mps resignations
-
మరో డజను మంత్రులు...
లండన్: బ్రిటన్‌లో రాజకీయ అనిశ్చితి తీవ్రతరమైంది. మంగళవారం భారత సంతతికి చెందిన ఆర్థిక మంత్రి రిషి సునక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్‌లతో మొదలైన రాజీనామాల పర్వం బుధవారం మరింత ఊపందుకుంది. సునక్, జావిద్ మాదిరిగానే తమకూ ప్రధాని బోరిస్ జాన్సన్ (58) నాయకత్వంపై నమ్మకం పోయిందంటూ బుధవారం ఏకంగా 12 మంది మంత్రులు తప్పుకున్నారు! ముందుగా జాన్ గ్లెన్, విక్టోరియా అట్కిన్స్, జో చర్చిల్, స్టూవర్ట్ ఆండ్రూ, విల్ క్విన్స్ (విద్యా శాఖ), రాబిన్ వాకర్ (స్కూళ్లు) రాజీనామా చేశారు. ఆ తర్వాత మరో ఐదుగురు మంత్రులు కేమీ బదెనోచ్ జూలియా లొపెజ్, లీ రౌలీ, నీల్ ఓబ్రియాన్, అలెక్స్ బర్హార్ట్ సంయుక్తంగా రాజీనామా లేఖ సంధించారు. వెనువెంటనే ఉపాధి కల్పన మంత్రి మిమ్స్ డేవిస్ కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. వీరితో పాటు పలువురు మంత్రుల సహాయకులు, రాయబారులు కూడా భారీగా రాజీనామా బాట పడుతున్నారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ లారా ట్రాట్ తదితరులు ప్రభుత్వపరమైన పదవుల నుంచి తప్పుకున్నారు. మొత్తమ్మీద ఒక్క బుధవారమే 34 రాజీనామాలు చోటుచేసుకున్నాయి! ఈ పరిణామాలు జాన్సన్‌కు ఊపిరాడనివ్వడం లేదు. ఆయన రాజీనామాకు కూడా సొంత పార్టీ ఎంపీల నుంచే ఒత్తిడి పెరుగుతోంది. జాన్సన్ తక్షణం తప్పుకోవాల్సిందేనని ఆయనకు గట్టి సమర్థకులుగా పేరున్న మంత్రులు ప్రీతీ పటేల్, మైఖేల్ గోవ్ కూడా డిమాండ్ చేశారు. సునక్, జావిద్ కూడా జాన్సన్ నాయకత్వంపైనే పదునైన విమర్శలు చేయడం తెలిసిందే. ప్రధానిని తప్పించేందుకు వీలుగా 1922 కమిటీ నిబంధనలను మార్చాలని డిమాండ్ చేస్తున్న కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల సంఖ్య చూస్తుండగానే పెరిగిపోతోంది. 1922 కమిటీ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ తదితరులు కూడా తప్పుకోవాలని జాన్సన్‌కు నేరుగానే సూచిస్తున్నారు. తన తప్పిదాలకు ఇతరులను నిందించడం ప్రధానికి అలవాటుగా మారిందంటూ దుయ్యబడుతున్నారు. జాన్సన్‌ను తక్షణం పదవి నుంచి తొలగించండంటూ మంత్రులకు జావిద్ బుధవారం పిలుపునిచ్చారు. కానీ జాన్సన్ మాత్రం ఎవరేం చెప్పినా తనంత తానుగా తప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘2019 ఎన్నికల్లో ప్రజలు నాకు భారీ మెజారిటీ కట్టబెట్టింది ఇలా అర్ధాంతరంగా తప్పుకునేందుకు కాదు. సమస్యలను అధిగమించి పరిస్థితిని చక్కదిద్దుతా. అందుకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమే’’ అని ప్రకటించారు. సునక్ స్థానంలో ఇరాక్ మూలాలున్న నదీమ్ జవాహీ, సాజిద్ స్థానంలో స్టీవ్ బార్‌క్లేలను నియమిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. జాన్సన్‌కు అండగా నిలబడాలని కేబినెట్ సహచరులకు జవాహీ పిలుపునిచ్చారు. కానీ జాన్సన్‌కు పదవీగండం తప్పకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో జరగబోయే హౌస్ ఆఫ్ కామర్స్ సమావేశాల్లో విపక్షాలతో పాటు సొంత పార్టీలోని వ్యతిరేకుల నుంచి జాన్సన్‌కు ఇబ్బందికరమైన ప్రశ్నలు తప్పవని చెబుతున్నారు. FIVE ministers resign in one fell swoop: Kemi Badenoch, Neil O'Brien, Alex Burghart, Lee Rowley and Julia Lopez pic.twitter.com/WAYannhrvR — Dominic Penna (@DominicPenna) July 6, 2022 ఇది కూడా చదవండి: క్వీన్ ఎలిజబెత్ రాయల్ డ్యూటీస్ కుదింపు.. కారణం అదేనా? -
హోదా సాధన పోరాటంలో చరిత్రాత్మక ఘట్టం
-
‘రాష్ట్ర రాజకీయ చరిత్రలో చారిత్రక ఘట్టం’
సాక్షి, కాకినాడ: ఆంధ్రపదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలు రాష్ట్ర రాజకీయ చరిత్రలో చారిత్రక ఘట్టమని పార్టీ కాకినాడ పార్లమెంటు నియోజవర్గ అధ్యక్షులు కురసాల కన్నబాబు తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీల త్యాగాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. పదవుల కోసం పాకులాడుతున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు హోదా విషయంలో ప్రజాకోర్టు బోనులో నిలబడ్డారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశంగా ఉప ఎన్నికలకు చంద్రబాబు సిద్ధం కావాలన్నారు. ధైర్యం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల్లో ఉప ఎన్నికలకు సిద్దమవ్వాలని సవాల్ విసిరారు. హోదా కోసం తమ పదవులకు రాజీనామాలు చేసిన వైఎస్సార్సీపీ ఎంపీల త్యాగం అభినందనీయమని మరోనేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఎన్నికలంటే చంద్రబాబు బయపడుతున్నారని విమర్శించారు. ప్రజల సొమ్ముతో హోదా కోసం చంద్రబాబు చేస్తున్న దొంగ దీక్షలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన కథనాల కోసం ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి : ఒకటే మాట.. ఒకటే బాట ‘స్పీకర్ ఆమోదాన్ని స్వాగతిస్తున్నాం’ ‘టీడీపీకి కచ్చితంగా చెప్పుదెబ్బ’ వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం మీ త్యాగం వృథా కాదు : వైఎస్ జగన్ చిత్తశుద్ధి నిరూపించుకున్నాం.. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి.. వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా! ఉప ఎన్నికలు: చంద్రబాబు పోటీకి రారు! ‘వంచన’పై వైఎస్సార్ సీపీ గర్జన! -
చెప్పింది చేసి చూపించారు
-
‘అది రాజకీయ చరిత్రలో అద్భుతఘట్టం’
సాక్షి, ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల పదవీ త్యాగం రాజకీయ చరిత్రలో అద్భుతఘట్టమని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మాటమీద నిలవబడటమంటే ఏంటో తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి చంద్రబాబు నేర్చుకోవాలని సూచించారు. దమ్ముంటే చంద్రబాబు ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. అప్పుడు ప్రజాక్షేత్రంలో ఎవరి సత్తా ఎంటో తేలిపోతుందని పేర్కొన్నారు. -
హోదా కోసం చేసిన వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం!
-
ఉపఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావు
-
మీ త్యాగం వృథా కాదు : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు చేయడం గర్వకారణ మని, వారి త్యాగం వృథాపోదని ప్రతిపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తమకు అత్యంత ప్రాధాన్యమని భావించి పదవులకు రాజీనామాలు చేసి వాటి ఆమోదానికి హామీ పొందిన మా ఎంపీలంటే గర్వ కారణంగా భావిస్తున్నాను. మీ త్యాగం వృథాపోదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది’ అని జగన్ తన ట్వీట్లో ఎంపీలను అభినందించారు. Proud of our MPs who stood firm on their resignations & ensured their acceptance, showing that APSCS is of utmost priority. Your sacrifice will not go waste & will be etched in AP’s history. — YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2018 -
దేశంలోనే నెంబర్ వన్ అవినీతి పాలన చంద్రబాబుదే
-
రాజీనామాలపై ఫలించిన వైఎస్సార్సీపీ ఎంపీల నిరీక్షణ
-
రాష్ట్ర ప్రయోజనాల కోసమే రాజీనామా
-
రాజీనామాలపై వైఎస్సార్ సీపీ ఎంపీలకు పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదాపై రాజీనామాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల 5వ తేదీ సాయంత్రం లేదా 6వ తేదీ ఉదయం రావాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి లేఖ అందింది. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి తమ రాజీనామాలు ఆమోదించాలని విజ్ఞప్తి చేయనున్నారు. కాగా తాము సమర్పించిన రాజీనామాలను ఆలస్యం చేయకుండా తక్షణమే ఆమోదించాలంటూ స్పీకర్‌తో గత నెల (మే) 29న ఎంపీలు సమావేశం అయిన విషయం విదితమే. ఈ సందర్భంగా రాజీనామాలపై పునరాలోచించుకోవాలని సభాపతి కోరినా ఎంపీలు ససేమిరా అన్నారు. పార్టీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి స్పీకర్‌తో భేటీ అయ్యారు. అయితే ఎంపీల సమావేశం అనంతరం సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో ఉన్న ఉద్వేగపూరిత పరిస్థితుల వల్ల రాజీనామాలు చేసినట్లు అనిపిస్తోంది. లోక్‌సభ స్పీకర్‌గా వాటన్నింటినీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీలకు సలహా ఇచ్చా. జూన్ 5 లేదా 6వ తేదీలోపు మరోసారి కలవాలని ఎంపీలకు సూచించా. అప్పటికీ నిర్ణయం మారకపోతే రాజీనామాలు ఆమోదిస్తా.’ అని తెలిపిన విషయం విదితమే. -
అప్పటికీ నిర్ణయం మారకపోతే రాజీనామాలు ఆమోదిస్తా..
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలు భావోద్వేగపూరితంగా ఉన్నాయని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ ఎంపీలు ఐదుగురు రాజీనామాలు చేసిన విషయం విదితమే. ప్రత్యేక హోదా సాధనకు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలు గత నెలలో స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాలు చేశారు. స్వీకర్ కార్యాలయం నుంచి పిలుపురావడంతో ఎంపీలు మంగళవారం సాయంత్రం లోక్‌సభలోని స్పీకర్ కార్యాలయంలో సుమిత్రా మహాజన్‌ను కలుసుకుని తమ రాజీనామాలు ఆమోదించాలని కోరారు. ఈ భేటీ అనంతరం సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో ఉన్న ఉద్వేగపూరిత పరిస్థితుల వల్ల రాజీనామాలు చేసినట్లు అనిపిస్తోంది. లోక్‌సభ స్పీకర్‌గా వాటన్నింటినీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీలకు సలహా ఇచ్చా. జూన్ 5 లేదా 7వ తేదీలోపు మరోసారి కలవాలని ఎంపీలకు సూచించా. అప్పటికీ నిర్ణయం మారకపోతే రాజీనామాలు ఆమోదిస్తా.’ అని అన్నారు. రాజీనామాలు ఆమోదించాలని కోరాం.. స్పీకర్‌తో సమావేశం ముగిసిన అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... మా రాజీనామాలు ఆమోదించాలని కోరాం. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని స్పీకర్ కోరారు. మేం మాత్రం తక్షణమే రాజీనామాలు ఆమోదించాలని కోరాం. కర్ణాటకలో ఇద్దరు ఎంపీలు రాజీనామాలు ఆమోదించారు. అదేవిధంగా మా రాజీనామాలు కూడా ఆమోదించాలని కోరాం. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు చేశాం. రాజీనామాలు ఆమోదిస్తారని ఆశిస్తున్నాం. రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళితే.. ప్రత్యేక హోదాకు బలం చేకూరుతుందని మా నమ్మకం. రాజీనామాలు ఆమోదించకపోతే మళ్లీ వచ్చి అడుగుతాం. హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు. టీడీపీ ఎంపీలు కూడా మాతోపాటు రాజీనామాలు చేసిఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మా ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదు. చంద్రబాబువన్నీ డ్రామాలే. ప్రత్యేక హోదా వచ్చేవరకూ పోరాటం చేస్తూనే ఉంటాం.’ అని స్పష్టం చేశారు. రాజీనామాలు ఆఖరి అస్త్రం... స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు చేశామని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. ఐదుగురు ఎంపీల రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరామని, హోదా కోసం ఆఖరి అస్త్రంగా రాజీనామాలు చేశామన్నారు. తక్షణమే రాజీనామాలు ఆమోదించాలని కోరామని, రాజీనామాలు ఆమోదించకపోతే మళ్లీ వచ్చి అడుగుతామని మేకపాటి అన్నారు. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం... ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ వరప్రసాద్ అన్నారు. ‘ఫిరాయింపుల అంశాన్ని కూడా స్పీకర్‌ను అడిగాం. ప్రివిలేజ్ కమిటీకి పంపామని స్పీకర్ చెప్పారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆ చట్టానికి అర్థం లేదు. స్వార్థ రాజకీయాల కోసం బీజేపీతో నాలుగేళ్లు అంటకాగి ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబుకు కచ్చితంగా గుణపాఠం చెబుతారు.’ అని ఆయన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు భయపడుతున్నారు.. ప్రజల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని ఎంపీ మిథున్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజీనామాలు చేస్తే ఓటమి పాలవుతారనే భయం బాబుకు ఉందని అన్నారు. ఎంపీల రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరామని, ఉప ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. -
రాజీనామాలపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు
-
అసలు 1989లో ఏం జరిగింది..?
-
దీక్షాదక్షత!
అనంతపురం: ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేపట్టడంతో ఉద్యమం తీవ్రతరమైంది. తొలిరోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ఆందోళనలు, నిరసనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించగా.. రెండోరోజు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రిలే దీక్షలు చేపట్టారు. ఎంపీల త్యాగానికి పాదాభివందనం చేస్తూ వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు అనంతపురంలో వారి ఫొటోలకు పాలాభిషేకం చేశారు. ► తాడిపత్రిలో పైలా నరసింహయ్య, ఎస్కేయూలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకుడు భానుప్రకాష్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ► అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నియోజకవర్గ సమన్వయకర్త నదీమ్అహ్మద్ ఆధ్వర్యంలో రిలేదీక్షలు ప్రారంభమయ్యాయి. నదీమ్ మాట్లాడుతూ హోదాను తక్కువ చేసి ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపిన సీఎం రాష్ట్ర ప్రజల హక్కును కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారన్నారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్న టీడీపీకి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరుశురాం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవీ శివారెడ్డి పాల్గొన్నారు. ► పెనుకొండ ఆర్డీఓ కార్యాలయం వద్ద హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు శంకరనారాయణ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు పదవులకు రాజీనామాలు చేయడం రాష్ట్ర చరిత్రలో ఓ మహాధ్యాయమన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే టీడీపీ తాజాగా హోదా డ్రామాకు తెరతీసిందన్నారు. ► ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షల్లో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన వారిపై సీఎం చంద్రబాబు అక్రమ కేసులు పెట్టించారన్నారు. హోదా వద్దు, ప్యాకేజీ అంటూ డ్రామాలు ఆడి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నారు. ► రాయదుర్గం పట్టణం లక్ష్మీబజార్‌లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కన మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. ముందుగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాపు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అడుగడుగునా అడ్డుకున్న నీచ చరిత్ర చంద్రబాబుదేనన్నారు. ►మడకశిర పట్టణం వైఎస్ విగ్రహం వద్ద సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ముందుగా వైఎస్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ► తాడిపత్రిలో సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో మాజీ జిల్లా కన్వీనర్ పైలా నరసింహయ్య ఆమరణదీక్ష చేపట్టారు. ముందుగా మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి మట్లాడుతూ ఉద్యమమే ఊపిరిగా ముందుకు సాగుతున్న వైఎస్సార్సీపీని సీఎం చంద్రబాబు నాలుగేళ్లుగా అణగదొక్కాలని చూస్తున్నారన్నారు. ► హిందూపురంలో సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. చిన్న మార్కెట్ వద్ద నుంచి సద్భావన సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. అక్కడే రిలే దీక్షలు చేపట్టారు. ► శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ► గుంతకల్లు పట్టణంతో పాటు, పామిడిలో రిలే దీక్షలు చేపట్టారు. గుంతకల్లు దీక్షలో సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ ఫ్లయింగ్ మాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జింకల రామాంజనేయులు పాల్గొన్నారు. ► కదిరి పట్టణంలో సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. ► కళ్యాణదుర్గం రెవెన్యూ కార్యాలయం ఎదుట సమన్వయకర్త ఉషశ్రీచరణ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. జీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పేస్వామినాయక్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాజునాయక్, ఎమ్మార్పీఎస్ నాయకులు విజయ్, ఎస్ఎఫ్ఐ అచ్యుత్‌ప్రసాద్ సంఘీభావం తెలిపారు. ► రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయం వద్ద జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ బోయ రామాంజనేయులు, యువజన విభాగం కన్వీనర్ చిట్రెడ్డి సత్యనారాయణ తదితరులు రిలే దీక్షలో కూర్చున్నారు. సాయంత్రం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ► పుట్టపర్తి పట్టణం సత్యమ్మ దేవాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. పార్టీ జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ► ఉరవకొండ పట్టణం టవర్‌క్లాక్ వద్ద రిలే దీక్షలు చేపట్టారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, జెడ్పీటీసీ తిప్పయ్య, రాష్ట్ర ప్రచారకార్యదర్శి తిరుపాల్‌శెట్టి తదితరులు పాల్గొన్నారు. -
అరుపుల మధ్యే జాతీయ గేయం..
-
పారిపోయిన కేంద్రం; పార్లమెంట్ నిరవధిక వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఎలాంటి పరీక్షకైనా సిద్ధమని చెప్పుకున్న ఎన్డీఏ సర్కార్.. చివరికి అవిశ్వాసాన్ని ఎదుర్కోకుండా పారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండానే పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శుక్రవారం లోక్ సభ ప్రారంభమైన వెంటనే.. సమావేశాల ముగింపునకు సబంధించి స్పీకర్ సుమిత్రా మహాజన్ కీలక ప్రకటన చేశారు. వెల్‌లో ఆందోళన చేస్తోన్న అన్నాడీఎంకే ఎంపీలు వెనక్కి వెళితే.. అవిశ్వాస తీర్మానం నోటీసులపై మాట్లాడతానన్న స్పీకర్.. అనూహ్యంగా సభను నిరవదికంగా వాయిదావేశారు. అరుపుల మధ్యే జాతీయ గేయం..: రెండు విడదలుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు తెన్నులను స్పీకర్ వివరిస్తున్న తరుణంలో.. అవిశ్వాసంపై చర్చ చేపట్టాలని విపక్ష ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. అయినాసరే, స్పీకర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అరుపుల మధ్యే జాతీయ గేయం వందేమాతరం ప్రారంభంకావడంతో ఎంపీలు మిన్నకుండిపోయారు. ఆ తర్వాత లోక్‌సభను నిరవదికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆఖరి రోజు లోక్ సభకు ప్రధాని మోదీ, ఇతర ముఖ్య నేతలంతా హాజరయ్యారు. స్పీకర్ అపాయింట్మెంట్: ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్సీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి రాజీనామాలు సమర్పించారు. సభ నిరవధిక వాయిదా పడిన అనంతరం స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లిన వైఎస్సార్సీపీ ఎంపీలు.. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఏపీ భవన్‌కు వెళ్లి ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభిస్తామని ఎంపీలు చెప్పారు. -
రాజీనామాలు చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
-
మహానేత పాదాల వద్ద రాజీనామాలు..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా పోరాటాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి.. పార్లమెంటు వేదికగా అలుపెరగని పోరాటం సాగించి.. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నించి.. దేశవ్యాప్తంగా చర్చనీయాం శంగా మార్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు అంతిమ పోరాటాన్ని ప్రారంభించింది. హోదా సాధన పోరాటంలో భాగంగా నేడు పదవులకు రాజీనామాలు చేయనున్న ఎంపీలు.. సంతకాలు చేసిన రాజీనామా పత్రాలను మహానేత వైఎస్సార్ పాదాల వద్ద ఉంచి, నమస్కరించారు. అనంతరం పార్లమెంట్‌కు బయలుదేరారు.. స్పీకర్ అపాయింట్మెంట్: ప్రత్యేక హోదా కోసం పదవులు త్యజించేందుకు సిద్ధమైన వైఎస్సార్సీపీ ఎంపీలు ఆమేరకు లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్నారు. సభ నిరవధిక వాయిదా పడిన తర్వాత నేరుగా స్పీకర్‌ను కలవనున్న ఎంపీలు.. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించిన అనంతరం నేరుగా ఏపీ భవన్‌కు వెళ్లి ఆమరణ దీక్షలో కూర్చుంటారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శుక్రవారం సభ నిరవధిక వాయిదా ప్రకటన వెలువడగానే రాజీనామాలు సమర్పిస్తామని వైఎస్సార్సీపీ ఎంపీలు తెలిపారు. ఆ వెంటనే ఏపీ భవన్ వేదికగా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోనున్నారు. ఢిల్లీలో దీక్షకు దిగనున్న వైఎస్సార్సీపీ ఎంపీలకు మద్దతుగా ఏపీ వ్యాప్తంగా అన్ని చోట్లా సంఘీభావ దీక్షలు జరుగనున్నాయి. వైఎస్సీర్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు విద్యార్థులు, యువతకు ఇదివరకే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అటు ఎంపీల దీక్షా శిబిరానికి కార్యకర్తల తాకిడి మొదలైంది. వేలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు వివిధ మార్గాల ద్వారా ఢిల్లీకి పయనం అయ్యారు. వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామా లేఖలు ఇవే.. -
బాబు డ్రామా
-
'రాజీనామాలపై ఎంపీలు పునరాలోచన చేయాలి'
న్యూఢిల్లీ : సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తమ రాజీనామాల విషయాన్ని పునరాలోచించుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలంతా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఇచ్చిన మాటపై వెనక్కి తగ్గటం మంచిది కాదని దిగ్విజయ్ సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తుపానును అడ్డుకుంటామన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన పట్టించుకోలేదు. సీమాంధ్ర ప్రాంత నేతలు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి తమకు తెలిసిందేనని అన్నారు. ఆ సమస్య నుంచి బయటపడేందుకు పరిష్కారం కనుక్కుందామన్నారు. సీమాంధ్ర ప్రజలను సంతృప్తి పరిచేలా జీవోఎంకు ప్రతిపాదనలు పంపుదామని దిగ్విజయ్ అన్నారు. హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తీర్మానం పంపుతామని ఆయన తెలిపారు. షెడ్యూల్లో ఏమైనా మార్పులు ఉంటే మరోకటి ఇవ్వాలని కోరతామన్నారు. -
'రాజీనామాలపై ఎంపీలు పునరాలోచన చేయాలి'