్ధిదారుల రుణాల నుంచి రూ.5 వేలు కట్ చేసి జీతం ఇస్తారు. అలాంటి వీరిని కూడా తొలగించారు. వైద్యవిధాన పరిషత్‌లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను కూడా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంక్షేమ హాస్టల్స్‌లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టులో పనిచేస్తున్న కుక్‌లు, ఇతర సిబ్బందిని టె ర్మినేట్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. స్కూల్స్ రేషనలైజేషన్ చేయడం రాజీవ్ విద్యామిషన్ ద్వారా బీఈడీ అర్హతతో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను తొలిగించి వారి స్థానంలో ఉన్న టీచర్లను నియమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఒంగోలు, కందుకూరుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన జాబ్‌మేళాలకు వేలాది మంది నిరుద్యోగులు హాజరవుతున్నారు. చిన్నచిన్న ఉద్యోగాలకు కూడా ఇంజినీరింగ్ గ్యాడ్యుయేట్లు హాజరవుతున్నారంటే నిరుద్యోగ తీవ్రత ఎంత ఉందో అర్థమవుతోంది. అనేక మంది నిరుద్యోగులు ఫైళ్లు పట్టుకొని బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలాంటి మహానగరాలల్లోని కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు. నిరుద్యోగులు 60 వేలేనట! జిల్లాలో నేటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 60 వేలమందికిపైగా నిరుద్యోగులున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలపై నమ్మకాలు సన్నగిల్లడంతో ఉపాధి కార్యాలయాల్లో నమోదు చేయించుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. వాస్తవానికి జిల్లా ఉపాధి కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్న వారి కంటే కనీసం మూడు, నాలుగు రెట్లు అధికంగా ఉంటారని అంచనా. గతంలో 10వ తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థి, విద్యార్థిని విధిగా జిల్లా ఉపాధి కార్యాలయాల్లో తమ పేర్లు నమోదు చేసుకునేవారు. ఇప్పుడు పూర్తిగా మానివేశారు. దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, కానిస్టేబుళ్లు, గ్రూప్-4, గ్రూప్-2 వంటి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదు. ఎప్పటి నుంచో వాయిదా పడి మొత్తానికి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలు వచ్చినా, నియామకాలు జరుగుతాయన్న నమ్మకం లేదు. స్కూల్ అసిస్టెంట్లను ఎస్జీటీలోకి అనుమతించాలనే విషయమై తేల్చకుండా డీఎస్సీ పరీక్ష నిర్వహించారు. ఈ విషయమై అభ్యర్థులు కోర్టుకెళతారన్న విషయం తెలిసి కూడా కావాలనే డీఎస్సీ పరీక్ష నిర్వహించారనే ప్రచారం ఉంది. నిరుద్యోగులకు నెలనెలా జీవనభృతి ఇస్తామని నోటి మాట కాకుండా మేనిఫెస్టోలో ఐదో వాగ్దానంగా టీడీపీ అధినేత చంద్రబాబు పొందుపరిచారు. జిల్లాలో అధికారికంగా నమోదు చేసుకున్న వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి వచ్చినా ఈ ఏడాది కాలానికి గాను రూ.144 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ నిరుద్యోగ భృతి ఊసే సీఎం ఎత్తడం లేదు. బాబు వస్తే జాబు పోయింది నేను ఆదర్శ రైతును. చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే ఆదర్శ రైతులందరినీ తొలగించారు. దీంతో ద్వారా మేము రోడ్డున పడ్డాం. అప్పుల పాలయ్యాం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చంద్రబాబు పాలనలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. - వెన్నపూస మాలకొండయ్య, పీసీపల్లి ఉన్న ఉద్యోగం తీసేశారు నేను ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేసేవాణ్ణి. టీడీపీ ప్రభుత్వం వచ్చిన త ర్వాత ఉద్యోగం తీసేశారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి అధికారం లోకి వచ్చిన చంద్రబాబునాయుడు ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. ఎన్ఆర్ఈజీఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దాదాపు ఏడుగురిని తొలగించారు. - బాబూరావు, చీరాల -
9.5 లక్షల కొత్త ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఉద్యోగార్ధులకు, ఉద్యోగులకు ఈ ఏడాది అద్బుతంగా ఉండనున్నదని వివిద హెచ్ఆర్ సంస్థలు అంటున్నాయి. భారత్‌లోని కంపెనీలు 9.5 లక్షల కొత్త ఉద్యోగాలను ఇవ్వనున్నాయని, అలాగే మంచి పనితీరు కనబరిచే ఉద్యోగులకు వేతనాల పెంపు 40 శాతం వరకూ ఉండొచ్చని ఈ సంస్థ అంటోంది. మైహైరింగ్‌క్లబ్‌డాట్‌కామ్, యాస్పైరింగ్ మైండ్స్, హే గ్రూప్, ఏఆన్ హెవిట్, గ్లోబల్ హంట్, ఆబ్సొల్యూట్ డేటా ఎనలిటిక్స్, పీపుల్ స్ట్రాంగ్ హెచ్ఆర్ సర్వీసెస్, టాల్వ్యూడాట్కామ్ తదితర సంస్థల అంచనాలు ఇలా... ఈ ఏడాది వివిధ రంగాల్లో 9.5 లక్షల వరకూ కొత్త ఉద్యోగాలు వస్తాయి. వీటిట్లో ఐటీ, ఐటీఈఎస్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో ఎక్కువగా ఉద్యోగాలు వస్తాయి. గత ఏడాది వివిధ రంగాల్లో వేతనాల సగటు పెరుగుదల 10-12 శాతంగా ఉంది. ఈ ఏడాది ఇది 15-20 శాతంగా ఉండనున్నది. కొత్తగా వచ్చిన ఈ కామర్స్ వంటి రంగాల్లో మరింతగా వేతన పెరుగుదల ఉండొచ్చు. జీడీపీ 5.5 శాతానికి పెరగవచ్చన్న అంచనాలతో వివిధ వ్యాపారాలు వృద్ధి బాటన పడతాయి. దీంతో భారీగా ఉద్యోగాలు వస్తాయి. తాజా పట్టభద్రులకు గత మూడు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా ఉద్యోగవకాశాలు ఈ ఏడాది రానున్నాయి. ముఖ్యంగా ఈ కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ, ఐటీఈఎస్, రిటైల్ రంగాల్లో వీరికి మంచి ఉద్యోగవకాశాలు అధిక స్థాయిలో లభించనున్నాయి. కేంద్రం మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తామని చెబుతుండటంతో ఇంజినీరింగ్, కన్సల్టింగ్ రంగాల్లోనూ భారీగా ఉద్యోగాలు రానున్నాయి. ఇక జీతాల పెంపు విషయానికొస్తే ప్రతిభ గల ఉద్యోగుల జీతాలు 20-40% వరకూ పెరగవచ్చు. భారత కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాలను సగటున 10-18 శాతం వరకూ పెంచే అవకాశాలున్నాయి. -
ఐదేళ్లలో 50 లక్షల కొత్త ఉద్యోగాలు
ప్రైవేట్ సెక్యూరిటీ రంగంలో అపార అవకాశాలు: సీఏపీఎస్‌ఐ-క్యాప్సి న్యూఢిల్లీ: భారత్‌లో 2020 కల్లా ప్రైవేట్ సెక్యూరిటీ రంగంలో 50 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి. సెక్యూరిటీ గార్డులకు డిమాండ్ పెరుగుతుండటంతో ఈ స్థాయి ఉద్యోగాలు వస్తాయని ది సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ(సీఏపీఎస్‌ఐ-క్యాప్సి) అంచనా వేస్తోంది. ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులందజేసే కంపెనీల అత్యున్నత సంఘమైన క్యాప్సి చైర్మన్ కున్వర్ విక్రమ్ సింగ్ వెల్లడించిన వివరాలు.., * కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలు, మౌలిక రంగ అభివృద్ధి ప్రాజెక్టులు, రహదారులు, విమానశ్రయాలు, ఓడరేవులపై ప్రధానంగా దృష్టిసారిస్తోంది. ఫలితంగా ఐదేళ్లలో భారీ స్థాయిలో సెక్యూరిటీ గార్డులు అవసరం అవుతారు. * ప్రస్తుతం 15 వేల సెక్యూరిటీ సర్వీసుల కంపెనీలు భారత్‌లోని 600 జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 70 లక్షలకు పైగా పురుష, మహిళ సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు. * సెక్యూరిటీ గార్డుల కోసం వ్యక్తులను వెదకడం, ఆ వ్యక్తులను అదే ఉద్యోగంలో కొనసాగించడం... ఈ రెండు అంశాలు ప్రైవేట్ సెక్యూరిటీ పరిశ్రమలో అతి పెద్ద సమస్యలు. ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు పెరుగుతుండడమే దీనికి ప్రధాన కారణం. * ఈ రంగంలో డిమాండ్-సరఫరాల మధ్య అంతరం 30 శాతంగా ఉంది. * ప్రైవేట్ సెక్యూరిటీ రంగంలో ఉద్యోగవకాశాలపై గిరిజన ప్రాంతాల్లో క్యాప్సి, సెక్యూరిటీ సెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్లు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. -
కొత్త ఉద్యోగాలకు ఎన్నికల జోష్
సుస్థిర ప్రభుత్వం వస్తే 20 లక్షల కొత్త కొలువులు న్యూఢిల్లీ: ఎన్నికల అనంతరం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే, 20 లక్షల కొత్త ఉద్యోగాలొస్తాయని ఉద్యోగ నియామక సంస్థలు ఆశిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది హైరింగ్ కార్యకలాపాలు 30-40 శాతం వృద్ధి చెందుతాయని ఆయా సంస్థలు అంచనా వేస్తున్నాయి. టీమ్‌లీజ్, గ్లోబల్‌హంట్, మాన్‌స్టర్‌డాట్‌కామ్, నౌకరీ డాట్‌కామ్ వంటి సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది భారత కంపెనీలకు 12-14 లక్షల మంది కొత్త ఉద్యోగులు అవసరం. ఎన్నికల తర్వాత సుస్థిర సర్కారు ఏర్పాటైతే, పెట్టుబడులు పెరిగి.. ఆర్థిక వృద్ధి జోరందుకుంటుంది. 20 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలొస్తాయి. గత ఏడాది వివిధ రంగాల్లో 10 లక్షల కొత్త ఉద్యోగాలొచ్చాయి. అయితే బలహీనంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా భారీ సంఖ్యలోనే ఉద్యోగాలు కూడా పోయాయి. ఎన్నికల కారణంగా ఇప్పటికే మీడియా, పబ్లిక్ రిలేషన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా రంగాల్లో ఉద్యోగాల వృద్ధి కనిపిస్తోంది. అయితే, ఇవన్నీ తాత్కాలిక ఉద్యోగాలే. ఎన్నికల ఫలితాలనుబట్టి దీర్ఘకాలిక ఉద్యోగవకాశాలుంటాయి. -
ఐటీ..వెరీ పిటీ
వెనక్కుపోతున్న కీలక రంగం సహాయ నిరాకరణం.. మారని వాతావరణం పేరుకే రాష్ట్రంలో రెండో ఐటీ రాజధాని అడుగడుగునా అవస్థలతో హాని కొత్త కంపెనీల ఊసే కరువు ఉన్నవాటిపై సమస్యల బరువు పెరగని వ్యాపారాలు.. కలగామారిన కొత్త ఉద్యోగాలు అంగట్లో అన్నీ ఉన్నాయ్.. వైజాగ్ ఐటీ నెత్తిన మట్టి ఉంది. సిటీ పెద్దది.. పేరున్నది.. పరిశ్రమల పెన్నిధి. పారిశ్రామిక రాజధానిగా వన్నెకెక్కింది. ఐటీ రంగాన్ని చూస్తే ఇదంతా వృథా అనిపిస్తుంది. అప్పుడప్పుడూ తాటాకు చప్పుళ్లలాటి ప్రకటనల హోరు తప్పితే ఈ రంగం ఇప్పటికే ముసుగు తన్నేసింది. ఐటీఐఆర్ మాటలో తీపి బాగుంది కానీ నిజం దీనంగా కనిపిస్తోంది. కొత్త పరిశ్రమలు రాక, ఉద్యోగాలు లేక సిస్టమ్ షట్‌డౌన్ అయ్యే కష్టం వెంటాడుతోంది. సాక్షి,విశాఖపట్నం: వైజాగ్ ఐటీ.. వెరీ పిటీ! సాఫ్ట్వేర్ రంగం నిపుణులు తేలిగ్గా చేసే వ్యాఖ్య ఇది! చేదనిపించినా కాదనలేని వాస్తవం ఇది! ఐటీ రంగంలో రెండోరాజధానిగా కీర్తి బాగుంది కానీ కళ్లెదుట నిజం కలవరం కలిగిస్తోంది. కనీస వసతులు లేక, ప్రభుత్వం కనికరించక, కాస్తయినా ప్రోత్సాహం కానరాక విశాఖలో ఐటీ నానాటికీ వెనకడుగు వేస్తోంది. మొత్తం 70 కంపెనీలు, నాలుగు ఎస్ఈజెడ్లుంటే అందులో పాతిక శాతమైనా పనిచేయడం లేదంటే పరిస్థితి అర్థమవుతుంది. అసలు డొల్ల విశాఖలోని 70 ఐటీ కంపెనీల్లో పూర్తిస్థాయిలో పనిచేస్తున్నవి 20 లోపే. నాలుగుఎస్ఈజెడ్ల్లో రెండు మాత్రమే పనిచేస్తుండగా,మిగతావి నిరుపయోగంగా మారాయి. దీనివల్ల కార్యకలాపాలు జరగక 2014-15నాటికి విశాఖలో రూ.5 వేల కోట్లదాటాల్సి ఉన్న టర్నోవర్ రూ. 1450 కోట్ల వద్దే ఆగిపోయింది. ఉద్యోగాలు 70వేలు దాటాల్సి ఉండగా, కేవలం 10,200 మందికే ఉపాధి లభిస్తోంది. గడిచిన అయిదేళ్లలో నాలుగైదు పెద్ద కంపెనీలు మినహా మరేం రాలేదు. కొత్త ఐటీ కంపెనీలు విశాఖకు రావాలంటే ప్రత్యేకంగా ప్రభుత్వం కృషి చేయాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని ఐటీ ప్రమోటింగ్ స్టాఫ్‌గా ఇక్కడ నియమించాలి. అది జరగడం లేదు. ఐటీ అభివృద్ధి చెందాలంటే అనుబంధ సౌకర్యాలూ ముఖ్యం. అత్యున్నత విద్యా, వైద్య, రవాణా సౌకర్యాలు ప్రధానం. కానీ నగరంలో వీటి అభివృద్ధి అంతంతే. విదేశీ క్లయింట్లు విశాఖకు రావాలంటే సరయిన విమాన సౌకర్యమూ లేదు. ఐటీ రంగ అభివృద్ధికి నిరంతరం విద్యుత్ అత్యవసరం. కాని విశాఖలో మాత్రం కంపెనీలకు కేటాయించిన విద్యుత్ కోటాను మించి వాడితే యూనిట్‌కు రూ.50 వంతున వసూలు చేస్తున్నారు. గతేడాది విద్యుత్‌కోతతో ఐటీ పరిశ్రమలు విలవిలలాడాయి. ఈసారీ అదే పరిస్థితి ఉంది. నగరానికి దూరంగా ఉన్న ఐటీ ఎస్‌ఈజెడ్‌ల్లో పనిచేసే కంపెనీ ఉద్యోగుల రాకపోకలకు కనీస రవాణా వ్యవస్థ లేదు. ఇక ఐటీఐఆర్ సంగతే సందేహంగా ఉంది. అవసరమైతే 10 వేల ఎకరాలు ఉన్నా వాటిని మాస్టర్‌ప్లాన్‌లో గుర్తించకపోవడంతో ఐటీఐఆర్ సాధ్యమా అనిపిస్తోంది. రుషికొండలో మొత్తం మూడు ఐటీ సెజ్‌లలో కనీస సౌకర్యాల అభివృద్ధి కోసం హైదరాబాద్ తరహాలో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణానికి 2012 జనవరిలో ఐటీ శాఖ మంత్రి పొన్నాల శంకుస్థాపనచేశారు. ఇంకా అది మొదలవలేదు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా రెండో సెంటర్‌కు రూ. 23 కోట్లు మంజూరు చేసింది. దీనికి భూమి మంజూరు కాలేదు. ఇదా ప్రోత్సాహం? కొత్త ఐటీ కంపెనీలు రావాలన్నా , ఉన్నవి సక్రమంగా పనిచేయాలన్నా ఎస్ఈజెడ్లను ప్రభుత్వం వెంటనే డీ-నోటిఫై చేయాలి. లేకపోతే కంపెనీలకు రుణాలు కూడా పుట్టక మూతపడే పరిస్థితి ఎదురవుతుంది. వీటిని డీ నోటిఫై చేస్తేనే విశాఖలో ఐటీకి మనుగడ . ఈపీడీసీఎల్ విద్యుత్ కోతలు తీవ్రంగా విధిస్తోంది. రాష్ట్రప్రభుత్వం తరఫున గతకొన్నేళ్లుగా ఏ ఒక్క ఉన్నతాధికారికూడా ఇక్కడకురాలేదు. అభివృద్ధి ఇంకెలా సాధ్యమవుతుంది? - ఓ.నరేష్కుమార్, రుషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు -
ఎన్నికల తర్వాత కొత్త కొలువుల జోరు
ముంబై: వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో కొత్త ఉద్యోగాల జోరు పెరుగుతుందని నిపుణులంటున్నారు. ఈ ఏడాది కొత్త ఉద్యోగాలివ్వడంలో కంపెనీలు అనేక సమస్యలు ఎదుర్కొన్నాయని, అయితే వచ్చే ఏడాది జూన్‌కల్లా ఎన్నికలు పూర్తయ్యేసరికి హైరింగ్ జోరు పెరుగుతుందని వివిధ మానవ వనరుల సేవలందించే కంపెనీలంటున్నాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత హైరింగ్ ఊపందుకుంటుందని ప్రముఖ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ సంస్థ, మైకేల్ పేజ్ ఇండియా డెరైక్టర్ నీలయ్ ఖండేల్వాల్ చెప్పారు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో కొత్త ఉద్యోగాలు తగ్గాయని పేర్కొన్నారు. కలసి వస్తోన్న అమెరికా రికవరీ ఏ రంగంలో కూడా ఉద్యోగాల కోత, కొత్త ఉద్యోగాలు నిలిపేయడం వంటి అంశాలు చోటు చేసుకోలేదని టాలెంట్ స్ప్రింట్ సీఈవో, ఎండీ శంతన్‌ను పాల్ చెపారు. రిటైల్, ఆతిధ్య, విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో హైరింగ్ ఓ మోస్తరుగా ఉందని పేర్కొన్నారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్లు, బీమా, మౌలిక, రియల్టీ, నిర్మాణ రంగాల్లో హైరింగ్ తగ్గిందని వివరించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న సూచనలు కనిపిస్తుండటంతో ఎగుమతులకు సంబంధించిన అన్ని రంగాల్లో హైరింగ్ పుంజుకోవచ్చని పేర్కొన్నారు. కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యోల్బణం వంటి అంశాల్లో మెరుగుదల ఉంటే, 6-12 నెలల్లో దేశీయంగా అన్ని రంగాల్లోనూ హైరింగ్ జోరు పెరుగుతుందని వివరించారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమనం, వినియోగదారులు కొనుగోళ్లు తగ్గడం, మార్కెటింగ్ కార్యకలాపాలు జోరుగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఆటో మొబైల్ రంగంలో హైరింగ్ తగ్గిందని గ్లోబల్‌హంట్ ఎండీ సునీల్ గోయెల్ చెప్పారు. 2 లక్షల ఉద్యోగాల కోత ఆర్థిక వృద్ధి మందగమనం కారణంగా గత 8-10 నెలల్లో సంఘటిత రంగాల్లో 2 లక్షల ఉద్యోగాలు పోయాయని ర్యాండ్స్టడ్ ఇండియా సీఈవో మూర్తి కె. ఉప్పలూరి చెప్పారు. అయితే అధ్వాన పరిస్థితులు ముగిశాయని, రానున్న నెలల్లో వ్యాపారం పుంజుకునే అవకాశాలున్నాయని వివరించారు. ఆర్ అండ్ డీలో 2 లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో పరిశోధన, అభివృద్ధి రంగంలో 2 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయని అంతర్జాతీయ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ జిన్నోవ్ పేర్కొంది. అంతర్జాతీయ అగ్రశ్రేణి 500 కంపెనీల్లో 228 వరకూ భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించడమే దీనికి కారణమని వివరించింది. 4 రూ. 34,647 కోట్ల ప్రాజెక్టులకు ఫాస్ట్‌ట్రాక్‌లో అనుమతి న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం రూ. 34,647 కోట్ల విలువైన ప్రాజెక్టులకు చకచకా అనుమతులు మంజూరుచేసేలా నడుంబిగించింది. విద్యుత్ రంగంలో రూ. 26,700 కోట్ల విలువైన, పెట్రోలియం-సహజవాయువు రంగాల్లో రూ. 7,947 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పలురకాల క్లియరెన్సులను ఫాస్ట్‌ట్రాక్‌లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంది. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని పెట్టుబడులపై ఏర్పాటైన క్యాబినెట్ కమిటీ(సీసీఐ) వీటికి ఆమోదముద్రవేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కొన్నింటికి ఆమోదముద్ర, మరికొన్ని ప్రాజెక్టులకు తక్షణం పర్యావరణ ఇతరత్రా అనుమతులు లభించేలా తగిన నిర్దేశాన్ని సీసీఐ చేసినట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. విశాఖపట్నంలో ప్రతిపాదిత హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ విద్యుత్ ప్రాజెక్టు, పశ్చిమ బెంగాల్లో సాగర్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. -
కుర్రకారు.. కొత్త కొలువులను సృష్టిస్తారు!
అఖిలేశ్, సందీప్‌లు స్నేహితులు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఎంబీఏలో చేరారు. అది పూర్తయిన కొద్ది రోజులకు ఇద్దరికీ మంచి కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. ఆ సమయంలో ఇద్దరూ తమ కెరీర్‌పై అభిప్రాయాలను ఇలా పంచుకుంటున్నారు.. అఖిలేశ్: జాబ్ ఆఫర్ బాగుంది. మరో ఆలోచన చేయకుండా వెంటనే జాబ్‌లో చేరిపోతా. ఉద్యోగం చేస్తూనే ఉన్నత ఉద్యోగాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తా. అంతేగానీ కొత్త కంపెనీ పెట్టి చేతులు కాల్చుకోలేను. సందీప్: ఉద్యోగానికి పరిమితం కావడం నాకిష్టం లేదు. ఎంబీఏ చేస్తున్నప్పుడు నాకొచ్చిన బిజినెస్ ఐడియాపై కొంత వర్క్ చేసి తర్వాత సొంతంగా కంపెనీ పెడదామనుకుంటున్నా. ఆ ఐడియాపై నాకు గట్టి నమ్మకముంది. అఖిలేశ్, సందీప్.. ఇద్దరి ఆలోచనల్లోనూ స్పష్టత ఉంది. అయితే అఖిలేశ్ ఉద్యోగానికే పరిమితం కావాలని భావిస్తుండగా, సందీప్ మరో అడుగు ముందుకేసి 9 టు 5 జాబ్‌కు పరిమితం కాకుండా తనకంటూ ఓ సొంత కలల ప్రపంచాన్ని నిర్మించుకుని, మరో పది మందికి ఉపాధి చూపుతూ పైకి ఎదగాలన్న పరిణితితో కూడిన ఆలోచన చేశాడు. ఆలోచనలే ఆసరాగా: మీరు ఎలా ఆలోచిస్తే అదే విధంగా తయారవుతారు.. బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు.. శక్తిమంతులమనుకుంటే అలానే అవుతారన్న వివేకానందుని మాటలను నేటి యువతరం ఒంటబట్టించుకుంటోంది. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంసీఏ, ఎంబీఏ.. చేసే కోర్సు ఏదైనా.. విద్యార్థుల చివరి లక్ష్యం మెచ్చిన కంపెనీలో నచ్చిన వేతనంతో కొలువును పొందడమనే ఆలోచన నుంచి మనమే పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎందుకు చేరకూడదు అని ఆలోచించే వారి సంఖ్య అధికమవుతోంది. వినూత్న ఆలోచనలు చేస్తూ ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ వైపునకు అడుగులు వేసే వారు ఎక్కువవుతున్నారు. స్వయంగా కంపెనీలు ఏర్పాటు చేసి, వ్యాపారానికి కొత్త నిర్వచనాలు ఇస్తున్నారు. ఓ తాజా అధ్యయనం ప్రకారం దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ బిజినెస్ విద్యార్థుల్లో 26 శాతం మంది అదే విధంగా ఐటీ, ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 16 శాతం మంది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దిశగా అడుగులు వేస్తున్నారు. కాలేజీ కేరాఫ్ ఇన్నోవేషన్: నిన్నామొన్నటి వరకు కాలేజీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్పై ఎక్కువగా దృష్టిసారించేవి. సాధ్యమైనన్ని పెద్ద కంపెనీలు ప్రాంగణ నియామకాలు జరిపేలా ప్రయత్నించేవి. విద్యార్థులు కూడా ఏ కాలేజీలో ఎక్కువగా క్యాంపస్ రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయో చూసుకొని చేరుతుండేవారు. ఇప్పుడు కళాశాలల యాజమాన్యాల ఆలోచన తీరులో మార్పు వచ్చింది. క్యాంపస్ నియామకాలతో పాటు విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. విద్యార్థుల మెదళ్లో దాగున్న సృజనాత్మక ఆలోచనల్ని వెలికితీసి, వారిని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఐఐటీలు, ఐఐఎంలు, నిట్ల వంటి ఉన్నత విద్యా సంస్థల దగ్గర నుంచి చిన్న నగరాల్లో నడిచే కళాశాలల వరకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఓ విద్యార్థి వద్ద మంచి ఆఠటజ్ఛీటట ఐఛ్ఛ్చీ ఉంది. అయితే ఆ ఆలోచనను విజయవంతంగా అమలు చేయాలంటే ఏం చేయాలి? దేనితో మొదలుపెట్టాలి? ఎలా ముందుకెళ్లాలి? వంటి ప్రశ్నలు సదరు విద్యార్థిని గందరగోళానికి గురిచేస్తాయి. ఇలాంటి వారికి ఆసరాగా ఉండేందుకు ప్రత్యేక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగాలు తోడ్పడుతున్నాయి. ఉదాహరణకు ఐఐటీ-పాట్నా.. విద్యార్థులను ఎంటర్‌ప్రెన్యూర్స్ దిశగా ప్రోత్సహించేందుకు ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్’ ఏర్పాటు చేసింది. దీని ఆధ్వర్యంలో విజయవంతమైన పారిశ్రామికవేత్తలతో గెస్ట్ లెక్చర్లు, వర్క్‌షాప్‌లు, బిజినెస్ ప్లాన్ కాంపిటేషన్స్ వంటివి జరుగుతున్నాయి. ఐఐఐటీ-హైదరాబాద్ క్యాంపస్‌లో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీఐఈ) నడుస్తోంది. ఇది టెక్నాలజీకి సంబంధించి సృజనాత్మక వ్యాపార ఆలోచనలున్న వారిని ప్రోత్సహిస్తోంది. ఇంక్యుబేటర్ ద్వారా అండగా ఉంటోంది. విద్యార్థుల ఆలోచనలను సానపట్టి వారి కలల్ని నిజం చేసేందుకు స్వయం (wayam), ఆకాశ్ (Akash).. ఇలా వివిధ పేర్లతో కళాశాలల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగాలు ఏర్పాటవుతున్నాయి. ఒకే విధమైన ఆలోచనలు, ఆశయాలు ఉన్న విద్యార్థులను ఒకచోటకు చేర్చి, సంయుక్తంగా ప్రాజెక్టును చేపట్టేలా చేసేందుకు, వారిని భవిష్యత్ వ్యాపార భాగస్వాములుగా మార్చేందుకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగాలు దోహదం చేస్తున్నాయి. అప్లికేషన్ స్కిల్స్ ప్రధానం: తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను వాస్తవంగా ఎలా ఉపయోగించాలో ప్రాక్టికల్స్ ద్వారా తెలుసుకోవాలి. అలాంటప్పుడు కొత్త ఆలోచనలతో ఆవిష్కరణలు రూపొందుతాయి. ఇవి విద్యార్థులను ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మార్చడానికి దోహదం చేస్తాయి. అందుకే విద్యా సంస్థలు విద్యార్థుల్లో అప్లికేషన్ స్కిల్స్‌ను పెంపొందించేందుకు టెక్ ఫెస్ట్‌లు వంటివి నిర్వహిస్తున్నాయి. వీటిలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు. ఇలాంటి పోటీల్లో విజేతలు కావడం వల్ల వచ్చే ఆత్మవిశ్వాసం ఎంటర్‌ప్రెన్యూర్స్ దశకు మార్గాన్ని సుగమమం చేస్తాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలంటే అవసరమయ్యే స్కిల్స్ స్వయం ప్రేరణ (Self motivation) ఆత్మవిశ్వాసం (self confidence) సమయపాలన (Time management) భావ వ్యక్తీకరణ (communication) నాయకత్వం (Leadership) సృజనాత్మకత (Creativity) దేన్నయినా అమ్మగలిగే నేర్పు (Be able to sell anything) వైఫల్యాల నుంచి నేర్చుకోవడం (Learning from failures) అవకాశాలు-అపారం: అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్.. అభివృద్ధి చెందిన దేశం స్థాయికి చేరాలంటే పది కోట్ల ఉద్యోగాల సృష్టి జరగాల్సి ఉంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రధాన మార్గం. ప్రస్తుతం చాలా రంగాల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు అనుకూల వాతావరణం ఉంది. ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్ రంగాలు.. డ్రీమ్ సెక్టార్స్‌గా వెలుగొందుతున్నాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు అవకాశమున్న విభాగాలు: ఒకటో స్థాయి: క్రాప్ ప్రొడక్షన్, ప్లాంటేషన్, లైవ్‌స్టాక్, ఫిషింగ్, మైనింగ్, క్వారీయింగ్ తదితరాలు. రెండో స్థాయి: హోటల్స్, రెస్టారెంట్స్, హోల్‌సేల్ అండ్ రిటైల్ ట్రేడ్ వంటివి. మూడో స్థాయి: మ్యాన్యుఫాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై వంటివి. నాలుగో స్థాయి: ఐటీ, ఫైనాన్స్, ఇన్స్యూరెన్స్ అండ్ బిజినెస్ సర్వీసెస్, కన్స్ట్రక్షన్, సోషల్ అండ్ పర్సనల్ సర్వీసెస్, సప్లై చైన్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ తదితరాలు. అందుబాటులో కోర్సులు: విద్యార్థులను ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దేందుకు బి-స్కూల్స్, ఉన్నత విద్యా సంస్థలు వివిధ కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి. వీటిలో పూర్తిస్థాయి ఎంబీఏ ప్రోగామ్లతో పాటు సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా వంటి కోర్సులు ఉన్నాయి. విద్యార్థుల్లో వ్యాపార నైపుణ్యాలను విస్తృతం చేసేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. కొన్ని సంస్థలు- అందిస్తున్న కోర్సులు: ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఈడీఐ).. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్- బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సును ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు డిప్లొమా ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లను అందిస్తోంది. వెబ్సైట్: www.ediindia.org కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తితో పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డవలప్మెంట్.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు సంబంధించి వివిధ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్, కెమికల్స్ తదితర విభాగాల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లను ఏర్పాటు చేస్తోంది. వెబ్సైట్: www.niesbud.org అమిటీ బిజినెస్ స్కూల్ (ఏబీఎస్).. ఎంబీఏ-ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (రెండేళ్లు) కోర్సును ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.amity.edu కోర్సులో ఏం బోధిస్తారు: ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోసెస్. ఇన్నోవేషన్ ఇన్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజ్. బిజినెస్ మోడల్స్. ప్రొడక్ట్ డవలప్మెంట్, డిజైన్. మార్కెటింగ్, ఎంటర్ప్రెన్యూరియల్ ఫైనాన్స్. బిజినెస్ కమ్యూనికేషన్. ఎమర్జింగ్ బిజినెస్ సెక్టార్స్ అండ్ న్యూటెక్నాలజీస్. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ వంటి అంశాలను బోధిస్తారు. రిస్క్ ఉన్నచోటే విజయం ఉంటుంది! ఇంటర్, ఇంజనీరింగ్.. ఆపై పుణెలోని సింబయోసిస్ బిజినెస్ మేనేజ్మెంట్ సంస్థలో ఎంబీఏ పూర్తిచేశా. తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, విప్రో సంస్థల్లో పనిచేశా. 9 టు 5 జాబ్‌కు పరిమితం కాకుండా నాకంటూ ఓ సొంత కలల ప్రపంచాన్ని నిర్మించుకోవాలన్న ఉద్దేశంతో నెలకు రూ.65 వేల వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని బయటకు వచ్చేశా. సొంతంగా ఏదైనా బిజినెస్ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలుసుకున్న కొందరు వేలకు వేలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని కోరికోరి కష్టాలు తెచ్చుకోవడమెందుకని అన్నారు? అయితే ధైర్యం కోల్పోకుండా 2010లో హైదరాబాద్‌లో ‘ఎక్స్‌ప్రెస్ గ్రీన్ పేపర్ బ్యాగ్స్’ కంపెనీని ప్రారంభించా. మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అయిన భర్త, కుటుంబ సభ్యుల అండదండలు కొండంత ధైర్యాన్నిచ్చాయి. ప్రస్తుతం 18 మంది ఉద్యోగులతో పేపర్ బ్యాగ్స్‌కు బ్రాండ్ ఇమేజ్ను జోడించేలా వైవిధ్య భరితంగా కస్టమర్ అవసరాలకు తగినట్లు బ్యాగ్స్‌ను తయారు చేస్తున్నాం. ఇందులో ఒకటి బర్త్‌డే, మ్యారేజ్‌లకు, కార్పొరేట్ ఈవెంట్లకు బ్యాగ్‌పై ఫొటో వచ్చేలా చేయడం. ఇలా లామినేటెడ్, క్రా్ఫ్ట్, ప్రీమియం, గ్రోసరీ తదితర బ్యాగులు తయారు చేస్తున్నాం. బయట మార్కెట్లో ఒకే రకమైన బ్యాగులు అమ్మే షాపులు పది ఉంటాయి.. అదే మా కంపెనీ ఔట్లెట్లో అయితే పది రకాల బ్యాగులు ఒకేచోట దొరుకుతాయి. అందుకే వివిధ వర్గాల వారిని ఆకట్టుకోగలుగుతున్నాం. పూర్తిగా ప్లాస్టిక్ సంచులు నిషేధం అమల్లో ఉన్న ఆస్ట్రేలియా నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయి. సోనీ ఇండియా, కోకాకోలా వంటి పెద్ద సంస్థలు మా క్లయింట్లుగా ఉన్నాయి. త్వరలో పూర్తిస్థాయి ‘ఈ-కామర్స్’ కార్యకలాపాలను ప్రారంభిస్తా. మొదట్లో పేపర్ బ్యాగ్స్ తయారీ కంపెనీ పెడతానని చెబితే కొందరు పెదవి విరిచారు. రిస్క్ చేస్తున్నావేమో.. ఆలోచించుకో! అన్నారు. అయితే కొత్త ఆలోచన ఉన్నచోట రిస్క్ ఉంటుంది.. రిస్క్ ఉన్నచోట ఉన్నత విజయాలు సాకారమవుతాయి.. కదా! నవతరం విద్యార్థులు దీన్ని గుర్తించాలి. చాలా మంది కంపెనీ అవసరాలకు సరిపడా రుణాలు దొరకడం కష్టమంటారు. అయితే మనం ఎంచుకున్న ప్రాజెక్టు సరైంది అయితే రుణాలు దొరకడం కష్టం కాదు. నా వరకైతే బ్యాంక్ మేనేజర్.. మేము తయారు చేసిన ప్రోటోటైప్ బ్యాగులు చూసి.. ‘పేపర్‌తో ఇలాంటి బ్యాగులు కూడా తయారు చేయొచ్చా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కంపెనీకి ప్రారంభ పెట్టుబడికి అవసరమైన రుణాన్ని వెంటనే మంజూరు చేశారు. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (అలెప్)లో ఔత్సాహికులకు పేపర్ బ్యాగ్స్ తయారీలో శిక్షణ ఇస్తున్నాను. ‘ అదేంటి? నీకు నీవే కాంపిటేటర్స్ని తయారు చేసుకుంటున్నావు’ అని కొందరు అంటుంటారు. దీనికి నేను.. ‘మరో పది మంది పేపర్ బ్యాగ్స్‌ను తయారు చేయడం ప్రారంభిస్తే ముడిసరకు సేకరణ ఖర్చులు తగ్గుతాయి. తద్వారా తక్కువ ధరకే బ్యాగులు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. మార్కెట్ విసృ్తతమవుతుంది. మరిన్ని ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి కదా’ అని సమాధానం చెబుతుంటా. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు అవకాశాలు పెరిగాయి. ఏర్పాటు చేసే కంపెనీ చిన్నదైనా, పెద్దదైనా ఆలోచన సరైంది అయి, కష్టపడి పనిచేస్తూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం తథ్యం. ఆల్ ది బెస్ట్! -వసంత చిగురుపాటి, ఫౌండర్, ది పేపర్బ్యాగ్ షాప్, హైదరాబాద్ -
ఆజన్మం: వజ్రం పళ్లు తోముతుందా?
వజ్రం కూడా డైనింగ్ హాల్‌కు వస్తుందా? పాలకోసం అందరిలా వరుసలో నిలబడుతుందా? ఆంజనేయులు మీసాలు చూసి నాలాగే భయపడుతుందా? అప్పటికి రెసిడెన్షియల్ స్కూల్లో చేరి రెండో రోజు. మేడ్చల్ నుంచి వచ్చానన్న కారణంగా శ్రీశైలం ఫ్రెండయ్యాడు. కొత్త బడిలోకో, కొత్త ఉద్యోగంలోకో అడుగుపెట్టగానే, తక్షణం ‘ఒకరు’ ముందు పరిచయం అవుతారు. ఆ పరిచయానికి ఏవైనా కారణాలుండొచ్చు. అలాగని అవే కారణాలున్నవారు పరిచయం కాకపోవచ్చు కూడా! అంటే, ఆ ఒకరిలో ఉండే స్వాభావికమైన గుణమేదో వెంటనే దగ్గరయ్యేలా చేస్తుంది. అయితే, ఈ తక్షణ స్నేహం తర్వాతి కాలంలో కూడా నిలబడుతుందని చెప్పలేం. అది కేవలం ఆ పరిస్థితులకు మనం అలవాటు పడటానికి ఉపకరిస్తుంది. చాలాసార్లు అంతవరకే ఆ స్నేహపు ప్రయోజనం. అలా శ్రీశైలం స్నేహం నేను కీసరగుట్ట గురుకుల పాఠశాలలో తొలి బెరుకులు పోగొట్టుకోవడానికి పనికొచ్చింది. శివరామిరెడ్డి సార్ ఊతపదం ఏమిటి? అప్పల్రాజు సార్ క్వార్టర్లో జామచెట్టు కాయలు ఎలా ఉంటాయి? పిల్లలు తెంపిన సీతాఫలాలు ఏ పొదల మాటున మాగేస్తారు? నర్సు మేడమ్ దృష్టిలో పడేందుకు పీఈటీ సార్ ఎలా నవ్వుతాడు? ఇట్లాంటివేవో విడతలుగా చెప్పాక, ఒకబ్బాయిని చూపించి, ‘కీసరగుట్ట వజ్రం’ అన్నాడు శ్రీశైలం. ‘‘ఆటల్లో ఫస్టు; చదువులో ఫస్టు.’’ ఐలేశ్వర్ నాకంటే ఓ క్లాసు జూనియరే! కానీ నాకన్నా బలంగా ఉంటాడు. నాకన్నా ఎత్తుగా ఉంటాడు. పైగా, నాలా ఎనిమిదిలో కాకుండా ఐదో తరగతిలోనే అక్కడ చేరడం వల్ల, స్కూల్ పరంగా నాకన్నా సీనియర్ కూడా! ఒక వజ్రపు ఉనికి అంటూ తెలిసింతర్వాత, వందమందిలో ఉన్నా అది కనబడుతుంది. అలా నేను ఎక్కడికెళ్లినా ఐలేశ్వర్ ఇట్టే ఫోకస్ అయ్యేవాడు. ప్రేయర్లో కనబడేవాడు; స్పోర్ట్స్ పీరియడ్‌లో కనబడేవాడు; ఒంటికి తువ్వాలు చుట్టుకుని కూడా కనబడేవాడు. కానీ అలా చూడటంలో ఒక నిరాశ ఏదో నన్ను కమ్మేసేది. వజ్రం కూడా డైనింగ్ హాల్‌కు వస్తుందా? పాలకోసం అందరిలా వరుసలో నిలబడుతుందా? ఆంజనేయులు మీసాలు చూసి నాలాగే భయపడుతుందా? నేనూ పళ్లు తోముకుని, అతడూ పళ్లు తోముకుని, నోరు నిండిపోయినప్పుడు ఎడమవైపు పెదాల మూల నుండి జారిపోయే నురగ ఏర్పరిచే చార ఇద్దరికీ ఒకటే అయినప్పుడు అతడు నాకన్నా గొప్పవాడు ఎలా అవుతాడు? వజ్రాన్ని నాతో సమానంగా నిలబెట్టే, ఇంకా చెప్పాలంటే నాతో సమానంగా కిందికి దిగజార్చే ఈ దైహిక కార్యక్రమాల మీద నాకు కోపం వచ్చేది. ఆ వజ్రం వాటిని నిరసించాలని ఆశపడేవాడిని. కానీ ఆ వజ్రం గట్క టిఫిన్ రోజు ఆబగా తింటోందే! మల్లయ్య తుడిచి వెళ్లాక ఉండే టేబుల్ మీది తేమను కూడా పట్టించుకోవడం లేదే! అలా ఆకాశంలోంచి వచ్చి, ఇలా వెళ్లిపోతేనేగానీ లేదంటే అతడు వజ్రం ఎలా అవుతాడు? అందుకే తను నాకు కేవలం ఐలేశ్వర్గానే మిగిలిపోయాడు. చాలా ఏళ్ల తర్వాత, ఒక చెన్నై పారిశ్రామికవేత్త గురించి పేపర్లో చదివాను. ఆయన కష్టపడి పైకొచ్చాడు; అనూహ్యమైన విజయాలేవో సాధించాడు; ఇంకా తన అనుభవాలేవో చెప్పాడు. అవేవీ నన్ను ఆకట్టుకోలేదుగానీ, ‘పెరుగన్నంలో ఆవకాయ వేసుకుని తినడం ఇష్టం’ అన్నాడు. అదిగో, అది నన్ను పట్టేసింది. ఆయన గొప్పవాడే కావొచ్చు; కానీ అంతదాకా మా ఇద్దరి మధ్యన ఏదో పరాయితనం ఉండింది. ఈ మామిడికాయ పెరుగన్నం మాట ఎత్తేసరికి, ఆయన్ని నాలోకి తీసుకోవడానికి అడ్డంకిగా ఉన్నదేదో కరిగిపోయింది. అజయ్ దేవ్గన్లాంటి వంకరపళ్లు నాక్కూడా ఉన్నాయి కాబట్టి, ఇద్దరమూ ఒకటే అనుకునేవాణ్ని. దేహానికి మించి కూడా మనిషి ఉంటాడని నాకు ఎప్పటికోగానీ అర్థం కాలేదు. ‘వజ్రం’ ఫస్టు వస్తుంది; మరొకటి రాదు. ఆవకాయ తిన్నంత మాత్రాన మనం మరేదో కాలేము. పికాసోకి మోషన్స్ అయ్యాయంటే, అది దేహం కల్పించే బరువు. మనుషులు వదిలి వెళ్లగలిగే గుణాత్మకమైన విలువని నేను శరీర పరిమితి కోణంలో అర్థం చేసుకుంటూ, అసలైన అర్థాన్ని అందుకోవడంలో విఫలమయ్యాను. ఒకప్పుడు, ఒకరికి మహత్వం ఆపాదించిన తర్వాత, వారు మామూలుగా ఉండటం నచ్చేదికాదు. దానికి విరుద్ధం గా, మహత్వం అనేది మామూలైపోయినవాళ్లు మామూలు మనుషుల్లా వ్యవహరించడం నచ్చుతోందిప్పుడు. - పూడూరి రాజిరెడ్డి -
ఉద్యోగాలను భర్తీ చేయొద్దు..
న్యూఢిల్లీ: ప్రణాళికేతర వ్యయాన్ని పది శాతం తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పొదుపు మంత్రం పఠిస్తోంది. అందులో భాగంగా.. అన్ని మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ విభాగాలు కొత్త ఉద్యోగాలు సృష్టించరాదని, ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సైతం భర్తీచేయరాదని ఆదేశాలు జారీచేసింది. కొత్త ఉద్యోగాలపై సంపూర్ణ నిషేధం ఉంటుందని ఆర్థికశాఖ బుధవారం జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. అలాగే ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను.. చాలా అరుదైన, అనివార్యమైన పరిస్థితుల్లో తప్పితే భర్తీ చేయటం జరగదని పేర్కొంది. ఖరీదైన ఎగ్జిక్యూటివ్ తరగతిలో అధికారుల విమాన ప్రయాణాలపై బుధవారం నుంచి నిషేధం విధించింది. అయితే విదేశీ ప్రయాణాలకు ఈ ఆంక్షలు వర్తించవని మినహాయింపునిచ్చింది. కానీ.. అత్యంత అవసరమైన, అనివార్యమైన అధికారిక కార్యక్రమాలకు మాత్రమే విదేశీ ప్రయాణాలను పరిమితం చేయాలని ప్రతి శాఖ, విభాగం కార్యదర్శికి నిర్దేశించింది. అలాగే.. విదేశీ ప్రయాణాలకు వెళ్లే ప్రతినిధుల బృందం సభ్యుల సంఖ్యను అత్యంత కనిష్టానికి తగ్గించాలని స్పష్టం చేసింది. అత్యంత అవసరమైన సదస్సులు, సమావేశాలను మాత్రమే నిర్వహించాలని చెప్పింది. విదేశాల్లో ప్రదర్శనలు, సదస్సులు, సమావేశాలను నిర్వహించటాన్ని.. వాణిజ్య ప్రోత్సాహ ప్రదర్శనలకు మినహా అనుమతించబోమని తెలిపింది. అలాగే ఫైవ్ స్టార్ హోటళ్లలో సదస్సులు, సమావేశాలను నిషేధిస్తున్నట్లు స్పష్టంచేసింది. తొలగించిన వాహనాల స్థానంలో కొత్త వాటిని తీసుకురావటం మినహా.. కొత్త వాహనాల కొనుగోళ్లనూ నిషేధిస్తున్నట్లు చెప్పింది. ఈ పొదుపు చర్యలు ఎయిమ్స్, ఆల్ ఇండియా రేడియో వంటి స్వయం ప్రతిపత్తిగల సంస్థలకు కూడా వర్తిస్తాయని ఆర్థికశాఖ స్పష్టంచేసింది. ఆయా శాఖలకు, సంస్థలకు బడ్జెట్లో చేసిన కేటాయింపులకు మించి కొత్తగా ఎలాంటి హామీలూ ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. ఈ పొదుపు చర్యలను తప్పనిసరిగా పాటించేలా చూడాల్సిన బాధ్యత ఆయా శాఖల కార్యదర్శులదేనని, సంబంధిత శాఖల ఆర్థిక సలహాదారులు పొదపు చర్యలపై ప్రభుత్వానికి త్రైమాసిక నివేదికలు అందించాలని నిర్దేశించింది. ద్రవ్యలోటును 4.8శాతానికి పరిమితం చేయటం లక్ష్యం 2013-14 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి)లో 4.8 శాతానికే పరిమితం చేయాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పొదుపు చర్యలు చేపడుతోంది. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచీ ప్రభుత్వం ఇలాంటి చర్యలు ప్రవేశపెడుతోంది. గత ఏడాది నవంబర్‌లో కూడా ఇలాంటి పలు చర్యలు అమలు చేసింది. ప్రభుత్వ పనితీరు సామర్థ్యంపై ప్రభావం చూపకుండానే ద్రవ్య క్రమశిక్షణను ప్రోత్సహించటానికి ఇలాంటి చర్యల ఉద్దేశమని, ప్రస్తుత ద్రవ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వ్యయాన్ని హేతుబద్ధీకరించటం, అందుబాటులో ఉన్న వనరులను పొదుపుచేయటం అవసరమని ఆర్థికశాఖ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును జీడీపీలో 5.1 శాతంగా నిర్దేశించుకోగా ప్రభుత్వం చేపట్టిన పొదుపు చర్యల ఫలితంగా దానిని 4.9 శాతానికి మాత్రమే పరిమితం చేయగలిగారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 4.8 శాతం మించకుండా చూడాలని తాను లక్ష్మణరేఖ గీసినట్లు ఆర్థికమంత్రి పి.చిదంబరం ఇటీవల పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.16.65 లక్షల కోట్లు బడ్జెట్ అంచనా వ్యయంగా, అందులో రూ.11.09 లక్షల కోట్లు ప్రణాళికేతర వ్యయంగా చూపారు.