
యాక్సెంచర్ చేతికి ఆస్ట్రేలియా సెక్యూరిటీ సంస్థ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఐటీ దిగ్గజం యాక్సెంచర్, ఆస్ట్రేలియాకు చెందిన సెక్యూరిటీ కంపెనీ రెడ్‌కోర్‌ను కొనుగోలు చేసింది. రెడ్ కోర్ కంపెనీని ఎంతకు కొనుగోలు చేసిందన్న వివరాలను యాక్సెంచర్ వెల్లడించలేదు. రెడ్‌కోర్ కంపెనీ కొనుగోలు కారణంగా తమ సెక్యూరిటీ సేవల విభాగం మరింతగా విస్తరిస్తుందని, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తమ అగ్రస్థానం మరింతగా పటిష్టమవుతుందని యాక్సెంచర్ సెక్యూరిటీ ఎండీ, కెల్లీ బిస్సెల్ చెప్పారు. రెడ్‌కోర్ కంపెనీ క్లౌడ్, వెబ్, మొబైల్, ఆడాప్టివ్ యాక్సెస్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీస్‌లలో హోలిస్టిక్ అథంటికేషన్, ఆథరైజేషన్, అడ్మినిస్ట్రేషన్ సర్వీసులను డెవలప్ చేస్తోంది. యాక్సెంచర్ దన్నుతో క్లయింట్లకు మరింత సమర్థవంతమైన, విస్తృతమైన సేవలందించగలమని రెడ్‌కోర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జోసెఫ్ ఫైల్లా పేర్కొన్నారు.