సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా వైరస్‌ను మాత్రం కట్టడి చేయలేకపోతున్నాయి. దీంతో తొందరగా కరోనా టెస్టులు చేయాల్సిన అవశ్యకత పెరిగింది. ఎందుకంటే పరీక్షలు చేయడం అలస్యమైతే కరోనా ఒకరి నుంచి మరొకరికి వారి నుంచి ఇంకొంత మందికి వేగంగా వ్యాపిస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దేశంలో కోవిడ్-19కు సంబంధించి రెండు రకాల పరీక్షలను ఆమోదించింది. అవి ఆర్‌టీ- పీసీఆర్ పరీక్షలు, యాంటీబాడీ పరీక్షలు. ఈ పరీక్షలను ప్రభుత్వ అనుమతి పొందిన కొన్ని ప్రైవేట్ ల్యాబ్‌లు కూడా నిర్వహించవచ్చు. అలాంటి ఒక ల్యాబ్ థైరోకేర్. ఇది 60,000 పరీక్షలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడయ్యింది.
చదవండి: ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌లు సగం మనకే
My #Guesstimate after 60,000 AB testing:
— Antibody Velumani. (@velumania) July 19, 2020
15% globally have had COVID exposure and remain immunized.
In India only 1/10,000 exposed die, high immunity.
In western rich countries 1/500 exposed die, poor immunity.
Data says after March 2021, vaccine will have less value. https://t.co/PuYu6zK5F7
18 కోట్ల మంది భారతీయులు ఇప్పటికే కోవిడ్ రోగనిరోధక శక్తిని కలిగి ఉండవచ్చని థైరోకేర్ డేటా పేర్కొంది. దేశంలో దాదాపు 15 శాతం మంది కరోనా వైరస్ కు వ్యతిరేకంగా తమ శరీరంలో యాంటీబాడీస్ కలిగి వుండవచ్చని తమ డేటాలో తేలిందని తెలియజేసింది. దేశంలోని 600 ప్రాంతాల్లో 60 వేల మందిపై సుమారు 20 రోజుల పాటు ఈ సంస్థ యాంటీ బాడీ పరీక్షలు నిర్వహించింది. దేశంలో దాదాపు 15 శాతం మందిలో ఇప్పటికే ప్రతినిరోధకాలు అభివృద్ధి చెందినట్లు తెలుస్తోందని స్టడీ తెలిపింది. ఈ విషయాన్ని థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ వెలుమని ట్విట్టర్ ద్వారా తెలిపారు. తమ అంచనాల్లో 3శాతం అటూఇటుగా ఉండవచ్చని పేర్కొన్నారు.
ఈ డేటా ప్రకారం, యాంటీబాడీలను అభివృద్ధి చేసుకున్న జాబితాలో థానేలోని బివాండీ టాప్ లో ఉంది. ఆ తర్వాత బెంగుళూరులోని పీణ్య ఉంది. ఇక మరోవైపు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనా మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. అయితే ఒకసారి శరీరంలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందితే వారికి కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.ఇప్పటి వరకు భారతదేశంలో 1.24 మిలియన్ కరోనా కేసులు నమోదు కాగా, 29,861 మంది మరణించారు. చదవండి: 24 గంటల్లో 45,720 పాజిటివ్ కేసులు
Comments
Please login to add a commentAdd a comment