భారత్‌లోని ప్రముఖ లార్జెస్ట్ వెబ్‌సైట్ నౌకరి.కామ్ యాప్ ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించిందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు.
గూగుల్, భారత్‌లోని యాప్ డెవలపర్ల మధ్య కొంతకాలంగా ప్లే స్టోర్ ఛార్జీల వివాదం కొనసాగుతోంది. భారత్‌లోని కొన్ని కంపెనీలు సర్వీస్ ఛార్జీలు చెల్లించకుండా గూగుల్ ప్లే స్టోర్‌ని వినియోగించుకుంటున్నాయని తెలిపింది. ఆయా సంస్థలు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందేనని, లేదంటే ప్లేస్టోర్ నుంచి సంబంధిత సంస్థల యాప్స్‌లను తొలగిస్తామని ప్రకటించారు.
నిబంధనల్ని పాటించాం..
ఈ తరుణంలో ఇన్ఫో ఎడ్జ్ యాజమాన్యంలోని నౌకరి, రియల్ ఎస్టేట్‌కు చెందిన 99 ఎకర్స్ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. ఈ సందర్భంగా గూగుల్ యాప్ బిల్లింగ్ పాలసీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఫిబ్రవరి 9 నుండి తాము గూగుల్ యాప్ విధానాలకు కట్టుబడి ఉన్నామని ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిక్‌చందానీ గతంలో చెప్పారు. గూగుల్ బకాయిలన్నీ సకాలంలో చెల్లించామని తెలిపారు.
భారత్‌లో 10 యాప్స్ తొలగింపు
తాజాగా ప్లే స్టోర్ నుంచి యాప్‌ను తొలగించడంపై సంజీవ్ బిక్‌చందానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కాగా, ఇన్ఫో ఎడ్జ్‌కి చెందిన నౌకరి, 99 ఎకర్స్‌తో కలిపి మొత్తం 10 యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment