న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. కరోనా పరిస్థితులతో పాటుగా ఎజెండాలో చర్చించాల్సిన అంశాలు పూర్తయిన నేపథ్యంలో వింటర్ సెషెన్‌ను ఒకరోజు ముందుగానే కేంద్ర ప్రభుత్వం ముగించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 29 న ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 వరకు జరగాల్సి ఉండగా.. ఒక రోజు ముందుగానే డిసెంబరు 22)న ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
శీతాకాల సమావేశంలో భాగంగా లోక్‌సభ ముందుకు 13 బిల్లులు రాగా, 11 బిల్లులు ఆమోదం పొందాయి. దీనిలో కీలకమైన సాగుచట్టాల రద్దు బిల్లు, ఎన్నికల చట్టాల సవరణల బిల్లులు ఇందులో ఉన్నాయి. అదే విధంగా యువత వివాహా వయసు పెంపుదలకు సంబంధించిన బిల్లును కేంద్రం స్టాండింగ్ కమిటీకి పంపించింది.
In the #WinterSession, 11 bills have been passed by both the Houses and 6 bills have been sent to Standing Committee.
— Pralhad Joshi (@JoshiPralhad) December 22, 2021
Opposition's conduct throughout the session was unfortunate and they repeatedly resorted to creating ruckus and disturbing the proceedings.
ఎంపీల నిరసనల కారణంగా శీతాకాల సమావేశాల్లో 18 గంటలు వృథా అయినట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. అదే విధంగా రాజ్యసభను కూడా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాగా, లఖీంపూర్ ఖేరీ ఘటన, 12 మంది ఎంపీల సస్పెన్షన్ పార్లమెంట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే.
చదవండి: ఎస్సై పరీక్షల్లో అభ్యర్థి హైటెక్ ఛీటింగ్.. ట్వీట్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment