Thyrocare company
-
ఫార్మ్ఈజీ చేతికి థైరోకేర్
ముంబై: డయాగ్నొస్టిక్ సేవల కంపెనీ థైరోకేర్ టెక్నాలజీస్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు డిజిటల్ హెల్త్‌కేర్ స్టార్టప్ ఫార్మ్ ఈజీ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 4,546 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా థైరోకేర్ టెక్నాలజీస్ చైర్మన్, ఎండీ ఎ.వేలుమణితో ఫార్మ్ ఈజీ మాతృ సంస్థ ఏపీఐ హోల్డింగ్స్ తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా థైరోకేర్‌లో 66.1 శాతం వాటాను యూనికార్న్ హోదాను పొందిన ఫార్మ్ఈజీ సొంతం చేసుకోనుంది. ఇందుకు ఒక్కో షేరుకి రూ. 1,300 చొప్పున చెల్లించనున్నట్లు ఫార్మ్ఈజీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో 25 ఏళ్లుగా దేశవ్యాప్త డయాగ్నొస్టిక్ సేవలను విస్తరించిన కంపెనీని 7 సంవత్సరాల వయసుగల ఒక స్టార్టప్ కొనుగోలు చేస్తుండటం ప్రస్తావించదగ్గ విషయమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫార్మ్ఈజీ ఇటీవలే మెడ్‌లైఫ్‌ను సైతం సొంతం చేసుకున్న విషయం విదితమే. 26 శాతం వాటాకు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన థైరోకేర్ టెక్నాలజీస్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకోనుండటంతో మైనారిటీ వాటాదారులకు ఫార్మ్ఈజీ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించవలసి ఉంటుంది. సెబీ నిబంధనల ప్రకారం థైరోకేర్ వాటాదారుల నుంచి ఫార్మ్ఈజీ 26 శాతం వాటాను కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఇందుకు మరో రూ. 1,788 కోట్లు వెచ్చించవలసి ఉంటుంది. దీంతో మొత్తం రూ. 6,334 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇక మరోవైపు వేలుమణి ఏపీఐ హోల్డింగ్స్‌లో 5 శాతం వరకూ వాటా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
థైరోకేర్- పెర్సిస్టెంట్ సిస్టమ్స్.. దూకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ పనితీరును చూపనుందన్న అంచనాలతో హెల్త్‌కేర్ రంగ కంపెనీ థైరోకేర్ టెక్నాలజీస్‌కు డిమాండ్ నెలకొంది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పతన మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు ఇలా.. థైరోకేర్ టెక్నాలజీస్ ఈ ఏడాది క్యూ2 ఫలితాలపై అంచనాలు పెరగడంతో డయాగ్నోస్టిక్ సేవల కంపెనీ థైరోకేర్ టెక్నాలజీస్ కౌంటర్ జోరు చూపుతోంది. తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 1,165కు చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 6.6 శాతం జంప్‌చేసి రూ. 1,129 వద్ద ట్రేడవుతోంది. క్యూ2 ఫలితాల విడుదలకు వీలుగా బుధవారం(28న) బోర్డు సమావేశంకానున్నట్లు థైరోకేర్ టెక్నాలజీస్ వెల్లడించింది. ఇదేవిధంగా వాటాదారులకు మధ్యంతర డివిడెండ్ చెల్లించే అంశంపైనా బోర్డు చర్చించనున్నట్లు తెలియజేసింది. కాగా.. గత నెల రోజుల్లో థైరోకేర్ టెక్నాలజీస్ షేరు 50 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఇందుకు క్యూ1లో సాధించిన పటిష్ట ఫలితాలు దోహదపడినట్లు నిపుణులు చెబుతున్నారు. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈ ఏడాది క్యూ2లో కన్సాలిడేటెడ్ నికర లాభం 13 శాతంపైగా ఎగసి రూ. 102 కోట్లకు చేరినట్లు పెర్సిస్టెంట్ సిస్టమ్స్ పేర్కొంది. త్రైమాసిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం 1.7 శాతం పుంజుకుని రూ. 1008 కోట్లను తాకింది. ఇబిటా 13 శాతం బలపడి రూ. 166 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో పెర్సిస్టెంట్ సిస్టమ్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 4 శాతం జంప్‌చేసి రూ. 1,220ను తాకింది. ప్రస్తుతం 2.4 శాతం లాభంతో రూ. 1,200 వద్ద ట్రేడవుతోంది. -
శ్రీకాళహస్తి పైప్స్, ఎలక్ట్రోస్టీల్ బోర్లా- థైరోకేర్ జూమ్
రెండు కంపెనీల విలీనానికి ఆయా బోర్డులు ఆమోదముద్ర వేసిన వార్తలతో శ్రీకాళహస్తి పైప్స్, ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో మెరుగైన పనితీరు ప్రదర్శించనున్న అంచనాలతో హెల్త్‌కేర్ రంగ కంపెనీ థైరోకేర్ టెక్నాలజీస్ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. వెరసి శ్రీకాళహస్తి పైప్స్, ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ షేర్లు పతనంకాగా.. థైరోకేర్ టెక్నాలజీస్ కౌంటర్ దూకుడు చూపుతోంది. వివరాలు చూద్దాం.. విలీన ఎఫెక్ట్ విలీన ముసాయిదా ప్రతిపాదనలపై అటు శ్రీ కాళహస్తి పైప్స్(ఎస్పీఎల్), ఇటు ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్(ఈసీఎల్) బోర్డులు ఆమోదముద్ర వేశాయి. సోమవారం సమావేశమైన బోర్డు ఇందుకు అనుమతించినట్లు రెండు కంపెనీలూ పేర్కొన్నాయి. విలీనంలో భాగంగా ఎస్పీఎల్ వాటాదారులు తమ వద్ద గల ప్రతీ 10 షేర్లకుగాను 59 ఈసీఎల్ షేర్లను పొందనున్నట్లు తెలియజేశాయి. ఈ వార్తలతో ఎన్ఎస్ఈలో తొలుత ఎస్పీఎల్ షేరు 18 శాతం కుప్పకూలింది. రూ. 109కు చేరింది. ప్రస్తుతం 14.5 శాతం పతనంతో రూ. 114 వద్ద ట్రేడవుతోంది. ఇక ఈసీఎల్ సైతం తొలుత 13 శాతం తిరోగమించి రూ. 20ను తాకింది. ప్రస్తుతం 8.2 శాతం నష్టంతో రూ. 21.30 వద్ద ట్రేడవుతోంది. థైరోకేర్ టెక్నాలజీస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 171 శాతం జంప్‌చేసినట్లు థైరోకేర్ టెక్నాలజీస్ తాజాగా వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన 37 శాతం పెరిగినట్లు తెలియజేసింది. కోవిడ్- పీసీఆర్, కోవిడ్- యాంటీబాడీ పరీక్షలు ఇందుకు సహకరించినట్లు పేర్కొంది. ఈ కాలంలో 4 లక్షలకుపైగా కోవిడ్- 19.. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించినట్లు తెలియజేసింది. దీంతో థైరోకేర్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 17 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 910 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 15 శాతం లాభంతో రూ. 890 వద్ద ట్రేడవుతోంది. -
మ్యాక్స్ హెల్త్‌కేర్- థైరోకేర్.. భల్లేభల్లే
ఒడిదొడుకుల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్లాక్‌డీల్స్ ద్వారా భారీ సంఖ్యలో షేర్లు చేతులు మారినట్లు వెల్లడికావడంతో మ్యాక్స్ హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్ కౌంటర్ వెలుగులో నిలుస్తోంది. మరోపక్క కొత్త సీఈవో ఎంపికకు వీలుగా చైర్మన్ వేలుమణికి అధికారాలను అప్పగిస్తూ బోర్డు తీర్మానించడంతో థైరోకేర్ టెక్నాలజీస్ కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. మ్యాక్స్ హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్ ఉదయం సెషన్లో మ్యాక్స్ హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్ కౌంటర్లో బ్లాక్‌డీల్స్ ద్వారా 4.7 కోట్ల షేర్లు చేతులు మారినట్లు బీఎస్ఈ డేటా వెల్లడించింది. ఇది కంపెనీ ఈక్విటీలో 5.2 శాతం వాటాకు సమానంకాగా.. కొనుగోలుదారులు, అమ్మకందారుల వివరాలు వెల్లడికాలేదు. ఈ నేపథ్యంలో మ్యాక్స్ హెల్త్‌కేర్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 18.5 శాతం దూసుకెళ్లింది. రూ. 132ను అధిగమించింది. తదుపరి కొంత మందగించింది. ప్రస్తుతం 13.3 శాతం ఎగసి రూ. 127 వద్ద ట్రేడవుతోంది. మ్యాక్స్ ఇండియాకుగల హెల్త్‌కేర్ ఆస్తులతో ప్రత్యేక కంపెనీగా మ్యాక్స్ హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటైన విషయం విదితమే. థైరోకేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ కొత్త సీఈవోను ఎంపిక చేసేందుకు చైర్మన్ డాక్టర్ ఎ.వేలుమణికి అధికారాలను ఇస్తూ బోర్డు తీర్మానించినట్లు థైరోకేర్ టెక్నాలజీస్ తాజాగా పేర్కొంది. సీఎఫ్‌వో, సీఐవో తదితర పదవులకు సైతం సరైన వ్యక్తులను ఎంపిక చేసేందుకు వేలుమణికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేసింది. తద్వారా చైర్మన్ ఎంపిక చేసిన అభ్యర్ధుల పదవీకాలం, వేతనాలు తదితరాలను బోర్డు పరిశీలిస్తుందని వివరించింది. ఈ నేపథ్యంలో థైరోకేర్ టెక్నాలజీస్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 795 వద్ద ట్రేడవుతోంది. తొలుత 6 శాతం ఎగసి రూ. 810 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
యాంటీ బాడీస్.. టూ పాజిటివ్...
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ వైరస్‌తో సమానంగా..దాన్ని ఎదుర్కొనే యాంటీ బాడీస్ సైతం యమస్పీడ్గానే వృద్ధి చెందుతున్నాయని ప్రముఖ ల్యాబొరేటరీ థైరోకేర్ వెల్లడించింది. ఇరవై రోజుల పాటు 65 నగరాల్లో నిర్వహించిన యాంటీ బాడీ టెస్టుల్లో మహారాష్ట్రలోని భివాండీ ఫస్ట్‌ప్లేస్‌లో ఉండగా, బెంగళూరు పీన్యా దసరహళ్లి సెకండ్ప్లేస్, ఢిల్లీలోని ఆనంద్ విహార్ థర్డ్, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నాల్గో ప్లేస్‌లో నిలిచాయి. థైరోకేర్ ల్యాబ్ ఎండీ డాక్టర్ వేలుమణి వెల్లడించిన వివరాల మేరకు...థైరోకేర్ ల్యాబ్ కంపెనీలతో పాటు వ్యక్తులకూ యాంటీ బాడీ టెస్టులు నిర్వహిస్తోంది. ఎలిసా, క్లియా కిట్స్‌ను ఈ టెస్టుల కోసం వినియోగిస్తోంది. గత నెల 23 నుంచి ఈ నెల 19 వరకు. దేశవ్యాప్తంగా 65 నగరాల్లో తమ థైరో కేర్ల్యాబ్ 74,809 యాంటీ బాడీ టెస్టులు నిర్వహించిందన్నారు. వీటిలో 60 వేల టెస్టుల ఫలితాలను ఆయన విశ్లేషించారు. ఈ శాంపిల్స్ ద్వారా పాజిటివిటీ రేట్ 17.5 శాతంగా ఉందన్నారు. అంటే 13,036 యాంటీ బాడీస్ టెస్టులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయన్నారు. పరీక్షలు చేశారిలా .. అయితే ఇదేమీ ప్రణాళికా బద్ధంగా చేసిన స్టడీ కాదని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ పరీక్షల కోసం తాము ఉన్నత స్థాయి వర్గాలు, వైట్ కాలర్ ఉద్యోగులనే ఎక్కువగా ఎంచుకున్నట్టు తెలిపారు. దిగువ స్థాయి వర్గాలు దాదాపుగా లేనే లేవన్నారు. ఈ డేటాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు అందజేశామన్నారు. ఈ డేటాను విశ్లేషించాల్సిన బాధ్యత వారిదేనన్నారు.తాము ఎవరిని పరీక్షించాలో ఎంపిక చేసుకోలేదని, పరీక్ష కోరుకున్నవారినే పరీక్షించామని అంటున్నారు. జూలై 30 కల్లా 1.2 లక్షల టెస్టులు నిర్వహిస్తామని తద్వారా మరింత స్పష్టమైన ఫలితాలు వెల్లడిస్తామని సంస్థ వెల్లడించింది. దేశంలోనే టాప్ భివాండీ... మొత్తం 600 పిన్‌కోడ్స్ వ్యాప్తంగా 20 రోజుల పాటు నారిమన్ పాయింట్ నుంచి జార్ఖండ్ దాకా నిర్వహించిన పరీక్షల డేటా ద్వారా థైరోకేర్ వేస్తున్న అంచనాల ప్రకారం దాదాపుగా 15 శాతం భారతీయులు ఇప్పటికే నోవల్ కరోనా వైరస్‌తో పోరాటానికి అవసరమైన యాంటీ బాడీస్‌ని సంతరించుకున్నారు. ఇందులో 3 శాతం ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు. ఈ డేటా ప్రకారం దేశంలో ఇప్పటికే 18 కోట్ల మందిలో కరోనా వైరస్‌ను ఎదుర్కునే యాంటీ బాడీస్ వృద్ధి చెందాయి. అంటే అంత మందికి కరోనా సోకింది. ఇక ఈ డేటా ప్రకారం అత్యధిక పాజిటివిటీ ఉన్న ప్రాంతం థానేలోని భివాండీ. ఇక్కడ 47.1 శాతం పాజిటివిటీ నమోదైంది. బెంగుళూర్లోని పీన్యా దసరహల్లి ప్రాంతం 44 శాతంతో రెండవ స్థానంలో ఉంది. ఇక 37.7 శాతంతో ఢిల్లీలోని ఆనంద్‌విహార్ ఈ జాబితాలో మూడో స్థానం దక్కించుకుంది. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ ఏరియా 37.3 శాతంతో నాల్గో స్థానంలో నిలిచింది. 0.7 శాతంతో అత్యల్ప పాజిటివ్ రేట్ ఉన్న ప్రాంతంగా మహారాష్ట్రలోని అలీభాగ్ ఏరియా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. యాంటీబాడీస్...టూ పాజిటివ్... ఈ యాంటీ బాడీ టెస్టులు ద్వారా పాజిటివ్‌గా నిర్ధారణ అవడం అంటే.. అప్పటికే టెస్టు చేయడానికి 15 నుంచి 21 రోజులకు ముందే ఆ వ్యక్తికి వైరస్ సోకినట్టు అర్థమని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. తాము కనుగొనాల్సిన యాంటీ బాడీస్‌ను ఈ పరీక్షలు అన్వేషిస్తాయని, ఈ యాంటీ బాడీస్ వైరస్ సోకిన 14 రోజుల తర్వాత ఉత్పత్తవుతాయని వివరించారు. అయితే వీటిలో మరో రకం యాంటీబాడీస్ మాత్రం ఇన్పెక్షన్ సోకిన 7 రోజులకు ఉత్పత్తి అవుతాయన్నారు. యాంటీ బాడీస్‌ని నమోదు చేయడం అనేది కేవలం థైరోకేర్ సంస్థ మాత్రమే కాదు.. ఢిల్లీకి చెందిన సెరో సర్వే కూడా గతంలో ఈ రకమైన లెక్కింపు చేసింది. తొలిదశలో కోవిడ్ వ్యాప్తిపై ఈ సంస్థ నిర్వహించిన స్టడీలో ఢిల్లీకి చెందిన దాదాపు 23.48 శాతం మందిలో యాంటీబాడీస్ వృద్ధి కనిపించింది. మరో రకంగా చెప్పాలంటే అంత మంది కరోనా బారిన పడ్డారు. అయితే వీరిలో చాలా మందికి ఏ విధమైన లక్షణాలూ కనపడక పోవడం వల్ల ఈ విషయం తెలియనే తెలియదు. -
ఆ 18 కోట్ల మందికి కరోనా భయం లేదు..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా వైరస్‌ను మాత్రం కట్టడి చేయలేకపోతున్నాయి. దీంతో తొందరగా కరోనా టెస్టులు చేయాల్సిన అవశ్యకత పెరిగింది. ఎందుకంటే పరీక్షలు చేయడం అలస్యమైతే కరోనా ఒకరి నుంచి మరొకరికి వారి నుంచి ఇంకొంత మందికి వేగంగా వ్యాపిస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దేశంలో కోవిడ్-19కు సంబంధించి రెండు రకాల పరీక్షలను ఆమోదించింది. అవి ఆర్టీ- పీసీఆర్ పరీక్షలు, యాంటీబాడీ పరీక్షలు. ఈ పరీక్షలను ప్రభుత్వ అనుమతి పొందిన కొన్ని ప్రైవేట్ ల్యాబ్‌లు కూడా నిర్వహించవచ్చు. అలాంటి ఒక ల్యాబ్ థైరోకేర్. ఇది 60,000 పరీక్షలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడయ్యింది. చదవండి: ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లు సగం మనకే My #Guesstimate after 60,000 AB testing: 15% globally have had COVID exposure and remain immunized. In India only 1/10,000 exposed die, high immunity. In western rich countries 1/500 exposed die, poor immunity. Data says after March 2021, vaccine will have less value. https://t.co/PuYu6zK5F7 — Antibody Velumani. (@velumania) July 19, 2020 18 కోట్ల మంది భారతీయులు ఇప్పటికే కోవిడ్ రోగనిరోధక శక్తిని కలిగి ఉండవచ్చని థైరోకేర్ డేటా పేర్కొంది. దేశంలో దాదాపు 15 శాతం మంది కరోనా వైరస్ కు వ్యతిరేకంగా తమ శరీరంలో యాంటీబాడీస్ కలిగి వుండవచ్చని తమ డేటాలో తేలిందని తెలియజేసింది. దేశంలోని 600 ప్రాంతాల్లో 60 వేల మందిపై సుమారు 20 రోజుల పాటు ఈ సంస్థ యాంటీ బాడీ పరీక్షలు నిర్వహించింది. దేశంలో దాదాపు 15 శాతం మందిలో ఇప్పటికే ప్రతినిరోధకాలు అభివృద్ధి చెందినట్లు తెలుస్తోందని స్టడీ తెలిపింది. ఈ విషయాన్ని థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ వెలుమని ట్విట్టర్ ద్వారా తెలిపారు. తమ అంచనాల్లో 3శాతం అటూఇటుగా ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ డేటా ప్రకారం, యాంటీబాడీలను అభివృద్ధి చేసుకున్న జాబితాలో థానేలోని బివాండీ టాప్ లో ఉంది. ఆ తర్వాత బెంగుళూరులోని పీణ్య ఉంది. ఇక మరోవైపు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనా మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. అయితే ఒకసారి శరీరంలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందితే వారికి కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.ఇప్పటి వరకు భారతదేశంలో 1.24 మిలియన్ కరోనా కేసులు నమోదు కాగా, 29,861 మంది మరణించారు. చదవండి: 24 గంటల్లో 45,720 పాజిటివ్ కేసులు -
