
న్యూఢిల్లీ: మారుతున్న టెక్నాలజీల కారణంగా భవిష్యత్తులో కొత్త కొత్త ఉద్యోగాలు రానున్నాయని ఒక నివేదిక పేర్కొంది. రానున్న రెండేళ్లలో ఉద్యోగ మార్కెట్లో మందగమనం చోటు చేసుకుంటుందని ఫిక్కి–నాస్కామ్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ తాజా నివేదిక పేర్కొంది. కంపెనీలు తమ వ్యాపార మోడళ్లను పునర్వ్యవస్థీకరించడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలుండటమే దీనికి కారణమని పేర్కొంది. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే...
♦ ప్రస్తుతం భారత ఉద్యోగ మార్కెట్ సంధి దశలో ఉంది.
♦ ప్రపంచీకరణ, పెరుగుతున్న జనాభా, కొత్త కొత్త టెక్నాలజీలు.. భారత ఉద్యోగ మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావమే చూపిస్తాయి.
♦ ప్రస్తుతం అసలు లేని కొత్త ఉద్యోగాలు 2022 కల్లా వస్తాయి. 60 కోట్లుగా ఉండే భారత ఉద్యోగుల్లో దాదాపు 9 శాతం మంది ఈ తరహా కొత్త ఉద్యోగాలు చేస్తారు. అంటే 5.4 కోట్ల కొత్త తరహా ఉద్యోగాలు వస్తాయి.
♦ ప్రస్తుతం 3.8 కోట్లుగా ఉన్న వ్యవస్థీకృత తయారీ, సేవల రంగాల్లోని ఉద్యోగుల సంఖ్య మరో ఐదేళ్లలో 4.6–4.8 కోట్లకు పెరుగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment