న్యూఢిల్లీ: ఐటీ, కన్సల్టింగ్ సేవల దిగ్గజం యాక్సెంచర్ భారత్‌లో గణనీయంగా నియామకాలు చేపట్టనుంది. ప్రధానంగా ఫ్రెషర్స్‌ను తీసుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. కంపెనీ సీఈవో జూలీ స్వీట్ ఈ విషయాలు వెల్లడించారు.
జెనరేటివ్‌ఏఐ (జెన్‌ఏ) మీద ఫోకస్‌తో తమ సర్వీసులను ఎప్పటికప్పుడు సరికొత్తగా తీర్చిదిద్దుకుంటున్నట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో ఆమె వివరించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో తమ వ్యాపార వృద్ధికి ఇదే దోహదపడిందని పేర్కొన్నారు. జెన్‌ఏఐ సాంకేతికతను ఉపయోగించడంలో సిబ్బందికి విస్తృతంగా శిక్షణనిస్తున్నట్లు జూలీ చెప్పారు.
ఐర్లాండ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాక్సెంచర్‌కి భారత్‌లో 3,00,000కు పైగా సిబ్బంది ఉన్నారు. అంతర్జాతీయంగా 7,74,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 64.90 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. యాక్సెంచర్ సెప్టెంబర్–ఆగస్టు వ్యవధిని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment