sine die
-
Parliament : ముగిసిన శీతాకాల సమావేశాలు.. ఎన్నిగంటలు వృథా చేశారంటే..
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. కరోనా పరిస్థితులతో పాటుగా ఎజెండాలో చర్చించాల్సిన అంశాలు పూర్తయిన నేపథ్యంలో వింటర్ సెషెన్‌ను ఒకరోజు ముందుగానే కేంద్ర ప్రభుత్వం ముగించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 29 న ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 వరకు జరగాల్సి ఉండగా.. ఒక రోజు ముందుగానే డిసెంబరు 22)న ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. శీతాకాల సమావేశంలో భాగంగా లోక్‌సభ ముందుకు 13 బిల్లులు రాగా, 11 బిల్లులు ఆమోదం పొందాయి. దీనిలో కీలకమైన సాగుచట్టాల రద్దు బిల్లు, ఎన్నికల చట్టాల సవరణల బిల్లులు ఇందులో ఉన్నాయి. అదే విధంగా యువత వివాహా వయసు పెంపుదలకు సంబంధించిన బిల్లును కేంద్రం స్టాండింగ్ కమిటీకి పంపించింది. In the #WinterSession, 11 bills have been passed by both the Houses and 6 bills have been sent to Standing Committee. Opposition's conduct throughout the session was unfortunate and they repeatedly resorted to creating ruckus and disturbing the proceedings. — Pralhad Joshi (@JoshiPralhad) December 22, 2021 ఎంపీల నిరసనల కారణంగా శీతాకాల సమావేశాల్లో 18 గంటలు వృథా అయినట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. అదే విధంగా రాజ్యసభను కూడా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాగా, లఖీంపూర్ ఖేరీ ఘటన, 12 మంది ఎంపీల సస్పెన్షన్ పార్లమెంట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఎస్సై పరీక్షల్లో అభ్యర్థి హైటెక్ ఛీటింగ్.. ట్వీట్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ -
హైదరాబాద్ చరిత్రలో తొలిసారి...
సాక్షి, హైదరాబాద్ : టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ క్యాంపస్ (టిస్) యాజమాన్యానికి.. విద్యార్థులకు మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. మెస్సు బిల్లుల పెంపునకు నిరసనగా గత కొద్ది రోజుల నుంచి ఆ ప్రాంగణం విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సమస్యను పరిష్కరించక పోగా హైదరాబాద్ క్యాంపస్‌లో అకడమిక్ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. విద్యార్థులంతా సోమవారం సాయంత్రం ఐదు గంటల్లోగా క్యాంపస్‌ను ఖాళీ చేయాల్సిందిగా స్పష్టం చేస్తూ ‘సైన్–డై’ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ చరిత్రలో తొలిసారి... హైదరాబాద్ విద్యాలయాల చరిత్రలో ఈ తరహా నోటీసులు జారీ చేసిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ క్యాంపస్(టిస్) తొలుత రాజేంద్రనగర్‌లో ఉండేది. ఇటీవల ఈ క్యాంపస్‌ను అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లికి తరలించారు. అక్కడ బీఏ, ఎంఏ, ఎంఫిల్ కోర్సులను బోధిస్తున్నారు. ఆయా కోర్సుల్లో సుమారు ఐదు వందల మంది విద్యార్థుల వరకు చదువుతున్నారు. విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా వసతి గృహాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల మెస్ చార్జీలతో పాటు డిపాజిట్లను భారీగా యాజమాన్యం పెంచింది. వాటిని తగ్గించాలని, మెస్ కాంట్రాక్ట్‌కు సంబంధించిన టెండర్లను బహిర్గతం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం ఈ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా.. వారిపై చర్యలకు ఉపక్రమించింది. విద్యార్థులు తమ ఆందోళనలతో ప్రాంగణ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని పేర్కొంటూ ‘సైన్–డై’ ఆఫ్ క్యాంపస్‌కు యాక్టింగ్ రిజిస్ట్రార్ ఎంపీ బాలమురగన్ నోటీసు జారీ చేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఫ్యాకల్టీ సహా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నోటీసులు పంపింది. దీంతో విద్యార్థులంతా క్యాంపస్‌ను ఖాళీ చేసి రోడ్డుపైకి వచ్చారు. ఇక్కడ చదువుతున్న వారిలో హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది విద్యార్థులు ఉన్నారు. తీరా సాయంత్రం క్యాంపస్ ఖాళీ చేయించడంతో ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలోపడ్డారు. ఇదిలా ఉంటే గత ఏడాది హాస్టల్, మెస్ డిపాజిట్ రూ.15 వేలు ఉండగా, ఈ మొత్తా న్ని మూడు విడతల్లో చెల్లించేవారు. తాజాగా మెస్ ఛార్జీలను ఒకే విడతలో రూ.54,000 చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ బిల్లు చెల్లింపులో ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థులకు మినహాయింపు ఉండగా, ఈ విద్యా సంవత్సరం ఆ వెసులుబాటును తొలగించి ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తోందని విద్యార్థి జేఏసీ నాయకురాలు కరీష్మా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ నోటీసులను రద్దు చేయాలని లేదంటే భవిష్యత్తులో భారీ ఆందోళనలకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. -
ఫలప్రదంగా జరిగాయ్!!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిసి, నిరవధికంగా వాయిదాపడ్డాయి. జూలై 18వ తేదీ నుంచి మొదలయిన ఈ సమావేశాల సందర్భంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దీంతోపాటు కీలకమైన ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అనంతరం ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో అభ్యంతరకర వ్యాఖ్యలుండటంతో వాటిని రికార్డుల నుంచి తొలగించటం గమనార్హం. అయితే, ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో మెజారిటీ లేనికారణంగా ప్రవేశపెట్టలేకపోయింది. ఈ సమావేశాల్లో లోక్‌సభ కార్యకలాపాలు ఫలవంతంగా సాగడంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ సంతృప్తి వ్యక్తం చేశారు. అవిశ్వాసం.. కీలక బిల్లులు గత బడ్జెట్ సమావేశాలతో పోలిస్తే ఈసారి ‘సంతృప్తికరం, ఫలప్రదం’గా జరిగాయని స్పీకర్ సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఓడిపోయింది. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లు, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే కీలక బిల్లులతోపాటు అవినీతి నిరోధక, క్రిమినల్ లా, ఆర్థిక ఎగవేతదారుల బిల్లు, బాలలకు ఉచిత, నిర్బంధ హక్కు బిల్లు, మనుషుల రవాణా వ్యతిరేక బిల్లు వంటివి 21 బిల్లులు ఆమోదం పొందాయన్నారు. ఈ సమావేశాల్లో సభ్యులు అడిగిన 4,140 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చిందన్నారు. ఇందులో 75 ప్రశ్నలకు సభలో మంత్రులు సమాధానం ఇచ్చారని తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అందజేసిన 62 నివేదికలతోపాటు సభ్యులు 128 ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టారని వివరించారు. వివిధ అంశాలపై సభ్యుల నిరసనల కారణంగా 27 గంటల సభాకాలం వృథా అయింది. ‘ట్రిపుల్ తలాక్’ను చర్చించని రాజ్యసభ రాఫెల్ ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ కాంగ్రెస్ పట్టుబట్టడంతో శుక్రవారం రాజ్యసభ సజావుగా సాగలేదు. త్రిపుల్ తలాక్ బిల్లుకు సవరణలు చేయాలని, పార్లమెంట్ సెలక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో చర్చకు తీసుకోవట్లేదని రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. త్వరలో దీనిపై ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీలకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన సౌకర్యాలు, రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగాన్ని సవరించాలంటూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు విశంభర్ ప్రసాద్ నిషాద్ ప్రవేశపెట్టిన బిల్లును సభ తిరస్కరించింది. అత్యంత ఫలప్రదం జూలై 18వ తేదీ నుంచి మొదలైన వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు అత్యంత ఫలప్రదంగా సాగాయి. ఈ సెషన్లో భాగంగా 24 రోజుల్లో 17 సార్లు సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఎజెండా ప్రకారం లోక్‌సభ 118 శాతం, రాజ్యసభ 74 శాతం సమర్ధంగా నడిచింది. లోక్‌సభ 21 బిల్లులు, రాజ్యసభ 14 బిల్లులను ఆమోదించాయి. 21 బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో అనువాదకుల సాయంతో ఏకకాలంలో వినే సౌకర్యం సభ్యులకు మొదటిసారిగా కల్పించారు. ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా, ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లులను ఆమోదించిన ఈ సమావేశాలను సామాజిక న్యాయ ఉత్సవంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ అభివర్ణించారు. ఈ సమావేశాలు అత్యంత ఫలప్రదంగా సాగటం 2000 సంవత్సరం తర్వాత ఇదే ప్రథమమని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చి సంస్థ పేర్కొంది. 16వ లోక్‌సభలో ఇదే రికార్డు. మొత్తం బిల్లుల్లో 26శాతం మాత్రమే పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు ప్రభుత్వం పంపగా ఇది 15వ లోక్‌సభలో 71శాతం, 14వ లోక్‌సభలో 60శాతం వరకు ఉంది. మొత్తం 999 ప్రైవేట్ బిల్లులను సభలో ప్రవేశపెట్టడం కూడా 2000 సంవత్సరం తర్వాత ఇదే ప్రథమం. రికార్డుల నుంచి ప్రధాని వ్యాఖ్యలు తొలగింపు కాంగ్రెస్ సభ్యుడు బీకే హరిప్రసాద్‌పై ప్రధాని మోదీ గురువారం చేసిన వ్యాఖ్యలను అభ్యంతరకరమైనవిగా భావిస్తూ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య చెప్పారు. మోదీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం అధికార పార్టీని తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టినట్లయింది. ప్రధాని మాటలను, అభ్యంతరకరంగా ఉన్నాయనే ఆరోపణలతో రికార్డుల నుంచి తీసివేయడం దేశ పార్లమెంటరీ చరిత్రలో ఇదే తొలిసారని రాజ్యసభ వర్గాలు అంటున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యర్ధిగా ప్రతిపక్షం బలపరిచిన హరిప్రసాద్‌పై ఎన్డీఏ అభ్యర్ధి హరివంశ్ గెలుపు సందర్భంగా మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ పేరులోని ‘బి.కె.’ కలిసి వచ్చేలా అమర్యాదకరమైన 3 హిందీ పదాలను వాడారు. దీంతో ఆ వ్యాఖ్యలను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మంత్రి రాందాస్ అథవలే చేసిన వ్యాఖ్యలను కూడా రికార్డుల నుంచి తొలగించినట్లు రాజ్యసభ వర్గాలు తెలిపాయి. -
ముగిసిన పార్లమెంట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. పాలక, విపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా సాగిన ఉభయ సభలూ శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇక ప్రస్తుత సమావేశాల్లో చేపట్టిన బిల్లులు, సవరణలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ సభకు వివరించిన అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగంలో వివాదాస్పద వ్యాఖ్యలను సెక్రటేరియట్ అధికారులు రికార్డుల నుంచి తొలిగించారు. డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థిగా హరివంశ్, విపక్ష అభ్యర్థిగా హరిప్రసాద్ పోటీపడ్డారు. హరివంశ్ విజయం తర్వాత ప్రసంగించిన ప్రధాని మోదీ.. డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ఇద్దరు హరిలు పోటీపడ్డారన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిని విపక్ష అభ్యర్థి హరిప్రసాద్ తప్పుపట్టారు. చైర్ హుందాతనాన్ని ప్రధాని దిగజార్చారని ఆరోపించారు. ఈ క్రమంలో మోదీ ప్రసంగంలోని కొన్నిపదాలను రాజ్యసభ సెక్రటేరియట్ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. పదప్రయోగంతో విపక్ష అభ్యర్థి ఇబ్బందిపడిన కారణంగా.. వివాదాస్పద వ్యాఖ్యలను తొలిగించిన్నట్లు అధికారులు తెలిపారు. పార్లమెంట్లో ప్రధాని ప్రసంగం నుంచి కొన్ని పదాలను తొలగించడం ఇదే తొలిసారి. పెద్దల సభలో చర్చకు రాని ట్రిపుల్ తలాఖ్.. వర్షాకాల సమావేశాల్లోనూ ప్రతిష్ఠాత్మక ట్రిపుల్‌తలాఖ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించలేదు. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టలేదు. సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేసినందున ట్రిపుల్ తలాఖ్ బిల్లును చేపట్టలేమని చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభలో తెలిపారు. ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు గతేడాదే లోక్‌సభ ఆమోదం లభించింది. రాజ్యసభలో ప్రభుత్వానికి తగిన మెజార్టీ లేకపోవడంతో వ్యతిరేకత ఎదురైంది. ఎగువసభలో అడ్డంకులను అధిగమించేందుకు ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు నిన్న కేంద్ర కేబినెట్ మూడు కీలక సవరణలు కూడా చేసింది. కానీ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రాజ్యసభ బిల్లుపై చర్చ చేపట్టలేదు. బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించనందున.. కేంద్రం ట్రిపుల్ తలాఖ్ ఆర్డినెన్స్ తీసుకురానుందని సమాచారం. -
అరుపుల మధ్యే జాతీయ గేయం..
-
పారిపోయిన కేంద్రం; పార్లమెంట్ నిరవధిక వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఎలాంటి పరీక్షకైనా సిద్ధమని చెప్పుకున్న ఎన్డీఏ సర్కార్.. చివరికి అవిశ్వాసాన్ని ఎదుర్కోకుండా పారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండానే పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శుక్రవారం లోక్ సభ ప్రారంభమైన వెంటనే.. సమావేశాల ముగింపునకు సబంధించి స్పీకర్ సుమిత్రా మహాజన్ కీలక ప్రకటన చేశారు. వెల్‌లో ఆందోళన చేస్తోన్న అన్నాడీఎంకే ఎంపీలు వెనక్కి వెళితే.. అవిశ్వాస తీర్మానం నోటీసులపై మాట్లాడతానన్న స్పీకర్.. అనూహ్యంగా సభను నిరవదికంగా వాయిదావేశారు. అరుపుల మధ్యే జాతీయ గేయం..: రెండు విడదలుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు తెన్నులను స్పీకర్ వివరిస్తున్న తరుణంలో.. అవిశ్వాసంపై చర్చ చేపట్టాలని విపక్ష ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. అయినాసరే, స్పీకర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అరుపుల మధ్యే జాతీయ గేయం వందేమాతరం ప్రారంభంకావడంతో ఎంపీలు మిన్నకుండిపోయారు. ఆ తర్వాత లోక్‌సభను నిరవదికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆఖరి రోజు లోక్ సభకు ప్రధాని మోదీ, ఇతర ముఖ్య నేతలంతా హాజరయ్యారు. స్పీకర్ అపాయింట్మెంట్: ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్సీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి రాజీనామాలు సమర్పించారు. సభ నిరవధిక వాయిదా పడిన అనంతరం స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లిన వైఎస్సార్సీపీ ఎంపీలు.. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఏపీ భవన్‌కు వెళ్లి ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభిస్తామని ఎంపీలు చెప్పారు. -
పార్లమెంటు ఉభయసభలు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: లోక్ సభ, రాజ్యసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇరు సభల స్పీకర్లు సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది శీతాకాల సమావేశాలు నిస్సారంగా సాగాయి. ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ సభలు ముగిసిపోయాయి. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్ సభకు హాజరయ్యారు. ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ బిల్లు-2016ను లోక్ సభ ఆమోదించింది. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై ప్రతిపక్షాలు, అధికారపక్షం ఒకరిపై ఒకరు ఆరోపణల మినహా ఇరు సభల్లో ఎలాంటి చర్చా జరగలేదు. మొత్తం 30 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ఒక్క రోజు కూడా సభ సజావుగా సాగలేదు. -
చర్చలు లేకుండానే నిరవధిక వాయిదా
ఎలాంటి చర్చలు లేకుండానే రాజ్యసభ శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ప్రధాని మోదీ సభకు వచ్చిన కొద్ది సేపటికీ సమావేశాలు నిరవధిక వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ హమ్మీద్ అన్సారీ ప్రకటించారు. నవంబర్ 15 నుంచి ఈ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైనప్పటి నుంచి పెద్దనోట్ల రద్దు, అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంతో పాటు ఇతర అంశాలు రాజ్యసభను కుదిపేశాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం, పట్టువిడుపులు విడవకపోవటంతో ఒక్క రోజు కూడా ఎలాంటి చర్చలేకుండానే రాజ్యసభ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. కేవలం రెండు బిల్లులను మాత్రమే ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించారు. ఒకటి పెద్ద నోట్ల రద్దు తర్వాత తేలే నల్లధనంపై కొరడా ఝళిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన సవరణలతో తీసుకొచ్చిన ఆదాయపు పన్ను చట్టం. ఆ బిల్లు లోక్‌సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. రెండోది గత యూపీఏ ప్రభుత్వం చివరి రోజుల్లో తీసుకొచ్చిన దివ్యాంగుల చట్ట సవరణ బిల్లు. 119 సవరణలతో తీసుకొచ్చిన ఈ బిల్లును ఎట్టకేలకు రాజ్యసభ ఆమోదించింది. అసమ్మతి, అంతరాయం, ఆందోళనల మధ్య వ్యత్యాసాన్ని అన్ని సెక్షన్ల వారు తమను తాము పరిశీలించుకోవాల్సినవసరం ఉందని వైస్ ప్రెసిడెంట్ హమ్మీద్ అన్సారీ అన్నారు. -
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బుధవారం నిరవధిక వాయిదా పడింది. శాసనసభ ఏడు రోజుల పాటు జరిగింది. శాసన సభ 30 గంటల 6 నిమిషాలపాటు సమావేశమైంది. సభలో రెండు బిల్లులు ప్రవేశపెట్టారు. అయితే అయిదు అంశాలపై స్వల్ప కాలిక చర్చలు జరిగాయి. -
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా!
-
విపక్షం గొంతు నొక్కి.. అసెంబ్లీ నిరవధిక వాయిదా
బీసీ తీర్మానం అంశంపై చివరిరోజు ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. హడావుడిగా బీసీ తీర్మానాన్ని చేపట్టి, ఆమోదించామని అనిపించుకోవడంపై విపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ గందరగోళం మధ్యనే ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించినట్లు ప్రకటించి, స్పీకర్ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు. అంతకుముందు అసలు ఎజెండాలో ఎక్కడా పెట్టకుండా ఉన్నట్టుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ తీర్మానం మీద మాట్లాడే అవకాశాన్ని ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వకుండానే సభలో దీనిపై ఓటింగ్ పెట్టడానికి అధికార పక్షం ప్రయత్నించడంతో దాన్ని గట్టిగా అడ్డుకున్నారు. దీనిపై అధికారపక్షం వేర్వేరు కారణాలు చూపుతూ ఎదురుదాడి చేసింది తప్ప.. సరైన సమాధానం ఇవ్వలేకపోయింది. బీసీ తీర్మానాన్ని ప్రవేశపెడతామని శనివారం ఉదయమే తాము స్పీకర్‌కు చెప్పామని యనమల అన్నారు. దాన్ని స్పీకర్ కూడా తర్వాత ఒక ప్రకటనలో సమర్థించారు. దీనిపై సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. బీసీల మీద ఇంత ముఖ్యమైన తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతామంటే ఎందుకంత భయపడుతున్నారని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. తాను లేవనెత్తే అంశాలకు సమాధానం ఎందుకు ఇవ్వరంటూ నిలదీశారు. అయితే.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సభా నియమాలను ప్రస్తావిస్తూ తాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, సభలో ఏ సమయంలోనైనా ప్రకటన ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందన్నారు. ఇది సభా సంప్రదాయమని అన్నారు. తాను విపక్ష నాయకుడిగా ఉండగా ఏరోజూ సమాచారం లేదని చెప్పారు. దాంతో విపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ స్పందించారు. ప్రకటనకు, తీర్మానానికి కూడా తేడా మర్చిపోయి ముఖ్యమంత్రి తాను తన ఇష్టం వచ్చినట్లు చెప్పేస్తున్నారని.. తీర్మానాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ప్రవేశపెట్టే అవకాశం లేదని వైఎస్ జగన్ గట్టిగా చెప్పారు. ప్రకటన చేయొచ్చు గానీ తీర్మానం కుదరదని, తీర్మానం అన్నప్పుడు దానిపై చర్చ కూడా జరుగుతుందని, జరగాలని స్పష్టం చేశారు. బీసీలపై తీర్మానాన్ని తాము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామన్నారు. ఆ సమయంలో మళ్లీ స్పీకర్ కోడెల, మంత్రి యనమల కల్పించుకుని, సభ ఆమోదించిన తీర్మానంపై మళ్లీ చర్చించడం సాధ్యం కాదన్నారు. తీర్మానాన్ని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రతిపాదించవచ్చని యనమల అన్నారు. కావాలంటే ద్రవ్య వినియోగ బిల్లుపై మాట్లాడొచ్చని స్పీకర్ తెలిపారు. అనంతరం విపక్షాల అభ్యంతరాల మధ్యే ద్రవ్య వినియోగబిల్లుపై మాట్లాడే అవకాశాన్ని టీడీపీ సభ్యుడు రవికుమార్‌కు స్పీకర్ ఇచ్చారు. ఒకవైపు విపక్ష సభ్యులు నిరసన తెలియజేస్తుండగానే బిల్లుపై చర్చ కొనసాగించే ప్రయత్నం జరిగింది. ఇది రాజ్యాంగపరంగా అత్యవసరమని, ఈ బిల్లును ఆమోదించకపోతే జీతాలు కూడా రావని యనమల అన్నారు. రాక్షసుల లక్షణాలు మీ దగ్గరే ఉన్నాయంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. దాంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ పోడియంలోకి వచ్చి నినాదాలు చేశారు. ఈ సమయంలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో భాగంగా బీసీలపై మాట్లాడాలని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్పీకర్ సూచించారు. అయిపోయిన ఎజెండాలోకి మళ్లీ వెళ్లలేమని తెలిపారు. దాంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లడారు. ''కౌరవ సభలో ఎలా ఉంటుందో నాకు తెలియదు గానీ.. ఆ సభను మీరు మరిపిస్తున్నారు. న్యాయం లేదు, ధర్మం లేదు. మిమ్మల్ని చూస్తే కౌరవులు కూడా సిగ్గుతో తలదించుకోవాలి. కౌరవులకు క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు, వాళ్ల కంటే అన్యాయంగా ఉన్నారు. మేం చేతులు పైకెత్తినా అవకాశం ఇవ్వలేదు. తీర్మానం ఆమోదించేసినట్లు చెబుతున్నారు. మంత్రిగారికి ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరదా అయిపోయింది. కొంతమందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. సభలో ప్రతిపక్ష నాయకుడిగా నేను ఇక్కడే కూర్చుని ఉండగానే, మాట్లాడతానంటూ చేతులు ఎత్తుతుండగానే తీర్మానం మీద చర్చ అయిపోయిందని ప్రకటించేశారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నా'' అన్నారు. ఆ సమయంలో మళ్లీ అధికారపక్షం అడ్డుతగిలి, ద్రవ్య వినిమయ బిల్లు మీదే మాట్లాడాలని తెలిపారు. అప్పుడు వైఎస్ జగన్ మాట్లాడుతూ ''ప్రజాస్వామ్యానికి పాతర వేసినప్పుడు రియాక్షన్స్ ఇలాగే ఉంటాయి. చేతులు పైకెత్తినా అవకాశం ఇవ్వకుండా చర్చ అయిపోయిందంటున్నారు. కావాలంటే వీడియో క్లిప్స్ చూసుకోండి'' అని చెప్పారు. అయితే.. ఆ సమయంలో స్పీకర్ కోడెల కలగజేసుకుని, స్పీకర్ స్థానానికి ఉద్దేశాలు ఆపాదించడం సరికాదని అన్నారు. ఈ గందరగోళం జరుగుతుండగానే ద్రవ్య వినిమయ బిల్లును హడావుడిగా ఆమోదించేసినట్లు ప్రకటించి.. సభను నిరవధికంగా వాయిదా వేశారు. దాంతో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిపోయినట్లయింది. -
నేటితో పార్లమెంటు సమావేశాల ముగింపు
పార్లమెంటు సమావేశాలు గురువారంతోనే ముగుస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ తెలిపారు. అవినీతి నిరోధక చట్టం లాంటి కీలక బిల్లులు ఇంకా ఆమోదం పొందాల్సి ఉన్నందున సమావేశాలను పొడిగించాలని తాము తలపెట్టినా, విపక్షాలు మాత్రం పొడిగింపునకు అంగీకరించలేదని ఆయన చెప్పారు. దీంతో ఇక.. ఇప్పటివరకు ఆమోదం పొందని బిల్లులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సులు జారీ చేయాలని నిర్ణయించింది. -
బడ్జెట్ ఆమోదం.. అసెంబ్లీ నిరవధిక వాయిదా
జై తెలంగాణ అంటూ ఆ ప్రాంత సభ్యుల నినాదాల మధ్య హడావుడిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో పాటు భూసేకరణ బిల్లును ఆమోదించిన అసెంబ్లీ.. నిరవధికంగా వాయిదా పడింది. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే టీఆర్ఎస్ సభ్యులు లేచి, వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేయాలంటూ నినాదాలు చేశారు. వాళ్లను తమతమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ మనోహర్ ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోకపోవడంతో ఆయన సభను గంటసేపు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. ఈ గందరగోళం మధ్యనే ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బిల్లును, భూసేకరణ బిల్లును ప్రతిపాదించగా వాటిని మూజువాణీ ఓటుతో ఆమోదించినట్లు ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఓటాన్ అకౌంట్‌ను ఆమోదించేందుకు గత సోమవారం నుంచి నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు ఈరోజే ఆఖరి రోజు. రాష్ట్ర విభజన అంశం కారణంగా సభ ప్రతిరోజూ గందరగోళంగానే నడిచింది.