Firm
-
బ్లాక్‌స్టోన్ చేతికి ఐజీఐ.. బెల్జియం డైమెండ్స్ సర్టిఫికేషన్ సంస్థ
ముంబై: అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ తాజాగా ఇంటర్నేషనల్ జెమాలాజికల్ ఇనిస్టిట్యూట్ (ఐజీఐ)ని కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 525 మిలియన్ డాలర్లని సంస్థ తెలిపింది. 80 శాతం వాటాను షాంఘై యుయువాన్ టూరిస్ట్ మార్ట్ (గ్రూప్) నుంచి, మిగతా మొత్తాన్ని ఐజీఐ వ్యవస్థాపక కుటుంబానికి చెందిన రోలాండ్ లోరీ నుంచి కొనుగోలు చేసినట్లు వివరించింది. ఐజీఐ ప్రధాన కార్యాలయం బెల్జియంలోని యాంట్వెర్ప్లో ఉన్నప్పటికీ సంస్థ ఆదాయం, లాభాల్లో సింహ భాగం భారత్ నుంచే ఉంటోంది. ప్రపంచంలోనే అత్యధికంగా డైమండ్ పాలిషింగ్ భారత్‌లోనే జరుగుతుండటం ఇందుకు కారణం. వజ్రాలు, రత్నాలు, ఆభరణాలకు సర్టిఫికేషన్ సేవలను ఐజీఐ అందిస్తోంది. వివిధ దేశాల్లో 29 ల్యాబరేటరీలు (భారత్‌లో 18), 18 జెమాలజీ స్కూల్స్ నిర్వహిస్తోంది. కంపెనీ కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెట్టనున్నట్లు ఐజీఐ సీనియర్ ఎండీ ముకేష్ మెహతా తెలిపారు. ఇదీ చదవండి: ట్రావెలింగ్ చేసేవారికి అలర్ట్! పెరుగుతున్న ఆన్లైన్ ట్రావెల్ స్కామ్‌లు -
యాక్సెంచర్ చేతికి ఫ్లూచురా
న్యూఢిల్లీ: ఐటీ, కన్సల్టింగ్ సర్వీసుల దిగ్గజం యాక్సెంచర్.. బెంగళూరు కంపెనీ ఫ్లూచురాను కొనుగోలు చేయనుంది. ఇండస్ట్రియల్ కృత్రిమ మేధ(ఏఐ) సేవలందించే ఫ్లూచురా 110 మంది నిపుణుల(ప్రొఫెషనల్స్)తో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తయారీ, ఇతర ఆస్తుల ఆధారిత కంపెనీలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ డేటా సైన్స్ సర్వీసులు సమకూరుస్తున్న ఫ్లూచురాను సొంతం చేసుకోనున్నట్లు యాక్సెంచర్ తాజాగా పేర్కొంది. ఇదీ చదవండి: ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..! ఐదేళ్ల జీతం బోనస్ అయితే డీల్ విలువను వెల్లడించలేదు. ఈ కొనుగోలుతో తమ ఇండస్ట్రియల్ ఏఐ సర్వీసులు మరింత పటిష్టంకానున్నట్లు యాక్సెంచర్ తెలియజేసింది. వీటి ద్వారా ప్లాంట్లు, రిఫైనరీలు, సప్లై చైన్ల పనితీరును మెరుగుపరచనున్నట్లు వివరించింది. అంతేకాకుండా క్లయింట్ల నెట్‌జీరో లక్ష్యాలను వేగంగా సాధించేందుకు దోహదపడనున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు! -
టీసీఎస్ క్యూ3 భేష్!
ముంబై: సాఫ్ట్వేర్ సేవల టాటా గ్రూప్ దిగ్గజం టీసీఎస్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 11 శాతం పుంజుకుని రూ. 10,846 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 9,769 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 19 శాతం ఎగసి రూ. 58,229 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 48,885 కోట్ల టర్నోవర్ నమోదైంది. కార్యకలాపాల్లో వృద్ధి, ఫారెక్స్ లాభాలు తాజా త్రైమాసికంలో కంపెనీ లాభదాయకతకు సహకరించాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 75 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. దీనిలో రూ. 67 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది. వెరసి డివిడెండ్ రూపేణా రూ. 33,000 కోట్లను పంచనుంది. డాలర్ల రూపేణా ఆదాయం 8 శాతం మెరుగుపడినట్లు టీసీఎస్ పేర్కొంది. భారీగా ఉద్యోగాలు వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లో అత్యంత భారీగా ఉద్యోగ సృష్టికి తెరతీయనున్నట్లు టీసీఎస్ వెల్లడించింది. సుమారు 1.5 లక్షల మందికి ఉపాధి కల్పించే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. డీల్ పరిస్థితులు, పైప్‌లైన్ ఆశావహంగా ఉన్నట్లు సీవోవో ఎన్.గణపతి సుబ్రమణ్యం పేర్కొన్నారు. 7 నుంచి 9 బిలియన్ డాలర్ల మధ్య డీల్స్‌ను లక్ష్యంగా పెట్టుకోగా.. వీటికి మధ్యస్థంగా కాంట్రాక్టులు పొందినట్లు వెల్లడించారు. థర్డ్‌పార్టీ, ఇతర వ్యయాలు పెరగడంతో లాభాల మార్జిన్లు ప్రభావితమైనట్లు సీఎఫ్‌వో సమీర్ సేక్సరియా పేర్కొన్నారు. గతేడాది స్థాయిలోనే 25 శాతం ఇబిటా మార్జిన్లు సాధించగలమని తెలియజేశారు. తగ్గిన సిబ్బంది... చాలా ఏళ్ల తదుపరి క్యూ3లో టీసీఎస్ మొత్తం సిబ్బంది సంఖ్య 2,197 తగ్గి 6,13,974కు పరిమితమైంది. ఉపాధి కల్పనకు మించి ఉద్యోగ వలస దీనికి కారణమైనట్లు హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ తెలియజేశారు. ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో 42,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకోగా.. క్యూ4(జనవరి–మార్చి)లోనూ మరికొంతమందికి ఆఫర్ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. వచ్చే ఏడాది(2023–24)లోనూ 40,000 మంది కొత్తవారిని నియమించుకోనున్నట్లు వెల్లడించారు. పూర్తి ఏడాదిలో 1.25–1.5 లక్షల మందిని ఎంపిక చేసుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ఇతర హైలైట్స్ ► నిర్వహణ లాభ మార్జిన్లు 0.5 శాతం బలపడి 24.5 శాతాన్ని తాకాయి. ► క్యూ3లో 7.9 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. ► ఉద్యోగుల వలస(అట్రిషన్) స్వల్పంగా తగ్గి 21.3 శాతానికి చేరింది. ► కొత్త ఏడాదిలో 40,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటన. మార్కెట్లు ముగిశాక టీసీఎస్ సాయంత్రం ఫలితాలు విడుదల చేసింది. క్యూ3 పనితీరుపై అంచనాలతో టీసీఎస్ షేరు బీఎస్ఈలో 3.35 శాతం ఎగసి రూ. 3,320 వద్ద ముగిసింది. చదవండి: ‘70 ఉద్యోగాలకు అప్లయ్ చేశా.. ఒక్క జాబ్ రాలేదు..ఇండియాకి తిరిగి వచ్చేస్తా’ -
శ్రీమంతుడు 2.0: రూ.24 వేల కోట్ల కంపెనీని విరాళంగా ఇచ్చాడు!
ప్రకృతి ప్రజలకు అవసరమైనవన్నీ ఇస్తుంది. అయితే కొందరు తమ స్వార్థం కోసం భూమిపై ఉన్న వనరులను వాడుకుంటూ అదే ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఇప్పటికే పర్యావరణం ప్రమాదంలో ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణ కొందరు ముందడుగు వేసి తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా యూఎస్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన వేల కోట్ల కంపెనీని లాభాపేక్ష లేని ఓ ట్రస్ట్‌కి విరాళంగా ఇచ్చేశాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. వివరాల్లోకి వెళితే.. యూఎస్‌కు చెందిన వ్యాపారవేత్త యోవోన్ చుయ్‌నార్డ్ తన కంపెనీ ‘పెటగోనియో’ని పర్యావరణ పరిరక్షణకై లాభాపేక్షలేని సంస్థకు విరాళంగా ఇచ్చాడు. ఇకపై ఈ కంపెనీ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం వాతావరణ మార్పులు, జీవ వైవిధ్యం,అటవీ భూములు సంరక్షణకు పాటుపడే సంస్థలకు అందజేయనున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని అతని భార్యాపిల్లలు కూడా మద్దతునిచ్చారు. ఆయన దీనిపై స్పందిస్తూ.. ప్రకృతి అందిస్తున్న వనరులను ఉపయోగించుకుంటూ వాటిని నగదు రూపంలో మార్చుకుంటున్నాం. ఇకపై పెటాగోనియో తన సంపాదనను తిరిగి ప్రకృతికే అందిస్తుందన్నారు. పెటాగోనియో ప్రతి సంవత్సరం సుమారు 1 బిలియన్ డాలర్ల విలువైన జాకెట్లు, స్కై ప్యాంట్లను అమ్మకాలు జరుపుతోంది. కాగా అవుట్డోర్ ఫ్యాషన్ సంస్థగా పెటగోనియాను 50 ఏళ్ల కిందట ప్రారంభించారు. చదవండి: దూసుకుపోతున్న రిలయన్స్ జియో.. జూలైలోనూ జోరు తగ్గలే! -
గూగుల్ చరిత్రలో మరో అతి పెద్ద డీల్..!
ప్రముఖ టెక్ దిగ్గజం అల్ఫాబెట్ ఇంక్‌కు చెందిన గూగుల్ మరో అతి పెద్ద భారీ డీల్‌ను కుదుర్చుకొనుంది. ఇది కంపెనీ చరిత్రలో రెండో అతిపెద్ద డీల్‌గా నిలిచే అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ కంపెనీలకు పోటీగా..! గూగుల్ సమీప టెక్ ప్రత్యర్థులు మైక్రోసాఫ్ట్ , అమెజాన్ కంపెనీలు క్లౌడ్ రంగంలో అత్యధిక వేగంతో అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రంగంలో వీటికి గట్టిపోటీను అందించేందుకుగాను సైబర్ సెక్యూరిటీ సంస్థ మాండియంట్ ఇంక్‌ను గూగుల్ కొనుగోలుచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు 5.4 బిలియన్ల డాలర్లుగా ఉంది. గూగుల్ చరిత్రలో ఇది రెండో అతి పెద్ద డీల్‌గా నిలవనుంది. 2011లో మోటోరోలా మొబిలిటీను సుమారు 12.5 బిలియన్ డాలర్లతో గూగుల్ కైవసం చేసుకుంది. మరింత వేగంగా..! మాండియంట్ ఇంక్ కొనుగోలుతో గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారం మరింత మెరుగుపడనుంది. ఈ ఒప్పందంతో గూగుల్ ఈ రంగంలో ఏడాదిగాను 19 బిలియన్ డాలర్లకు పైగా ఆర్జించనుంది. మరోవైపు పలు నివేదికల ప్రకారం...మైక్రోసాఫ్ట్ కార్ప్ కూడా మాండియంట్ ఇంక్ కంపెనీ కొనుగోలుపై దృష్టి సారిస్తోందని తెలుస్తోంది. ఈ సాఫ్ట్వేర్ దిగ్గజం వచ్చే ఐదేళ్లలో సైబర్ సెక్యూరిటీ కోసం 20 బిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నట్లు గతంలో అంచనా వేసింది. గూగుల్‌తో మాండియంట్ ఇంక్ ఒప్పందం జరుగుతుందనే ఊహగానాలతో మంగళవారం ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో మాండియంట్ షేర్లు 2శాతం క్షీణించగా, ఆల్ఫాబెట్ షేర్లు 0.2 శాతం పెరిగి 2532.20 డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది చివర్లో ఈ ఒప్పందం ముగియనున్నట్లు తెలుస్తోంది. చదవండి: శాంసంగ్‌కు గట్టిషాకిచ్చిన హ్యాకర్లు..! ప్రమాదంలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు.! -
Parliament : ముగిసిన శీతాకాల సమావేశాలు.. ఎన్నిగంటలు వృథా చేశారంటే..
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. కరోనా పరిస్థితులతో పాటుగా ఎజెండాలో చర్చించాల్సిన అంశాలు పూర్తయిన నేపథ్యంలో వింటర్ సెషెన్‌ను ఒకరోజు ముందుగానే కేంద్ర ప్రభుత్వం ముగించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 29 న ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 వరకు జరగాల్సి ఉండగా.. ఒక రోజు ముందుగానే డిసెంబరు 22)న ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. శీతాకాల సమావేశంలో భాగంగా లోక్‌సభ ముందుకు 13 బిల్లులు రాగా, 11 బిల్లులు ఆమోదం పొందాయి. దీనిలో కీలకమైన సాగుచట్టాల రద్దు బిల్లు, ఎన్నికల చట్టాల సవరణల బిల్లులు ఇందులో ఉన్నాయి. అదే విధంగా యువత వివాహా వయసు పెంపుదలకు సంబంధించిన బిల్లును కేంద్రం స్టాండింగ్ కమిటీకి పంపించింది. In the #WinterSession, 11 bills have been passed by both the Houses and 6 bills have been sent to Standing Committee. Opposition's conduct throughout the session was unfortunate and they repeatedly resorted to creating ruckus and disturbing the proceedings. — Pralhad Joshi (@JoshiPralhad) December 22, 2021 ఎంపీల నిరసనల కారణంగా శీతాకాల సమావేశాల్లో 18 గంటలు వృథా అయినట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. అదే విధంగా రాజ్యసభను కూడా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాగా, లఖీంపూర్ ఖేరీ ఘటన, 12 మంది ఎంపీల సస్పెన్షన్ పార్లమెంట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఎస్సై పరీక్షల్లో అభ్యర్థి హైటెక్ ఛీటింగ్.. ట్వీట్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ -
కోట్లమంది ఫోన్ డేటా చోరీ! ఎట్టకేలకు కదిలిన యాపిల్
Pegasus surveillance scandal: పెగాసస్ స్కామ్‌కు సంబంధించిన వ్యవహారంలో యాపిల్ కంపెనీ ఎట్టకేలకు స్పందించింది. కోట్ల మంది ఐఫోన్ యూజర్ల డేటాను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ లక్క్ష్యంగా చేసుకుందంటూ మంగళవారం కాలిఫోర్నియా కోర్టులో దావా వేసింది యాపిల్. ఇప్పటికే పెగాసస్ స్పైవేర్ ద్వారా కోట్లమంది ఐఫోన్ యూజర్ల డేటాను హ్యాకర్లకు చేర్చిందని సదరు దావాలో యాపిల్ పేర్కొంది. ఇజ్రాయెల్‌కు చెందిన టెక్నాలజీ కంపెనీ ఎన్ఎస్వో గ్రూప్.. పెగాసస్ స్పైవేర్‌ను ఇతర దేశాలకు అమ్ముతుంటుంది. అయితే ప్రభుత్వాలు మాత్రమే మెయింటెన్ చేసే ఈ స్పైవేర్‌ను.. హ్యాకర్లు లక్క్ష్యం చేసుకున్నారని, పలువురు ప్రముఖుల ఫోన్ డేటాను తస్కరించారనే ఆరోపణలతో ‘పెగాసస్ స్కామ్’ వెలుగుచూసింది. పైగా యాపిల్ ఫోన్లు వాడే ప్రముఖుల డేటా లక్క్ష్యం అయ్యిందని, భవిష్యత్తులోనూ ఐఫోన్లు వాడేవాళ్ల డేటా తేలికగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని ఉటంకించింది. Pegasus surveillance scandal నేపథ్యంలోనే మంగళవారం స్పైవేర్ మేకర్ ఎన్‌ఎస్‌వోపై దావా వేసింది. పెగాసస్ స్పైవేర్‌పై అమెరికా ఆంక్షలు విధించిన రెండు వారాలకే యాపిల్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. అంతేకాదు ఎన్ఎస్వో గ్రూప్ యాపిల్‌కు సంబంధించి ఎలాంటి డివైజ్‌లను, సాంకేతికతను, సేవలను, వినియోగించకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఫెడరల్ కోర్టును యాపిల్ అభ్యర్థించింది. అంతేకాదు తమ ఫోన్ డేటా కూడా చోరీకి గురయ్యే అవకాశం ఉందన్న భయాందోళనను తాజా సర్వేలో పలువురు యూజర్లు వ్యక్తం చేశారని యాపిల్ దావాలో పేర్కొంది. అయితే పెగాసస్ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి(భారత్‌కు చెందిన పలువురు రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సెలబ్రిటీల పేర్లు కూడా!).. ఆరోపణల్ని ఎన్ఎస్వో గ్రూప్ ఖండిస్తోంది. పెగాసస్ స్పైవేర్ హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే ఉండదని స్పష్టం చేసింది. లీక్ డేటా బేస్‌లో నెంబర్లు కనిపించినంత మాత్రనా డేటా హ్యాక్ అయినట్లు కాదని గుర్తించాలని తెలిపింది. తప్పుడు కథనాలు ప్రచురించిన వార్తా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది కూడా. అయినప్పటికీ వివాదం ముదురుతూనే వచ్చింది. ఇక ఎన్‌ఎస్‌వోకి ఇలాంటి దావాలు కొత్తేం కాదు. 2019లో ఫేస్బుక్ కూడా దావా వేసింది. వాట్సాప్ మెసేంజర్ ద్వారా సైబర్ గూఢచర్యానికి పాల్పడిందని, జర్నలిస్టులు, మానవ హక్కుల సంఘం ఉద్యమకారుల డాటాను తస్కరించిందనే ఆరోపణలు చేస్తూ కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులోనే ఫేస్బుక్ దావా వేసింది. దావాలు చాలవన్నట్లు 500 మిలియన్ డాలర్ల అప్పుల్లో కూరుకుపోయి.. డిఫాల్ట్ ప్రమాదానికి చేరువలో ఉంది. మరోవైపు అమెరికా ఆంక్షల తర్వాత భారీ కొనుగోళ్ల ఒప్పందం నుంచి ఫ్రాన్స్ సైతం వెనుదిరిగింది. చదవండి: ఐఫోన్ యూజర్లకు హైఅలర్ట్! వెంటనే.. -
పాపం: 175 ఎకరాల ఆసామి నేడు కూలీగా..
భువనేశ్వర్ : ఒకప్పుడు ఆకలి చావులు, పిల్లల ఆమ్మకాలకు పేరుగాంచి పత్రికల పతాక శీర్షికల్లో నిత్యం నిలిచేది రాష్ట్రంలోని కలహండి జిల్లా. కరువు రక్కసి కబంధహస్తాల్లో నలిగిపోతున్న కలహండి జిల్లాను పచ్చగా మార్చేందుకు, సాగునీటి వనరుల కోసం బృహత్తర ఇంద్రావతి జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. అప్పటికి ఆ ప్రాంతంలోని ఫటాగుడ గ్రామానికి చెందిన బ్రజ సుందర బిశాయి 175 ఎకరాలకు పైగా భూస్వామి. ఆ గ్రామమంతా ఆయన ఆధీనంలో ఉండేది. ఇంద్రావతి జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం తన యావదాస్తి (భూమి) కోల్పోయాడు. అందుకు తగిన పరిహారం కూడా లభించలేదు. ఇంద్రావతి ప్రాజెక్టు వల్ల కలహండి జిల్లా నేడు కళకళ లాడుతుండగా ఆ ప్రాజెక్టు కోసం ఆస్తులు పోగొట్టుకున్న బ్రజ సుదర బిశాయి జీవితం సున్నం వెలిసిపోయిన గోడలా తయారైంది. ఆయన నేడు ఇంద్రావతి ప్రాజెక్టు బాధితుడు. ఆయన కొడుకు పొట్ట నింపుకొనేందుకు పరాయి రాష్ట్రానికి వలస పోయాడు. ఒకనాటి జమీందారు బిశాయి నేడు కూలీగా మారి పార చేత పట్టి జీవనం గడుపుతున్నాడు. 70 యేళ్లు పైబడిన ఆయన ఒక గడ్డి ఇంటిలో భార్యతో ఉంటున్నాడు. గతంలో ఇంటిలో అనేకమంది పనివారుండేవారు. పనివారిని అజమాయిషీ చేసే ఆయన భార్య నేడు కర్రల పొయ్యిపై వంటచేస్తూ గత జ్ఞాపకాలతో కన్నీరు కారుస్తోంది. కొన్ని సమయాల్లో భర్తతో పాటు పనులకు వెళ్తోంది. కూలి పనులకు వెళ్తున్న బిశాయి దంపతులు కొండంత భూమి..