కరోనా వైరస్ కారణంగా చాలా కంపెనీలు భారీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొత్తగా ఉద్యోగులను చేర్చుకోవడం లేదా ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ చేయడం గానీ పూర్తిగా ఆపేసాయి. అంతే కాకుండా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించగా.. మరికొన్ని సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ వెసలుబాటు కల్పించి ఇంటికే పరిమితం చేశాయి. కాగా ఇప్పుడు ఉద్యోగులు ఆఫీసుల బాట పడుతున్నారు.. నియామకాల జోరు కూడా పెరుగుతోంది.
నివేదికల ప్రకారం, 2023 డిసెంబర్ చివరి నాటికి కొత్త ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందని, ఇప్పటికే ఖాళీ ఉన్న పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయడానికి కంపెనీలు సన్నద్ధమవుతాయని తెలుస్తోంది. నౌకరి హైరింగ్ అవుట్ లుక్ (Naukri Hiring Outlook) రూపొందించిన ఒక నివేదికలో 1200ల కంటే ఎక్కువ నియామక సంస్థలు, కన్సల్టెంట్స్ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి: భారత్ ఎన్‌సీఏపీ ప్రారంభం నేడే.. దీనివల్ల ఉపయోగాలెన్నో తెలుసా?
రానున్న రోజుల్లో దాదాపు 92 శాతం నియామకాలు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. ఇందులో కూడా కొత్త ఉద్యోగాల సంఖ్య పెరిగే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. బిజినెస్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్ వంటి వాటిలో ఉద్యోగాలు మెండుగా ఉండనున్నాయి.
ఈ ఏడాది చాలా సంస్థలు తమ ఉద్యోగులకు చాలా తక్కువ మొత్తంలో ఇంక్రిమెంట్స్ కల్పించాయి, కాగా మరికొన్ని కంపెనీలు ఇంక్రిమెంట్ ఊసే ఎత్తలేదు. అంతే కాకుండా చాలా రోజుల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటుపడిన ఉద్యోగులను తప్పకుండా ఆఫీసులకు రావాలని బడా సంస్థలు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. ఇవన్నీ కూడా కొత్త ఉద్యోగాలు కల్పించడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment