
భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ సంక్షోభం నెలకొంది. 2024లో 50,000 మందికి పైగా ఐటీ ఉద్యోగులను తొలగించడం నగర ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. వ్యయ నియంత్రణ చర్యలు, కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్‌ను వేగంగా అందిపుచ్చుకోవడం వల్ల ఉద్యోగుల తొలగింపు టెక్ రంగంపై ప్రభావం చూపడమే కాకుండా రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ఆందోళనలు రేకెత్తిస్తున్నట్లు ఇన్‌షార్ట్స్ నివేదిక తెలిపింది.
సంక్షోభంలో ఐటీ రంగం
బెంగళూరు ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన ఐటీ పరిశ్రమ ఇటీవలి కాలంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఎంట్రీ లెవల్ ప్రోగ్రామర్లు, స్టాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌లో భాగంగా ఉన్న కోడింగ్, డీబగ్గింగ్ వంటి పనుల కోసం ఉన్న సాఫ్ట్‌వేర్ టెస్టర్ల స్థానంలో కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ మార్పు వల్ల అనేక ఉద్యోగాలు తొలగింపునకు కారణమవుతుంది. దాంతో వేలాది మంది వృత్తి నిపుణులు నిరుద్యోగులుగా మారుతున్నారు. పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి అందిస్తున్న వారు స్థానికంగా ఉద్యోగులు ఖాళీ చేస్తుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
రియల్ ఎస్టేట్‌పై ప్రభావం
ఉద్యోగులు తొలగింపులు బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. బడ్జెట్ హౌసింగ్‌కు డిమాండ్ గణనీయంగా తగ్గడంతో భూయజమానులు, ప్రాపర్టీ ఇన్వెస్టర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు జూనియర్ ఐటీ ఉద్యోగులతో సందడిగా ఉండే పీజీ సౌకర్యాలు ఇప్పుడు తక్కువ ఆక్యుపెన్సీ రేటుతో సతమతమవుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు వంటి టెక్నాలజీ హబ్‌ల సమీపంలో అద్దె ప్రాపర్టీల్లోకి కోట్లాది రూపాయలు వెచ్చించిన ఇన్వెస్టర్లు ప్రాపర్టీ విలువలు పడిపోవడం, యూనిట్లు ఖాళీగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చదవండి: యూఎస్ మాజీ అధ్యక్షుడి సంతకం కాపీ..?
విస్తృత ఆర్థిక ప్రభావాలు
ఉద్యోగ సంక్షోభం ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలతోపాటు ఇతర విభాగాలకు విస్తరించింది. నగరంలోని ఆర్థిక స్థిరత్వానికి ముప్పు కలిగిస్తుంది. రెస్టారెంట్లు, కేఫ్‌లు, రిటైల్ స్టోర్లు వంటి ఐటీ నిపుణులకు సేవలందించే స్థానిక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కొత్త కొలువు కోసం ఎదురుచేసే తొలగించిన ఉద్యోగుల వ్యయ శక్తి తగ్గడం బెంగళూరులోని వివిధ పరిశ్రమలపై ప్రభావం చూపుతుంది.
Comments
Please login to add a commentAdd a comment