మరిన్ని ప్రాంతాలకు థైరోకేర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ చైన్ థైరోకేర్ టెక్నాలజీస్ చిన్న పట్టణాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 8 ల్యాబ్‌లు ఉన్నాయి. 2020 నాటికి వీటి సంఖ్య 60కి చేరుకుంటుందని థైరోకేర్ ఫౌండర్ డాక్టర్ వేలుమణి శుక్రవారమిక్కడ తెలిపారు. విజయవాడ, వైజాగ్‌లో కూడా వీటిని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఒక్కో కేంద్రానికి కంపెనీ రూ.4 కోట్లు ఖర్చు చేస్తోంది. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కీలకోపన్యాసం చేసిన ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. 1,000 నగరాలు, పట్టణాల్లో 3,000 ఫ్రాంచైజీల ద్వారా శాంపిల్ కలెక్షన్ సెంటర్లను నిర్వహిస్తున్నామని చెప్పారు. అతితక్కువ వ్యయానికే సేవలు అందిస్తూ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నామని వివరించారు. రోజుకు 3,00,000 పరీక్షలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఫ్రెషర్లకే ఉద్యోగాలు.. కంపెనీ ఉద్యోగులు 1,200 మంది ఉన్నారు. వీరిలో ఫ్రెషర్లే 98 శాతం అని వేలుమణి చెప్పారు. ‘కంపెనీ ఏర్పాటుకు ముందు 50 ఉద్యోగాలకు ఇంటర్వ్యూకు వెళ్లినా అనుభవం లేదన్న కారణంతో నన్ను రిజెక్ట్ చేశారు. అందుకే ఫ్రెషర్లను మాత్రమే తీసుకోవాలన్న ది మా అభిమతం. రెండేళ్లలో శాంపిల్ కలెక్షన్ కేంద్రా లు మరో 7,000 రానున్నాయి. ప్రతి కేంద్రం ద్వారా కనీసం 35 మందికి ఉపాధి లభిస్తోంది. ఫ్రాంచైజీల వద్ద 10,000 పైచిలుకు కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ పనిచేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.350 కోట్ల టర్నోవర్ నమోదు చేశాం. 2020 నాటికి రూ.600 కోట్లు లక్ష్యంగా చేసుకున్నాం. 5 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నాం’ అని పేర్కొన్నారు. -
నేటి నుంచి థైరోకేర్ ఐపీఓ
ధర శ్రేణి రూ.420-446 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డయాగ్నస్టిక్స్ ల్యాబొరేటరీ చెయిన్‌ను నిర్వహిస్తున్న థైరోకేర్ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 29న (శుక్రవారం) నాడు ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఒక్కోటి రూ.10 ముఖ విలువగల 1.07 కోట్ల షేర్లను జారీ చేయనున్నారు. ఈ ఐపీఓకు ధరల శ్రేణిని రూ.420-రూ.446గా కంపెనీ నిర్ణయించింది. ఈ ధరల శ్రేణిలో గరిష్ట స్థాయి ధర ప్రకారం చూస్తే ఈ కంపెనీ ఈ ఐపీఓ ద్వారా రూ.480 కోట్లు సమీకరించనున్నదని అంచనా. ఈ ఐపీఓకు ఎడిల్‌వేజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సంస్థలు లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. థైరో కేర్ కంపెనీకి డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, ఎస్ఆర్ఎల్ డయాగ్నస్టిక్స్, మెట్రోపొలిస్ హెల్త్‌కేర్, అపోలో క్లినిక్‌ల నుంచి గట్టి పోటీనే ఉంది.