బాబూ జగ్జీవన్‌రామ్‌ గొప్ప మానవతావాది | Babu Jagjivan Ram is a great humanist | Sakshi
Sakshi News home page

బాబూ జగ్జీవన్‌రామ్‌ గొప్ప మానవతావాది

Published Fri, Apr 6 2018 3:01 AM | Last Updated on Fri, Apr 6 2018 3:01 AM

Babu Jagjivan Ram is a great humanist - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ విజయవాడ సిటీ: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవ న్‌రామ్‌ గొప్ప మానవతా వాది అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. గురు వారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన జగ్జీవన్‌ రామ్‌.. ప్రజా సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేశారన్నారు. 

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పద్మజ కూడా మాట్లాడారు. కార్యక్రమంలో  వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవరావు, తెలంగాణ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు నాగదేశి రవికుమార్‌ ,పలువురు పార్టీనేతలు పాల్గొన్నారు. అలాగే విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన  కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే  రక్షణనిధి, పార్టీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement