IT jobs data: దేశంలో ఐటీ రంగంలో ఉద్యోగాల పరిస్థితి దారుణంగా మారింది. నియామకాలు బాగా తగ్గిపోయాయి. దేశంలోని వివిధ రంగాల్లో ఉద్యోగ నియామయాల పరిస్థితిని ప్రముఖ జాబ్ పోర్టల్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఐటీ, ఇన్సూరెన్స్, ఆటో, హెల్త్‌కేర్ బీపీఓ రంగాల్లోని వైట్ కాలర్ నియామకాలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 6 శాతం తగ్గాయి.
జాబ్ పోర్టల్ నౌకరీ (Naukri) డేటా ప్రకారం.. 2023 ఆగస్టులో 2,666 జాబ్ పోస్టింగ్‌లు వచ్చాయి. గతేడాది ఆగస్టు నెలలో 2,828 జాబ్ పోస్టింగ్‌లు వచ్చాయి. కాగా నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ (Naukri JobSpeak Index) ప్రకారం ఈ ఏడాది జులైలో 2,573 జాబ్ పోస్టింగ్‌లతో పోలిస్తే ఈ ఆగస్టులో నియామకాలు 4 శాతం పెరిగాయి.
భారీగా తగ్గిన కొత్త జాబ్‌లు
ఐటీ పరిశ్రమలో కొత్త ఉద్యోగాలు గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 33 శాతం తగ్గాయి. ఐటీతో పాటు, బీమా, ఆటో, హెల్త్‌కేర్,బీపీఓ వంటి రంగాలు కూడా గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే కొత్త ఉద్యోగాల కల్పనలో వరుసగా 19 శాతం, 14 శాతం, 12 శాతం, 10 శాతం క్షీణించినట్లుగా నివేదిక పేర్కొంది.
జాబ్ మార్కెట్‌లో టెక్ రంగం ఇప్పటికీ కష్టపడుతుండగా, నాన్-టెక్ సెక్టార్‌లో మాత్రం నియామకాలు పెరిగాయి. నివేదిక ప్రకారం ఆయిల్&గ్యాస్, హాస్పిటాలిటీ, ఫార్మా రంగాలలో కొత్త ఉద్యోగాలలో అత్యధిక వృద్ధి కనిపించింది. గత ఏడాది ఆగస్టుతో పోల్చితే ఈ రంగాల్లో రిక్రూట్‌మెంట్ వరుసగా 17 శాతం, 14 శాతం, 12 శాతం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment