దిగ్గజ కంపెనీ భారీ లేఆఫ్స్!.. వేలాదిమందిపై ప్రభావం? | AI likely To Claim 14000 Jobs in Amazon | Sakshi
Sakshi News home page

దిగ్గజ కంపెనీ భారీ లేఆఫ్స్!.. వేలాదిమందిపై ప్రభావం?

Mar 18 2025 7:28 PM | Updated on Mar 21 2025 11:03 AM

AI likely To Claim 14000 Jobs in Amazon

2025లోనూ లేఆప్స్ ప్రభావం తగ్గడం లేదు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఏకంగా 14,000 మంది ఉద్యోగులను బయటకు పంపించడానికి సిద్ధమవుతోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి, లాభాలను గడించడానికి కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి పూనుకుంది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కంపెనీ 13 శాతం శ్రామిక శక్తిని తగ్గించనుంది. దీని ద్వారా సంస్థ 2.1 బిలియన్ డాలర్ల నుంచి 3.6 బిలియన్ డాలర్ల వరకు ఆదా చేయనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల కోత పూర్తయితే సంస్థలో పనిచేస్తున్న వారి సంఖ్య 1,05,770 నుంచి 91,936కు చేరుతుంది.

2025 మొదటి త్రైమాసికంలో.. మేనేజర్లకు వ్యక్తిగత సహకారాన్ని 15 శాతం పెంచనున్నట్లు అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఆండీ జాస్సీ పేర్కొన్నారు. కంపెనీ లేఆప్స్ అనేవి కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయని సీఈఓ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మైక్రో రిటైర్మెంట్.. ఉద్యోగుల్లో ఇదో కొత్త ట్రెండ్

అమెజాన్ ఉద్యోగుల తొలగింపును నిందిస్తూ.. కంప్లీట్ సర్కిల్ మేనేజింగ్ పార్టనర్ అండ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (CIO) గుర్మీత్ చద్దా తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. నవంబర్‌లో 18 వేల మందిని తొలగించిన తర్వాత అమెజాన్ మరో 10000 మందిని తొలగించనుంది. ఏఐ కారణంగా ఉద్యోగుల తొలగింపు జరుగుతోందని.. ప్రజలకు కష్టాలను తెచ్చే ఏఐ లేదా మరే ఇతర సాంకేతికత పనికిరానిదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement