Accenture
-
యాక్సెంచర్‌లో జోరుగా నియామకాలు
న్యూఢిల్లీ: ఐటీ, కన్సల్టింగ్ సేవల దిగ్గజం యాక్సెంచర్ భారత్‌లో గణనీయంగా నియామకాలు చేపట్టనుంది. ప్రధానంగా ఫ్రెషర్స్‌ను తీసుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. కంపెనీ సీఈవో జూలీ స్వీట్ ఈ విషయాలు వెల్లడించారు.జెనరేటివ్ఏఐ (జెన్‌ఏ) మీద ఫోకస్‌తో తమ సర్వీసులను ఎప్పటికప్పుడు సరికొత్తగా తీర్చిదిద్దుకుంటున్నట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో ఆమె వివరించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో తమ వ్యాపార వృద్ధికి ఇదే దోహదపడిందని పేర్కొన్నారు. జెన్ఏఐ సాంకేతికతను ఉపయోగించడంలో సిబ్బందికి విస్తృతంగా శిక్షణనిస్తున్నట్లు జూలీ చెప్పారు.ఐర్లాండ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాక్సెంచర్‌కి భారత్‌లో 3,00,000కు పైగా సిబ్బంది ఉన్నారు. అంతర్జాతీయంగా 7,74,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 64.90 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. యాక్సెంచర్ సెప్టెంబర్–ఆగస్టు వ్యవధిని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. -
మూడో భారీ ఎకానమీ దిశగా భారత్!
న్యూయార్క్: భారత్ త్వరలో మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో దేశ ఆరి్థక వృద్ధిలో భాగమవ్వాలని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని అమెరికన్ దిగ్గజ సంస్థల సీఈవోలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తాము అధికారం చేపట్టిన మూడో విడత కాలంలో (2024–29) భారత్‌ను భారీ ఎకానమీల్లో మూడో స్థానానికి చేర్చేందుకు అన్నివిధాలుగా కృషి చేస్తామని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం 3.9 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత భారత్ అయిదో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక, సాంకేతికత ప్రగతితో లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కంపెనీలకు ప్రధాని సూచించారు. యావత్ ప్రపంచం కోసం ఉత్పత్తులు, సేవలను రూపొందించేందుకు, ఉత్పత్తి చేసేందుకు భారత్‌తో చేతులు కలపాలని ఆయన పేర్కొన్నారు. మేధోహక్కుల పరిరక్షణకు, టెక్నాలజీలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తయారీ, సెమీకండక్టర్లు తదితర విభాగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరించారు. ‘సెమీకండక్టర్ల తయారీకి గ్లోబల్ హబ్’గా భారత్‌ను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. ‘టెక్ సీఈవోలతో సమావేశం ఫలప్రదంగా జరిగింది. టెక్నాలజీ, నవకల్పనలు మొదలైన అంశాలు చర్చకు వచ్చాయి. ఆయా విభాగాల్లో భారత పురోగతిని వివరించాను’ అని ఎక్స్‌లో మోదీ పోస్ట్ చేశారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నిర్వహించిన సమావేశంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఎడోబ్ సీఈవో శంతను నారాయణ్, యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్ తదితరులు పాల్గొన్నారు. కొత్త ఆవిష్కరణలకు అనుకూలమైన విధానాలతో భారత్, అంతర్జాతీయ టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతోందని సీఈవోలు కితాబిచ్చారు. ఎన్విడియా, గూగుల్ మరింత ఫోకస్ భారత్‌పై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు గూగుల్, ఎన్విడియా తదితర టెక్ దిగ్గజాలు వెల్లడించాయి. దేశీయంగా కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ వినియోగంపై ఫోకస్ పెట్టనున్నట్లు మోదీతో భేటీ అనంతరం సీఈవోలు తెలిపారు. డిజిటల్ ఇండియా విజన్ ద్వారా భారత్‌లో పరివర్తన తేవడంపై ప్రధాని దృష్టి పెట్టారని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ‘హెల్త్‌కేర్, విద్య, వ్యవసాయం వంటి విభాగాల్లో వినూత్న సొల్యూషన్స్ రూపొందించాలని ఆయన సూచించారు. భారత్‌లో ఏఐపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాం. మరింతగా కలిసి పనిచేయడంపై ఆసక్తిగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. భారత్‌తో తమకు ఇప్పటికే వివిధ విభాగాల్లో భాగస్వామ్యం ఉందని, అధునాతన టెక్నాలజీ లను అందుబాటులోకి తెస్తున్నామని ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ తెలిపారు. -
మరో ఆరు నెలలు.. వాయిదా వేసిన దిగ్గజ కంపెనీ
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత చాలా కంపెనీలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఆర్థిక మందగమనం కారణంగా ఎంతోమంది ఉద్యోగులను తొలగించిన దిగ్గజ కంపెనీలు.. ఇప్పుడు వేతనాలను పెంచడానికి ససేమిరా అంటున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు జీతాల పెంపును నిలిపివేయడమే కాకుండా.. ప్రమోషన్స్, బోనస్ వంటి వాటిని కూడా వాయిదా వేస్తూ వస్తున్నాయి.సాధారణంగా జూన్ లేదా జులై నెలలో వేతనాల పెరుగుదల, ప్రమోషన్స్ ఉంటాయి. కొన్ని కంపెనీలు దీనిని వాయిదా వేసుకుంటూ వస్తూనే ఉన్నాయి. ప్రపంచంలో అతి పెద్ద ఐటీ కంపెనీ 'అసెంచర్' 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్, శ్రీలంకలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు పెంచలేదు. ఎక్కువ పర్ఫామెన్స్ చేసినవాళ్ళకైనా జీతాలు పెంచే అవకాశం ఉందేమో అని ఎదురు చూస్తే.. వారికి కూడా చుక్కెదురైంది.ఇటీవల అసెంచర్ చేసిన ప్రకటనలో.. ప్రమోషన్లకు సంబంధించిన గడువును మరో ఆరు నెలలకు వాయిదా వీడింది. ఇంతకు ముందు ప్రమోషన్స్ ఈ ఏడాది చివరకు ఉంటాయని చెప్పిన కంపెనీ.. ఇప్పుడు వచ్చే ఏడాది జూన్‌కు వాయిదా వేసింది. కంపెనీ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండటం చేత ఈ ఆలస్యం జరుగుతోందని సంస్థ వెల్లడించింది.ఇదీ చదవండి: 10 నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీటెక్నాలజీ దిగ్గజం అసెంచర్ ప్రపంచవ్యాప్తంగా 7,50,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కన్సల్టింగ్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న ఈ కంపెనీ ఆర్థిక పరమైన అనిశ్చితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఉద్యోగుల మీద పడింది. ఏది ఏమైనా త్వరలోనే ఉద్యోగులకు శుభవార్త వినిపించనుంది. -
ఆర్నెళ్లు ఆలస్యం.. యాక్సెంచర్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్
ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ప్రముఖ కన్సల్టింగ్, ఐటీ సంస్థ యాక్సెంచర్ చేదు వార్త చెప్పింది. కన్సల్టెన్సీ రంగంలో కొనసాగుతున్న సవాళ్లను సూచిస్తూ యాక్సెంచర్ తన ప్రమోషన్ సైకిల్లో గణనీయమైన మార్పును ప్రకటించింది. పదోన్నతుల ప్రక్రియను ఆరు నెలలు ఆలస్యం చేసింది.యాక్సెంచర్‌లో ప్రమోషన్లు ఆనవాయితీ ప్రకారం డిసెంబర్లో చేపడతారు. కానీ బ్లూమ్‌బెర్గ్ ద్వారా పొందిన అంతర్గత కంపెనీ సందేశం ప్రకారం.. ప్రమోషన్లు ఇప్పుడు వచ్చే జూన్‌లో జరుగుతాయి. కార్పొరేట్ వ్యయం, స్థూల ఆర్థిక అస్థిరత కఠినతరం కావడం వంటివాటతో ఆర్థిక అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కంపెనీ ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ఆఫీస్‌కు రాకుంటే.. ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్!క్లయింట్ వ్యూహాలు, డిమాండ్ స్థాయిలకు అనుగుణంగా కంపెనీ విజిబులిటీకి కొత్త ప్రమోషన్ షెడ్యూల్ సరిగ్గా సరిపోతుందని కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారు. ఎందుకంటే ఇవి సాధారణంగా సంవత్సరం మధ్య నాటికి స్పష్టంగా తెలుస్తాయి. ఈ వార్తల తర్వాత యాక్సెంచర్ స్టాక్ మంగళవారం దాదాపు 5 శాతం క్షీణతను చూసింది.కన్సల్టెన్సీ పరిశ్రమను ప్రభావితం చేసే విస్తృత ఆందోళనలకు ఇన్వెస్టర్లు ప్రతిస్పందించారు. ప్రమోషన్లను ఆలస్యం చేయాలనే యాక్సెంచర్ నిర్ణయం కన్సల్టెన్సీ పరిశ్రమలో విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తుంది. మెకిన్సే, ఎర్నెస్ట్ & యంగ్, ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ వంటి కంపెనీలు కూడా ఆర్థిక ఇబ్బందులకు ప్రతిస్పందనగా సిబ్బంది సర్దుబాట్లు చేశాయి. -
ఆదాయ వృద్ధిని పరిమితం చేసిన ఐటీ దిగ్గజం
అంతర్జాతీయ అనిశ్చితులు, కొత్త ప్రాజెక్టులు రాకపోవడం, బ్యాంకింగ్ వంటి ప్రధాన రంగాల్లోని సంస్థలు టెక్నాలజీ ఆధారిత సేవలపై చేసే ఖర్చును తగ్గించుకోవడంతో ఐటీ సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ ఐటీ సంస్థల ఆదాయాలు, లాభాలు తగ్గుతాయని కొన్ని రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా కేంద్రంగా పలు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ దిగ్గజ సంస్థ యాక్సెంచర్ తన భవిష్యత్తు ఆదాయంలో వృద్ధి 1-3 శాతానికే పరిమితం కావొచ్చని పేర్కొంది. గతంలో ఈ అంచనా 2-5 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలోనే భారతీయ ఐటీ సంస్థల ఆదాయ వృద్ధిపైనా అనుమానాలు రేకెత్తాయి. ఫలితంగానే దేశీయ ఐటీ సంస్థలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో తదితర కంపెనీల షేర్లు ఇటీవల 1-3% నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ సూచీ 3% తగ్గింది. టెక్నాలజీ సూచీలు నెల వ్యవధిలో 9% క్షీణించింది. యాక్సెంచర్ తన ఆదాయ అంచనాలను తక్కువకు సవరించడం వల్లే, స్వల్పకాలంలో దేశీయ ఐటీ షేర్లకు ఒత్తిడి ఎదురవుతోంది. అంతర్జాతీయంగా కార్యకలాపాలు సాగించే అమెరికా కంపెనీ తాజా నిర్ణయంతో దేశీయ ఐటీ కంపెనీల్లోనూ అదే ధోరణి ఉంటుందని మార్కెట్ భావిస్తున్నట్లు తెలిసింది. పలు రంగాల సంస్థలు అంతగా ముఖ్యం కాని స్వల్పకాలిక ప్రాజెక్టులను పక్కన పెడుతున్నాయని యాక్సెంచర్ తన ఆదాయ అంచనాల నివేదికలో పేర్కొంది. ఇలాంటి ప్రాజెక్టులను చేస్తున్న విప్రో, ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఎంఫసిస్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలకూ సమీప భవిష్యత్తులో ఇబ్బందులుండే అవకాశాలున్నాయని స్టాక్ బ్రోకింగ్ సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. కంపెనీల విచక్షణ ఆధారిత పెట్టుబడి, వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి పెరిగేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి. ఇదీ చదవండి: అరచేతిలో ఇమిడే గాలి పంపు.. వీడియో వైరల్ యాక్సెంచర్ సైతం వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంపై ఆశాజనకంగానే ఉంది. ఫలితంగా దేశీయ ఐటీ సంస్థలకూ అప్పుడు కాస్త అనుకూల పరిస్థితులు నెలకొనచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
ఇన్ఫోసిస్‌కు మరో భారీ షాక్, వరుస ‘ఝలక్’ ఇస్తున్న ఉద్యోగులు!
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటీవ్ బిన్నీ మ్యాథ్యూ తాజాగా యాక్సెంచర్‌లో చేరారు. తమ సంస్థలో చీఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టినట్లు యాక్సెంచర్ తెలిపింది. ‘‘భారత్‌లో కాగ్నిజెంట్ అనైతిక వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది. నిబంధల్ని ఉల్లంఘించి తమ ఎగ్జిక్యూటీవ్‌లను సంస్థలో చేర్చుకుంటుంది. నాన్-కాంపిటీ క్లాజ్‌ను ఉల్లంఘిస్తూ ఉద్యోగులు సైతం కాగ్నిజెంట్‌లో చేరుతున్నారంటూ ’’ ఇటీవల విప్రో- ఇన్ఫోసిస్‌లు బెంగళూరు కోర్టును ఆశ్రయించాయి. జతిన్ దమాల్ రూ.25.15 కోట్లు చెల్లించాలి దీంతో పాటు నాన్-కాంపిటీ నిబంధనల ప్రకారం.. విప్రోలో పనిచేస్తున్న ఉద్యోగులు రాజీనామా అనంతరం తమ కాంపిటీటర్ సంస్థల్లో 10ఏళ్ల వరకు చేరకూడదు. అలా చేరితే నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనని అస్త్రంగా చేసుకున్న విప్రో.. నాన్-కాంపిటేట్ నిబంధన ఉల్లంఘించారంటూ విప్రో సంస్థ మాజీ సీఎఫ్ఓ జతిన్ దలాల్‌ను రూ. 25.15 కోట్లు చెల్లించాలని కోర్టులో దావా వేసింది. మీకు మీరే.. మాకు మేమే అయినప్పటికీ ఆ రెండు సంస్థలోని ఉన్నతస్థాయి ఉద్యోగులు ఇతర సంస్థల్లో 10 ఏళ్ల పాటు చేరకూడదంటూ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పట్లో సఫలమయ్యేలా కనిపించడం లేదు. ఎగ్జిక్యూటీవ్‌లు, ఇతర సీనియర్ స్థాయి ఉద్యోగులు మీకు మీరే.. మాకు మేమే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్ధి కంపెనీల్లో చేరి భారీ ప్యాకేజీలను సొంతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ సీనియర్ ఎగ్జిక్యూటీవ్ బిన్నీ మ్యాథ్యూ యాక్సెంచర్‌లో చేరడం అగ్నికి ఆజ్యం పోసినట్లైందని టెక్నాలజీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. యాక్సెంచర్‌లో చేరడానికి ముందు మాథ్యూస్ 15 సంవత్సరాలకు పైగా ఇన్ఫోసిస్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రొక్యూర్మెంట్ గ్రూప్ హెడ్‌గా పనిచేశారు. తాజాగా ఆ సంస్థకు గుడ్ బై చెప్పారు. జనవరి 3న యాక్సెంచర్‌లో చేరారు. ఇన్ఫోసిస్, విప్రో వర్సెస్ కాగ్నిజెంట్ టెక్ కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రో ప్రత్యర్థి సంస్థ కాగ్నిజెంట్‌పై చర్యలు తీసుకుంటున్నాయి.కాగ్నిజెంట్ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుందంటూ కోర్టును ఆశ్రయించాయి. కాగ్నిజెంట్‌లో ఇటీవలి పునర్నిర్మాణం కింద, సంస్థ దాదాపు 20 మంది కొత్త ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకుంది. వీరిలో డజను మంది ఇన్ఫోసిస్, విప్రో ఉద్యోగుల్ని చేర్చుకుంది. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విప్రో.. కాంట్రాక్టు ఉల్లంఘించినందుకు సీఎఫ్ఓ జతిన్ దలాల్‌తో సహా కాగ్నిజెంట్‌లో చేరిన మాజీ ఉద్యోగులపై రెండు వ్యాజ్యాలను దాఖలు చేసింది. ఈ తరుణంలో బిన్నీ మ్యాథ్యూ నిర్ణయం టెక్నాలజీ కంపెనీల్లో వ్యవహారం ఎటు ములుపు తిరుగుతుందోనని ఆసక్తికరంగా మారింది. విప్రో ప్రత్యర్థి కంపెనీలు ఇవే.. విప్రో ఎగ్జిక్యూటివ్‌ల కాంట్రాక్ట్‌లో పది ప్రత్యర్థి కంపెనీల పేర్లను పేర్కొంది. నాన్-కాంపిటేట్ నిబంధన కింద వారు విప్రోలో మానేసిన తర్వాత సంవత్సరం పాటు ఈ కంపెనీలలో చేరేందుకు వీలు లేదు. ఆ కంపెనీలు ఇవే.. యాక్సెంచర్, క్యాప్‌జెమినీ, కాగ్నిజెంట్, డెలాయిట్, డీఎక్స్‌సీ టెక్నాలజీ, హెచ్‌సీఎల్, ఐబీఎం, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా. ఈ పేర్లలో ప్రతి ఒక్కటి దలాల్ కాంట్రాక్ట్‌లో పేర్కొన్నట్లు విప్రో తెలిపింది. -
బెంగళూరులో యాక్సెంచర్ ఏఐ స్టూడియో.. ఏంటిది.. ఏం చేస్తుంది?
Accenture Generative AI Studio: ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్ బెంగళూరులో జెనరేటివ్ ఏఐ స్టూడియోను ఏర్పాటు చేసింది. దాదాపు రూ.25 వేల కోట్ల పెట్టుబడిలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ జెనరేటివ్ ఏఐ స్టూడియో ఉద్దేశం, ఉపయోగం, అందించే సేవలు వంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం గురించి తెలిసిందే. అన్ని రంగాల వ్యాపారాలు ఈ టెక్నాలజీ వినియోగంపై ఆసక్తి కనబరుస్తున్నాయి. దీన్ని అందిపుచ్చుకునేందుకు ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. రాబోయే మూడేళ్లలో ఏఐ, డేటా ప్రాక్టీస్‌లో 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25 వేల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించిన కొన్ని నెలల తర్వాత, డిసెంబర్ 18న యాక్సెంచర్ భారత్‌లోని బెంగళూరులో జనరేటివ్ ఏఐ స్టూడియోను ప్రారంభించింది. ఉత్పాదక కృత్రిమ మేధ (Generative AI) ఆధారంగా పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి క్సెంచర్ డేటా, ఏఐ బృందం క్లయింట్లతో కలిసి పని చేసేందుకు ఓ చోటును కల్పించడమే ప్రాథమికంగా ఈ స్టూడియో ఉద్దేశం. ఏఐ ఆధారిత పరిష్కారాలతో సంస్థలు తమ వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. జనరేటివ్ ఏఐ అనేది ఒక రకమైన కృత్రిమ మేధస్సు. ఇది శిక్షణ డేటాను పోలి ఉండే కొత్త డేటాను రూపొందించగలదు. వ్యాపార ప్రక్రియలను ఆప్టిమైజ్ చేయడానికి దీనిని ఉపయోగించవచ్చని కంపెనీ చెబుతోంది. యాక్సెంచర్‌లోని గ్లోబల్ లీడ్- డేటా & ఏఐ సెంథిల్ రమణి ప్రకారం.. మొత్తం వాల్యూ చైన్‌లోని సామర్థ్యాలకు ప్రాధాన్యతనిస్తూ తమ ఏఐ పెట్టుబడులను పెంచుకోవడానికి ఈ స్టుడియో సహాయపడుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో పెరిగిన పెట్టుబడి విస్తృత ధోరణిని యాక్సెంచర్ ఏఐ స్టుడియో ప్రతిబింబిస్తుంది. యాక్సెంచర్ నిర్వహించిన ఇటీవలి సర్వేలో 74 శాతం C-సూట్ (ఉన్నత కార్యవర్గాలు) 2024లో తమ ఏఐ సంబంధిత వ్యయాన్ని పెంచాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఇది అంతకుముందు సంవత్సరంలో 50 శాతమే ఉండేది. అందించే సేవలు స్టూడియో ఉత్పాదక ఏఐకి సంబంధించిన అనేక రకాల సేవలను అందిస్తుంది. వీటిలో యాజమాన్య ఉత్పాదకకేఐ మోడల్ “స్విచ్‌బోర్డ్,” అనుకూలీకరణ పద్ధతులు, మోడల్ మేనేజ్డ్ సేవలు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఉన్నాయి. క్లయింట్లకు ఉత్పాదక ఏఐ పరిష్కారాలను అర్థం చేసుకోవడం, ప్రయోగం చేయడం, స్వీకరించడం, పెంచుకోవడంలో సహాయపడేలా ఈ సేవలను రూపొందించినట్లు యాక్సెంచర్ పేర్కొంటోంది. -
ఏఐ వినియోగంపై ఆర్బీఐ దృష్టి
ముంబై: రిజర్వ్ బ్యాంక్ తాజాగా తమ కార్యకలాపాల్లో కృత్రిమ మేథ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) వినియోగంపై మరింతగా దృష్టి పెడుతోంది. బ్యాంకింగ్ పర్యవేక్షణ అవసరాలకు వీటిని వినియోగించుకునేలా తగు సిస్టమ్స్‌ను రూపొందించేందుకు అంతర్జాతీయ కన్సల్టెన్సీలు మెకిన్సే అండ్ కంపెనీ, యాక్సెంచర్ సొల్యూషన్స్‌ను ఎంపిక చేసింది. భారీ డేటాబేస్‌ను విశ్లేషించేందుకు, బ్యాంకులు.. ఎన్‌బీఎఫ్‌సీల నియంత్రణను మెరుగుపర్చేందుకు ఈ సిస్టమ్స్ ఉపయోగపడనున్నాయి. ఈ కాంట్రాక్టు విలువ రూ. 91 కోట్లు. ఆర్బీఐ గతేడాది సెప్టెంబర్‌లో ఏఐ, ఎంఎల్ కన్సల్టెంట్ల నియామకం కోసం ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహా్వనించింది. ప్రాథమిక మదింపులో ఏడు సంస్థలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. బోస్టన్ కన్సలి్టంగ్ గ్రూప్ (ఇండియా), డెలాయిట్ టచ్ తోమాత్సు ఇండియా, ఎర్న్స్ట్ అండ్ యంగ్, కేపీఎంజీ అష్యూరెన్స్ అండ్ కన్సలి్టంగ్ సరీ్వసెస్ తదితర సంస్థలు కూడా పోటీపడ్డాయి. -
బోనస్ ఇస్తాంలే కాస్త ఆగండి.. జాయినింగ్ ఆలస్యం చేస్తున్న యాక్సెంచర్
ఇటీవల 19,000 మంది ఉద్యోగుల తొలగింపును ప్రకటించిన యాక్సెంచర్ కొత్త ఉద్యోగుల జాయినింగ్‌ను కూడా ఒక సంవత్సరం వరకు ఆలస్యం చేస్తోంది. కంపెనీ కొత్త ఉద్యోగుల జాయినింగ్ తేదీని ఎప్పుటికప్పుడూ పొడిగిస్తూ వస్తున్న సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. (Vodafone Idea 5G: వోడాఫోన్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు ముగిసిన నిరీక్షణ!) తమకు ప్రస్తుతం కొత్త ఉద్యోగుల అవసరం లేనందునే యాక్సెంచర్ కొత్త ఉద్యోగుల జాయినింగ్ తేదీలను పొడిగిస్తూ వస్తున్నట్లు తెలిసింది. పరిస్థితి ఇలా ఉంటుందని ముందే తెలిస్తే తాము మరేదైనా కంపెనీలో చేరేవాళ్లమని, కానీ యాక్సెంచర్ జాయినింగ్‌ను నెలల తరబడి ఆలస్యం చేస్తూ వస్తోందని అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు. తమ క్లయింట్ల అవసరాలకు తగ్గట్టుగా కొత్త ఉద్యోగుల జాయినింగ్ తేదీలను సర్దుబాటు చేస్తున్నట్లుగా యాక్సెంచర్ ప్రతినిధి రాచెల్ ఫ్రే ఈమెయిల్ ద్వారా తెలియజేశారు. ఇలా ఎంతమంది అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ జాప్యం ఇలాగే కొనసాగుతుందా అనే విషయాలపై స్పష్టత లేదు. (Akshata Murthy: బ్రిటన్ ప్రధాని సతీమణి చేతికి ఒక్క రోజులో రూ.68 కోట్లు..) యాక్సెంచర్ తనకు యూకేలో కన్సల్టింగ్ ఉద్యోగం ఇచ్చిందని, వచ్చే జూన్‌లో ఉద్యోగంలో చేరాల్సి ఉండగా జాయినింగ్ తేదీని అక్టోబరు నెలకు మార్చిందని ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఓ అభ్యర్థి బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థకు తెలియజేసింది. జాయినింగ్ తేదీని మళ్లీ 2024 సంవత్సరం ప్రారంభానికి మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఆ ఉద్యోగం వదిలివేయాలని నిర్ణయించుకున్నారు. అయితే జాయినింగ్ ఆలస్యానికి యాక్సెంచర్ రిక్రూటర్ ఆ ఈమెయిల్లో క్షమాపణలు కోరారు. ఇలా జాయినింగ్ ఆలస్యం అయిన వారికి కంపెనీ అదనపు బోనస్ ఇవ్వనున్నట్లు తెలిసింది. యాక్సెంచర్‌లో జాయినింగ్ ఆలస్యం కావడం పట్ల విసుగు చెందిన కొందరు అభ్యర్థులు రెడ్డిట్ ఫోరమ్‌లలో కూడా తమ నిరాశను వ్యక్తం చేశారు. (Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...) -
19,000 మందికి యాక్సెంచర్ ఉద్వాసన
న్యూఢిల్లీ: యాక్సెంచర్ వచ్చే ఏడాదిన్నరలో 19,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో వీరి సంఖ్య 2.5 శాతమని ప్రకటించింది. సంస్థలో ప్రస్తుతం 7 లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారు. వీరిలో అత్యధికంగా 3 లక్షల మంది భారత్‌లో పనిచేస్తున్నారు. -
యాక్సెంచర్ సంచలనం: ఏకంగా 19వేలమందికి ఉద్వాసన
సాక్షి,ముంబై: ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఐటీ కంపెనీలను భారీగా ప్రభావితం చేస్తోంది. తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్ కూడా తన ఉద్యోగులకు భారీ షాక్ ఇస్తోంది. కంపెనీ ఆదాయ క్షీణత నేపథ్యంలో 19వేల ఉద్యోగాలను తీసివేయనుంది. అటు వార్షిక రాబడి, లాభాల అంచనాలను కూడా తగ్గించింది. ఈ మేరకు కంపెనీ గురువారం అధికారికంగా ప్రకటించింది. అయితే ఇందులో ఎంతమంది భారతీయ ఉద్యోగులు ప్రభావితం కానున్నారనేదానిపై స్పష్టత లేదు. తమ సిబ్బందిలో 2.5 శాతం లేదా 19,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలిపింది. సగానికి పైగా తొలగింపులు నాన్ బిల్ కార్పొరేట్ ఫంక్షన్ల సిబ్బందిని ప్రభావితం చేస్తాయని వెల్లడించింది. మరోవైపు యాక్సెంచర్ తమ వార్షిక రాబడి వృద్ధిని కూడా కుదించుకుంది. గతంలో అంచనా వేసిన 8-11 శాతంతో పోలిస్తే 8-10శాతం మధ్య ఉంటుందని భావిస్తోంది. (ఇదీ చదవండి: ట్యాక్స్‌పేయర్ల కోసం స్పెషల్ యాప్, ఎలా పనిచేస్తుంది?) 2023 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో, ముఖ్యంగా వ్యూహాత్మక వృద్ధి ప్రాధాన్యతలకు మద్దతు నిమిత్తం నియామకాలను కొనసాగిస్తున్న క్రమంలో తమ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి , ఖర్చులను తగ్గించడానికి ఈ చర్యలను ప్రారంభించామని రాబోయే 18 నెలల్లో ఉద్యోగుల కోతలుంటాయని తెలిపింది. అంతేకాదు గతంలో 11.20 -11.52 డాలర్లతో పోలిస్తే ఒక్కో షేరుకు సంపాదన10.84-11.06 డాలర్ల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. (సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు) (రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 1,999కే) -
యాక్సెంచర్ చేతికి ఫ్లూచురా
న్యూఢిల్లీ: ఐటీ, కన్సల్టింగ్ సర్వీసుల దిగ్గజం యాక్సెంచర్.. బెంగళూరు కంపెనీ ఫ్లూచురాను కొనుగోలు చేయనుంది. ఇండస్ట్రియల్ కృత్రిమ మేధ(ఏఐ) సేవలందించే ఫ్లూచురా 110 మంది నిపుణుల(ప్రొఫెషనల్స్)తో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తయారీ, ఇతర ఆస్తుల ఆధారిత కంపెనీలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ డేటా సైన్స్ సర్వీసులు సమకూరుస్తున్న ఫ్లూచురాను సొంతం చేసుకోనున్నట్లు యాక్సెంచర్ తాజాగా పేర్కొంది. ఇదీ చదవండి: ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..! ఐదేళ్ల జీతం బోనస్ అయితే డీల్ విలువను వెల్లడించలేదు. ఈ కొనుగోలుతో తమ ఇండస్ట్రియల్ ఏఐ సర్వీసులు మరింత పటిష్టంకానున్నట్లు యాక్సెంచర్ తెలియజేసింది. వీటి ద్వారా ప్లాంట్లు, రిఫైనరీలు, సప్లై చైన్ల పనితీరును మెరుగుపరచనున్నట్లు వివరించింది. అంతేకాకుండా క్లయింట్ల నెట్‌జీరో లక్ష్యాలను వేగంగా సాధించేందుకు దోహదపడనున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు! -
ఐబీఎస్ సాఫ్ట్వేర్ చేతికి ఏఎఫ్‌ఎల్‌ఎస్
తిరువనంతపురం: యాక్సెంచర్ ఫ్రైట్ అండ్ లాజిస్టిక్స్ సాఫ్ట్వేర్ (ఏఎఫ్‌ఎల్‌ఎస్)ను కొనుగోలు చేసినట్లు ఐబీఎస్ సాఫ్ట్వేర్ తెలిపింది. అయితే డీల్ విలువ మాత్రం వెల్లడి కాలేదు. ఈ ఒప్పందంతో తాము ఆకాశ, సముద్ర మార్గంలో రవాణా కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు టెక్నాలజీ సర్వీసులు అందించడానికి సాధ్యపడనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వీకే మాథ్యూస్ తెలిపారు. తమ కార్గో, లాజిస్టిక్స్ వ్యాపారాన్ని అలాగే కార్యకలాపాలను అంతర్జాతీయంగా మరింత విస్తరించుకునేందుకు ఇది తోడ్పడగలదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ పరిశ్రమకు సాఫ్ట్వేర్ సర్వీసులను (ఎస్ఏఏఎస్) ఐబీఎస్ అందిస్తోంది. ట్రావెల్, రవాణా, లాజిస్టిక్స్ కోసం చెన్నైలో కొత్తగా డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇది భారత్‌లో తమకు నాలుగోదని వివరించింది. -
ఐటీలో ‘ఫేక్’ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే!
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం పరిస్థితి అంతగా బాలేదు. దీనికి తోడు ఆర్థిక మాంద్యం కంపెనీలను భయపెడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఉద్యోగుల మెడకు చుట్టుకుంటోంది. ప్రస్తుతం నకిలీ పత్రాలు, ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ అంశం ఐటీలో కలకలం రేపుతోంది. ఇటీవల నియమాలను ఉల్లఘించి, నకిలీ డాక్యుమెంట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన పలువురిని ప్రముఖ కంపెనీ యాక్సెంచర్ తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మరో దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ సైతం చేరింది. యాక్సెంచర్ బాటలో కాగ్నిజెంట్.. తమ ఉద్యోగుల్లో బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్‌లో విఫలమైన వారిపై వేటు వేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కొందరు నకిలీ పత్రాలు సమర్పించి ఉద్యోగాల్లో చేరిన 6 శాతం మంది సిబ్బందిని తొలగించినట్టు కాగ్నిజెంట్ ఇండియా తెలిపింది. ఈ అంశంపై కంపెనీ ఇండియా హెడ్ రాజేష్ నంబియార్ మాట్లాడుతూ.. ‘ఎంపిక చేసిన పోస్ట్‌కు వారి సరిపోరని కంపెనీ జరిపిన బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్‌లో తేలింది. బ్యాక్‌గ్రౌండ్ చెక్‌ను క్లియర్ చేయనివారిని కంపెనీ ఏ మాత్రం ఉపేక్షించేది లేదని’ స్పష్టం చేశారు. సాధారణంగా నియామక ప్రక్రియ ఆలస్యం అవుతుందని, కంపెనీలు అభ్యర్థులను సంస్ధలోకి తీసుకునేముందు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వవు. ఒక్కోసారి ఈ ప్రక్రియ పాటించడం వల్ల ఉద్యోగులు తమ కంపెనీలో చేరేందుకు ఆసక్తి కూడా చూపరని భావిస్తూ.. వీటిపై సరైన శ్రద్ధ పెట్టవు. అయితే కరోనా సమయంలో మాత్రం పెద్ద ఎత్తున ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాల్లో చేరారు. అయితే రానున్న సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా నియామకాలకు కూడా ఫుల్స్టాప్ పెట్టాయి. ఇదిలా ఉండగా.. ఇదే తరహాలోనే మిగిలిన కంపెనీలు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌ను చూస్తే వేల మంది సిబ్బంది వారి ఉద్యోగాలను కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు! -
‘వెనక ఇంత జరిగిందా’.. ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ!
ఐటీలో రోజుకో అంశం తెరపైకి వచ్చి కలకలం రేపుతోంది. నిన్నటి వరకు మూన్‌లైటింగ్, వర్క్ ఫ్రం హోమ్‌పై చర్చ నడవగా, తాజాగా ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉద్యోగాలు పొందుతున్నారనే అంశం తెరపైకి వచ్చింది. తాజగా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ యాక్సెంచర్ తమ నియామక ప్రక్రియలో కంపెనీని తప్పుదారి పట్టించిన ఉద్యోగులపై వేటు వేసింది. సంస్థలో ఉద్యోగం పొందడానికి నకిలీ ఎక్స్పీరియన్స్ లెటర్, ఇతర తప్పుడు పత్రాలను ఉపయోగించిన ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ తెలిపింది. ఆ ఉద్యోగులపై వేటు.. యాక్సెంచర్ కంపెనీ కఠిన వాణిజ్య నైతిక విలువలను అనుసరిస్తుందని, కంపెనీ నియమ, నిబంధలను పాటించని వారిపై వేటు తప్పదని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. నియామక ప్రక్రియ సమయంలో నకిలీ పత్రాలను ఉపయోగించి కొందరు ఉద్యోగాలు పొందారన్న విషయం తెలియడంతో వారిని తొలగించింది. అయితే అలా పని చేస్తున్నా వారిలో ఎంత మంది ఉద్యోగులను తొలగించారన్న దానిపై యాక్సెంచర్ పూర్తి వివరాలు తెలపాల్సి ఉంది. వీటితో పాటు మరో అంశంపై స్పందిస్తూ.. నకిలీ జాబ్ పోస్టుల పట్ల అభ్యర్థులు జాగ్రత్త వహించాలని సూచించింది. యాక్సెంచర్‌లో ఉద్యోగం కోసం కొన్ని ఎంప్లాయిమెంట్ ఏజెన్సీలు, కొందరు వ్యక్తులు ఉద్యోగార్థుల వద్ద డబ్బు అడుగుతున్నారని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. వాటిని నమ్మకండి యాక్సెంచర్‌లో ఉద్యోగం ఇచ్చే క్రమంలో డబ్బు వసూలు చేయాలని తాము ఏ సంస్ధకు, వ్యక్తికి అధికారం ఇవ్వలేదని తేల్చిచెప్పింది. నకిలీ జాబ్ ఆఫర్ల పట్ల అభ్యర్ధులు అప్రమత్తంగా ఉండాలని బ్లాగ్ పోస్ట్‌లో హెచ్చరించింది. యాక్సెంచర్‌లో జాబ్ కోసం ఏ ఒక్కరూ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. తమ సంస్థలో నియామకం కేవలం మెరిట్ ఆధారంగానే జరుగుతుందని, ఉద్యోగాల కోసం ఎవరూ ఎప్పుడూ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. చదవండి: Dropout Chaiwala: విదేశాలలో చదువు మానేసి.. కాఫీలు, టీలు అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నాడు! -
హెచ్‌సీఎల్ ఉద్యోగులకు భారీ షాక్!
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. హెచ్‌సీఎల్ సంస్థ మైక్రోసాఫ్ట్ న్యూస్ విభాగానికి చెందిన ప్రొడక్ట్‌పై వర్క్ చేస్తోంది. ఈ తరుణంలో ఆ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్న 300 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్‌లపై వర్క్ చేస్తున్నాం. భవిష్యత్‌లో ఎలాంటి ప్రాజెక్ట్‌లపై వర్క్ చేయబోతున్నామనే అంశాలపై చర్చించేందుకు హెచ్‌సీఎల్ ఉద్యోగులతో టౌన్ హాల్ మీటింగ్ నిర్వహించింది. ఆ సమావేశంలో ఉద్యోగుల తొలగింపులపై ప్రకటన చేసినట్లు సమాచారం. ఇక హెచ్‌సీఎల్ తొలగించిన ఉద్యోగులు భారత్, గ్వాటెమాల, ఫిలిప్పీన్స్ తో పాటు ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఉద్యోగులకు కంపెనీలో చివరి రోజైన సెప్టెంబర్ 30 నాటికి ప్రతి ఉద్యోగికి వేతనాన్ని అందించనున్నట్లు హెచ్‌సీఎల్ తెలిపిందని ఆ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో తొలగించిన ఉద్యోగులు మాట్లాడుతూ..మా సంస్థకు..మైక్రోసాఫ్ట్‌కు క్వాలిటీ ఆఫ్ వర్క్ విషయంలో విభేదాలు తలెత్తాయి. మేం భారత్,యూరప్,యూఎస్ వంటి దేశాల నుండి మైక్రోసాఫ్ట్ న్యూస్ ప్లాట్‌ఫారమ్ ఎంఎస్ఎన్ కోసం కంటెంట్‌ను పర్యవేక్షించడం, క్యూరేట్ చేయడం, సవరించడంలాంటి వర్క్స్ చేస్తుంటాం.అయితే ఇటీవల మైక్రోసాఫ్ట్ గ్లోబల్ న్యూస్ మానిటరింగ్ కోసం మైక్రోసాఫ్ట్ ఆటోమెషిన్‌ను వినియోగించడం ప్రారంభించింది. మేం వర్క్ చేయడానికి ముందు జర్మనీకి చెందిన హుబెర్ట్ బుర్దా మీడియా ఈ సైట్‌ను నిర్వహించేది. బింగ్‌లో ట్రెండింగ్, జియోపొలిటికల్ న్యూస్ క్యూరేషన్, కామెంట్ మోడరేషన్, టాబ్లాయిడ్ హిట్ యాప్‌లను పర్యవేక్షించేది' అని చెప్పారు. హెచ్‌సీఎల్‌కు గుడ్‌బై మైక్రోసాఫ్ట్- హెచ్‌సీఎల్ మధ్య కాంట్రాక్ట్ ముగిసిందని,ఆ కారణం చేతనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. మైక్రోసాఫ్ట్ ఈ కాంట్రాక్ట్‌ను వేరే సంస్థకు అప్పగించాలని భావిస్తున్నట్లు..హెచ్సీఎల్ను కాదనుకొని యాక్సెంచర్‌కు తన ప్రాజెక్ట్ కట్టబెట్టాలని మైక్రోసాఫ్ట్ మంతనాలు నిర్వహిస్తుంది. ఇతర టెక్ కంపెనీల బాటలో హెచ్‌సీఎల్ సైతం ఇతర టెక్ కంపెనీల బాటలో చేరింది.ఇటీవల యాపిల్,మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఇతర టెక్ కంపెనీలు ఆర్థిక సంక్షోభం కారణంగా ఉద్యోగుల్ని, పలు విభాగాల్ని పూర్తి స్థాయిలో తొలగించింది. అదే సమయంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులు 100 శాతం వర్క్ ప్రొడక్టవిటీపై దృష్టిసారించాలని కోరడం చర్చాంశనీయంగా మారింది. -
టీసీఎస్ సంచలనం.. ప్రపంచంలోనే 2వ స్థానంలో..!
TCS, Infosys among world’s most valuable brands: దేశీయ ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరో రికార్డు సాధించింది. బ్రాండ్ ఫైనాన్స్ 2022 గ్లోబల్ 500 నివేదిక ప్రకారం.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవల్లో రెండవ అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న యాక్సెంచర్ అత్యంత విలువైన బలమైన ఐటీ సేవల అందిస్తున్న బ్రాండ్‌గా కొనసాగుతుంది. ఇక మూడవ స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్ గత సంవత్సరం నుంచి 52 శాతం వృద్ధి చెందింది. $12.8 బిలియన్లతో ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటి సేవల బ్రాండ్‌గా అవతరించింది. 16.8 బిలియన్ డాలర్ల విలువైన టీసీఎస్ వ్యాపార పనితీరు, మెరుగైన భాగస్వామ్యాల ఒప్పందాల ద్వారా రెండు ర్యాంకింగ్ స్థాయికి చేరుకుంది. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం.. టీసీఎస్ బ్రాండ్ విలువ గత 12 నెలల్లో $1.844 బిలియన్(12.5 శాతం) పెరిగి $16.786 బిలియన్లకు చేరుకుంది. ఈ వృద్ధికి కంపెనీలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడుదారులు, ఉద్యోగులు, కస్టమర్ ఈక్విటీ & బలమైన ఆర్థిక పనితీరు కారణమని పేర్కొంది. బ్రాండ్ విలువ వృద్ధి పరంగా భారతీయ ఐటీ సేవల కంపెనీలు, యునైటెడ్ స్టేట్స్ నుంచి వస్తున్న పోటీని అధిగమించాయి. కోవిడ్-19 మహమ్మారి ద్వారా డిజిటల్ సేవలు అందించే కంపెనీలు భారీగా వృద్ది చెందాయని ఈ కొత్త నివేదిక తెలిపింది. 2020 నుంచి భారతీయ బ్రాండ్ల సగటు వృద్ధి 51 శాతం పెరిగితే, యుఎస్ బ్రాండ్ల వృద్ది సగటున 7 శాతం తగ్గింది. కరోనా మహమ్మారి వల అనేక రంగాలు ప్రభావితం అయినప్పటికీ ఐటి సేవలు & సాంకేతిక రంగానికి చెందిన దూసుకెళ్తున్నాయి. మార్కెట్ కి అనుగుణంగా ద్వారా క్లౌడ్ సేవలు, టెక్నాలజీ కన్సల్టింగ్, మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధస్సు వంటి సేవలు అందిస్తుండటం ద్వారా కంపెనీలు దేశీయ కంపెనీలు తమ బ్రాండ్ విలువను పెంచుకుంటూ పోతున్నాయి. (చదవండి: సామాన్యులకు దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..!) -
టెకీలకు బంపర్ ఆఫర్ : డబుల్ హైక్స్ కు ఐటీ దిగ్గజాల మొగ్గు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మరి కారణంగా గత ఏడాది చాలా ఐటి కంపెనీలు జీతాల పెంపును వాయిదా వేసుకున్నాయి. గత ఏడాది రెండవ భాగంలో వ్యాపారం పుంజుకున్నందున, చాలా ఐటి కంపెనీలు గత క్యాలెండర్ సంవత్సరం చివరి నుంచి లేదా ఈ ఏడాది ఆరంభం నుంచి ఇంక్రిమెంట్ ఇవ్వడం ప్రారంభించాయి. ఇక ఈ ఏడాది ఐటీ దిగ్గజాలు ఇప్పటికే వేతనాలు పెంచడంతో పాటు నైపుణ్యం గల మానవ వనరులను నిలుపుకునేందుకు డబుల్ హైక్స్ కూడా ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. కరోనా మహమ్మారి డిజిటల్ వాడకం పెరగడంతో పాటు ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తుండటంతో ఆఫీస్ నిర్వహణ ఖర్చులు కూడా తగ్గి పోయాయి. అందుకే ప్రతిభ గల ఉద్యోగులు జారీ పోకుండా ఉండేందుకు డబుల్ హైక్స్ ఇచ్చేందుకు సిద్దపడుతున్నాయి. దీంతో టెకీల్లో జోరు నెలకొంది. ఇప్పుడు ప్రతిభకు పోటీ తీవ్రతరం కావడంతో, చాలా ఐటి కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్, ప్రమోషన్లతో మళ్లీ బహుమతి ఇస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, 2 లక్షలకు పైగా ఉద్యోగులున్న యాక్సెంచర్ ఇండియా గత ఏడాదికి డిసెంబరులో ఇంక్రిమెంట్ ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్ళీ వేతనాల పెంపు, బోనస్, ప్రమోషన్లను ప్రకటించింది. ఏప్రిల్‌లో అసోసియేట్ డైరెక్టర్ స్థాయి వరకూ ఒన్ టైమ్ థ్యాంక్యూ బోనస్ ను అందచేశామని యాక్సెంచర్ ఇండియా ప్రకటించినట్టు ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. మరోవైపు ఈ ఏడాది రెండోసారి కాంపెన్సేషన్ రివ్యూ జరుగుతోందని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ హెడ్ రిచర్డ్ లోబో వెల్లడించారు. గత ఏడాది డిసెంబరులో, యాక్సెంచర్ ప్రపంచవ్యాప్తంగా 605 మందిని ఎండికి, 63 మందిని సీనియర్ ఎండికి ప్రమోషన్ ఇచ్చింది. ఇందులో రికార్డు శాతం మహిళలు ఉన్నారు. మరోవైపు ఈ ఏడాది రెండోసారి కాంపెన్సేషన్ రివ్యూ జరుగుతోందని ఇన్ఫోసిస్ ఈవీపీ & హెచ్ఆర్ హెడ్ రిచర్డ్ లోబో వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో చాలా వరకు హైక్స్ నిలిపివేసిన తరువాత జనవరి నుంచి ఇంక్రిమెంట్లను ఇవ్వడం ప్రారంభించారు. గత సంవత్సరం పనితీరు ఆధారంగా మరో సమీక్ష ఇన్ఫోసిస్ చేస్తున్నట్లు పేర్కొంది. పనితీరు ఆధారంగా జీతం పెంపు జూలై నుంచి అమలులోకి రానుంది. రెండు ఇంక్రిమెంట్లు కలుపుకుని 10 నుంచి 14 శాతం వరకూ వేతన పెంపు ఉంటుందని భావిస్తున్నారు. అలాగే, ఇన్ఫోసిస్ ప్రధాన ప్రత్యర్థి టీసీఎస్ ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు ఇంక్రిమెంట్లను ఇచ్చినట్లు ప్రకటించింది. టీసీఎస్ అన్ని భౌగోళిక ప్రాంతాలలో పనిచేసే ఉద్యోగులకు ఏప్రిల్ నుంచి ఇంక్రిమెంట్ ఇచ్చింది. చాలా మంది సీనియర్ ఉద్యోగులు 6-8 శాతం వరకు వేతన పెంపును అందుకున్నారని, ఇది సాధారణం కంటే ఎక్కువగా అని మార్కెట్ వర్గాల అభిప్రాయం. ఇక విప్రో మరో దేశీ ఐటీ దిగ్గజం విప్రో జూన్ లో వేతన పెంపును అమలు చేస్తామని వెల్లడించింది. ఏప్రిల్ నుంచి తమ సిబ్బంది వేతనాలు పెంచినట్టు టెక్ మహీంద్ర పేర్కొంది. చదవండి: భారత్ కు అండగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ -
యాక్సెంచర్‌కు షాకిచ్చిన టీసీఎస్
సాక్షి, ముంబై: భారతీయ సాఫ్ట్వేర్ సేవలసంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మరోసారి అరుదైన ఘనతను సాదించింది. సోమవారం (జనవరి 25) న మరో ఐటీసంస్థ యాక్సెంచర్‌ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన ఐటీ కంపెనీగా అవతరించింది. టీసీఎస్ మార్కెట్ విలువ సోమవారం ఉదయం169.9 బిలియన్ డాలర్లను దాటింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో యాక్సెంచర్ మార్కెట్ క్యాప్ 168 బిలియన్ డాలర్లు. కాగా మార్కెట్ క్యాప్‌కు సంబంధించి టీసీఎస్ ఇంతకుముందు రెండుసార్లు యాక్సెంచర్ కంపెనీని అధిగమించింది. 2018 లో ఒకసారి, గత ఏడాది అక్టోబర్‌లో మరోసారి టీసీఎస్ యాక్సెంచర్‌ను దాటేసింది. అయితే 2020 అక్టోబరులో తొలిసారి ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సేవల సంస్థ టైటిల్‌ను దక్కించుకుంది. 2018 లో, యాక్సెంచర్ కంటే టీసీఎస్ ముందంజలో ఉన్నప్పటికీ, అప్పటికి ఐబీఎం 300 శాతం ఎక్కువ ఆదాయంతో మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. కాగా ఇటీవల ప్రకటించిన 2020 , డిసెంబరు త్రైమాసిక ఫలితాల్లో ఊహించిన దానికంటే మెరుగైన ఆదాయాలను ప్రకటించింది. దీంతో 3,224 రూపాయల వద్ద జనవరి 11 న, కంపెనీ షేర్ ధర 52 వారాల గరిష్ట స్థాయిని సంగతి తెలిసిందే. -
యాక్సెంచర్ పుష్- ఐటీ షేర్లు గెలాప్
ముంబై, సాక్షి: ఐటీ సేవల దిగ్గజం యాక్సెంచర్ తాజాగా నవంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆశావహ ఫలితాలు ప్రకటించింది. దీంతో దేశీయంగా లిస్టెడ్ దిగ్గజ కంపెనీలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ 2 శాతం ఎగసి 23,408 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని చేరుకుంది. అంతేకాకుండా సాఫ్ట్వేర్ సేవల దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ సరికొత్త గరిష్టాలను తాకాయి. వివరాలు చూద్దాం.. (కన్సాలిడేషన్ బాటలో- 47,000కు సెన్సెక్స్) యాక్సెంచర్ జోష్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ తొలి త్రైమాసికంలో డాలర్ల రూపేణా 4 శాతం వృద్ధితో 11.8 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. ఇది అంచనాలకంటే అధికంకాగా.. నిర్వహణ లాభ మార్జిన్లు 0.5 శాతం బలపడి 16.1 శాతానికి చేరాయి. ప్రయాణ వ్యయాలు తగ్గడం, పెరిగిన ఉత్పాదకత వంటి అంశాలు మార్జిన్లకు బలాన్నిచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో 25 శాతం వృద్ధితో 12.9 బిలియన్ డాలర్ల విలువైన తాజా డీల్స్‌ను కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. పూర్తి ఏడాదికి ఆదాయం 4-6 శాతం స్థాయిలో పుంజుకోగలదని తాజాగా అంచనా వేసింది. నిర్వహణ లాభం 7 శాతం పెరిగి 1.89 బిలియన్ డాలర్లను తాకింది. (గత నెల అమ్మకాలలో టాప్-3 కార్లు) షేర్ల జోరు యాక్సెంచర్ 4-6 శాతం వృద్ధితో ఆదాయ అంచనాలను ప్రకటించిన నేపథ్యంలో ఐటీ కౌంటర్లు జోరందుకున్నాయి. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఇన్ఫోసిస్ దాదాపు 3 శాతం ఎగసి రూ. 1,193 సమీపానికి చేరింది. ఇక టీసీఎస్ 2 శాతం బలపడి రూ. 2,894ను తాకింది. ఇవి ఇది సరికొత్త గరిష్టాలుకాగా.. హెచ్‌సీఎల్ టెక్ 2.5 శాతం లాభంతో రూ. 901 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో కోఫోర్జ్ 2.3 శాతం పుంజుకుని రూ. 2,569 వద్ద, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 1.6 శాతం బలపడి రూ. 3,359 వద్ద, ఎంఫసిస్ 1.6 శాతం పెరిగి రూ. 1,361 వద్ద కదులుతున్నాయి. విప్రొ 1.3 శాతం లాభంతో రూ. 362 వద్ద ట్రేడవుతోంది. -
టీసీఎస్ అరుదైన ఘనత
సాక్షి, న్యూఢిల్లీ : దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) శుక్రవారం అసెంచర్‌ను అధిగమించి కొద్దిసేపు ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ కంపెనీగా నిలిచింది. ఆ సమయంలో (అక్టోబర్ 8, క్లోజింగ్ గణాంకాల ప్రకారం) టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 144.7 బిలియన్ డాలర్లు కాగా, యాక్సెంచర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 143.1 బిలియన్ డాలర్లకు పడిపోయింది. చదవండి : టీసీఎస్ ఉద్యోగులకు వేతన పెంపు ఇక టీసీఎస్ సోమవారం మరో కీలక మైలురాయిని చేరుకుంది. రిలయన్స్ ఇండస్ర్టీస్ తర్వాత రూ 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన రెండో భారతీయ కంపెనీగా టీసీఎస్ నిలిచింది. కంపెనీ షేర్ ధర పెరగడంతో టీసీఎస్ మార్కెట్ విలువ ఏకంగా రూ 69,082.25 కోట్లు ఎగిసి ట్రేడ్ ముగిసే సమయానికి బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ 10,15,714 కోట్లకు ఎగబాకింది. కాగా దేశంలో రూ 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను అధిగమించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ర్టీస్ నిలిచిన సంగతి తెలిసిందే. టీసీఎస్ బుధవారం రూ 16,000 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రణాళికను ప్రకటించింది. మరోవైపు పలు కంపెనీలు లేఆఫ్‌లు, వేతన కోతలు విధించడంతో పాటు ఏడాది పాటు ప్రమోషన్లు, వేతన పెంపులను నిలిపివేసిన నేపథ్యంలో టీసీఎస్ తమ ఉద్యోగులందరికీ వేతనాలను పెంచనుంది. టీసీఎస్ వేతన పెంపు నిర్ణయం ఐటీ రంగానికి తీపికబురుగా మారింది. ఇక దేశీ ఐటీ దిగ్గజంలో నియామకాల ప్రక్రియా ఊపందుకుంది. భారత్‌లో 7,000 మంది ట్రైనీలను, అమెరికాలో 1000 మందిని ట్రైనీలను నియమించుకోనుంది. -
ఉద్యోగాలు వదులుకున్నవారికి బంపర్ ఆఫర్..
బెంగుళూరు: ఐటీ సర్వీసుల గ్లోబల్ దిగ్గజం యాక్సెంచర్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కరోనా ఉదృతి నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న విషయం తెలిసిందే. అయితే తమ సంస్థలో స్వచ్చందంగా ఉద్యోగాలు వదులుకునే వారికి 7 నెలల వేతనాలు చెల్లించాలని యాక్సెంచర్ భావిస్తోంది. ఇందులో ముడు నెలల కాలాన్ని నోటీస్ పిరియడ్‌గా పేర్కొనగా, మరో నాలుగు నెలలు వేతనాలను చెల్లించనుంది. అయితే మెజారిటీ ఐటీ కంపెనీలు ఉద్యోగాలు వదులుకున్న వారికి రెండు నుంచి మూడు నెలల మాత్రమే వేతానాలు చెల్లిస్తున్నాయి. కాగా యాక్సెంచర్ సంస్థలో నైపుణ్యం లేని 5శాతం ఉద్యోగులకు కోత విధించనున్నట్లు గతంలో యాక్సెంచర్ ప్రకటించింది. అయితే సంస్థ మాత్రం ప్రతి సంవత్సరం కొత్త ఉద్యోగాలు, ఉద్యోగాల కోత సహజమేనని పేర్కొంది. అయితే ఎక్కువగా టెక్నాలజీకి డిమాండ్ లేని ప్రాంతాలలో ఉద్యోగాల కోత ప్రభావం ఎక్కువుంటుంది. మరోవైపు టెక్నాలజీకి డిమాండ్ ఉన్న ప్రాంతాలలో కంపెనీలు కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. యాక్సెంచర్ సంస్థకు ఇప్పటికి 70శాతం రెవెన్యూ డిజిటల్ సేవల నుంచి లభిస్తున్నాయి. చదవండి: ఉద్యోగాలు, బోనస్ ఇస్తున్నాం: యాక్సెంచర్ -
టెకీలకు యాక్సెంచర్ షాక్..
