ఆర్నెళ్లు ఆలస్యం.. యాక్సెంచర్ ఉద్యోగులకు బ్యాడ్‌ న్యూస్‌ | Accenture delays promotion cycle from December to June | Sakshi
Sakshi News home page

ఆర్నెళ్లు ఆలస్యం.. యాక్సెంచర్ ఉద్యోగులకు బ్యాడ్‌ న్యూస్‌

Published Wed, Sep 18 2024 4:08 PM | Last Updated on Wed, Sep 18 2024 4:22 PM

Accenture delays promotion cycle from December to June

ప్రమోషన్‌ల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ప్రముఖ కన్సల్టింగ్‌, ఐటీ సంస్థ యాక్సెంచర్ చేదు వార్త చెప్పింది. కన్సల్టెన్సీ రంగంలో కొనసాగుతున్న సవాళ్లను సూచిస్తూ యాక్సెంచర్ తన ప్రమోషన్ సైకిల్‌లో గణనీయమైన మార్పును ప్రకటించింది. పదోన్నతుల ప్రక్రియను ఆరు నెలలు ఆలస్యం చేసింది.

యాక్సెంచర్‌లో ప్రమోషన్లు ఆనవాయితీ ప్రకారం డిసెంబర్‌లో చేపడతారు. కానీ బ్లూమ్‌బెర్గ్ ద్వారా పొందిన అంతర్గత కంపెనీ సందేశం ప్రకారం.. ప్రమోషన్‌లు ఇప్పుడు వచ్చే జూన్‌లో జరుగుతాయి. కార్పొరేట్ వ్యయం, స్థూల ఆర్థిక అస్థిరత కఠినతరం కావడం వంటివాటతో ఆర్థిక అనిశ్చిత పరి​స్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కంపెనీ ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ  చదవండి: ఆఫీస్‌కు రాకుంటే.. ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్‌!

క్లయింట్ వ్యూహాలు, డిమాండ్ స్థాయిలకు అనుగుణంగా కంపెనీ విజిబులిటీకి కొత్త ప్రమోషన్‌ షెడ్యూల్‌ సరిగ్గా సరిపోతుందని కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారు. ఎందుకంటే ఇవి సాధారణంగా సంవత్సరం మధ్య నాటికి స్పష్టంగా తెలుస్తాయి. ఈ వార్తల తర్వాత యాక్సెంచర్ స్టాక్ మంగళవారం దాదాపు 5 శాతం క్షీణతను చూసింది.

కన్సల్టెన్సీ పరిశ్రమను ప్రభావితం చేసే విస్తృత ఆందోళనలకు ఇన్వెస్టర్లు ప్రతిస్పందించారు. ప్రమోషన్లను ఆలస్యం చేయాలనే యాక్సెంచర్ నిర్ణయం కన్సల్టెన్సీ పరిశ్రమలో విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తుంది. మెకిన్సే, ఎర్నెస్ట్ & యంగ్, ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ వంటి కంపెనీలు కూడా ఆర్థిక ఇబ్బందులకు ప్రతిస్పందనగా సిబ్బంది సర్దుబాట్లు చేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement