white collar jobs
-
ఐటీ ఉద్యోగ నియామకాల పరిస్థితి ఇదీ..
ముంబై: వైట్ కాలర్ ఉద్యోగుల (నైపుణ్య, నిర్వహణ విధులు) నియామకాలు నవంబర్ నెలలో 2 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, కృత్రిమ మేథ–మెషిన్ లెర్నింగ్ (ఏఐ/ఎంఎల్), ఎఫ్ఎంసీజీ రంగాల్లో నియామకాలు సానుకూలంగా నమోదయ్యాయి. నవంబర్ నెలకు సంబంధించిన గణాంకాలను నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ విడుదల చేసింది.నౌకరీ ప్లాట్‌ఫామ్‌పై వైట్‌కాలర్ ఉద్యోగాలకు సంబంధించి 2,430 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 2 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో 16 శాతం, ఫార్మా/బయోటెక్ రంగంలో 7 శాతం, ఎఫ్ఎంసీజీ రంగంలో 7 శాతం, రియల్ ఎస్టేట్‌లో 10 శాతం చొప్పున వైట్ కాలర్ నియామకాలు అధికంగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఏఐ/ఎంఎల్ విభాగంలో 30 శాతం, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లలో 11 శాతం అధికంగా ఉపాధి కల్పన జరిగినట్టు నౌకరీ నివేదిక తెలిపింది.ఐటీ రంగంలో వైట్ కాలర్ నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చిచూసినప్పుడు ఎలాంటి వృద్ధి లేకుండా ఫ్లాట్‌గా నమోదైంది. పండుగల సీజన్ మద్దతుతో ఇతర రంగాల్లో నియామకాలు మోస్తరుగా ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే రాజస్థాన్ ముందుంది. జైపూర్ 14 శాతం, ఉదయ్‌పూర్ 24 శాతం, కోటలో 15 శాతం వైట్ కాలర్ నియామకాలు పెరిగాయి. జైపూర్‌లో విదేశీ ఎంఎన్సీ కంపెనీల తరఫున నియామకాలు 20 శాతం పెరిగాయి. భువనేశ్వర్‌లో 21 శాతం వృద్ధి కనిపించింది. -
భారీగా తగ్గిపోయిన నియామకాలు.. ఐటీ రంగం ప్రభావంతోనే!
ముంబై: కార్యాలయ ఉద్యోగ నియామకాలు (వైట్ కాలర్) 2023 డిసెంబర్ నెలలో భారీగా తగ్గిపోయాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 16 శాతం మేర తగ్గినట్లు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్‌లో వెల్లడైంది. ఐటీ, బీపీవో, విద్య, రిటైల్, హెల్త్‌కేర్ రంగాల్లో నియామకాల పట్ల అప్రమత్త ధోరణే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ‘‘2023 నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్ నెలలో కార్యాలయ ఉద్యోగ నియామకాలు 2 శాతం పెరిగాయి. ఐటీయేతర రంగాల్లో నియామకాలు ఇందుకు అనుకూలించాయి. నౌకరీ జాబ్ స్పీక్ సూచీ 16 శాతం తగ్గిపోవడానికి ఐటీ రంగమే ఎక్కువ ప్రభావం చూపించింది. ఐటీలో నియామకాలు పూర్తి స్థాయిలో సాధారణ స్థాయికి చేరుకునేందుకు ఎక్కువ కాలమే వేచి చూడాల్సి రావచ్చు’’ అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వెల్లడించారు. నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ డిసెంబర్ నెల గణాంకాల ప్రకారం.. బీపీవో రంగంలో (వార్షికంగా క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు) నియామకాలు 17 శాతం తగ్గాయి. విద్యా రంగంలో 11 శాతం, రిటైల్‌లో 11 శాతం, హెల్త్‌కేర్‌లో 10 శాతం చొప్పున తగ్గాయి. ఐటీ రంగంలో నియామకాలు ఏకంగా 21 శాతం పడిపోయాయి. క్రితం ఏడాది నవంబర్‌తో పోల్చి చూసినప్పుడు ఐటీ నియామకాలు 4 శాతం తగ్గాయి. డేటా సైంటిస్ట్లకు డిమాండ్.. ఐటీలో నియామకాల పట్ల అప్రమత్త ధోరణి నెలకొన్నప్పటికీ.. ఫుల్ స్టాక్ డేటా సైంటిస్ట్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్, ఆటోమేషన్ ఇంజనీర్లకు మంచి డిమాండ్ కనిపించింది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో నియామకాలు ఫ్లాట్‌గా (పెరగకుండా/తగ్గకుండా) ఉన్నాయి. నౌకరీ డాట్ కామ్ ప్లాట్‌ఫామ్‌పై కొత్త జాబ్ పోస్టింగ్‌లు, నియామకాల ధోరణులు, ఉద్యోగాలకు సంబంధించిన శోధనల సమాచారాన్ని ఈ నివేదిక ప్రతిఫలిస్తుంటుంది. ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ)లోనూ నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 4 శాతం పెరిగాయి. ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్లో ఆతిథ్య రంగ నియామకాలు ఎక్కువగా నమోదయ్యాయి. 16 ఏళ్ల అనుభవం ఉన్న వారికి అధిక డిమాండ్ నెలకొంది. ఫార్మా రంగంలోనూ 2 శాతం అధిక నియామకాలు నమోదయ్యాయి. అహ్మదాబాద్, వదోదర, ముంబైలో ఫార్మా నియామకాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 17 శాతం డౌన్ డిసెంబర్ నెలలో హైదరాబాద్‌లో నియామకాలు 17 శాతం తక్కువగా నమోదయ్యాయి. చెన్నై, బెంగళూరులో అయితే 23 శాతం చొప్పున తగ్గాయి. పుణెలో 15 శాతం తగ్గినట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. -
వైట్ కాలర్ ఉద్యోగాలకు డిమాండ్ డౌన్
ముంబై: ఐటీ–సాఫ్ట్వేర్, టెలికం, విద్యా రంగాల్లో నియామకాలు మందగించిన నేపథ్యంలో అక్టోబర్–నవంబర్‌లో వైట్ కాలర్ ఉద్యోగాలకు హైరింగ్ తగ్గింది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12 శాతం క్షీణించింది. నౌకరీ జాబ్‌స్పీక్ సూచీకి సంబంధించిన నివేదిక ప్రకారం 2022 అక్టోబర్–నవంబర్‌లో 2,781 జాబ్ పోస్టింగ్స్ నమోదు కాగా ఈసారి అదే వ్యవధిలో 2,433 పోస్టింగ్స్ మాత్రమే నమోదయ్యాయి. నౌకరీడాట్‌కామ్‌లో సంస్థలు పోస్ట్ చేసే ఉద్యోగావకాశాలను బట్టి దేశీయంగా ప్రతి నెలా నియామకాల ధోరణిని నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ సూచిస్తుంది. మేనేజర్లు, క్లర్కులు, అడ్మిని్రస్టేషన్ సిబ్బంది మొదలైన ఆఫీసు ఆధారిత కొలువులను వైట్ కాలర్ ఉద్యోగాలుగా వ్యవహరిస్తారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► టెలికంలో 18 శాతం, విద్యా రంగంలో 17 శాతం, రిటైలింగ్ రంగంలో 11 శాతం మేర వైట్ కాలర్ నియామకాలు తగ్గాయి. ఆతిథ్య, ట్రావెల్, ఆటో, ఆటో విడిభాగాల రంగాల్లో హైరింగ్‌లో పెద్దగా మార్పులేమీ లేవు. ►ఇంధన కంపెనీలు వేగంగా కార్యకలాపాలు విస్తరిస్తుండటం, దేశవ్యాప్తంగా కొత్త రిఫైనరీలను ఏర్పాటు చేస్తుండటం వంటి సానుకూల పరిణామాలతో ఆయిల్, గ్యాస్ రంగాల్లో హైరింగ్ 9 శాతం పెరిగింది. ►కొత్త ఉద్యోగావకాశాలు ఫార్మా రంగంలో 6 శాతం, బీమా రంగంలో 5 శాతం పెరిగాయి. ►ఐటీ రంగంలో మొత్తం మీద హైరింగ్ 22 శాతం క్షీణించింది. అయితే అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌లో నియామకాలు 1 శాతం మేర పెరిగాయి. ►ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ సంబంధ మెషిన్ లెరి్నంగ్ ఇంజినీర్లకు అవకాశాలు 64 శాతం మేర, ఫుల్ స్టాక్ డేటా సైంటిస్టులకు కొత్త ఉద్యోగాలు 16 శాతం మేర పెరిగాయి. ►మెట్రోలతో పోలిస్తే నాన్–మెట్రోల్లోనే ఎక్కువగా హైరింగ్ కార్యకలాపాలు ఉన్నాయి. వదోదరలో అత్యధికంగా 9 శాతం కొత్త ఉద్యోగాల పోస్టింగ్స్ నమోదయ్యాయి. ►ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై వంటి మెట్రోల్లో నియామకాలు చెరి 12 శాతం మేర, ఐటీ ప్రధానమైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణెలో వరుసగా 20 శాతం, 18 శాతం, 21 శాతం, 18 శాతం మేర హైరింగ్ క్షీణించింది. ►2023 ఆసాంతంలో కనిపించిన ట్రెండ్‌కి అనుగుణంగా అక్టోబర్–నవంబర్‌లో కూడా సీనియర్ ప్రొఫెషనల్స్ వైపే కంపెనీలు మొగ్గు చూపాయి. 16 ఏళ్ల పైబడి అనుభవమున్న సీనియర్ నిపుణుల నియామకాలు 26 శాతం పెరిగాయి. ఫ్రెషర్లకు కొత్త ఆఫర్లు 13 శాతం పడిపోయాయి. -
సెప్టెంబర్‌లో కార్యాలయ ఉద్యోగ నియామకాలు తగ్గుదల
ముంబై: ఐటీ, బీపీవో, ఎఫ్ఎంసీజీ తదితర రంగాల్లో ప్రతికూల ధోరణులతో.. కార్యాలయ ఉద్యోగుల (వైట్ కాలర్) నియామకాలు సెప్టెంబర్‌లో 8.6 శాతం తగ్గాయి. ఆగస్ట్ నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో నియామకాలు 6 శాతం పెరిగినట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ సర్వే నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్‌లో మొత్తం 2,835 మంది కోసం నియామక ప్రకటనలు వెలువడ్డాయి. అంతక్రితం నెలలో 3,103 ఉద్యోగాలకు ప్రకటనలు విడుదలైనట్టు ఈ నివేదిక తెలిపింది. ప్రతి నెలా తన పోర్టల్‌పై వెలువడే పోస్టింగ్‌ల ఆధారంగా నౌకరీ డాట్ కామ్ ఈ నివేదికను విడుదల చేస్తుంటుంది. అంతర్జాతీయంగా అనిశి్చత పరిస్థితుల నేపథ్యంలో ఐటీ రంగంలో నియామకాలు గత కొన్ని నెలలుగా తగ్గుతూ వస్తున్న విషయాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. బీపీవో/ఐటీఈఎస్ రంగంలో 25 శాతం, ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో 23 శాతం చొప్పున నియామకాలు క్షీణించాయి. ‘‘ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం కొనసాగుతూనే ఉంది. బ్యాంకింగ్ రంగలో బలమైన వృద్ధి ఉండడం ఆశావహం. మొత్తం మీద సీక్వెన్షియల్‌గా 6 శాతం వృద్ధిని చూడడం అన్నది భారత ఉద్యోగ మార్కెట్ బలంగా ఉందన్న దాన్ని సూచిస్తోంది’’అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ తెలిపారు. ఆతిథ్యరంగం , రవాణా నియామకాల పరంగా మెరుగైన వృద్ధిని చూశాయి. ఈ రంగాలకు సంబంధించి ముంబైలో ఎక్కువ జాబ్ ఆఫర్లు ఉన్నట్టు నౌకరీ తెలిపింది. సెప్టెంబర్ క్వార్టర్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), హెల్త్‌కేర్ రంగాల్లో 7 శాతం నియాకాల వృద్ధి నమోదైంది. బ్రాంచ్ మేనేజర్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ నిపుణులకు డిమాండ్ నెలకొంది. ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో రంగాల్లో 6 శాతం వృద్ధి కనిపించింది. కొత్త ఉద్యోగ నియామకాల్లో మెట్రోలతో పోలిస్తే, ఇతర పట్టణాల్లో వృద్ధి నెలకొంది. -
ఉద్యోగ నియామకాలు డౌన్
ముంబై: కార్యాలయ ఉద్యోగ నియామకాలు ఆగస్ట్ నెలలో క్షీణత చూశాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చనప్పుడు 6 శాతం తక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఐటీ, బీమా, ఆటోమొబైల్, హెల్త్‌కేర్, బీపీవో రంగాల్లో నియామకాల పరంగా అప్రమత్త ధోరణి కనిపించింది. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో 2,566 ఉద్యోగాలకు సంబంధించి పోస్టింగ్‌లు పడ్డాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఇవి 2,828గా ఉన్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. నౌకరీ సంస్థ తన పోర్టల్‌పై జాబ్ పోస్టింగ్‌లు, ఉద్యోగ అన్వేషణల డేటా ఆధారంగా ప్రతి నెలా నివేదిక విడుదల చేస్తుంటుంది. ఇక ఈ ఏడాది జూలై నెలలో పోస్టింగ్‌లు 2,573తో పోలిస్తే కనుక ఆగస్ట్‌లో నియామకాలు 4 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, హాస్పిటాలిటీ, ఫార్మా రంగాల్లో నియామకాల పట్ల ఆశావహ ధోరణి కనిపించింది. ‘‘ఐటీలోనూ సానుకూల సంకేతలు కనిపించాయి. గడిచిన కొన్ని నెలలుగా ఐటీలో నియామకాలు తగ్గగా, సీక్వెన్షియల్‌గా (జూలైతో పోలిస్తే) ఐటీలో నియామకాలు పెరిగాయి. కార్యాలయ ఉద్యోగాల మార్కెట్లో సాధారణ పరిస్థితులు తిరిగి ఏర్పడుతున్నదానికి ఇది ఆరోగ్యకర సంకేతం’’అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వెల్లడించారు. ఐటీలో 33 శాతం డౌన్ ఐటీ రంగంలో నియామకాలు క్రితం ఏడాది ఆగస్ట్‌తో పోలి్చనప్పుడు, ఈ ఏడాది అదే నెలలో 33 శాతం తక్కువగా నమోదయ్యాయి. బీమా రంగంలో 19 శాతం, ఆటోమొబైల్ రంగంలో 14 శాతం, హెల్త్‌కేర్ రంగంలో 12 శాతం, బీపీవో రంగంలో 10 శాతం చొప్పున నియామకాలు తగ్గాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో నియామకాల పరంగా 17 శాతం వృద్ధి నమోదైంది. అహ్మదాబాద్, ముంబై, చెన్నై, హైదరాబాద్‌లో ఆయిల్ అండ్ గ్యాస్ రంగ నియామకాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. 16 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన నిపుణులకు డిమాండ్ ఎక్కువగా కనిపించింది. ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ)లోనూ నియామకాలు బలంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చనప్పుడు 14 శాతం వృద్ధి కనిపించింది. ఆర్అండ్డీపై దృష్టి పెరగడంతో ఫార్మా రంగంలో 12 శాతం అధికంగా నియామకాలు జరిగాయి. అహ్మదాబాద్, చెన్నైలో ఎక్కువగా ఫార్మా అవకాశాలు లభించాయి. ఏఐ ఉద్యోగాల్లోనూ 8 శాతం వృద్ధి కనిపించింది. మెషిన్ లెరి్నంగ్, ఏఐ సైంటిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్‌ల ఉద్యోగ నియామకాలు కూడా పెరిగాయి. -
దారుణంగా ఐటీ ఉద్యోగాలు.. ప్రముఖ జాబ్ పోర్టల్ రిపోర్ట్!
IT jobs data: దేశంలో ఐటీ రంగంలో ఉద్యోగాల పరిస్థితి దారుణంగా మారింది. నియామకాలు బాగా తగ్గిపోయాయి. దేశంలోని వివిధ రంగాల్లో ఉద్యోగ నియామయాల పరిస్థితిని ప్రముఖ జాబ్ పోర్టల్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఐటీ, ఇన్సూరెన్స్, ఆటో, హెల్త్‌కేర్ బీపీఓ రంగాల్లోని వైట్ కాలర్ నియామకాలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 6 శాతం తగ్గాయి. జాబ్ పోర్టల్ నౌకరీ (Naukri) డేటా ప్రకారం.. 2023 ఆగస్టులో 2,666 జాబ్ పోస్టింగ్‌లు వచ్చాయి. గతేడాది ఆగస్టు నెలలో 2,828 జాబ్ పోస్టింగ్‌లు వచ్చాయి. కాగా నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ (Naukri JobSpeak Index) ప్రకారం ఈ ఏడాది జులైలో 2,573 జాబ్ పోస్టింగ్‌లతో పోలిస్తే ఈ ఆగస్టులో నియామకాలు 4 శాతం పెరిగాయి. భారీగా తగ్గిన కొత్త జాబ్‌లు ఐటీ పరిశ్రమలో కొత్త ఉద్యోగాలు గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 33 శాతం తగ్గాయి. ఐటీతో పాటు, బీమా, ఆటో, హెల్త్‌కేర్,బీపీఓ వంటి రంగాలు కూడా గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే కొత్త ఉద్యోగాల కల్పనలో వరుసగా 19 శాతం, 14 శాతం, 12 శాతం, 10 శాతం క్షీణించినట్లుగా నివేదిక పేర్కొంది. జాబ్ మార్కెట్లో టెక్ రంగం ఇప్పటికీ కష్టపడుతుండగా, నాన్-టెక్ సెక్టార్లో మాత్రం నియామకాలు పెరిగాయి. నివేదిక ప్రకారం ఆయిల్&గ్యాస్, హాస్పిటాలిటీ, ఫార్మా రంగాలలో కొత్త ఉద్యోగాలలో అత్యధిక వృద్ధి కనిపించింది. గత ఏడాది ఆగస్టుతో పోల్చితే ఈ రంగాల్లో రిక్రూట్మెంట్ వరుసగా 17 శాతం, 14 శాతం, 12 శాతం పెరిగింది. -
ఆ ఉద్యోగాలకు ముప్పే.. ఐబీఎం సీఈవో కీలక వ్యాఖ్యలు
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌తో కొన్ని రకాల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ఐబీఎం ఛైర్మన్, సీఈవో అరవింద్ కృష్ణ (Arvind Krishna) అన్నారు. చాట్‌జీపీటీ (ChatGPT), గూగుల్ బార్డ్ (Google Bard) వంటి జెనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ఉత్పాదకతను పెంచగలవని, అయితే "బ్యాక్ ఆఫీస్, వైట్ కాలర్" ఉద్యోగాలపై వాటి ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలలో జనాభా పెరుగుదల క్షీణతను ప్రస్తావించారు. ఏఐ టెక్నాలజీలు మానవులకు నాణ్యమైన జీవనాన్ని అందించడంతో తోడ్పడగలవని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టిఫీషియల్ సానుకూలతను ఉపయోగించుకోవడానికి ఐబీఎం కూడా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఐబీఎం ఇటీవల వాట్సన్‌ఎక్స్‌ను అనే జనరేటివ్ ఏఐ ప్లాట్‌ఫామ్ సూట్‌ను పరిచయం చేసింది. సాంకేతికతను సురక్షితంగా ఉపయోగించుకోవడంలో కంపెనీలకు సహాయం చేయడానికి దీన్ని రూపొందించారు. ఇంతకు ముందు మేనెలలో జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలోనూ ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ కంపెనీలో 30 శాతం ఉద్యోగాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఆటోమేషన్ టెక్నాలజీతో భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఫలితంగా, వచ్చే ఐదేళ్లలో కంపెనీ 7,800 ఉద్యోగాలను తొలగిస్తుందని అంతా ఆందోళన చెందారు. తర్వాత తన వ్యాఖ్యలపై మరింత స్పష్టతనిస్తూ, కొత్త టెక్నాలజీ ఆఫీసు పనిని భర్తీ చేస్తుందని, ఐబీఎంలో కూడా ఇదే జరుగుతుందని పేర్కొన్నారు. -
ఈ రంగాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారా?
ముంబై: కార్యాలయ ఉద్యోగుల నియామకాలు (వైట్ కాలర్) జూన్ నెలలో 3 శాతం తక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఐటీ, బీఎఫ్ఎస్ఐ, తయారీ రంగాలు నియామకాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించినట్టు మానవ వనరుల ప్లాట్‌ఫామ్ ‘ఫౌండిట్’ ఓ నివేదిక విడుదల చేసింది. ఐటీలో 19 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో 13 శాతం, గృహోపకరణాల రంగంలో 26 శాతం, తయారీ రంగంలో 14 శాతం మేర నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు తగ్గాయి. వీటిల్లో కొన్ని రంగాలు నియామకాల విషయంలో మే నెలతో పోల్చిచూసినప్పుడు కాస్త మెరుగైన పనితీరు చూపించాయి. నెలవారీగా జాబ్ పోస్టింగ్‌ల డేటా ఆధారంగా ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్ (గతంలో మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్) ఈ వివరాలు ప్రకటించింది. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే కార్యాలయ ఉద్యోగుల నియామకాలు జూన్ నెలలో 2 శాతం పెరిగాయి. హెల్త్‌కేర్‌లో 11 శాతం, బీపీవోలో 7 శాతం, తయారీలో 5 శాతం, లాజిస్టిక్స్‌లో 9 శాతం మేర నియామకాల్లో వృద్ధి కనిపించింది. ముఖ్యంగా మెట్రోల్లో 3 శాతం మేర అధిక నియామకాలు నమోదయ్యాయి. టైర్–2 పట్టణాల్లో 2 శాతం మేర క్షీణత కనిపించింది. 0–2 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్రెషర్లకు డిమాండ్ నెలకొనగా, మేనేజ్మెంట్ ఉద్యోగుల నియామకాలు 4 శాతం పెరిగాయి. 11–15 ఏళ్ల అనుభవం కలిగి సీనియర్ ఉద్యోగుల నియామకాలు ఒక శాతం, 7–10 ఏళ్ల అనుభవం ఉన్న విభాగంలో 2 శాతం, 4–6 ఏళ్ల అనుభవం కలిగిన విభాగంలో 2 శాతం మేర అధిక నియామకాలు నమోదయ్యాయి. రానున్న త్రైమాసికంలో మెరుగు.. ‘‘మేము ట్రాక్ చేస్తున్న మెజారిటీ రంగాల్లో నియామకాల్లో సానుకూల ధోరణి కనిపించడం ప్రోత్సాహకరంగా అనిపించింది. హెల్త్‌కేర్, తయారీ, ఐటీలోనూ కొంత మేర నియామకాలు పుంజుకున్నాయి. రానున్న త్రైమాసికంలో నియామకాలు మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నాం. కంపెనీలు తమ నైపుణ్య అవసరాలను తిరిగి సమీక్షించుకోనున్నాయి’’అని ఫౌండిట్ సీఈవో శేఖర్ గరీష తెలిపారు. నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకోవడం, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్పును స్వీకరించడం అనేవి ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో ఉద్యోగంలో రాణించేందుకు అవసరమని సూచించారు. ఐటీ రంగంలో కూడా తగ్గాయంటున్న నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ కార్యాలయ ఉద్యోగుల నియామకాలు (వైట్ కాలర్) జూన్ నెలలో మూడు శాతం తగ్గినట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ సర్వేలో తేలిసింది. ఐటీ, రిటైల్, బీపీవో, ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ నియామకాల విషయంలో అప్రమ్తత ధోరణి వ్యవహరించడమే ఇందుకు కారణంగా ఉంది. ముఖ్యంగా ఐటీ రంగంలో గణనీయంగా తగ్గాయి. జూన్ నెలలో 2,795 ఉద్యోగాలకు పోస్టింగ్‌లు పడ్డాయి. 2022 జూన్ నెలలో ఇవి 2,878గానే ఉన్నాయి. ఇక ఈ ఏడాది మే నెల నియామకాలతో పోల్చి చూసినా జూన్‌లో 2 శాతం తగ్గాయి. నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ ప్రతి నెలా ఉద్యోగ మార్కెట్ ధోరణులు, నియామకాల వివరాలను విడుదల చేస్తుంటుంది. కార్యాలయ ఉద్యోగ మార్కెట్ దీర్ఘకాలం తర్వాత నిర్మాణాత్మక మార్పును చూస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ప్రధానంగా ఈ ఉద్యోగాలకు మెట్రో పట్టణాలు కీలక చోదకంగా ఉంటున్నట్టు గుర్తు చేసింది. రియల్ ఎస్టేట్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, బీఎఫ్ఎస్ఐ ఎక్కువ ఉద్యోగాలకు కల్పించినట్టు నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వెల్లడించారు. ఐటీలో ఆందోళనకరం ఐటీ రంగంలో నియామకాల ధోరణి ఇప్పటికీ ఆందోళనకరంగా ఉన్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. గతేడాది జూన్ నెలతో పోల్చిచూసినప్పుడు, ఈ ఏడాది జూన్‌లో ఐటీ నియామకాలు 31 శాతం తక్కువగా నమోదైనట్టు వివరించింది. అన్ని రకాల ఐటీ కంపెనీల్లోనూ ఇదే ధోరణి కనిపించినట్టు తెలిపింది. సాఫ్ట్వేర్ డెవలపర్స్, సిస్టమ్ అనలిస్టులకు డిమాండ్ క్షీణత కొనసాగినట్టు వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఏఐ స్పెషలిస్ట్‌ల నియామకాలు సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో బుల్లిష్ ధోరణి కొనసాగిందని, జూన్‌లో కొత్త ఉద్యోగ నియామకాలు ఈ రంగంలో క్రితం ఏడాది ఇదే మాసంతో పోల్చినప్పుడు 40 శాతం పెరిగాయని పేర్కొంది. పెద్ద ఎత్తున రిఫైనరీ సామర్థ్యాల విస్తరణ, దేశీయ డిమాండ్ అవసరాలను చేరుకునేందుకు కంపెనీల వ్యూహాలు నియామకాలకు మద్దతునిస్తున్నట్టు వివరించింది. ఫార్మా రంగంలో నియామకాలు 14 శాతం పెరిగాయి. ఆటోమొబైల్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్లోనూ నియామకాల గణాంకాలు సానుకూలంగా ఉన్నాయి. అత్యధికంగా అహ్మదాబాద్‌లో కార్యాలయ ఉద్యోగ నియామకాలు జూన్‌లో 23 శాతం వృద్ధి చెందాయి. వదోదరలో 14 శాతం, జైపూర్‌లో స్థిరంగా ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. -
మే నెలలో నియామకాలు ఓకే
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కార్యాలయ ఉద్యోగుల నియామకాలు (వైట్ కాలర్) మే నెలలో 2,849గా ఉన్నాయి. 2023 ఏప్రిల్ నెల నియామకాలతో పోల్చి చూసినప్పుడు 5 శాతం పెరగ్గా, 2022 మే నెలలో నియామకాలు 2,863తో పోల్చినప్పుడు ఎలాంటి వృద్ధి లేకుండా ఫ్లాట్‌గా నియామకాలు ఉన్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వివిధ రంగాల్లో నియామకాల ధోరణలు భిన్నంగా ఉన్నట్టు పేర్కొంది. ఆయిల్ అండ్ గ్యాస్‌తోపాటు, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఫార్మా రంగాలు ఈ ఏడాది మే నెలలో నియామకాల్లో వృద్ధిని ముందుండి నడిపించాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో నియామకాలు ఏకంగా 31 శాతం పెరిగాయి. అదే ఐటీ రంగంలో నియామకాలు 2022 మే నెలతో పోల్చినప్పుడు 23 శాతం తక్కువగా నమోదయ్యాయి. దేశ ఇంధన భద్రతకు ప్రాధాన్యం పెరగడం, రిఫైనరీల విస్తరతో ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో అధిక నియామకాలు ఏర్పడినట్టు తెలుస్తోంది. అంతకుముందు నెలల్లో ఈ రంగంలో నియామకాల్లో వృద్ధి 10–20 శాతం మించకపోవడం గమనార్హం. ► రియల్ ఎస్టేట్‌లో 22 శాతం, బ్యాంకింగ్‌లో 14 శాతం అధికంగా నియామకాలు నమోదయ్యాయి. రియల్టీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్, సివిల్ ఇంజనీర్, సైట్ సూపర్ వైజర్ ఉద్యోగాలకు.. బ్యాంకింగ్‌లో రిలేషన్షిప్ మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్‌లకు డిమాండ్ నెలకొంది. ► ప్రొడక్షన్ ఇంజనీర్లు, ప్రాసెస్ ఇంజనీర్లు, క్వాలిటీ ఆడిటర్లకు డిమాండ్ ఏర్పడింది. ► హైదరాబాద్, చెన్నై, పుణె నగరాల్లో మధ్య స్థాయి, సీనియర్ ఉద్యోగాల్లో నియామకాలు ఎక్కువగా నమోదయ్యాయి. ► నియామకాలకు నాన్ మెట్రోలు కొత్త కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. అహ్మదాబాద్‌లో 26 శాతం, వదోదరలో 22 శాతం, జైపూర్‌లో 17 శాతం చొప్పున అధిక నియామకాలు (క్రితం ఏడాది మే నెలతో పోల్చినప్పుడు) జరిగాయి. ఇక్కడ బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాలు వృద్ధికి మద్దతుగా నిలిచాయి. ► పెద్ద మెట్రోల్లో నియామకాల పరంగా ఫ్లాట్ లేదా క్షీణత నమోదైంది. పెద్ద మెట్రోల్లో ముంబై, ఢిల్లీలో మాత్రం 5 శాతం వృద్ధి కనిపించింది. రియల్ ఎస్టేట్, టెలికం, హెల్త్‌కేర్, ఆటోమొబైల్ ఇక్కడ వృద్దికి దోహదపడ్డాయి. ► సీనియర్లకు అధిక డిమాండ్ నెలకొంది. 13–16 ఏళ్లు, అంతకుమించి సర్వీసు ఉన్న వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇచ్చాయి. ► ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో సీనియర్లకు నియామకాల పరంగా ప్రాధాన్యం నెలకొంది. ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్ ఫ్రెషర్లకు అవకాశాలు ఇచ్చాయి. మరీ ముఖ్యంగా ఫ్రెషర్లకు నియామకాల్లో 7 శాతం క్షీణత నమోదైంది. -
ఏప్రిల్‌లో నియామకాలు తగ్గాయ్
ముంబై: దేశవ్యాప్తంగా 2023 ఏప్రిల్‌లో వైట్–కాలర్ జాబ్స్‌కు డిమాండ్ తగ్గిందని నౌకరీ.కామ్ నివేదిక తెలిపింది. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ ప్రకారం ఉద్యోగాల కోసం ప్రకటనలు గత నెలలో 5 శాతం తగ్గి 2,715 నమోదయ్యాయి. ఐటీ రంగంలో దిద్దుబాటు ఇందుకు కారణమని నివేదిక తెలిపింది. ఈ పరిశ్రమలో నియామకాలు 27 శాతం క్షీణించాయి. బీపీవో విభాగంలో 18 శాతం, ఎడ్టెక్ 21, రిటైల్‌లో 23 శాతం తగ్గాయి. ‘టెక్నాలజీయేతర రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగాల్లో నియామకాలు చురుకుగా ఉన్నాయి. మెట్రో నగరాల్లో కొత్తగా గృహ, వాణిజ్య భవనాల నిర్మాణం అధికం కావడంతో రియల్టీలో రిక్రూట్మెంట్ 21 శాతం పెరిగింది. దీంతో టెండర్ మేనేజర్, కన్స్ట్రక్షన్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్లకు డిమాండ్ దూసుకెళ్లింది. వీరి నియామకాలు కోల్‌కతలో 28 శాతం, పుణే 22, హైదరాబాద్‌లో 19 శాతం అధికం అయ్యాయి. 16 ఏళ్లకుపైబడి నైపుణ్యం ఉన్న సీనియర్లకు డిమాండ్ 30 శాతం ఎక్కువగా ఉంది. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు, 4–7 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణుల డిమాండ్ క్షీణించింది. నియామకాలు చమురు, సహజవాయువు రంగాల్లో 20 శాతం, బీమా 13, బ్యాంకింగ్ 11 శాతం వృద్ధి చెందాయి. వాహన పరిశ్రమలో 4 శాతం, ఫార్మా రంగంలో ఇది 3 శాతంగా ఉంది. మెట్రోయేతర నగరాల్లో అహ్మదాబాద్ 28 శాతం వృద్ధితో ముందంజలో ఉంది. ఈ నగరాల్లో బ్యాంకింగ్, వాహన, బీమా రంగాలు ప్రధాన పాత్ర పోషించాయి’ అని నివేదిక వివరించింది. -
కరోనా ఎఫెక్ట్: 60 లక్షల ఉద్యోగులకు ఉద్వాసన
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే మే, ఆగస్ట్ నెలలో 60 లక్షల మంది వైట్ కాలర్ ఉద్యోగులకు( ఐటీ ఉద్యోగులు, ఇంజనీర్స్, టీచర్స్, అకౌంటెంట్స్, అనలిస్ట్స్) సంస్థలు ఉద్వాసన పలికినట్లు సెంటర్ ఫర్ మానీటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది. కరోనా వైరస్‌ను నివారించేందుకు లాక్డౌన్ విధించడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయి. ఈ నేపథ్యంలో సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే 2016లో కంపెనీలు 12కోట్ల 50లక్షల వైట్ కాలర్ ఉద్యోగులను నియమించగా, 2019లో భారీగా 18కోట్ల 70లక్షల ఉద్యోగులను నియమించాయి. కాగా సీఎంఐఈ సర్వేను మే నుంచి ఆగస్ట్ నెల వరకు నిర్వహించారు. మరోవైపు కరోనా కారణంగా చిన్న తరహా పరిశ్రమలలో భారీ సంఖ్యలో సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. (చదవండి: ట్రంప్‌ను ఇరకాటంలో పెట్టే వీడియో) -
భాషణం: తెల్ల ఉద్యోగాలు... తెల్ల అబద్ధాలు... తెల్ల ఆశాదీపాలు
అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ పెళ్లి సంబంధాల్లో తెల్లగా ఉండేవాళ్లనే కోరుకుంటారు. తప్పేం లేదు. తెలుపంటే అందరికీ క్రేజ్. (తెల్లగా ఉండేవాళ్లకి కూడా!) white supremacy అనే మాట ఈ క్రేజ్ నుండి వచ్చిందే. విశేషం ఏమిటంటే ఈ నలుపు తెలుపులను ‘పెళ్లి’కి పట్టించుకుంటారే కానీ, ‘ప్రేమ’లో పట్టించుకోరు. ఇంతకీ వైట్ సుప్రిమసీ అంటే ఏమిటి? నల్లగా ఉండేవాళ్ల కన్నా, తెల్లగా ఉండేవాళ్లే అన్నిటా అధికులనే భావన. White అనే పదంతో ఉన్న పదబంధాలన్నీ దాదాపుగా ఇలాంటి ఆధిక్య భావననుంచి పుట్టుకొచ్చినవే. ఉదా: white collar. కాయకష్టం చేసే అవసరం లేకుండా చక్కగా ఆఫీసులో కూర్చుని మైండ్‌తో పనిచేసుకుంటూ పోయే ఉద్యోగులను white collar workers అంటారు. ఇలాంటి ఉద్యోగాలే వైట్ కాలర్ జాబ్స్. అలాగే white hope అనేది ఇంకో మాట. అంటే ఆశాదీపం, ఆశాజ్యోతి. ఈ దీపాలు, జ్యోతులు... వ్యక్తులు కావచ్చు లేదా వస్తువులైనా కావచ్చు. ఈ వాక్యం చూడండి. This new car is seen as the great white hope of the Indian motor industry. అదేంటో White తో కలిస్తే చెడ్డవి కూడా మంచివి అయిపోతుంటాయి. white lie అనే మాట మీరు వినే ఉంటారు. ఇందులో lie అంటే అబద్ధం అని కదా అర్థం. white lie అంటే ‘మంచి అబద్ధం’ అని. కొన్నిసార్లు మంచి కోసం... లేదా నిజం చెప్పడం వల్ల జరగబోయే అనర్థాలను నివారించడం కోసం... అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. వాటిని వైట్ లైస్ అంటారు. మరక మంచిదే అంటున్నారు కదా ఏదో సర్ఫ్ వాళ్లు. అలాగన్నమాట. అదేవిధంగా white magic. అంటే మంచి పనులకోసం చేసే మ్యాజిక్. ఉదా: సమాజాన్ని మేల్కొలపడానికి, జాగృతం చేయడానికి చేసే మ్యాజిక్. దీనికి పూర్తిగా వ్యతిరేకం black magic. హాని తలపెట్టేందుకు చేసే మాయలు, మంత్రాలు ఈ కేటగిరీలోకి వస్తాయి. ఇప్పుడు మరికొన్ని white ల గురించి చకచకా తెలుసుకుందాం. white goods అంటే విద్యుత్ గృహోపకరణాలు. (కుక్కర్లు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు వగైరా). white horses అంటే ... ఉపరితంలో తెల్లగా ఉండే అలలు. ఈ white horses నే యు.ఎస్.లో whitecaps అంటారు. white knight అంటే.. గట్టెక్కించే వ్యక్తి. ఆపద్బాంధవుడు. ఒక కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనుకుందాం. ఆ కంపెనీ మూత పడకుండా లేదా చేతులు మారకుండా కాపాడే వ్యక్తిని లేదా సంస్థను white knight అనొచ్చు. white trash అంటే... చదువు లేని, నిరుపేద తెల్లజాతీయులు. (అలాంటి వారు ఉంటారా?). తమలోనే డబ్బు లేనివాళ్లను అమెరికన్లు అనే మాట... వైట్ ట్రాష్. black-and-white అని ఇంకోమాట ఉంది. ‘స్పష్టంగా అర్థమయ్యేది’ అని దీని అర్థం. (Disarmament isn't a black-and-white issue for me). ఆయనెవరికో నిరాయుధీకరణ అనేది అంతుబట్టని సబ్జెక్ట్ అట. అలాగే in black and white అనే మాట. అంటే లిఖితపూర్వకంగా (రాతపూర్వకంగా) అని. (I could not believe it was true, but there it is, in black and white). ఇవండీ... white తో వచ్చే కొన్ని పదాలు. అన్నట్లు... whiter than white అనే మాట విన్నారా? అంటే... ఎప్పుడూ అసలు తప్పన్నదే చెయ్యకపోవడం. (I never was convinced by the whiter than white image of her portrayed in the press). White elephant నడపడానికి భారమైపోయిన కంపెనీలను, డబ్బును పదేపదే ఖర్చుపెట్టిస్తున్న వస్తువులను వైట్ ఎలిఫెంట్‌తో పోలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం white elephant (ఐరావతం) అనేది ఇంద్రుడి ఏనుగు. తెల్లగా ఉంటుంది. పాల సముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవి, కల్పవృక్షం, కామధేనువులతో పాటు ఐరావతం కూడా ఉద్భవించిందని పురాగాథ.