ఆకలితో సౌదీ నుంచి 10వేల మంది వెనక్కు..
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా తిండి లేక ఆకలి బాధలు పడుతున్న 10 వేల మందికి పైగా భారతీయులను దేశానికి తీసుకువచ్చేందుకు ఓ మినిష్టర్ ను పంపనున్నట్లు విదేశాంగ శాఖ(ఈఏ) మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ఉద్యోగాల నుంచి తీసివేసిన కార్మికులు అక్కడి ఖర్చులకు తగిన డబ్బులు లేక ఆకలితో అల్లాడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ విషయంపై సౌదీ ప్రభుత్వం చర్చించేందుకు వచ్చే వారం మినిష్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఈఏఎమ్ వీకే సింగ్ తో పాటు ఎమ్ అక్బర్ సౌదీకు వెళ్లనున్నారు.
ఉద్యోగాలు కోల్పోయి ఆకలి బాధలు పడుతున్న భారతీయులకు సౌదీలోని భారతకాన్సులేట్ జనరల్ శనివారం రాత్రి భోజన ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కాన్సులేట్ జనరల్ ట్విట్టర్ లో పోస్టు చేసింది. సౌదీ రాజధాని జెడ్డాలో దాదాపు 800ల మందికి పైగా భారతీయులు తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని, సాయం చేయాలని ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా సుష్మాస్వరాజ్ ను కోరాడు. స్సందించిన సుష్మా కాన్సులేట్ జనరల్ ద్వారా భోజన ఏర్పాట్లు చేయించారు. గంటకు ఒకసారి ఈ విషయాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న భారతీయులకు ఆహార సదుపాయాన్ని కల్పించాలని రియాద్ లోని ఇండియన్ ఎంబసీని కోరినట్లు ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. సౌదీ, కువైట్ లలో చాలా మంది భారతీయులు ఉద్యోగాలను కోల్పోయారని చెప్పారు. కంపెనీలను మూసివేసిన వారందరూ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వకపోవడంతో రోడ్డును పడ్డారని వివరించారు.
సౌదీ, కువైట్ ల ప్రధాన ఆదాయవనరైన ఆయిల్ రేట్లు భారీగా పతనం కావడంతో గత ఏడాది నుంచి అక్కడ పరిస్థితులు బాగాలేవు. నిర్మాణ రంగం బాగా దెబ్బతింది. దీంతో విదేశీ వర్కర్లకు కంపెనీలు వేతనాలు చెల్లించలేక, స్వదేశానికి టిక్కెట్లు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. మరికొన్ని కంపెనీలు మొత్తానికే చేతులు ఎత్తేసి, ఉద్యోగి వేతనాన్ని కూడా ఇవ్వడం లేదు. కాగా, ఈ పరిస్థితిపై స్పందించిన సౌదీ ప్రభుత్వం ఫిర్యాదులను పరిశీలించి ఆపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
Indian Consulate n Indian Community Jeddah food stuff distribution mission accomplished at 245 AM today morning. Kudos to all. @123nrs
— India in Jeddah (@CGIJeddah) 31 July 2016
Excellent efforts by CCWA members of Taif. Distributed food stuff 2 Indians in Taif after advice by CGI Jeddah pic.twitter.com/HiK1bPtndC
— India in Jeddah (@CGIJeddah) 31 July 2016