నేటి నుంచి థైరోకేర్ ఐపీఓ
ధర శ్రేణి రూ.420-446
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డయాగ్నస్టిక్స్ ల్యాబొరేటరీ చెయిన్‌ను నిర్వహిస్తున్న థైరోకేర్ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 29న (శుక్రవారం) నాడు ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఒక్కోటి రూ.10 ముఖ విలువగల 1.07 కోట్ల షేర్లను జారీ చేయనున్నారు. ఈ ఐపీఓకు ధరల శ్రేణిని రూ.420-రూ.446గా కంపెనీ నిర్ణయించింది. ఈ ధరల శ్రేణిలో గరిష్ట స్థాయి ధర ప్రకారం చూస్తే ఈ కంపెనీ ఈ ఐపీఓ ద్వారా రూ.480 కోట్లు సమీకరించనున్నదని అంచనా. ఈ ఐపీఓకు ఎడిల్‌వేజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సంస్థలు లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. థైరో కేర్ కంపెనీకి డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, ఎస్‌ఆర్‌ఎల్ డయాగ్నస్టిక్స్, మెట్రోపొలిస్ హెల్త్‌కేర్, అపోలో క్లినిక్‌ల నుంచి గట్టి పోటీనే ఉంది.