ముంబై: వైట్ కాలర్ ఉద్యోగుల (నైపుణ్య, నిర్వహణ విధులు) నియామకాలు నవంబర్ నెలలో 2 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, కృత్రిమ మేథ–మెషిన్ లెర్నింగ్ (ఏఐ/ఎంఎల్), ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో నియామకాలు సానుకూలంగా నమోదయ్యాయి. నవంబర్ నెలకు సంబంధించిన గణాంకాలను నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ విడుదల చేసింది.
నౌకరీ ప్లాట్‌ఫామ్‌పై వైట్‌కాలర్ ఉద్యోగాలకు సంబంధించి 2,430 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 2 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో 16 శాతం, ఫార్మా/బయోటెక్ రంగంలో 7 శాతం, ఎఫ్‌ఎంసీజీ రంగంలో 7 శాతం, రియల్ ఎస్టేట్‌లో 10 శాతం చొప్పున వైట్ కాలర్ నియామకాలు అధికంగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఏఐ/ఎంఎల్ విభాగంలో 30 శాతం, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లలో 11 శాతం అధికంగా ఉపాధి కల్పన జరిగినట్టు నౌకరీ నివేదిక తెలిపింది.
ఐటీ రంగంలో వైట్ కాలర్ నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చిచూసినప్పుడు ఎలాంటి వృద్ధి లేకుండా ఫ్లాట్‌గా నమోదైంది. పండుగల సీజన్ మద్దతుతో ఇతర రంగాల్లో నియామకాలు మోస్తరుగా ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే రాజస్థాన్ ముందుంది. జైపూర్ 14 శాతం, ఉదయ్‌పూర్ 24 శాతం, కోటలో 15 శాతం వైట్ కాలర్ నియామకాలు పెరిగాయి. జైపూర్‌లో విదేశీ ఎంఎన్‌సీ కంపెనీల తరఫున నియామకాలు 20 శాతం పెరిగాయి. భువనేశ్వర్‌లో 21 శాతం వృద్ధి కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment