
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల పదవీ త్యాగం రాజకీయ చరిత్రలో అద్భుతఘట్టమని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు.
సాక్షి, ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల పదవీ త్యాగం రాజకీయ చరిత్రలో అద్భుతఘట్టమని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మాటమీద నిలవబడటమంటే ఏంటో తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి చంద్రబాబు నేర్చుకోవాలని సూచించారు.
దమ్ముంటే చంద్రబాబు ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. అప్పుడు ప్రజాక్షేత్రంలో ఎవరి సత్తా ఎంటో తేలిపోతుందని పేర్కొన్నారు.