గోరంత పరిహారం ఆయన పూర్వీకుల భూమి తెంతులికుంఠి సమితి ముండిగుడ గ్రామంలో 5.52 ఎకరాలు, ముడిగుమ్మ గ్రామంలో 90 ఎకరాలు, కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సమితి అంబాగుడ గ్రామంలో 80 ఎకరాలు ఉండేవి. ఆ నాడు వందలాది మంది పనివారితో ఆయన ఇల్లు సందడిగా ఉండేది. పాడి పంటలతో లక్ష్మి తాండవించేది. ఆ భూములన్నీ ఇంద్రావతి ప్రాజెక్టులో విలీనమయ్యాయి. ఆనాడు తెంతులికుంఠి సమితిలో ఆయన భూమికి రూ.1,42,387, దశమంతపూర్ సమితిలో భూమికి రూ.64, 861 పరిహారంగా అందింది. ప్రభుత్వం తనకు ఇచ్చిన పరిహారం సముద్రంలో నీటిబొట్టు అని, హారతి కర్పూరంలా ఖర్చయిపోయిందని బ్రజ సుందర బిశాయి వాపోయాడు. ఇంద్రావతి ప్రాజెక్టుకు వల్ల తన సర్వస్వాన్ని కోల్పోయానని, ప్రాజెక్టు తనకు పేదరికం మిగిలి్చందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రాజెక్టు నిర్వాసితులకు తగిన పరిహారంతో పాటు, పునరావాసం కల్పిస్తామని పాలకులు ఎన్నో హామీలు ఇచ్చి, చివరికి మొండి చెయ్యి చూపారని కళ్లనీళ్లు కార్చాడు. ఎన్నో పోరాటాలు, ఆందోళనలు చేశాక ఒక రేషన్ కార్డు, వృద్ధాప్య పెన్షన్లు ప్రభుత్వం సమకూర్చిందని వెల్లడించాడు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నమ్మి యావదాస్తిని ధారబోసి నిరుపేదల్లా మిగిలామని బ్రజసుందర బిశాయి భోరుమన్నాడు. ఆయన మాట గ్రామస్తులకు వేదవాక్కు. గ్రామస్తులే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఆయనను జమీందారు అనే పిలిచేవారు. ఆయన వద్ద వందలాదిమంది పనిచేసేవారు. ఒకప్పుడు పదిమందికి దాతగా ఉన్న ఆయన నేడు పిడికెడు బియ్యం కోసం చేతులు చాచే పరిస్థితిలో ఉన్నాడు. రూపాయి కేజీ బియ్యం కోసం పడిగాపులు కాస్తున్నాడు. అందుకు కారణం ఇం«ద్రావతి జలవిద్యుత్ ప్రాజెక్టు. ఇంద్రావతి ప్రాజెక్టు పూర్తయింది. కలహండి జిల్లా సస్యశ్యామలమైంది. పేదరికం కొంత దూరమైంది. అయితే ఆనాటి భూస్వామి నేడు నిరుపేద అయిపోయాడు. అంతే కాదు వృద్ధాప్యంలో కూలిగా మారాడు. నవరంగపూర్ జిల్లా ఇంద్రావతి ప్రాంతంలోని ఫటాగుడ గ్రామానికి చెందిన బ్రజ సుందర బిశాయి దీనగాథ ఇది. -
హథ్రస్ కేసు: ఆ రైతు పాలిట శాపంగా..
లక్నో : హథ్రస్ దళిత యువతిపై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది. అధికారులు.. బాధితులు, నిందితులను ఇది వరకే పలుమార్లు విచారించారు. నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను సేకరించారు. బాధితులతో కలిసి పంట పొలంలోని క్రైం సీన్‌ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ కారణంగా తన పంట నాశనం అయిందని క్రైం సీన్ ఉన్న పంట పొలం యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 19 ఏళ్ల దళిత బాలిక అత్యాచారానికి గురైన బూల్‌గర్హీ గ్రామంలోని పంట పొలాన్ని సీబీఐ అధికారులు పలుమార్లు పరిశీలించారు. క్రైం సీన్‌ను కాపాడటానికి పొలానికి దూరంగా ఉండాలని దాని యజమానిని ఆదేశించారు. నీళ్లు పెట్టకపోవడం, కలుపు తీయకపోవటంతో పంట నాశనం అయిపోయింది. ( ఢిల్లీ వెళ్తామన్న ‘హాథ్రస్’ కుటుంబం ) దీనిపై సదరు రైతు మాట్లాడుతూ.. ‘‘క్రైం సీన్లోని ఆధారాలను పరిరక్షించటానికి దాదాపు రెండున్నర ఎకరాలు ఉన్న నా పొలానికి నీళ్లు పెట్టవద్దని, పొలంలో ఎలాంటి పనులు చేయవద్దని సీబీఐ అధికారులు ఆదేశించారు. దానికి తోడు చాలామంది పంటను తొక్కారు. దీంతో పంట నాశనమై 50 వేల రూపాయల నష్టంతో పాటు మా ఇంటిల్లిపాది కష్టం వృధా అయింది. ప్రభుత్వం నాకు నష్ట పరిహారం ఇప్పించాలి’’ అని డిమాండ్ చేశారు. -
తలైవా మానియా..బంపర్ ఆఫర్
