battula bramhananda reddy
-
చంద్రబాబుది ఎలుగుబంటి పాలన..
సాక్షి, ప్రకాశం: గత ఐదేళ్ల పాలనలో ప్రజా సమస్యలు గాలికొదిలిన చంద్రబాబు..నేడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మనందరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు రాజకీయాలను వ్యాపారం చేశారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పోలవరం నిర్మాణం కలని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం హయాంలో నీరు-చెట్టు పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో రైతుల భూములను బలవంతంగా గుంజుకుని అన్యాయం చేశారని నిప్పులు చెరిగారు. భూములను తన కోటరిలోని నాయకులకు పంచిపెట్టి.. రైతులను నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబుది ఎలుగుబంటి పాలన అయితే..ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ది కామధేనువు పాలనగా బ్రహ్మనందరెడ్డి అభివర్ణించారు. -
‘జగన్‌పై హత్యాయత్నం కుట్రలో బాబూ.. లోకేష్ ఉన్నారేమో’
సాక్షి, అనంతపురం : వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రమేయం లేదనుకుంటే సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు అంగీకరిస్తారని మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ వ్యాఖ్యలు కేసును పక్కదారి పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. కేసును నీరుగార్చేందుకు బాబు యత్నిస్తున్నారని విమర్శించారు. నటుడు శివాజీ చెప్పిన ‘ఆపరేషన్ గరుడ’ పై టీడీపీ సర్కార్ ఎందుకు విచారణకు అంగీకరించడం లేదని ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం అంపశయ్య పై ఉందని, చంద్రబాబు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. టీడీపీ ప్రభుత్వాన్నిఅస్థిరపరచాల్సిన అగత్యం తమకు లేదన్నారు. రాజకీయంగా వైఎస్ జగన్ బలపడడంతో నేరుగా ఎదుర్కొనలేకనే ఆయనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. వారికి ముందే తెలుసు.. సాక్షి, నెల్లూరు : వైఎస్ జగన్‌పై హత్యాయంత్నం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ, టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జగన్‌పై దాడి జరుగనుందని ప్రభుత్వానికి ముందే తెలుసునని ఆయన ఆరోపించారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. టీడీపీ నేతల డ్రామాలన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. సాక్షి, ఒంగోలు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి అనంతరం పరామర్శించాల్సిన చంద్రబాబు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నాడని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. అలిపిరిలో చంద్రబాబుపై దాడి అనంతరం నాటి ప్రతిపక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయనకు మద్దతుగా నిలిచి ఏకంగా ధర్నా చేశారని గుర్తు చేశారు. -
జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
ఒంగోలు సబర్బన్: సాధారణ ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఇప్పటికీ నెరవేర్చక పోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. శుక్రవారం స్థానిక ఎన్జీఓ హోంలో జిల్లాలోని హామీలను నెరవేర్చుకునేందుకు చేపట్టిన న్యాయ ధర్మ పోరాట దీక్షలో విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. న్యాయ ధర్మ పోరాట దీక్షలో జిల్లా అభివృద్ధి వేదిక చైర్మన్ చుండూరి రంగారావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్లు దాటినా జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఒక్క యూనివర్శిటీ కూడా ఏర్పాటు కాలేదంటే జిల్లాపై పాలకులకు ఎంత చిత్తశుద్ధి ఉందో అట్టే అర్ధమవుతుందన్నారు. కనీసం జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థి, యువత ఉద్యమించాల్సిన అవసరం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. కేంద్రం నిధులతో ఏర్పాటు చేయాల్సిన రామాయపట్నం ఓడరేవును నిర్మించాలని, తద్వారా జిల్లా రూపురేఖలే మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ పోరాటాలతోనే హామీలను నెరవేర్చుకోవాలని యువతకు, విద్యార్ధులకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రకాశం జిల్లాపై వివక్షత చూపుతున్నారని, గతంలో పలు రాజకీయపార్టీ నాయకులు వెళ్ళి జిల్లా సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసినప్పుడు స్వయంగా జిల్లా ప్రజలు తన పార్టీకి ఓటు వేయలేదు కాబట్టి ఎలాంటి అభివృద్ది చేయను అని ఖరాఖండిగా చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని గుర్తు చేశారు. అంటే ఓట్లేస్తే ఒకన్యాయం...వేయకపోతే మరో న్యాయమా....జిల్లావాళ్ళు ప్రజలు రాష్ట్ర ప్రజలు కాదా అని ద్వజమెత్తారు. చంద్రబాబు చెప్పే మోసపు మాటలు విని ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు. విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ మాట్లాడుతూ పామూరులో ఐఐఐటీ ఏర్పాటు వలన జిల్లా విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒంగోలులో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా నేటికీ అమలు చేయలేక పోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకరరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా మరిచి పోయిందని, జిల్లాను అభివృద్ధి నిరోధకంగా తయారు చేసిన ఘనత చంద్రబాబుదేనని ధ్వజమెత్తారు. సీపీఐ కార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా వెనుకబాటు తనంతో ఉందని విశ్వవిద్యాలయం ఏర్పాటు ద్వారా బలహీన వర్గాల వారు సైతం ఉన్నత విద్యను అభ్యసిస్తారన్నారు. సీపీఐ నాయకుడు ఎంఎల్.నారాయణ మాట్లాడుతూ విద్యార్థి జేఏసీ న్యాయ ధర్మ పోరాట దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సుపరిపాలన వేదిక నాయకులు చుంచు శేషయ్య, జిల్లా అభివృద్ది వేదిక నాయకులు కొమ్మూరి కనకారావు, అన్నెం కొండలరావు, ఇతర పార్టీల నాయకులు చెరుకూరి కిరణ్, పుష్పరాజు, సాహిత్, రావూరి బుజ్జి, శివశంకర్, రమణారెడ్డి, విద్యార్థి జేఏసీ నాయకుడు పి.మురళితో పాటు పలువురు పాల్గొన్నారు. -
‘అది రాజకీయ చరిత్రలో అద్భుతఘట్టం’
సాక్షి, ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల పదవీ త్యాగం రాజకీయ చరిత్రలో అద్భుతఘట్టమని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మాటమీద నిలవబడటమంటే ఏంటో తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి చంద్రబాబు నేర్చుకోవాలని సూచించారు. దమ్ముంటే చంద్రబాబు ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. అప్పుడు ప్రజాక్షేత్రంలో ఎవరి సత్తా ఎంటో తేలిపోతుందని పేర్కొన్నారు. -
కరడుగట్టిన విలన్లా చంద్రబాబు
ప్రకాశం జిల్లా: కరుడుగట్టిన విలన్లా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నాడని వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ప్రకాశం జిల్లాలో జరిగిన రాజకీయ శిక్షణా తరగతుల్లో వైఎస్సార్సీపీ అగ్రనేతలు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు భ్రమలు కల్పించి..పబ్బం గడుపుకోవడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని అబద్దాలు ప్రచారం చేస్తూ చంద్రబాబు దిగజారుడు రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. ఆత్మన్యూనత భావాన్ని వీడి పార్టీ గెలుపుకోసం కృషిచేయాలని పిలుపు నిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైస్సార్సీపీది ఒంటరి పోరేనని, వాళ్లతో వీళ్లతో పొత్తులు ఉంటాయనే ప్రచారాలు నమ్మొద్దని సూచించారు. బూత్ లెవెల్ కన్వీనర్ల పాత్ర అమోగమని, ఏమరు పాటు వద్దు.. ప్రతి ఓటు విలువైనదని గుర్తెరగండని సూచించారు. వైఎస్ జగన్‌కి ప్రజల్లో ఆదరణ బాగా పెరిగింది..కష్ట పడితే విజయం తథ్యమని అన్నారు. పార్టీ అధినేత జగన్, నియోజక వర్గ ఇంచార్జి, బూత్ లెవెల్ కన్వీనర్లు, ఈ ముగ్గురే నా దృష్టిలో కీలకమైన వ్యక్తులని చెప్పారు. సరైన వ్యక్తులను బూత్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవాలని సూచించారు. నవరత్నాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లండని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. బూత్ కన్వీనర్లు క్రియాశీలకంగా పనిచేయాలని కోరారు. ఈ అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యేందుకు ఐక్యంగా కృషి చేయాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జగన్‌కు 68 శాతం ప్రజల ఆదరణ ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయని, దీన్ని ఓట్ల రూపంలో మలచడంలో బూత్ కమిటీలే కీలకమన్నారు. జిల్లాలో సహకార సంస్థలను నాశనం చేశారని, కో ఆపరేటివ్ బ్యాంకును నిలువు దోపిడీ చేశారని విమర్శించారు. డీసీఎంఎస్‌లో నిధులు నొక్కేసి అడ్రస్ లేకుండా చేశారని ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో కులమతాలకు అతీతంగా ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దారని అన్నారు. వైస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..సింహం ఒంటరిగానే బరిలోకి దిగుతుందని, జగన్ ఎవరి పొత్తు కోసం పాకులాడటం లేదని, అవకాశం పొత్తులు కోసం అర్రులు చాచేది చంద్రబాబు నైజమని మండిపడ్డారు. -
బాబూ జగ్జీవన్‌రామ్ గొప్ప మానవతావాది
సాక్షి, హైదరాబాద్/ విజయవాడ సిటీ: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవ న్రామ్ గొప్ప మానవతా వాది అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. గురు వారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన జగ్జీవన్ రామ్.. ప్రజా సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేశారన్నారు. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పద్మజ కూడా మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవరావు, తెలంగాణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగదేశి రవికుమార్ ,పలువురు పార్టీనేతలు పాల్గొన్నారు. అలాగే విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే రక్షణనిధి, పార్టీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతలు చెప్పిందే చట్టమా
సాక్షి, హైదరాబాద్: ఏపీలో టీడీపీ నేతలు చెప్పేదే చట్టం అన్నట్లుగా చెలామణి అవుతోందని, అధికారపక్షం రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించాలో అంతగా పట్టించారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం, ధర్మం, రాజ్యాంగం ఏవీ కూడా టీడీపీ నేతలకు వర్తించడం లేదని ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏపీ అంటే అరాచక ఆంధ్రప్రదేశ్, మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని, టీడీపీ ఎంపీ మాగంటి బాబు కార్యాలయం (కైకలూరు) పేకాట డెన్‌గా మారిందని విమర్శించారు. చంద్రబాబు సర్కారు అక్రమార్కులకు అండగా నిలుస్తోందని, విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్, ఎంపీ ఇంట్లో పేకాట, దుర్గమ్మ ఆలయ భూముల కబ్జా, రోడ్ల వెడల్పు పేరుతో 40 దేవాలయాలను కూల్చివేయడం, సదావర్తి భూములను కాజేసేందుకు ప్రయత్నం.. ఇలా కుట్రలన్నింటిలో బాబు ప్రభుత్వం అండగా నిలిచిందని ధ్వజమెత్తారు. ఎంపీ అంటే మాగంటి పేకాట అన్నట్లుగా.. సీఎం అంటే ఛీటింగ్ మినిస్టర్, క్రిమినల్ మినిస్టర్ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. -
చంద్రబాబూ.. రైతుల జీవితాలతో వ్యాపారం చేస్తారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 7 లక్షల ఎకరాల భూసేకరణకు సిద్ధమైనట్టు ప్రకటించిందని, తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. రైతుకు, భూమికి ఉన్న బంధం తెలియదా? అని ప్రశ్నించారు. భూసేకరణ పేరుతో రైతుల పొట్టగొట్టి, పెద్దలకు కట్టబెట్టే యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ చేయకపోగా, రైతుల నెత్తిన అధిక భారం మోపారని విమర్శించారు. రైతుల జీవితాలతో వ్యాపారం చేస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు తన వైఖరి మార్చుకోకుంటే తగిన గుణపాఠం తప్పదని బ్రహ్మానందరెడ్డి హెచ్చరించారు. -
బాబూ.. రైతుల జీవితాలతో వ్యాపారం చేస్తారా?
-
రైతుల్ని బహిరంగంగా మోసం చేస్తున్నాడు
ఒంగోలు అర్బన్: చంద్రబాబు రైతు సాధికారత సభలుపెట్టి రైతులను బహిరంగంగా మోసగిస్తున్నాడని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులంతా వారి రుణాలు రీషెడ్యూల్ చేసుకోవాలని చంద్రబాబు అనడంపై మండిపడ్డారు. రీషెడ్యూల్ చేయాల్సింది ప్రభుత్వమైతే..రైతులను రీషెడ్యూల్ చేసుకోమనడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థమవుతోందన్నారు. రీషెడ్యూల్ అంటే ఉన్న అప్పుని కొన్నేళ్లు వాయిదాల పద్ధతిలో చెల్లించుకుంటూ కొత్త రుణాలు పొందే అవకాశం కల్పించడమని..అయితే ఇప్పుడు చంద్రబాబు రీషెడ్యూల్ పేరుతో రైతుల రుణాల్ని రెన్యువల్ చేసి వారిపై భారం మోపుతున్నారని అన్నారు. రైతు సాధికారత సదస్సులో రుణవిముక్తి పత్రాలు పంచినా ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి రుణమాఫీ జరిగిందా అని ప్రశ్నించారు. రుణమాఫీ వర్తించేవారిని గుర్తించడంలో జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం కార్యకర్తలకు కట్టబెట్టడం దారుణమన్నారు. వెంటనే ఆ కమిటీలను తీసేయాలని డిమాండ్ చేశారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు వేర్వేరుగా వ్యవసాయం చేసుకుంటుంటే అలాంటి వారికి కుటుంబానికి ఒక్కరికే రుణమాఫీ వర్తిస్తుందని చంద్రబాబు అంటున్నాడని..దీనివల్ల ఎంతో మంది చిన్న, సన్నకారు రైతులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.50వేలలోపు వారికి రుణ విముక్తి పత్రాలు ఇస్తున్నాం అన్న చంద్రబాబు అవి కూడా ఆ పార్టీ కార్యకర్తలకే ఇవ్వడం దారుణమన్నారు. ఇతర పార్టీకి ఓట్లు వేసిన వారు రైతులు కాదా అని ప్రశ్నించారు. డ్వాక్రా రుణాల పరిస్థితి ఏంటో కూడా చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందన్నారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్ పాల్గొన్నారు. -
రైతు మోసకారి చంద్రబాబు
ఒంగోలు అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల్ని నిలువునా మోసం చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బూటకపు హామీలతో అన్ని వర్గాలను మభ్యపెట్టారని విమర్శించారు. రుణమాఫీ విషయంలో పూటకో మాట మారుస్తూ ఇప్పుడేమో రూ.50 వేలలోపు వారికి రుణ విముక్తి అంటూ పనికిరాని పత్రాలను ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రుణ విముక్తి ద్వారా ఎవరైనా లబ్ధి పొందారంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేనని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ, రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, సీజీసీ సభ్యుడు శేషారెడ్డి, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ వేమూరి బుజ్జి తదితరులున్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించిన వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి, అందుకు సహకరించిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. బత్తుల సేవలు పార్టీకి అవసరం అపార అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డికి రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించడం సంతోషకరమని జిల్లా వైఎస్సార్ సీపి నాయకులు అన్నారు. ఈ మేరకు జిలా ్లనేతలు పూలమాలలు, పుష్పగుఛాలతో ఆయన్ని అభినందించారు. విజయవాడ ఇన్చార్జి వై.వెంకటేశ్వర్లు, ట్రేడ్ యూనియన్ నాయకులు కేవీ ప్రసాద్, జిల్లా ఉపాధి కల్పన విభాగం కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, నరాల రమణారెడ్డి, నగర మహిళా కన్వీనర్ కావూరి సుశీల, బడుగు ఇందిర, బత్తుల ప్రమీల, గంగాడ సుజాత ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.