బెంగుళూరు: ఐటీ సర్వీసుల గ్లోబల్ దిగ్గజం యాక్సెంచర్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. కంపెనీలో పనిచేసే 5 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 5లక్షల టెకీలకు ఉద్యోగాలు కల్పిస్తున్నయాక్సెంచర్, భారత్‌లో 2లక్షల టెకీలకు ఉద్యోగాలు కల్పిస్తుంది. సంస్థ అంతర్గత సమావేశంలో కాంట్రాక్ట్‌లను తగ్గించడంతో పాటు, కొత నియామకాలు చేపట్టకుండా ప్రస్తుతం పని చేస్తున్న నైపుణ్యం లేని ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని భావిస్తోంది. క్లయింట్లకు కేటాయించాల్సిన పనిగంటలు భారీగా తగ్గాయని, నైపుణ్యం కలిగిన టెకీల ఉద్యోగాలకు ఎలాంటి డోకా ఉండదని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా యాక్సెంచర్‌లో ఉద్యోగాల కోత ఉంటుందని జులై 1న గార్డియన్ అనే నివేదిక తెలిపింది. అయితే వృధా ఖర్చును తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని, సప్లై, డిమాండ్ మధ్య వ్యత్యాసం లేకుండా చూస్తామని సంస్థ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దిగ్గజ ఐటీ కంపెనీలు కాగ్నిజెంట్, ఐబీఎమ్ ఉద్యోగులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. చదవండి: కంపెనీలకు నిరసనల సెగ.. -
యాక్సెంచర్ పుష్- ఐటీ షేర్లు గెలాప్
సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం యాక్సెంచర్ మూడో త్రైమాసికం(మార్చి-మే)లో అంచనాలను మించిన ఫలితాలు సాధించడంతో దేశీ ఐటీ రంగ కౌంటర్లకు ఒక్కసారిగా ఉత్సాహమొచ్చింది. ఫలితంగా సాఫ్ట్వేర్ సేవల రంగంలోని దాదాపు అన్ని కౌంటర్లకూ డిమాండ్ పెరిగింది. దీంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఐటీ ఇండెక్స్ ఏకంగా 4.5 శాతం జంప్‌చేసింది. దాదాపు అన్ని ఐటీ కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లకు కొనుగోళ్లకు ఎగబడుతుండటంతో బ్లూచిప్స్‌తోపాటు మిడ్ క్యాప్స్ సైతం భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జోరు తీరిలా ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్ 6.5 శాతం ఎగసి రూ. 747ను తాకగా.. టీసీఎస్ 5 శాతం జంప్‌చేసి రూ. 2113కు చరింది. విప్రో 4 శాతం లాభపడి రూ. 227 వద్ద, టెక్ మహీంద్రా 2.3 శాతం పుంజుకుని రూ. 567 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 3 శాతం పురోగమించి రూ. 566కు చేరింది. రయ్రయ్ మిడ్ సైజ్ కంపెనీ కౌంటర్లలో నిట్ టెక్ 8 శాతం పెరిగి రూ. 1491కు చేరగా.. మైండ్‌ట్రీ 6 శాతం జంప్‌చేసి రూ. 972ను తాకింది. ఈ బాటలో ఎంఫసిస్ 4 శాతం బలపడి రూ. 906 వద్ద, ఎల్అండ్టీ టెక్నాలజీ 4.2 శాతం ఎగసి రూ. 1314 వద్ద, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 2 శాతం లాభంతో రూ. 1927 వద్ద కదులుతున్నాయి. క్యూ4 భళా ఐటీ దిగ్గజం యాక్సెంచర్ మేతో ముగిసిన తాజా క్వార్టర్లో 125 కోట్ల డాలర్ల నికర లాభం ఆర్జించింది. ఇది త్రైమాసిక ప్రాతిపదికన 1.9 డాలర్ల షేరువారీ ఆర్జన(ఈపీఎస్)కాగా.. మొత్తం ఆదాయం 11 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ కాలంలో కంపెనీ 62.7 కోట్ల డాలర్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేసింది. క్యూ4లో 10.6-11 బిలియన్ డాలర్ల ఆదాయం అంచనా(గైడెన్స్) వేస్తోంది. పూర్తి ఏడాదికి 7.7 ఈపీఎస్‌ను సాధించగలమని భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. -
ఉద్యోగాలు, బోనస్ ఇస్తున్నాం: యాక్సెంచర్
ఐటీ సర్వీసుల గ్లోబల్ దిగ్గజం యాక్సెంచర్ గత కొద్ది వారాలుగా తమ సిబ్బందిలో అత్యధిక శాతం మందికి ప్రమోషన్లు ఇవ్వడంతోపాటు.. బోనస్‌లు చెల్లించినట్లు తెలుస్తోంది. దేశీయంగా కంపెనీకున్న 2,00,000 మంది ఉద్యోగులలో సగానికంటే ఎక్కువమందికి ప్రమోషన్లు, బోనస్‌లు లభించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా ఐటీ సర్వీసుల రంగంలో అత్యధిక శాతం మందికి ఉపాధి కల్పించడం ద్వారా యాక్సెంచర్ సైతం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఏడాదికి కనీసం 2,500 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇస్తోంది. సుమారు 45 లక్షల మంది ఉద్యోగులకు ఆవాసమైన దేశీ ఐటీ రంగం సగటున నెలకు 20,000 కొత్త ఉద్యోగాలకు దారి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో 2020 మార్చితో ముగిసిన గతేడాదిలోనూ 2.05 లక్షల మందికి కొత్తగా ఉపాధి కల్పించినట్లు ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ వెల్లడించింది. కొత్త వారికి సై గత కొద్ది రోజుల్లో కొత్తగా ఆఫర్ లెటర్లు ఇచ్చిన వారందరికీ ఉద్యోగ అవకాశాన్ని కల్పించనున్నట్లు యాక్సెంచర్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అంతేకాకుండా కంపెనీలో చేరిన మరుక్షణం నుంచీ అన్ని రకాల వేతన సౌకర్యాలూ అందించనున్నట్లు తెలియజేశారు. కాగా.. కోవిడ్-19 విస్తృతి, లాక్‌డవున్ ప్రభావంతో బిజినెస్‌లు మందగించడంతో పలు కంపెనీలు సిబ్బంది కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. ఐటీ రంగంలోనూ కొన్ని కంపెనీలు వేతన పెంపును నిలిపివేయడంతోపాటు.. ప్రమోషన్లను వాయిదా వేశాయి. ఇప్పటికే ఆఫర్ లెటర్లు జారీ చేసిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు దేశీ ఐటీ దిగ్గజం విప్రో కంపెనీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. అయితే వేతన పెంపు, ప్రమోషన్లను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం ఇటీవల ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించింది. వ్యయాల అదుపునకు ఇతర చర్యలను సైతం చేపడుతున్నట్లు తెలియజేసింది. పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించనున్నట్లు పేర్కొంది. కాగా.. జూనియర్ స్థాయి ఉద్యోగులకు విధానాలకు అనుగుణంగా వేతన చెల్లింపులను చేపడుతున్నట్లు టెక్ మహీంద్రా పేర్కొంది. అయితే అత్యున్నత, సీనియర్ స్థాయిలో పనితీరు ఆధారంగా ఇచ్చే వేతన చెల్లింపులలో కోత పెడుతున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ఇక ఫ్రెంచ్ కంపెనీ క్యాప్‌జెమినీ.. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, బోనస్‌లను చెల్లిస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. మొత్తం సిబ్బందిలో 70 శాతంవరకూ లబ్ది పొందినట్లు తెలుస్తోంది. -
కంపెనీలకు నిరసనల సెగ..
న్యూఢిల్లీ: వివాదాస్పద అంశాలపై చెలరేగే నిరసనల్లో అప్పుడప్పుడు అనుకోని విధంగా కంపెనీలు కూడా ఇరుక్కుంటున్నాయి. దీంతో వ్యతిరేకత సెగ వాటికి కూడా గట్టిగానే తగులుతోంది. తాజాగా సీఏఏ–ఎన్ఆర్సీ అంశం, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థులపై దాడులు, ఆరెస్సెస్ కార్యక్రమాలు తదితర అంశాలపై బ్రాండ్ అంబాసిడర్లు, తమ సంస్థల చీఫ్‌ల వైఖరులు .. టెక్ కంపెనీలకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. పాలసీబజార్, జోహో, యాక్సెంచర్ వంటి సంస్థలు ఎవరో ఒకరి పక్షం వహించక తప్పని పరిస్థితుల్లో చిక్కుకుంటున్నాయి. దీంతో వ్యాపార అవకాశాలు కూడా కోల్పోయే సందర్భాలు ఎదురవుతున్నాయి. దీపిక బ్రాండ్‌పై జేఎన్‌యూ ఎఫెక్ట్.. వివాదాస్పద అంశాలపై బ్రాండ్ అంబాసిడర్లు వ్యవహరించే తీరు కంపెనీలకే కాకుండా.. స్వయంగా వారికి కూడా సమస్యలు తెచ్చిపెడుతోంది. ఆగంతకుల చేతిలో దెబ్బలు తిన్న జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావంగా నిర్వహించిన ఓ నిరసన ప్రదర్శనకు బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె కూడా హాజరు కావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కొన్ని బ్రాండ్స్.. ఆమెతో రూపొందించిన పలు ప్రకటనలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలని నిర్ణయించుకున్నాయి. వివాదం సద్దుమణిగే దాకా ఓ రెండు వారాల పాటు ఆమె ప్రకటనలు ఆపేయాలంటూ తమ క్లయింట్ నుంచి సూచనలు వచ్చినట్లు ఓ మీడియా ఏజెన్సీ వెల్లడించింది. దేశీయంగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణుల్లో పదుకొణె కూడా ఒకరు. ఒకో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు ఆమె రూ. 8 కోట్లు, సినిమాకు రూ. 10 కోట్ల పైగా తీసుకుంటారని టాక్. ఆమె లోరియల్, తనిష్క్, యాక్సిస్ బ్యాంక్ తదితర 23 బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. పాలసీబజార్‌కు బ్రాండ్ అంబాసిడర్ కష్టం.. ఇక, కంపెనీలపరంగా చూస్తే.. ఆన్లైన్లో బీమా పథకాలు మొదలైనవి విక్రయించే పాలసీబజార్‌కు బ్రాండ్ అంబాసిడర్ కారణంగా కష్టం వచ్చిపడింది. ఈ సంస్థ రాజకీయంగా రెండు భిన్న వర్గాలకు చెందిన నటులైన అక్షయ్ కుమార్, మొహమ్మద్ జీషన్ అయూబ్‌లను తమ ప్రచారకర్తలుగా నియమించుకుంది. అయితే, జేఎన్‌యూ, షహీన్ బాగ్ తదితర నిరసన ప్రదర్శనలకు అయూబ్ బాహాటంగా మద్దతు పలకడం పాలసీబజార్‌ను చిక్కుల్లో పడేసింది. అయూబ్ వైఖరిని పాలసీబజార్ సమర్ధిస్తోందా అన్నది బీజేపీ నేతల ప్రశ్న. ఈ వివాదంతో బాయ్కాట్పాలసీబజార్ హ్యాష్‌టాగ్ బాగా ట్రెండింగ్ అయ్యింది. అయితే, దీనిపై కంపెనీ ఎటువంటి వైఖరీ వెల్లడించలేదు. ఆరెస్సెస్ వివాదంలో జోహో, యాక్సెంచర్.. ఫిబ్రవరి 2న జరగబోయే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యక్రమం.. జోహో, యాక్సెంచర్ ఇండియాకు సమస్యలు తెచ్చిపెట్టింది. రెండు సంస్థల చీఫ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొంటుండటమే ఇందుకు కారణం. చెన్నైలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలన్న తన నిర్ణయాన్ని జోహో సీఈవో శ్రీధర్ వెంబు సమర్ధించుకున్నారు. అయితే, దీన్ని వ్యతిరేకిస్తున్న నిఖిల్ పహ్వా, ఎ లదఖ్, సచిన్ టాండన్ వంటి çపలువురు యువ వ్యాపారవేత్తలు .. జోహోతో వ్యాపారానికి తెగదెంపులు చేసుకుంటామని స్పష్టం చేశారు. ‘మిగతా వారంతా బాయ్‌కాట్ చేయాలని నేనేమీ పిలుపునివ్వడం లేదు. అది ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. కానీ ఆ కార్యక్రమంలో వెంబు పాలుపంచుకుంటున్నందున.. నేను మాత్రం జోహోతో వ్యాపార లావాదేవీలను ఆపేసే పరిస్థితిలో ఉన్నాను‘ అంటూ టాండన్ .. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో పోస్ట్ చేశారు. మరోవైపు, యాక్సెంచర్ ఇండియా సీఈవో రామ ఎస్ రామచంద్రన్ తీరుపై సొంత సంస్థలోని ఉద్యోగుల నుంచే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. యాక్సెంచర్ నైతిక నియమావళి ప్రకారం ప్రొఫెషనల్ హోదాలో ఉద్యోగులెవరూ ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనరాదని కొందరు సిబ్బంది చెబుతున్నారు. తమ ఉద్యోగులు నిర్దిష్ట సిద్ధాంతాల పక్షం వహించడాన్ని యాక్సెంచర్ ఎంతవరకూ సమర్థిస్తుందన్న దానిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చర్యలు.. యాక్సెంచర్‌లోని మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన ఉద్యోగులకు ఎలాంటి సంకేతాలు పంపిస్తాయని ట్విట్టర్ యూజర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఏకంగా యాక్సెంచర్ గ్లోబల్ సీఈవో జూలీ స్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. వారు పోస్ట్‌లు చేశారు. అయిదేళ్ల క్రితం స్నాప్‌డీల్ ఉదంతం.. కంపెనీలు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. 2015లో ఈకామర్స్ సంస్థ స్నాప్‌డీల్ కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంది. అప్పట్లో ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆమిర్‌ఖాన్.. దేశంలో నెలకొన్న పరిస్థితులను తనను భయాందోళనలకు గురిచేస్తున్నాయని వ్యాఖ్యానించడం స్నాప్‌డీల్‌కు చిక్కులు తెచ్చిపెట్టింది. ఆమిర్‌ఖాన్‌తో పాటు స్నాప్‌డీల్‌ను కూడా బాయ్‌కాట్ చేయాలంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆ దెబ్బతో మళ్లీ ఆమిర్‌ఖాన్‌తో కాంట్రాక్టును స్నాప్‌డీల్ .. రెన్యూ చేసుకోలేదు. ఇటీవలే ఆన్లైన్ ఫుడ్ సర్వీసుల యాప్ జొమాటోకూ ఇలాంటి సమస్యే ఎదురైంది. హిందువేతర డెలివరీ బాయ్‌ని పంపించారనే కారణంతో ఓ యూజరు.. ఆర్డరును క్యాన్సిల్ చేశారు. అయితే, జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్.. తమ డెలివరీ బాయ్‌కు మద్దతిచ్చారు. కొన్ని వివాదాలు.. నవంబర్, 2015: భారత్‌లో అభద్రతాభావం పెరిగిపోయిందంటూ బాలీవుడ్ నటుడు, స్నాప్‌డీల్ బ్రాండ్ అంబాసిడర్ ఆమిర్‌ఖాన్ వ్యాఖ్యానించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఆయనతో స్నాప్‌డీల్ తెగదెంపులు చేసుకోక తప్పలేదు. ఏప్రిల్, 2018: కథువా రేప్ బాధితురాలికి న్యాయం చేయాలంటూ సాగిన ఉద్యమంలో నటి స్వరభాస్కర్ వివాదాస్పద ట్వీట్స్ చేశారు. దీంతో ఈకామర్స్ సంస్థ అమెజాన్.. ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పించింది. ఏప్రిల్, 2018: డ్రైవర్ ముస్లిం అనే కారణంతో వీహెచ్‌పీ కార్యకర్త ఒకరు.. ఓలా ట్యాక్సీ రైడ్‌ను రద్దు చేసుకున్నారు. తాము మతసామరస్యానికి ప్రాధాన్యమిస్తామంటూ ఓలా సంస్థ .. సదరు డ్రైవరు పక్షాన నిల్చింది. జూలై, 2019: ముస్లిం డెలివరీ బాయ్ వచ్చారనే కారణంతో జొమాటోలో చేసిన ఆర్డరును ఒక యూజరు క్యాన్సిల్ చేశారు. జొమాటో, దాని వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ .. డెలివరీ బాయ్ పక్షాన నిల్చారు. -
ఐటీ కంపెనీలపై సంచలన కేసు
సాక్షి, హైదరాబాద్: ఐటీ కంపెనీల్లో టెక్కీల కష్టాలు, పని ఒత్తిడి తదితర అంశాలపై చాలా కథనాలు ఇప్పటివరకూ విన్నాం. చదివాం. అయితే తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీలపై ఉద్యోగులు ఏకంగా కోర్టుకెక్కడం సంచలనం రేపుతోంది. యాక్సెంచర్, కాగ్నిజెంట్, కాస్పెక్స్ కార్పొరేషన్ కంపెనీలపై హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు ఐటి ఉద్యోగులు కేసు నమోదు చేశారు. ఫోరమ్ ఎగైనెస్ట్ కరప్షన్ కార్యకర్తల బృందంతో కలిసి వీరు తెలంగాణ పిల్ హైకోర్టులో దాఖలు చేశారు. భారతదేశ ఐటి పరిశ్రమ చరిత్రలోనే ఒక మైలురాయి లాంటిదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. "ఉపాధి పేరిట రాష్ట్రంలో వైట్ కాలర్డ్ బానిసత్వం" అని టెక్కీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎక్కువ పని గంటలు, ప్రోత్సాహకాలు ప్రకటించకపోవడం, చెత్త లీవ్ విధానం లాంటి వివిధ ఆరోపణలతో ఫిర్యాదు నమోదు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది. దీనిపై నాలుగు వారాల్లో స్పందించాల్సిందిగా ఐటీ సంస్థలను ఆదేశించింది. అలాగే ఈ వ్యవహారంపై స్పందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కోర్టు నోటీసులిచ్చింది. ఐటి ఉద్యోగుల జీవితాలను మెరుగుపర్చడానికి, సంస్థల పని సంబంధిత దోపిడీని నిలువరించడానికి ఈ పిల్ దాఖలు చేశామని ఫోరం ఎగైనెస్ట్ అవినీతి అధ్యక్షుడు విజయ్ గోపాల్ వెల్లడించారు. అదనపు వేతనం లేకుండా దాదాపు పది గంటల విధులు, కార్యాలయ క్యాబ్‌ల ద్వారా రోజువారీ ప్రయాణంలో 4-5 గంటలు గడపవల్సి రావడం, సెలవులను సమయానికి కేటాయించకపోవడం లాంటి ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయన్నారు. చట్టం ఏమి చెబుతుంది? 2002 లో ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారం తెలంగాణ, హైదరాబాద్, ఇతర ఐటి హబ్‌లలో వర్తించే చట్టాలు ఆసక్తికర విషయాలను వివరిస్తున్నాయి. ఉద్యోగులను వారానికి 48 గంటలు/ లేదా రోజుకు 8 గంటలు పని ఓవర్ టైం వారానికి 6 గంటలు, సంవత్సరానికి 24 గంటలు మాత్రమే ప్రతి ఉద్యోగికి సంవత్సరంలో 15 రోజుల పెయిడ్ లీవ్, 12 రోజుల క్యాజువల్ లీవ్, 12 రోజుల సిక్ లీవ్ ఇవ్వాలి మరోవైపు రాష్ట్రంలో (అప్పటి ఆంధ్రప్రదేశ్) తమ కార్యాలయాలను స్థాపించడానికి మరిన్ని ఐటి సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ కార్మిక చట్టాలను దాటవేయడానికి వీలు కల్పించింది. మొత్తం 6 విభాగాలను బైపాస్ చేయడానికి అనుమతించారు. వీటిలో ప్రారంభ, ముగింపు గంటలు, రోజువారీ, వారపు పని గంటలు, సెలవులతోపాటు ఉద్యోగం నుంచి తొలిగించిన సందర్భంలో ఉద్యోగిని రక్షించడానికి నిబంధనలున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమింటే ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆయా కంపెనీలకు కేవలం 100 రూపాయల జరిమానా మాత్రమే ప్రభుత్వం విధించవచ్చు. ఈ చట్టాన్నిమరో రెండేళ్లపాటు పొడిగిస్తూ 2019లో తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
నడిరోడ్డుపై టెకీ దారుణహత్య
బెంగుళూరు : స్నేహితురాలిని కలిసేందుకు వెళ్తున్న టెకీ ప్రణయ్ మిశ్రా(28) దారుణ హత్యకు గురయ్యాడు. బెంగుళూరులో సోమవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన ప్రణయ్ మిశ్రా ప్రముఖ ఐటీ కంపెనీ ఎక్సెంచర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి వీకెండ్ ఎంజాయ్ చేసిన ప్రణయ్.. తన ఇంటికి చేరువలో ఉన్న స్నేహితురాలిని కలిసేందుకు సోమవారం తెల్లవారుజామున బయల్దేరి వెళ్లాడు. దారిలో ప్రణయ్‌ను అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు కత్తితో నిర్దాక్షణ్యంగా దాడి చేసి, పారిపోయారు. రక్తపు మడగులో పడి ఉన్న ప్రణయ్‌ను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో రక్తం ఎక్కువగా పోయి ప్రణయ్ అప్పటికే ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య చేసిన దుండగులు ప్రణయ్ వస్తువులను దోచుకెళ్లలేదని పోలీసులు చెప్పారు. ప్రణయ్ ఫోన్, ఇతర వస్తువులు జేబులోనే ఉన్నాయని తెలిపారు. ప్రణయ్ కాల్ రికార్డింగులను పరిశీలిస్తున్నామని, సన్నిహితులు, స్నేహితులు, సహచర ఉద్యోగులను కూడా ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. -
ట్రంప్ ఎఫెక్ట్: అమెరికాలో 15 వేల ఉద్యోగాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపడుతున్న రక్షణాత్మక ఆర్థిక విధానాలకు అంతర్జాతీయ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ కూడా ప్రభావితం కానుంది. అమెరికాలో 15,000 ఉద్యోగాలను కల్పించనున్నట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. అలాగే అమెరికాలో ఉద్యోగుల శిక్షణకోసం 10 ఇన్నోవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. దీనికోసం 1.4 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్టు ప్రకటించింది. దీంతో 2020 నాటికి 65 వేలమందికిపైగా ఉద్యోగులతో అమెరికాలో తమ కంపెనీల ఉద్యోగుల శాతం 30శాతానికి పెరగనుందని పేర్కొంది. డబ్లిన్, ఐర్లాండ్ రాష్ట్రాల్లో టెక్ సేవలను అందిస్తున్న యాక్సెంచర్ భారతదేశంలోనే ఎక్కువ సిబ్బంది కలిగివుంది. దేశీయంగా 3 లక్షల ఎనభైవేలకు పైగా ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. కాగా హెచ్1బీ వీసాల ఆంక్షలు, అమెరికాలోని ఉద్యోగాలను స్థానికులకే కేటాయించాలన్న ట్రంప్ నిబంధనలతో ప్రముఖ ఐటీ, ఇతర సంస్థలు, భారత ఐటీ పరిశ్రమ ఆందోళన పడిపోయిన సంగతి తెలిసిందే. -
యాక్సెంచర్ చేతికి ఆస్ట్రేలియా సెక్యూరిటీ సంస్థ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఐటీ దిగ్గజం యాక్సెంచర్, ఆస్ట్రేలియాకు చెందిన సెక్యూరిటీ కంపెనీ రెడ్కోర్ను కొనుగోలు చేసింది. రెడ్ కోర్ కంపెనీని ఎంతకు కొనుగోలు చేసిందన్న వివరాలను యాక్సెంచర్ వెల్లడించలేదు. రెడ్‌కోర్ కంపెనీ కొనుగోలు కారణంగా తమ సెక్యూరిటీ సేవల విభాగం మరింతగా విస్తరిస్తుందని, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తమ అగ్రస్థానం మరింతగా పటిష్టమవుతుందని యాక్సెంచర్ సెక్యూరిటీ ఎండీ, కెల్లీ బిస్సెల్ చెప్పారు. రెడ్‌కోర్ కంపెనీ క్లౌడ్, వెబ్, మొబైల్, ఆడాప్టివ్ యాక్సెస్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్‌లలో హోలిస్టిక్ అథంటికేషన్, ఆథరైజేషన్, అడ్మినిస్ట్రేషన్ సర్వీసులను డెవలప్ చేస్తోంది. యాక్సెంచర్ దన్నుతో క్లయింట్లకు మరింత సమర్థవంతమైన, విస్తృతమైన సేవలందించగలమని రెడ్‌కోర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జోసెఫ్ ఫైల్లా పేర్కొన్నారు. -
యాక్సెంచర్‌లో 95వేల కొత్త ఉద్యోగాలు
న్యూయార్క్ : ఈ ఏడాది ఆగస్టుతో ముగిసే ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా మొత్తం 95,000 నియామకాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్ సంస్థ యాక్సెంచర్ తెలిపింది. కంపెనీ సెప్టెంబర్-ఆగస్టు కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. మే 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో యాక్సెంచర్ 7.8 బిలియన్ డాలర్ల ఆదాయన్ని ఆర్జించగా, నాలుగో త్రైమాసికంలో 7.45-7.70 బిలియన్ డాలర్ల స్థాయిలో ఆదాయాలు ఉండొచ్చని అంచనా వేస్తోంది. మూడో త్రైమాసికం ఆఖరు నాటికి 3,36,000 పై చిలుకు ఉద్యోగులు ఉన్నారు. వీరిలో దాదాపు మూడు లక్షల మంది భారత్‌తోనే ఉన్నారు. మరో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీలో అత్యధికంగా 3,19,656 మంది, ఇన్ఫోసిస్‌లో1.76 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. -
జీడీపీకి ‘డిజిటల్’ జోష్!
2020 నాటికి 101 బిలియన్ డాలర్ల జత న్యూఢిల్లీ: పెరుగుతున్న డిజిటల్ టెక్నాలజీ వినియోగం ద్వారా 2020 నాటికి భారత జీడీపీకి 101 బిలియన్ డాలర్లు సమకూరుతాయని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ యాక్సెంచర్ తెలిపింది. యాక్సెంచర్ నివేదిక ప్రకారం, డిజిటల్ టెక్నాలజీ వల్ల చైనాకు వచ్చే ఆదాయం 410 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. అదే బ్రెజిల్‌కు అయితే 97 బిలియన్ డాలర్ల ఆదాయం రానుంది. అంతర్జాతీయంగా చూస్తే డిజిటల్ టెక్నాలజీ వల్ల వచ్చే ఆదాయంలో భారత్ నాల్గో స్థానంలో నిలువనుంది. భారత్‌కు ముందు వరుసలో చైనా, అమెరికా (365 బిలియన్ డాలర్లు), జపాన్ (114 బిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీ వల్ల వచ్చే ఆదాయం అభివృద్ధి చెందిన దేశాలలో 0.25 శాతం జీడీపీ వృద్ధికి, అభివృద్ధి చెందుతున్న దేశాలలో 0.5 శాతం జీడీపీ వృద్ధికి దోహదపడుతుంది. డిజిటల్ టెక్నాలజీ వినియోగం వల్ల టాప్ 10 ఆర్థికవ్యవస్థలను కలిగిన దేశాల ఉత్పాదకత పెరిగి, వాటికి దాదాపు 1.36 ట్రిలియన్ డాలర్ల సంపద చేకూరనుంది. -
టెక్‌మహీంద్రా మొబైల్ జాబ్ ప్లాట్‌ఫామ్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా.. ఉద్యోగార్థుల కోసం జాతీయ స్థాయిలో మొబైల్ జాబ్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం జాతీయ స్థాయిలో సరల్ రోజ్‌గార్ కార్డులను ప్రవేశపెట్టినట్లు బుధవారం ప్రకటించింది. రూ. 50 వెచ్చించి ఈ సరల్ రోజ్‌గార్ కార్డును కొనుగోలు చేయడం ద్వారా సర్వీసులను పొందవచ్చని పేర్కొంది. తదనంతరం 1860-180-1100 నంబర్‌కు డయల్ చేసి తమకు నచ్చిన భాషలో వాయిస్‌కాల్ ద్వారా భారత్‌లోని ఏ ప్రదేశం నుంచైనా ఉద్యోగార్ధులు రిజిస్టర్ చేసుకోవచ్చని టెక్ మహీంద్రా మొబిలిటీ బిజినెస్ హెడ్ జగదీశ్ మిత్రా వెల్లడించారు. ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు, గ్రాడ్యుయేట్ కంటే కింది స్థాయిలోని(దినసరి వేతనంతో పనిచేసే వర్కర్లు, ఎంట్రీలెవెల్) కొలువుల కోసం వేచిచూసే అభ్యర్థుల మధ్య అనుసంధానకర్తగా ఈ మొబైల్ జాబ్ మార్కెట్ ప్లేస్ పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా కార్పొరేట్, ప్రధాన కంపెనీలకు తమ అర్హతలను సరైన రీతిలో తెలియజేసేందుకు వీలుగా తొలిసారి రెస్యూమెలను రూపొందించుకునేవారికి తాము సహకారం కూడా అందిస్తామని మిత్రా చెప్పారు. చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈలు)/ఎంట్రప్రెన్యూర్స్ కూడా ఈ సేవల ద్వారా రిజిస్టర్ అయినవారికి వాయిస్ కాల్స్ ద్వారా సంప్రదించే అవకాశం ఉందని ఆయన వివరించారు. ప్రస్తుతం 100కుపైగా ఉద్యోగ విభాగాల్లో లక్షకు పైబడి జాబ్స్ సరల్ రోజ్‌గార్ ద్వారా అందుబాటులో ఉన్నాయని టెక్ మహీంద్రా వైస్‌ప్రెసిడెంట్(మొబిలిటీ, వ్యాస్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో) వివేక్ చందోక్ చెప్పారు. రిటైల్, అకౌంటింగ్, టైలర్, ఎలక్ట్రీషియన్, మెషీన్ ఆపరేటర్, కుక్స్, సెక్యూరిటీగార్డులు, డెలివరీ బాయ్స్ వంటి కేటగిరీల్లో డిమాండ్ అధికంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా లక్షకు పైగా టెలికం రీచార్జ్ సేవలందించే రిటైల్ అవుట్‌లెట్స్ వద్ద ఈ సరల్ రోజ్‌గార్ కార్డులు లభిస్తాయని చందోక్ తెలిపారు. -
కార్పొరేట్ రంగంలో మగువల హవా!
న్యూఢిల్లీ: ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటున్న మహిళలు కార్పొరేట్ రంగంలో కూడా దూసుకుపోతారని యాక్సెంచర్ తాజా నివేదిక అంటోంది. 2020 కల్లా అగ్రశ్రేణి మేనేజ్మెంట్ స్థాయిల్లోనూ, కంపెనీల డెరైక్టర్ల బోర్డ్ల్లోనూ మహిళల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని కన్సల్టింగ్, టెక్నాలజీ కంపెనీ యాక్సెంచర్ నివేదిక వెల్లడించింది. గతేడాది నవంబర్‌లో ఆన్లైన్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ కంపెనీ ఈ నివేదికను రూపొందించింది. 32 దేశాలకు చెందిన మధ్య, భారీ స్థాయి సంస్థలకు చెందిన 4,100 మంది బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ సర్వేలో పాల్గొన్నారు. కంపెనీల్లో మహిళల పురోగతి విషయమై, ఉద్యోగుల్లోనూ, కంపెనీల్లోనూ చెప్పుకోదగిన స్థాయిలో ఆశాభావం వెల్లడైందని ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యాంశాలు.. {పస్తుతం భారత కంపెనీల్లో సీఈవోలు, ఎగ్జిక్యూటివ్‌లు, ఇతర ఉన్నత స్థాయిల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, ఆరేళ్లలో ఈ సంఖ్య పెరగగలదన్న విశ్వాసాన్ని ఈ సర్వేలో పాల్గొన్న భారతీయులు వ్యక్తం చేశారు. కంపెనీల డెరైక్టర్లుగా మహిళల సంఖ్య 2020కల్లా పెరుగుతుందని 71% మంది అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారి సంఖ్య 40%. 2020 కల్లా మహిళా సీఈవోల సంఖ్య పెరుగుతుందని 70% మంది పేర్కొన్నారు. భారత్ విషయానికొస్తే, ఇలా చెప్పిన వారి సంఖ్య 44%, అమెరికాలో 66%గా, ఇంగ్లండ్‌లో 49 శాతంగా ఉంది. గతేడాదితో పోల్చితే మరింత ఉన్నత స్థాయిల్లోకి మహిళా ఉద్యోగులను ప్రమోట్ చేయాలని యోచిస్తున్నామని 44% కంపెనీలు చెప్పాయి. కాగా కంపెనీల ఉన్నత స్థాయిల్లో మహిళల సంఖ్యలో 2020కల్లా ఎలాంటి మార్పు ఉండదని జపాన్ దేశస్థులు భావిస్తున్నారు. -
ఆఫర్ లెటర్ ఆలస్యం కాకుంటే బతికి ఉండేవాడు
కొత్తకోట మండలం పాలెం ఎన్‌హెచ్ 44పై బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన బస్సులో 45 మంది ప్రయాణీకులు సజీవ దహనమైన ఘోర దుర్ఘటనలో హృదయవిదారకమైన ఉదంతాలలో కాలిబూడిదైపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆడారు రవి (27)ది భిన్నమైన ఉదంతం. అంతా సజావుగా జరిగి ఉంటే, తను కలలుగన్న మల్టీనేషనల్ కంపెనీ ఆక్సెంచుర్ (Accenture) హైదరాబాదు ఆఫీసులో ఈ పాటికి చేరి ఉండేవాడు. ఈ ఒక్క రోజు ఆగి ఉన్నట్టైతే మరో మల్టీనేషనల్ కంపెనీ కెటి & టి (KT &T) లో తానిప్పుడు చేస్తున్న బెంగలూరులోనే చేరి ఉండేవాడు. "ఒక విధంగా వాడి చావుకు నేను కూడా బాధ్యుడ్నేనేమో. వాడు ఎటూ తేల్చుకోలేక పోతుంటే కెటి & టి కంటే ఆక్సెంచుర్ పెద్ద కంపెనీ అని సలహా ఇచ్చాను. మంగళవారానికి కెటి & టి ఆఫర్ లెటర్ వస్తే, ఉండిపోతానని, లేకపోతే హైద్రాబాద్ బయిల్దేరతానని అన్నాడు," అని చెప్పుకొచ్చాడు ఆడారు రవి ప్రాణ స్నేహితుడు కె. లీలా శివ ప్రసాద్. మిత్రుడ్ని రిసీవ్ చేసుకోవాలన్న ఆత్రుతలో ఉన్న తాను, గుర్తు పట్టడం కూడా కష్టమైన ఆ మిత్రుడి శవాన్ని చూడటానికి వెళ్తున్నానని దుర్ఘటనా స్తలానికి వెళ్లబోయే ముందు 'సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడాడు. ప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం, విజయనగరానికి చెందిన రవి చదువులో చాలా చురుకైన వాడు. మాచర్ల న్యూటన్ కాలేజీలో ఇంజినీరింగ్ 2003- 2007 బ్యాచ్. 2007 ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, బెంగలూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాడు. రవికి ఒక అన్నయ్య, ఓ చెల్లి ఉన్నారు. అన్నయ్య విజయనగరంలోనే తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటూ, ఇంటర్నెట్ సెంటర్ నడుపు కుంటున్నాడు. రవి ఆ కుటుంబానికి ఆధారంగా ఉన్నాడు. త్వరలో చెల్లి పెళ్ళి చేయాలని, మంచి కంపెనీలో మరింత మంచి జీతం వచ్చే ఉధ్యోగంలో చేరాలని పట్టుదలగా కొన్ని పెద్ద కంపెనీలలో ప్రయత్నించి సఫలమయ్యాడు. నిజానికి కెటి & టి ఆఫర్ చేసిన జీతం ఎక్కువ అయినా, ఆఫర్ లెటర్ ఇవ్వడంలో జాప్యం జరగడం, ఆక్సెంచుర్ ఇంకా పేరున్న కంపనీ కావడంతో రవి మంగళవారం రాత్రి తన మృత్యువుని వెదుక్కుంటూ బయిల్దేరినట్టైయింది. "రాత్రి బస్సు ఎక్కిన తర్వాత కూడా ఫోన్ చేశాడు. రేపు జాయిన్ అయ్యాక, సాయంత్రం కె ఎఫ్ సీ లో పార్టీ చేసుకుందాం అన్న వాడిని ఇప్పుడు గుర్తు పట్టడానికి కూడా లేదు,' అని ఆడారు రవి స్నేహితుడు లీలా ప్రసాద్ భోరుమన్నాడు.