Naukri
-
ఏఐ వచ్చా.. వెంటనే ఉద్యోగం.. జీతం ఎంతంటే..
ఏఐ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి యువత సిద్ధమవ్వాలి. అదే జరిగితే మన దేశం ఏఐ విభాగంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలుస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయని ఉద్యోగస్థులు బయపడుతున్న నేపథ్యంలో తాజా నివేదిక కొంత ఊరట కలిగిస్తుంది. ఏఐతోపాటు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లలో పుష్కలంగా కొలువులు సంపాదించవచ్చని ఏటా 20 లక్షల కంటే ఎక్కువ జీతంతో జాబ్ ఆఫర్ చేస్తున్నాయని నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిపుణులకు జాబ్ ఆఫర్లలో 2024 ఫిబ్రవరి నెలలో 20 శాతం కంటే ఎక్కువ పెరుగుదలే ఉందని తేలింది. నౌక్రీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక ప్రకారం..మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్, స్టాక్ ఏఐ సైంటిస్ట్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత ఉద్యోగాల్లో గతేడాదితో పోలిస్తే ఈసారి 100 శాతం, గత ఫిబ్రవరితో పోల్చుకుంటే 44 శాతం వేతనాలు పెరిగాయి. ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం.. మెట్రో నగరాలతోపాటు నాన్ మెట్రో నగరాల్లో ఎప్పటికప్పుడు మార్కెట్లో వస్తున్న కొత్త ప్రతిభకు డిమాండ్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, ఏఐ విభాగాల్లో రానున్న రోజుల్లో అధికమొత్తంలో కొలువులు రాబోతున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: రిస్క్ అని తెలిసినా అవే అప్పులు చేస్తున్నారు..! ఆందోళనలో ఆర్బీఐ ఫిబ్రవరి 2024లో రాయ్‌పుర్ లాంటి మెట్రోయేతర నగరాల్లో గతేడాది 14 శాతం వృద్ధితో కొత్త ఉద్యోగాలు సృష్టించగా.. సూరత్, జోధ్‌పుర్, గాంధీనగర్‌లు వరుసగా 12శాతం, 10 శాతం, 8 శాతం వృద్ధిని సాధించాయి. 16 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్ పీరియెన్స్ ఉన్న సీనియర్ నిపుణులు గరిష్ట జాబ్ ఆఫర్లను పొందారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఏటా 20 లక్షల కంటే ఎక్కువ జీతం తీసుకునేవారిలో జాబ్ ఆఫర్లు 23శాతం వృద్ధి చెందినట్లు తెలిసింది. -
షాకిచ్చిన గూగుల్..నౌకరి.కామ్ యాప్ మాయం!
భారత్‌లోని ప్రముఖ లార్జెస్ట్ వెబ్సైట్ నౌకరి.కామ్ యాప్ ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించిందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. గూగుల్, భారత్‌లోని యాప్ డెవలపర్ల మధ్య కొంతకాలంగా ప్లే స్టోర్ ఛార్జీల వివాదం కొనసాగుతోంది. భారత్‌లోని కొన్ని కంపెనీలు సర్వీస్ ఛార్జీలు చెల్లించకుండా గూగుల్ ప్లే స్టోర్‌ని వినియోగించుకుంటున్నాయని తెలిపింది. ఆయా సంస్థలు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందేనని, లేదంటే ప్లేస్టోర్ నుంచి సంబంధిత సంస్థల యాప్స్‌లను తొలగిస్తామని ప్రకటించారు. నిబంధనల్ని పాటించాం.. ఈ తరుణంలో ఇన్ఫో ఎడ్జ్ యాజమాన్యంలోని నౌకరి, రియల్ ఎస్టేట్‌కు చెందిన 99 ఎకర్స్ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. ఈ సందర్భంగా గూగుల్ యాప్ బిల్లింగ్ పాలసీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఫిబ్రవరి 9 నుండి తాము గూగుల్ యాప్ విధానాలకు కట్టుబడి ఉన్నామని ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిక్చందానీ గతంలో చెప్పారు. గూగుల్ బకాయిలన్నీ సకాలంలో చెల్లించామని తెలిపారు. భారత్‌లో 10 యాప్స్ తొలగింపు తాజాగా ప్లే స్టోర్ నుంచి యాప్‌ను తొలగించడంపై సంజీవ్ బిక్చందానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కాగా, ఇన్ఫో ఎడ్జ్‌కి చెందిన నౌకరి, 99 ఎకర్స్తో కలిపి మొత్తం 10 యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించిన విషయం తెలిసిందే. -
దారుణంగా ఐటీ ఉద్యోగాలు.. ప్రముఖ జాబ్ పోర్టల్ రిపోర్ట్!
IT jobs data: దేశంలో ఐటీ రంగంలో ఉద్యోగాల పరిస్థితి దారుణంగా మారింది. నియామకాలు బాగా తగ్గిపోయాయి. దేశంలోని వివిధ రంగాల్లో ఉద్యోగ నియామయాల పరిస్థితిని ప్రముఖ జాబ్ పోర్టల్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఐటీ, ఇన్సూరెన్స్, ఆటో, హెల్త్‌కేర్ బీపీఓ రంగాల్లోని వైట్ కాలర్ నియామకాలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 6 శాతం తగ్గాయి. జాబ్ పోర్టల్ నౌకరీ (Naukri) డేటా ప్రకారం.. 2023 ఆగస్టులో 2,666 జాబ్ పోస్టింగ్‌లు వచ్చాయి. గతేడాది ఆగస్టు నెలలో 2,828 జాబ్ పోస్టింగ్‌లు వచ్చాయి. కాగా నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ (Naukri JobSpeak Index) ప్రకారం ఈ ఏడాది జులైలో 2,573 జాబ్ పోస్టింగ్‌లతో పోలిస్తే ఈ ఆగస్టులో నియామకాలు 4 శాతం పెరిగాయి. భారీగా తగ్గిన కొత్త జాబ్‌లు ఐటీ పరిశ్రమలో కొత్త ఉద్యోగాలు గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 33 శాతం తగ్గాయి. ఐటీతో పాటు, బీమా, ఆటో, హెల్త్‌కేర్,బీపీఓ వంటి రంగాలు కూడా గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే కొత్త ఉద్యోగాల కల్పనలో వరుసగా 19 శాతం, 14 శాతం, 12 శాతం, 10 శాతం క్షీణించినట్లుగా నివేదిక పేర్కొంది. జాబ్ మార్కెట్లో టెక్ రంగం ఇప్పటికీ కష్టపడుతుండగా, నాన్-టెక్ సెక్టార్లో మాత్రం నియామకాలు పెరిగాయి. నివేదిక ప్రకారం ఆయిల్&గ్యాస్, హాస్పిటాలిటీ, ఫార్మా రంగాలలో కొత్త ఉద్యోగాలలో అత్యధిక వృద్ధి కనిపించింది. గత ఏడాది ఆగస్టుతో పోల్చితే ఈ రంగాల్లో రిక్రూట్మెంట్ వరుసగా 17 శాతం, 14 శాతం, 12 శాతం పెరిగింది. -
కొత్త ఉద్యోగాలు పెరగనున్నాయ్.. ఇదిగో సాక్ష్యం!
కరోనా వైరస్ కారణంగా చాలా కంపెనీలు భారీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొత్తగా ఉద్యోగులను చేర్చుకోవడం లేదా ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేయడం గానీ పూర్తిగా ఆపేసాయి. అంతే కాకుండా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించగా.. మరికొన్ని సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ వెసలుబాటు కల్పించి ఇంటికే పరిమితం చేశాయి. కాగా ఇప్పుడు ఉద్యోగులు ఆఫీసుల బాట పడుతున్నారు.. నియామకాల జోరు కూడా పెరుగుతోంది. నివేదికల ప్రకారం, 2023 డిసెంబర్ చివరి నాటికి కొత్త ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందని, ఇప్పటికే ఖాళీ ఉన్న పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయడానికి కంపెనీలు సన్నద్ధమవుతాయని తెలుస్తోంది. నౌకరి హైరింగ్ అవుట్ లుక్ (Naukri Hiring Outlook) రూపొందించిన ఒక నివేదికలో 1200ల కంటే ఎక్కువ నియామక సంస్థలు, కన్సల్టెంట్స్ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: భారత్ ఎన్సీఏపీ ప్రారంభం నేడే.. దీనివల్ల ఉపయోగాలెన్నో తెలుసా? రానున్న రోజుల్లో దాదాపు 92 శాతం నియామకాలు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. ఇందులో కూడా కొత్త ఉద్యోగాల సంఖ్య పెరిగే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్ వంటి వాటిలో ఉద్యోగాలు మెండుగా ఉండనున్నాయి. ఈ ఏడాది చాలా సంస్థలు తమ ఉద్యోగులకు చాలా తక్కువ మొత్తంలో ఇంక్రిమెంట్స్ కల్పించాయి, కాగా మరికొన్ని కంపెనీలు ఇంక్రిమెంట్ ఊసే ఎత్తలేదు. అంతే కాకుండా చాలా రోజుల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటుపడిన ఉద్యోగులను తప్పకుండా ఆఫీసులకు రావాలని బడా సంస్థలు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. ఇవన్నీ కూడా కొత్త ఉద్యోగాలు కల్పించడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. -
ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం.. ఆ రంగానికి చెందిన ఉద్యోగాలకు భారీ డిమాండ్!
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించి ఉపాధి అవకాశాల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగం ముందున్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. 2023 మార్చి నెలకు సంబంధించి నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ (బ్యాంకింగ్) ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 4,555కి చేరుకుందని, 2022 మార్చి నెలలో ఉన్న 3188తో పోలిస్తే 45 శాతం మేర వృద్ధి చెందినట్టు పేర్కొంది. నాన్ మెట్రో పట్టణాలు ఉపాధి అవకాశాల వృద్ధికి తోడ్పడినట్టు వివరించింది. బీఎఫ్ఎస్ఐ మినహా దేశంలో నియామకాల ధోరణి అప్రమత్తతో కూడిన ఆశావహంగా ఉందని నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ తెలిపింది. నూతన ఉద్యోగ నియామకాల డేటా ఆధారంగా ప్రతి నెలా ఈ నివేదికను నౌకరీ సంస్థ విడుదల చేస్తుంటుంది. మార్చి నెలకు సంబంధించి ఈ సూచీ 2979గా ఉంది. 2022 మార్చి నెలతో పోలిస్తే 5 శాతం పెరగ్గా.. ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఫ్లాట్‌గా ఉంది. నాన్ టెక్నాలజీ రంగాలు నూతన ఉపాధి కల్పన పరంగా బీమా, బ్యాంకింగ్ రంగాలు సంప్రదాయ బుల్ ర్యాలీలో ఉన్నట్టు, మొత్తం మీద కార్యాలయ ఉద్యోగాల మార్కెట్లో గణనీయమైన నియామకాలకు తోడ్పడుతున్నట్టు నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. బీమా రంగంలో ఉపాధి అవకాశాలు మార్చి నెలలో 108 శాతం వృద్ధి (క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు) చెందాయి. ప్రధానంగా బీమా పాలసీలను విక్రయించే విభాగంగా కొత్త ఉద్యోగాలు లభించాయి. డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు డిమాండ్ పెరగడంతో బ్యాంకింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 45 శాతం ఎక్కువగా వచ్చాయి. పట్టణాల వారీగా బ్యాంకింగ్ ఉపాధి అవకాశాల్లో వైవిధ్యం కనిపించింది. అహ్మదాబాద్ పట్టణంలో 149 శాతం వృద్ధి కనిపిస్తే, వదోదరలో 72 శాతం, కోల్‌కతాలో 49 శాతం కొత్త ఉపాధి అవకాశాలు బ్యాంకింగ్ రంగంలో వచ్చాయి. బహుళజాతి బీఎఫ్ఎస్ఐ సంస్థలతోపాటు, బ్యాంకింగ్, బీమా ఉత్పత్తులపై దృష్టి సారించిన దేశీ ఆర్థిక దిగ్గజాల నుంచి ఈ ఉపాధి అవకాశాలు వచ్చినట్టు ఈ నివేదిక వివరించింది. ఐటీ రంగంలో క్షీణత ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు మార్చి నెలలో 17 శాతం తగ్గాయి. మెషిన్‌లెర్నింగ్ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. ఆయిల్ రంగంలో 36 శాతం, రియల్ ఎస్టేట్ రంగంలో 31 శాతం, ఎఫ్ఎంసీజీలో 14 శాతం, హాస్పిటాలిటీ రంగంలో 7 శాతం మేర నూతన ఉద్యోగాలు మార్చి నెలలో (క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు) అందుబాటులోకి వచ్చాయి. రిటైల్, విద్య, బీపీవో రంగాల్లో 4–2 శాతం మేర నియామకాలు తగ్గాయి. హైదరాబాద్‌లో స్వల్పంగా క్షీణత మెట్రో పట్టణాల పరంగా చూస్తే ముంబైలో మార్చి నెలలో 17 శాతం మేర ఉపాధి అవకాశాలు పెరగ్గా, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 7 శాతం వృద్ధి కనిపించింది. బెంగళూరులో 12 శాతం, హైదరాబాద్ మార్కెట్లో 11 శాతం, పుణెలో 2% చొప్పున నియామకాలు తగ్గాయి. -
ఉద్యోగులకు బంపరాఫర్: పర్మినెంట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్
కోవిడ్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఆఫీస్‌కి వెళ్లి పనిచేయాలా? అన్న సందిగ్ధంలో ఉన్నారా? అయితే మీకో శుభవార్త. దేశీయ దిగ్గజ కంపెనీలు పర్మినెంట్‌గా ఇంటి వద్ద నుంచి పనిచేసేలా బంపరాఫర్ ను ప్రకటిస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరి స్పష్టం చేసింది. కోవిడ్ కారణంగా వర్క్ కల్చర్ ఆఫీస్నుంచి ఇంటికి మారింది. కానీ గత కొద్దిరోజులుగా పలు ఐటీ దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని కార్యాలయాల్లో పని చేయాలని చెప్పినట్లే చెప్పి మళ్లీ యూటర్న్ తీసుకున్నాయి. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని, అవసరం అయితే ఉద్యోగుల్ని ఐబ్రిడ్ వర్క్‌కి ఆహ్వానిస్తామని తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ జాబ్ పోర్ట్ నౌకరి వర్క్ ఫ్రమ్ హోమ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. గత 6నెలల్లో నౌకరిలో ప్రకటనలిస్తున్న దిగ్గజ కంపెనీలు శాశ్వతంగా ఇంటి వద్ద నుంచి పనిచేసే ఉద్యోగులకోసం అన్వేషిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు మరెన్నో ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ►నౌకరి వెబ్ పోర్టల్‌లో మనదేశానికి చెందిన సుమారు 32 లక్షల మంది ఉద్యోగులు ఉద్యోగాల కోసం అన్వేషించినట్లు నౌకరి తెలిపింది. అందులో దాదాపు 57శాతం మంది అభ్యర్ధులు పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం వెతికినట్లు వెల్లడించింది. ►నౌకరి తన జాబ్ బోర్డ్‌లో ప్రత్యేక ఫీచర్‌ను రూపొందించిన తర్వాత, తన సైట్లో 93,000 శాశ్వత, తాత్కాలిక రిమోట్ ఉద్యోగాల్ని ప్రకటించాయని, పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు 22శాతం ఉన్నాయి. ►మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా వర్క్ కల్చర్ మారిపోయింది. కార్పోరేట్ కంపెనీలు చాలా వరకు ఉద్యోగుల్ని హైబ్రిడ్ వర్క్ కల్చర్ కి దగ్గర చేయాలని భావిస్తున్నాయి. ►రిక్రూటర్లు ఉద్యోగుల ఎంపిక, వారి పని విధానం విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనే విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహమ్మారి కారణంగా ఎక్కువ మంది రిక్రూటర్లు పనితీరు కనబరిచే ఉద్యోగుల కోసం అన్వేషణ, ఎక్కడి నుండైనా పని చేసేందుకు అంగీకరిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో మానవ వనరులు, మౌలిక సదుపాయాల అవసరాలకు శాశ్వత మార్పులు చేయడం ప్రారంభించారు”అని నౌకరి చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గోయల్ అన్నారు. ►అంతేకాకుండా, కంపెనీలు కొన్ని జాబ్ ప్రొఫైల్‌లను పర్మినెంట్ వర్క్ హోమ్‌లో పనిచేసే ఉద్యోగుల కోసం అన్వేషిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్వేర్, బీపీఓ వంటి రంగాల్లో ఈతరహా ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. ►పెద్ద, చిన్న కంపెనీలు రెండూ మూడు రకాల ఉద్యోగాలను పోస్ట్ చేశాయి. వాటిలో సాధారణ ఉద్యోగాలు, తాత్కాలిక వర్క్ ఫ్రమ్ హోమ్, శాస్వతంగా రిమోట్ వర్క్ చేసే ఉద్యోగాలు ఉన్నాయి. ►ఐటీ సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ సేవలు, ఐటీఈఎస్, రిక్రూట్మెంట్/సిబ్బంది రంగాలు ఎక్కువ శాశ్వత రిమోట్ ఉద్యోగాలను పోస్ట్ చేస్తున్నాయని నౌకరీ డేటా చూపుతోంది. ►నౌకరీ డేటా ప్రకారం అమెజాన్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్, పిడబ్ల్యుసి, ట్రిజెంట్, ఫ్లిప్‌కార్ట్, సిమెన్స్, డెలాయిట్, ఒరాకిల్, జెన్సార్, టీసీఎస్, క్యాప్‌జెమినీ తాత్కాలిక, శాశ్వత రిమోట్ ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి. -
రికార్డ్ స్థాయిలో పెరిగిన ఐటీ నియామకాలు
ముంబై: డిజిటలైజేషన్, ఆటోమేషన్ కారణంగా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఉద్యోగ నియామకాలు ఊపందుకున్నాయి. జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో రికార్డ్ స్థాయిలో మంచి వృద్ధి నమోదైంది. అన్ని పరిశ్రమల్లో కలిపి జనవరిలో 1,925 జాబ్స్ హైరింగ్స్ జరగగా.. గత నెలలో 2,356 నియామకాలు జరిగాయని నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ సర్వే తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవటం, మార్కెట్ సాధారణ స్థితికి చేరుకోవటంతో కోవిడ్-19 తర్వాత తొలిసారిగా మెజారిటీ పరిశ్రమలలో నియామక కార్యకలాపాలలో సానుకూల థృక్పదాన్ని సాధించాయని నివేదక వెల్లడించింది. నగరాల వారీగా చూస్తే.. దేశంలోని ఆరు మెట్రో నగరాలు, ప్రధాన ద్వితీయ శ్రేణి పట్టణాల్లో జాబ్స్ హైరింగ్‌లో సానుకూల వాతావరణ నెలకొంది. గత నెలలో 31 శాతం నియామక వృద్ధితో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలవగా.. 28 శాతంతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. పుణేలో 24 శాతంగా ఉన్నాయి. వడోదరలో 20 హైరింగ్స్ ధోరణి కనిపించింది. చదవండి: అమెజాన్.. వెనక్కి తగ్గాలి బీమా సంస్థలలో భారీ వాటాల విక్రయం! -
ఉద్యోగ నియామకాల వృద్ధి 22 శాతం: నౌకరీ
‘పన్ను’ మినహాయింపు పరిమితి పెంపు న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగ నియామకాలు జూన్‌లో వార్షిక ప్రాతిపదికన 22 శాతంమేర పెరిగాయి. ఐటీ, టెలికం, హెల్త్‌కేర్ రంగాలు నియామకాల వృద్ధికి దన్నుగా నిలిచాయి. అలాగే రానున్న నెలల్లోనూ ఇదే జోరు కొనసాగుతుందని, మరిన్ని ఇతర రంగాల్లో కూడా ఉద్యోగ నియామక ప్రక్రియ ఊపందుకుంటుందని నౌకరీ.కామ్ తన సర్వేలో పేర్కొంది. కాగా నౌకరీ ఉద్యోగ సూచీ జూన్‌లో 2,129కు ఎగసింది. సర్వే ప్రకారం.. నియామకాల వృద్ధి ఐటీ-సాఫ్ట్వేర్ రంగంలో 19 శాతంగా, హెల్త్‌కేర్ రంగంలో 37 శాతంగా ఉంది. ఐటీ హార్డ్‌వేర్ అండ్ టెలికం, ఫైనాన్స్ విభాగాల్లోని ప్రొఫెషనల్స్ డిమాండ్ వరుసగా 13 శాతం, 11 శాతం మేర వృద్ధి చెందింది. ఇక పట్టణాల వారీగా చూస్తే.. నియామకాల వృద్ధి ఢిల్లీ-ఎన్సీఆర్లో 46 శాతంగా, చెన్నైలో 43 శాతంగా, హైదరాబాద్‌లో 36 శాతంగా ఉంది. అలాగే నియామకాల వృద్ధి ముంబైలో 24 శాతంగా, బెంగళూరులో 18 శాతంగా, పుణేలో 13 శాతంగా నమోదయ్యింది. -
ఐటీ ఉద్యోగాలకు హైద్రాబాదే బెస్ట్ అట!