ఎలాంటి పరీక్షకైనా సిద్ధమని చెప్పుకున్న ఎన్డీఏ సర్కార్.. చివరికి అవిశ్వాసాన్ని ఎదుర్కోకుండా పారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండానే పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శుక్రవారం లోక్ సభ ప్రారంభమైన వెంటనే.. సమావేశాల ముగింపునకు సబంధించి స్పీకర్ సుమిత్రా మహాజన్ కీలక ప్రకటన చేశారు. వెల్‌లో ఆందోళన చేస్తోన్న అన్నాడీఎంకే ఎంపీలు వెనక్కి వెళితే.. అవిశ్వాస తీర్మానం నోటీసులపై మాట్లాడతానన్న స్పీకర్.. అనూహ్యంగా సభను నిరవదికంగా వాయిదావేశారు.