job crisis
-
జీడీపీనా? ఉద్యోగాలా?
ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని ఐదేళ్లలో ఐదు ట్రిలియన్లకు చేర్చాలనేది ప్రధాని మోదీ కల. కానీ ఈ కల సాకారానికి ఎన్నో సవాళ్లు. ఇంకెన్నో సమస్యలు. కనుచూపు మేరలో పరిష్కారం కానరావడమే లేదు. ఆర్థిక వ్యవస్థ 20 త్రైమాసికాల కనిష్టానికి దిగజారింది. పెట్టుబడులు మందగించాయి. ఎకానమీలో కీలక సూచికలేవీ విశ్వాసం రేకెత్తించడం లేదు. ఉద్యోగాలు దొరకడం లేదు. వ్యవసాయ సంక్షోభం ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. కానీ అత్యధిక భారతీయులకు ఇవి ప్రాధాన్యతాంశాలుగా కన్పించడం లేదని, రుణమాఫీ గురించి సానుభూతితో యోచించే పరిస్థితి లేదని ఎకనామిక్స్ టైమ్స్ ముందస్తు బడ్జెట్ సర్వే తేల్చింది. సర్వేలో పాల్గొన్న వారిలో 35.4 శాతం మంది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, వృద్ధిరేటు పెంచడమే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ముందున్న ప్రధాన కర్తవ్యమన్నారు. 31.5 శాతం మంది వృద్ధి కంటే ఉద్యోగాల కల్పనకే పెద్దపీట వేయాలన్నారు. 19.7 శాతం మంది ఆదాయం పన్ను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. రైతాంగ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న వారు కేవలం 13.4 శాతం మంది మాత్రమే. మద్దతు ధర పెంచాల్సిందే.. కనీస మద్దతు ధర పెంచడమే వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారమంటున్నారు 42.8 శాతం మంది. 29 శాతం మంది ఎకరానికి నిర్ణీత మొత్తం చొప్పున చెల్లింపులు జరపడం ఉత్తమమని భావిస్తున్నారు. రుణ మాఫీ వైపు మొగ్గు చూపుతున్న వారు 6.5 శాతం మంది మాత్రమే. 21.7 శాతం మంది ఉచిత విద్యుత్తు, నీటి సౌకర్యం కల్పించడంపై ఆర్థికమంత్రి దృష్టి పెట్టాలంటున్నారు. పన్నులు ఎలా? 38 శాతం మందికిపైగా ప్రజలు ఆదాయం పన్ను బేసిక్ స్లాబ్‌ను ఐదు లక్షలకు పెంచాలని కోరుతున్నారు. 80(సీ) కింద పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలంటున్న వారు 19.9 శాతం మంది. నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ఏదో ఒక రూపంలో రివార్డులు ఇవ్వాలనే ఆలోచనను 33 శాతం మంది సమర్థిస్తున్నారు. మిగిలిన వారు ప్రస్తుత పన్ను శ్లాబులు బాగున్నాయని, మార్పులు చేయాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడ్డారు. సంస్కరణలు అవసరమా? ప్రత్యక్ష పన్నుల విధానంలో మార్పులు చేయాలని 34 శాతం మంది కోరుతున్నారు. తక్షణమే ఈ మార్పులు అవసరమంటున్నారు. 25.7 శాతం మంది భూ సేకరణ చట్టంలో మార్పులు అవసరమని భావిస్తుండగా, 24.7శాతం మంది కార్మిక చట్టాలను సంస్కరించాలంటున్నారు. విద్యుత్ రంగ సంస్కరణల వైపు మొగ్గు చూపిన వారు 15.6శాతం మంది మాత్రమే. ఉద్యోగాలు ఎలా? ఉపాధి సంక్షోభాన్ని ఎలా పరిష్కరించాలి? ఈ ప్రశ్నకు విద్యా వ్యవస్థను ప్రక్షాళించడమే మార్గమని 40 శాతం మంది తమ అభిప్రాయాన్ని చెప్పారు. 21.9 శాతం మంది కార్మిక సంస్కరణలతో సమస్యను పరిష్కరించవచ్చునన్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం (27.5 శాతం మంది) ‘ముద్ర’తరహా పథకాలు మరిన్ని అమలు చేయడం (10.6 శాతం) ద్వారా ఉద్యోగాలు కల్పించవచ్చునన్నారు కొందరు. కేటాయింపులు ఎలా? బడ్జెట్ కేటాయింపుల్లో మౌలిక సదుపాయాల రంగానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని 36.4 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ రంగ కేటాయింపులకు పెద్ద పీట వేయాలంటున్నారు 29 శాతం మంది. మిగిలిన వారు నైపుణ్యాలు (18.7శాతం) పర్యావరణం (15.9శాతం) వైపు మొగ్గు చూపుతున్నారు. షేర్ల లాభాలపై విధిస్తున్న దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్టీసీజీ) పన్నును రద్దు చేయడం ద్వారా మదుపర్లను ఆకట్టుకోవచ్చునని 27.4 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. అంకుర పరిశ్రమలకు విధించే ఏంజెల్ ట్యాక్స్‌ను రద్దు చేయాలంటున్నారు 30 శాతం మంది. -
అది అంగీకరించేందుకు మోదీ సిద్ధంగా లేరు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగ సంక్షోభం ఉందని అంగీకరించేందుకు ప్రధాని నరేంద్రమోదీ సిద్ధంగా లేరని ఆక్షేపించారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. సమస్య ఉందని ఒప్పుకోని వ్యక్తి.. దాని పరిష్కారానికి ఎలా కృషిచేస్తారని విమర్శించారు. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థులతో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రాహుల్ ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. నిరుద్యోగం, పెరుగుతున్న యువత అవసరాలు వంటి అవకాశాల గురించి చర్చించారు. సమస్యలపై చర్చించేందుకు ప్రధాని మోదీకి ధైర్యం లేదన్నారు రాహుల్. రఫేల్ డీల్ సహా వివిధ అంశాలపై చర్చకు రావాలని ఎన్నిసార్లు అడిగినా ఆయన ముందుకు రాలేదని ఎద్దేవా చేశారు. -
ట్రంప్ కళ్లు తెరుస్తారా?!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికార పీఠం ఎక్కి ఏడాదికాలం పూర్తయిన ప్రస్తుత తరుణంలో ఆయన సాఫల్య వైఫల్యాలపై చర్చించాల్సింది పోయి ఆయన పదవి ఉంటుందా, ఊడుతుందా అన్నదే అందరికీ ఉత్కంఠ రేపే అంశమైంది. ముఖ్యంగా నీలి చిత్రాల తార స్టార్మీ డేనియల్స్‌తో పదేళ్లక్రితం ఆయనకున్న సంబం ధాలు, అవి బయటపడకుండా ఉండటం కోసం ఆమెకు భారీ మొత్తంలో డబ్బు వెదజల్లి నోరుమూయించిన వైనం వెల్లడై అల్లరవుతోంది. ఈలోగా పులి మీద పుట్రలా అమెరికా ప్రభుత్వం మూతబడి చర్చంతా దానిపైకి మళ్లింది. ట్రంప్ పద వికి ముప్పు తీసుకురాగల వివిధ అంశాల జాబితాలో అది కూడా చేరింది. అమె రికాలో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు గనుక, ఇప్పుడొచ్చిన ఈ తాజా సంక్షోభం రేపో మాపో సమసిపోతుందన్న ఆశ అందరిలోనూ ఉంది. కానీ ట్రంప్ స్థానంలో మరొకరెవరైనా ఉన్నట్టయితే సమస్య ఇంత ముదిరేది కాదన్నది వాస్తవం. సంప్రదాయానికి విరుద్ధమైన తోవన వెళ్లి ‘ఎలాగోలా’ బిల్లును గట్టెక్కించుకోవడా నికి ఆయన అంతా సిద్ధం చేశారని అంటున్నారు. అదే జరిగితే తాత్కాలికంగా ఈ సమస్య నుంచి బయటపడినా భవిష్యత్తులో రిపబ్లికన్ పార్టీకి అదో పెద్ద గుదిబం డగా మారకతప్పదు. అమెరికా సర్కారు మూతబడి అప్పుడే మూడురోజులు కావస్తోంది. శుక్ర వారం అర్ధరాత్రితో మొదలైన ఈ సంక్షోభం ఆదివారానికల్లా ఓ కొలిక్కి వస్తుందని, అధికార రిపబ్లికన్ పార్టీ, విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఒక అవగాహనకొచ్చి ఈ గండం నుంచి దేశాన్ని గట్టెక్కిస్తాయని అందరూ ఆశించారు. కానీ అదేం జరగలేదు. ఫలి తంగా వైట్ హౌస్‌లో పనిచేసే సిబ్బందిలోనే చాలామందిని విధుల నుంచి తాత్కా లికంగా తప్పించాల్సివచ్చింది. సైన్యంలో కొత్తగా చేరినవారికి ఇస్తున్న శిక్షణ ఆగిపో యింది. జాతీయభద్రతా విభాగంలో, మరికొన్ని అత్యవసర విభాగాల్లో సిబ్బంది మినహా మిగిలినచోట్ల వేతనాలు లేని సెలవు మంజూరు చేశారు. విద్య, గృహ నిర్మాణం, పర్యావరణం, వాణిజ్యం వగైరా విభాగాల్లోని వేలాదిమంది ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. న్యూయార్క్‌లోని స్వేచ్ఛాప్రతిమ ఉండే పార్క్తోసహా దేశంలోని మూడోవంతు పార్కులు మూతబడ్డాయి. మ్యూజియంలకు తాళాలు వేశారు. చాలినంతమంది సిబ్బంది లేకపోవడంతో ఆ దేశ ప్రైవేటు అంతరిక్ష యాన సంస్థ స్పేస్ ఎక్స్ భారీ రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ఇలా ఎనిమిది లక్షలకు పైగా సిబ్బంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎప్పుడు సంక్షోభం సమసి తమకు మళ్లీ కొలువుకు పిలుపు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ట్రంప్‌కు దిగువసభలోనూ, సెనేట్‌లోనూ కూడా మెజారిటీ ఉంది. దిగువసభలోని 435మంది సభ్యుల్లో 238మంది రిపబ్లికన్లు. డెమొక్రాట్ల సంఖ్య 193 మాత్రమే. అటు సెనేట్‌లో ఉన్న 100 మంది సభ్యుల్లో 51మంది రిపబ్లికన్లు. 47మంది డెమొక్రాట్లు. దిగువ సభలో ఉన్న మెజారిటీతో వినిమయ బిల్లును సులభంగా గట్టెక్కించుకోగలిగిన ట్రంప్ సెనేట్‌లో బోల్తా పడ్డారు. వినిమయ బిల్లు ఆమోదానికి సాధారణ మెజారిటీ సరిపోదు గనుక మరో పది ఓట్లు రిపబ్లికన్లకు తప్పనిసరి. కను కనే కొందరు డెమొక్రటిక్ సభ్యులతో మంతనాలు జరిపి వారిలో అయిదుగురిని అనుకూలురుగా మార్చుకున్నారు కూడా. ఈలోగా స్వపక్షంలోని అయిదుగురు విని మయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడంతో ఆ వ్యూహం వృథా అయింది. దీనికి పరి ష్కారం కనుచూపు మేరలో లేదనుకుంటే దేశాధ్యక్షుడు తన ప్రత్యేకాధికారాలు ఉపయోగించి సాధారణ మెజారిటీతో బిల్లు ఆమోదం పొందడానికి అనుమతించ వచ్చు. అమెరికా చరిత్రలో 1976 మొదలుకొని ఇంతవరకూ 18సార్లు ఇలా ప్రభు త్వం మూతబడిన సందర్భాలు ఎదురైనా ఏ అధ్యక్షుడూ ఈ అధికారాన్ని వినియో గించుకోలేదు. ప్రతిపక్షంతో ఓపిగ్గా చర్చించి, వారి అభిప్రాయాలకు కూడా ప్రాధా న్యమిచ్చి ఏదో విధంగా సంక్షోభాలను అధిగమించారు. ఇలా విపక్షానికి విలువ ఇవ్వడం వెనక ఓ భయం కూడా ఉంది. ఇటువంటి కీలకమైన బిల్లును సాధారణ మెజారిటీతో ఆమోదించవచ్చునన్న మినహాయింపునిస్తే భవిష్యత్తులో తమ ప్రత్యర్థి పక్షం కూడా అధికారంలోకొచ్చి ఆ మాదిరే వ్యవహరిస్తుందని అటు డెమొక్రాట్లు, ఇటు రిపబ్లికన్లు కూడా ఈ ప్రత్యామ్నాయాన్ని ఇంతవరకూ ఎంచుకోలేదు. కానీ ట్రంప్ ఇప్పటివరకూ వచ్చిన అధ్యక్షుల్లో మొండి ఘటం. ఎప్పుడో ఏదో అవుతుందని భయపడుతూ తలొంచడం ఆయనకు ససేమిరా ఇష్టం లేదు. ఈ విషయంలో పార్టీ సలహాను కూడా ఆయన బేఖాతరు చేయొచ్చని చెబుతున్నారు. ఇంతకూ డెమొక్రాట్లు అడుగుతున్నవి గొంతెమ్మ కోర్కెలేమీ కాదు. అక్రమంగా అమెరికాకు వచ్చి నివాసం ఉంటున్నవారి పిల్లల(స్వాప్నికులు) విషయంలో పున రాలోచించాలని, వారిని వచ్చే మార్చిలో బలవంతంగా బయటకు తరిమేసే ప్రతి పాదనను విరమించుకోవాలని డిమాండు చేస్తున్నారు. నిజానికి ట్రంప్ ఏడాది పాలనలో స్టాక్ మార్కెట్లో తళతళలున్నాయి. ఉపాధి అవకాశాలు కూడా అంతో ఇంతో పెరిగాయి. కానీ ప్రభుత్వ రుణం ప్రకోపిస్తోంది. రష్యాతో లాలూచీ, ఇరా న్‌తో కొత్త పేచీలు, ఉత్తర కొరియాతో కయ్యం, నీలి చిత్రాల తారతో సంబంధాలు వగైరా అంశాల్లో ఆయన జనాదరణ గ్రాఫ్ పడిపోతోంది. వీటన్నిటి పర్యవసానంగా వచ్చే నవంబర్‌లో కాంగ్రెస్‌కు జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీని జనం ఛీకొడతారన్న భయం కూడా ఆయనలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వలసల విషయంలో మొండిగా ఉన్నట్టు కనబడితేనే అధ్యక్ష ఎన్నికల సమయంలో వలే శ్వేత జాతి అమెరికన్లు తనవైపే ఉండగలరని ఆయన విశ్వసిస్తున్నారు. అందుకోసమే తాజా సంక్షోభం విషయంలో పట్టువిడుపుల్లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇదిలాగే కొన సాగితే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని, సాధించిన కొద్దో గొప్పో విజయాలను కాస్తా ఊడ్చిపెట్టేస్తుందని ట్రంప్ గ్రహించకపోతే అంతిమంగా అది ఆయన మెడకే చుట్టుకోవడం ఖాయం. కోట్లాదిమంది పౌరుల జీవితాలతో, వారి భవిష్యత్తుతో ముడిపడి ఉండే కీలకమైన వ్యవహారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలతో, పరువు ప్రతిష్టలతో తూచడం తగని పని. -
ఆకలితో సౌదీ నుంచి 10వేల మంది వెనక్కు..
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా తిండి లేక ఆకలి బాధలు పడుతున్న 10 వేల మందికి పైగా భారతీయులను దేశానికి తీసుకువచ్చేందుకు ఓ మినిష్టర్ ను పంపనున్నట్లు విదేశాంగ శాఖ(ఈఏ) మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ఉద్యోగాల నుంచి తీసివేసిన కార్మికులు అక్కడి ఖర్చులకు తగిన డబ్బులు లేక ఆకలితో అల్లాడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ విషయంపై సౌదీ ప్రభుత్వం చర్చించేందుకు వచ్చే వారం మినిష్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఈఏఎమ్ వీకే సింగ్ తో పాటు ఎమ్ అక్బర్ సౌదీకు వెళ్లనున్నారు. ఉద్యోగాలు కోల్పోయి ఆకలి బాధలు పడుతున్న భారతీయులకు సౌదీలోని భారతకాన్సులేట్ జనరల్ శనివారం రాత్రి భోజన ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కాన్సులేట్ జనరల్ ట్విట్టర్ లో పోస్టు చేసింది. సౌదీ రాజధాని జెడ్డాలో దాదాపు 800ల మందికి పైగా భారతీయులు తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని, సాయం చేయాలని ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా సుష్మాస్వరాజ్ ను కోరాడు. స్సందించిన సుష్మా కాన్సులేట్ జనరల్ ద్వారా భోజన ఏర్పాట్లు చేయించారు. గంటకు ఒకసారి ఈ విషయాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న భారతీయులకు ఆహార సదుపాయాన్ని కల్పించాలని రియాద్ లోని ఇండియన్ ఎంబసీని కోరినట్లు ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. సౌదీ, కువైట్ లలో చాలా మంది భారతీయులు ఉద్యోగాలను కోల్పోయారని చెప్పారు. కంపెనీలను మూసివేసిన వారందరూ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వకపోవడంతో రోడ్డును పడ్డారని వివరించారు. సౌదీ, కువైట్ ల ప్రధాన ఆదాయవనరైన ఆయిల్ రేట్లు భారీగా పతనం కావడంతో గత ఏడాది నుంచి అక్కడ పరిస్థితులు బాగాలేవు. నిర్మాణ రంగం బాగా దెబ్బతింది. దీంతో విదేశీ వర్కర్లకు కంపెనీలు వేతనాలు చెల్లించలేక, స్వదేశానికి టిక్కెట్లు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. మరికొన్ని కంపెనీలు మొత్తానికే చేతులు ఎత్తేసి, ఉద్యోగి వేతనాన్ని కూడా ఇవ్వడం లేదు. కాగా, ఈ పరిస్థితిపై స్పందించిన సౌదీ ప్రభుత్వం ఫిర్యాదులను పరిశీలించి ఆపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. Indian Consulate n Indian Community Jeddah food stuff distribution mission accomplished at 245 AM today morning. Kudos to all. @123nrs — India in Jeddah (@CGIJeddah) 31 July 2016 Excellent efforts by CCWA members of Taif. Distributed food stuff 2 Indians in Taif after advice by CGI Jeddah pic.twitter.com/HiK1bPtndC — India in Jeddah (@CGIJeddah) 31 July 2016