ఫస్ట్ డే..ఫస్ట్ షో..ఎలాగైనా చూసెయ్యాలి...ఇదీ సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానుల కోరిక. మరి అలాంటిది ఎప్పటినుంచో ఉత్కంఠగా చూస్తున్న ప్రముఖ దర్శకుడు శంకర్, రజనీ, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్, సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్‌ల గ్రేట్ కాంబినేషన్లో వస్తున్న సినిమా థియేటర్లను పలకరిస్తోంటే.. ఇక ఆ సందడే వేరు. ఆఫీసులకు సెలవుపెట్టి మరీ మూవీకి చెక్కెయ్యాల్సిందే. అదీ తలైవా మానియా. ఈ నేపథ్యంలోనే కోయంబత్తూరుకు చెందిన ఒక స్కిల్ డెవలప్మెంట్ సంస్థ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో బాస్ అంటే వీడేరా అంటూ..ఉద్యోగులు థియేటర్లకు పరుగులు తీయడంలో అతిశయోక్తి ఏముంది... విషయం ఏమిటంటే... కోయంబత్తూరులోని గెట్ సెట్ గో అనే సంస్థ తన ఉద్యోగులకు 2.ఓ మూవీ విడుదల సందర్భంగా నవంబరు 29న అధికారిక సెలవు దినంగా ప్రకటించేసింది. పనినుంచి మీకు ఊరట. 2.0 మోడ్ ఆన్..ఛలో థియేటర్స్ అంటూ ఉద్యోగులకు ఒక లేఖ రాసింది. అంతేకాదు..ఈ మూవీకి వెళ్లాలనుకునేవారికి మొదటి రోజు టికెట్లను కూడా ఉచితంగా అందిస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. పనిలో పనిగా తలైవా, పద్మవిభూషణ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సార్.. శంకర్ సర్, ప్రతినాయకుడుగా ఖిలాడీ అక్షయ్ కుమార్, ఇతర నటీనటులు, సంగీత దర్శకుడు ఎఆర్ రహ్మాన్తోపాటు, చిత్ర యూనిట్ మొత్తంపై ప్రశంసలు కురిపించింది. కాగా ప్రపంచవ్యాప్తంగా 10వేల స్క్రీన్లలో రిలీజవుతోంది. ముఖ్యంగా దేశీయంగా బాహుబలి-2 రికార్డులను తిరగరాస్తూ వేల థియేటర్లను రోబో చిట్టి పలకరిస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రముఖ డేటా సంస్థలో భారీ ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: యూకే ఆధారిత డేటా డెవలపర్ డన్ హంబీ కంపెనీ భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న నెలల్లో భారతదేశంలో మరింత మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ప్రపంచ రిటైల్ వ్యాపారం రంగంలో భారత్ ప్రకాశవంతమైన ప్రదేశంగా ఉన్నందున ఈ సంస్థ తన గ్లోబల్ వినియోగదారులను పెంచుకుందని డన్హంబీ చీఫ్ టెక్నాలజీ అండ్ ప్రొడక్షన్ ఆఫీసర్ డేవిడ్ జాక్ తెలిపారు. 25 శాతం కన్నా ఎక్కువ వృద్ధిని సాధించిందన్నారు. రానున్న నెలల్లో భారతదేశంలో తమ టాలెంట్ పూల్‌ను మరింత పెంచుతామని ఆయన అన్నారు. జనాభా పరిమాణం, రిటైల్ రంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న భారత్ భారీ అవకాశాలను కలిగి ఉందని డేవిడ్ జాక్ చెప్పారు. -
5జీ టార్గెట్: జియో న్యూ ప్లాన్స్
సాక్షి, ముంబై: దేశీయ ప్రయివేటు టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో టెలికాం సేవల రంగంలో మరింత దూసుకుపోతోంది. ఆధునిక టెక్నాలజీ ద్వారా మెరుగైన సేవలతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్రణాళికలను రచిస్తోంది. దేశంలో 5జీ సేవలను అందించేందుకు అమెరికా ఆధారిత టెలికాం సొల్యూషన్స్ సంస్థను కొనుగోలు చేయనుంది. అమెరికాకు చెందిన రాడీసిస్‌తో ఒప్పందంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ సంతకాలు చేసింది. ఓపెన్ టెలికాం సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న రాడిసిస్ కార్పొరేషన్ కొనుగోలుకు ఒక ఒప్పందం చేసుకున్నామని జియో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డీల్ విలువ సుమారుగా 74మిలియన్ డాలర్లు. భారతీయులకు 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ) లాంటి సేవలను అందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నామని జియో వెల్లడించింది. ఈ ఒప్పందానికి రెగ్యులేటరీ అనుమతితోపాటు, రాడిసిస్ వాటా దారుల సమ్మతి పొందాల్సి ఉందని తెలిపింది. 2018 చివరి(నాలుగు) త్రైమాసికానికి ఈ డీల్ పూర్తికానుందని భావిస్తోంది. అలాగే అంతర్గత లావాదేవీల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని యోచిస్తోంది. రాడిసిస్‌కు చెందిన టాప్-క్లాస్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ టీం రిలయన్స్‌కు త్వరిత ఆవిష్కరణ పరిష్కార అభివృద్ధి నైపుణ్యాలను అందిస్తుందని, తద్వారా వినియోగదారులు సేవలు మెరుగవుతాయని రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ చెప్పారు. నాస్డాక్-లిస్టెడ్ కంపెనీగా రాడిసిస్‌కు ప్రపంచవ్యాప్తంగా విక్రయాలు, మద్దతు కార్యాలయాలతో పాటు, బెంగళూరులో కూడా ఒక ఇంజనీరింగ్ టీమ్ కలిగి ఉందని రెండు సంస్థల ఉమ్మడి ప్రకటన తెలిపింది. ఒరెగాన్లోని హిల్స్ బోరోలో ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాడిసిస్‌లో దాదాపు 600 ఉద్యోగులు ఉన్నారు. ఈ డీల్ ముగిసిన తరువాత రాడిసిస్ డీలిస్ట్ కానుంది. -
వ్యవసాయ పొలంలో వెండి నాణేలు
ఆత్మకూర్: ఓ రైతు వ్యవసాయ పొలాన్ని చదును చేస్తుండగా వెండి నాణేలు బయటపడ్డాయి. విషయం తెలిసిన గ్రామస్తులు గుంపులుగుంపులుగా చేరి తవ్వకాలు జరిపారు. ఈ ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలోని కత్తెపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండారెడ్డికి చెందిన పొలాన్ని సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి, ఆయన ద్వారా నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం అన్నారం క్యాంపు గ్రామానికి చెందిన నారాయణరావు 22 ఎకరాల పొలాన్ని నెల క్రితం కొనుగోలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం సర్వే 123/ ఈలో ని పిల్లిగుట్ట వద్ద పొలాన్ని సాగు కోసం చదును చేస్తున్నాడు. ఈ సందర్భంగా తవ్వకాల్లో వెండి నాణేలు లభ్యం కావడంతో వ్యవసాయ కూలీల ద్వారా గ్రామస్తులకు సమాచారం చేరింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో పొలం వద్దకు చేరుకుని తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో వందల సంఖ్యలో నాణేలు దొరికినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న ఆత్మకూర్ సీఐ బండారి శంకర్ నేతృత్వంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులు, రైతుకు దొరికిన 17 వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నాణేలు నిజాం కాలం నాటివిగా గుర్తించారు. అనంతరం తహసీల్దార్ జెకె.మోహన్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించగా. నాణేలను కలెక్టర్‌కు అందచేయనున్నట్లు తెలిపారు. కాగా, తవ్వకాల్లో వందల సంఖ్యలో నాణేలు బయటపడ్డాయనే ప్రచారం సాగుతోంది. -
బ్యూటిప్
నాలుగు చెంచాల ఆలివ్ నూనెలో, చెంచాడు నిమ్మరసం కలిపి కొద్దిగా వెచ్చబెట్టాలి. ఈ మిశ్రమంలో చేతి వేళ్లను పావుగంట పాటు ఉంచాలి. అప్పుడప్పుడూ ఇలా చేస్తూ ఉంటే... గోళ్లు పెళుసుగా మారకుండా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.