ఏఐ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి యువత సిద్ధమవ్వాలి. అదే జరిగితే మన దేశం ఏఐ విభాగంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలుస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయని ఉద్యోగస్థులు బయపడుతున్న నేపథ్యంలో తాజా నివేదిక కొంత ఊరట కలిగిస్తుంది.
ఏఐతోపాటు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లలో పుష్కలంగా కొలువులు సంపాదించవచ్చని ఏటా 20 లక్షల కంటే ఎక్కువ జీతంతో జాబ్ ఆఫర్ చేస్తున్నాయని నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిపుణులకు జాబ్ ఆఫర్లలో 2024 ఫిబ్రవరి నెలలో 20 శాతం కంటే ఎక్కువ పెరుగుదలే ఉందని తేలింది.
నౌక్రీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక ప్రకారం..మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్, స్టాక్ ఏఐ సైంటిస్ట్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత ఉద్యోగాల్లో గతేడాదితో పోలిస్తే ఈసారి 100 శాతం, గత ఫిబ్రవరితో పోల్చుకుంటే 44 శాతం వేతనాలు పెరిగాయి. ఐఏఎన్‌ఎస్ నివేదిక ప్రకారం.. మెట్రో నగరాలతోపాటు నాన్ మెట్రో నగరాల్లో ఎప్పటికప్పుడు మార్కెట్‌లో వస్తున్న కొత్త ప్రతిభకు డిమాండ్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, ఏఐ విభాగాల్లో రానున్న రోజుల్లో అధికమొత్తంలో కొలువులు రాబోతున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: రిస్క్ అని తెలిసినా అవే అప్పులు చేస్తున్నారు..! ఆందోళనలో ఆర్‌బీఐ
ఫిబ్రవరి 2024లో రాయ్‌పుర్ లాంటి మెట్రోయేతర నగరాల్లో గతేడాది 14 శాతం వృద్ధితో కొత్త ఉద్యోగాలు సృష్టించగా.. సూరత్, జోధ్‌పుర్, గాంధీనగర్‌లు వరుసగా 12శాతం, 10 శాతం, 8 శాతం వృద్ధిని సాధించాయి. 16 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్ పీరియెన్స్ ఉన్న సీనియర్ నిపుణులు గరిష్ట జాబ్ ఆఫర్లను పొందారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఏటా 20 లక్షల కంటే ఎక్కువ జీతం తీసుకునేవారిలో జాబ్ ఆఫర్లు 23శాతం వృద్ధి చెందినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment