సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగ సంక్షోభం ఉందని అంగీకరించేందుకు ప్రధాని నరేంద్రమోదీ సిద్ధంగా లేరని ఆక్షేపించారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. సమస్య ఉందని ఒప్పుకోని వ్యక్తి.. దాని పరిష్కారానికి ఎలా కృషిచేస్తారని విమర్శించారు. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థులతో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రాహుల్ ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. నిరుద్యోగం, పెరుగుతున్న యువత అవసరాలు వంటి అవకాశాల గురించి చర్చించారు. సమస్యలపై చర్చించేందుకు ప్రధాని మోదీకి ధైర్యం లేదన్నారు రాహుల్. రఫేల్ డీల్ సహా వివిధ అంశాలపై చర్చకు రావాలని ఎన్నిసార్లు అడిగినా ఆయన ముందుకు రాలేదని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment