న్యూఢిల్లీ: ఐటీ, కన్సల్టింగ్ సర్వీసుల దిగ్గజం యాక్సెంచర్.. బెంగళూరు కంపెనీ ఫ్లూచురాను కొనుగోలు చేయనుంది. ఇండస్ట్రియల్ కృత్రిమ మేధ(ఏఐ) సేవలందించే ఫ్లూచురా 110 మంది నిపుణుల(ప్రొఫెషనల్స్)తో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తయారీ, ఇతర ఆస్తుల ఆధారిత కంపెనీలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ డేటా సైన్స్ సర్వీసులు సమకూరుస్తున్న ఫ్లూచురాను సొంతం చేసుకోనున్నట్లు యాక్సెంచర్ తాజాగా పేర్కొంది.
ఇదీ చదవండి: ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..! ఐదేళ్ల జీతం బోనస్
అయితే డీల్ విలువను వెల్లడించలేదు. ఈ కొనుగోలుతో తమ ఇండస్ట్రియల్ ఏఐ సర్వీసులు మరింత పటిష్టంకానున్నట్లు యాక్సెంచర్ తెలియజేసింది. వీటి ద్వారా ప్లాంట్లు, రిఫైనరీలు, సప్లై చైన్ల పనితీరును మెరుగుపరచనున్నట్లు వివరించింది. అంతేకాకుండా క్లయింట్ల నెట్‌జీరో లక్ష్యాలను వేగంగా సాధించేందుకు దోహదపడనున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు!
Comments
Please login to add a commentAdd a comment