
దిగ్గజ కంపెనీలు భారీ లేఆఫ్స్ ప్రకటించిన తరువాత.. థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎ వేలుమణి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. సంవత్సరానికి 3.5 బిలియన్ డాలర్ల ఖర్చులను ఆదా చేయడానికి అమెజాన్ 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలకు ప్రతిస్పందనగా ట్వీట్ చేశారు.
అమెజాన్, మెటా, గూగుల్ వంటి ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించడానికి చాలా కష్టపడతారు. ఉద్యోగం వచ్చిన తరువాత సంబరపడతారు. ''ఇలాంటి బ్రాండ్లతో క్యాంపస్ ప్లేస్‌మెంట్ పొందినందుకు ఎంతమంది సంబరాలు చేసుకున్నారో ఊహించుకోండి. ఇప్పుడు ఎంతమంది నిరాశకు గురవుతారో..! కేవలం 10, 20 మంది కాదు.. ఏకంగా 14,000 మంది ఈ ప్రభావానికి గురవుతున్నారు. కెరీర్ లేదా బిజినెస్ అనేది మారథాన్ రేస్'' అని థైరోకేర్ ఫౌండర్ అన్నారు.
వేలుమణి ట్వీట్ మీద పలువురు స్పందించారు. 'కలామ్ సర్ చెప్పినట్లుగా కంపెనీకి విధేయంగా ఉండాల్సిన అవసరం లేదు, మీ పనికి విధేయంగా ఉండండి" అని ఒకరు అన్నారు. కార్పొరేట్ ఉద్యోగాలు ఎప్పుడైనా పోవచ్చు, కాబట్టి ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను పెంపొందించుకోండి అని మరొకరు అన్నారు.
అమెజాన్ లేఆఫ్స్
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఏకంగా 14,000 మంది ఉద్యోగులను బయటకు పంపించడానికి సిద్ధమవుతోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి, లాభాలను గడించడానికి కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి పూనుకుంది. దీని ద్వారా సంస్థ 2.1 బిలియన్ డాలర్ల నుంచి 3.6 బిలియన్ డాలర్ల వరకు ఆదా చేయనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల కోత పూర్తయితే సంస్థలో పనిచేస్తున్న వారి సంఖ్య 1,05,770 నుంచి 91,936కు చేరుతుంది.
Imagine how many might have celebrated for getting a campus placement with such brands.
Now how many might feel depressed!
It is not 10 or 20.
100 or 200
1000 or 2000
14000!!!!
Donot celebrate too early. Career or business - It’s Marathon Race. pic.twitter.com/rrcQujB7hN— Dr. A. Velumani.PhD. (@velumania) March 19, 2025
Comments
Please login to add a commentAdd a comment