Jagjivan ram jayanthi
-
వైఎస్సార్సీపీలోనే దళిత డీఎన్ఏ ఉంది
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీలోనే దళిత డీఎన్ఏ ఉందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. అంబేద్కర్, జగ్జీవన్ రామ్‌లు ఒకరు ఆలోచన, మరొకరు ఆచరణ అని తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు అసమానతలకు పుట్టినిల్లుగా ఉన్న భారతదేశం నేడు సమానత్వం, అభివృద్ధి దిశగా వెళ్తోందంటే అంబేద్కర్, జగ్జీవన్ రామ్లే కారణమని అన్నారు. జగ్జీవన్ రామ్ ఆశయాలు ఆంధ్రప్రదేశ్‌లో సంపూర్ణంగా నెరవేరతాయని వివరించారు. అణగారినవర్గాలు రాజకీయ సాధికారత సాధించే దిశగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందని తెలిపారు. ఈ వర్గాలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాల్సిన ఆవశ్యకతను గుర్తించింది వైఎస్సార్సీపీయే అని చెప్పారు. మంత్రివర్గ కూర్పు నుంచి అన్నింటిలోనూ సీఎం జగన్ ఈ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. గతంలో పాలించిన పార్టీలు దళిత వర్గాల అభివృద్ధి గురించి మాటలు మాత్రమే చెప్పాయని, వారి అభ్యున్నతికి చేసిందేమీ లేదని తెలిపారు. దళితుల మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలనే ప్రతిపక్ష పార్టీల కుట్రలను తిప్పికొట్టాలన్నారు. దళితుల అభ్యున్నతికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, లేళ్ల అప్పిరెడ్డి, అరుణ్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (సోషల్ జస్టిస్) జూపూడి ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇలా సమతా దిశగా ఉందంటే అది వారిద్దరి కృషే: సజ్జల
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు బాబు జగజ్జీవన్ రామ్‌కి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అంబేడ్కర్, జగజ్జీవన్ రామ్ లు ఒకరు ఆలోచన..మరొకరు ఆచరణ. ఈ రోజు ఈ దేశం ఇలా సమతా దిశగా ఉందంటే అది వారిద్దరి కృషే. వైఎస్సార్సీపీలోనే దళిత డీఎన్ఏ ఉంది. ఈ ప్రభుత్వం మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతి కోసం పాటు పడుతోంది. రాజకీయ సాధికారితలో భాగంగా ఒక ప్రణాళిక బద్దంగా ఇవన్నీ చేస్తున్నాం. ఇంతకుమందు నాయకులకు మాటలు తప్ప చేతలు లేవు. కానీ మా పార్టీ మంత్రి వర్గ కూర్పు నుంచి అన్నింటిలో దళితులకు ప్రాధాన్యం ఇస్తోంది. దళితులను అన్నిరకాలుగా ముందు తీసుకురావడానికి నిబద్ధతతో చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాయి. ఎవరో బిచ్చం వేసేదిగా కాకుండా హక్కుగా మేము ఇస్తున్నాం. బడుగు బలహీనవర్గాల వారందరూ ఈ ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలు ఉపయోగించుకోవాలి. అప్పుడే రానున్న పదేళ్ళలో జగజ్జీవన్ రామ్ ఆశయాలు నెరవేరతాయి అని నొక్కి చెప్పారు. ఈ వేడుకలకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అదిమూలపు సురేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మెరుగ నాగార్జున, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: చంద్రబాబు దున్నపోతు ఈనిందని చెబితే పవన్ దూడను కట్టెసే రకం: పేర్ని నాని) -
బాబు జగ్జీవన్‌కు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు విశ్వరూప్, అదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ‘స్వాతంత్ర్యోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. పేదలు, శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. విజయవాడ: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ రామవరప్పాడులో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ శామ్యూల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. దేశానికి బాబూ జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయం అన్నారు. దళితుల సంక్షేమానికి కృషి చేసిన గొప్ప నాయకుడు జగ్జీవన్‌రామ్ అని తెలిపారు. బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. తిరుపతి: బైరాగిపట్టెడలోని జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి డా.గురుమూర్తి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కృష్ణా: గన్నవరం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విజయవాడ: గాంధీనగర్‌లోని బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే, మల్లాది విష్ణు, ఎమ్మెల్యే మెరుగ నాగార్జున, మేయర్ రాయన భాగ్య లక్ష్మీ, ఎపి ఎస్.ఎఫ్.ఎల్ చైర్మన్ గౌతం రెడ్డి, దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్ ఆయన విగ్రహాన్నికి పూలమాల వేసి నివాళులర్పించారు. చదవండి: తిరుపతిలో అత్యధిక మెజార్టీ సాధిద్దాం -
బాబూజీ.. భారత అమూల్య రత్నం
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో జరిగిన స్వాతంత్య్రోద్యమం, కుల నిర్మూలన కోసం జరిగిన సామాజిక సంస్కరణోద్యమం ఉమ్మడిగా కన్న ముద్దుబిడ్డ బాబూ జగ్జీవన్ రామ్. ఆయన్ని స్మరించుకోవడం అంటే భారతదేశ స్వాతంత్య్రం, సామాజికోద్యమ ప్రాంగణాన సంభవించిన సమున్నత ఘట్టా లను గుర్తు చేసుకోవడమే. జగ్జీవన్‌రామ్ మహోన్నత నాయ కత్వం, వ్యక్తిత్వం భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థకు మహా బలాన్ని చేకూర్చిపెట్టాయి. 1908 ఏప్రిల్ 5న జగ్జీవన్‌రామ్ బిహార్‌లో జన్మించాడు. సామాన్య చర్మకార కులం. చిన్ననాటే తండ్రి చనిపోవడంతో సాంఘిక, ఆర్థిక ఇక్కట్ల మధ్య చదువు కొనసాగించాడు. అయినా అణగారిన కులాల విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ను తీసు కోవడానికి నిరాకరించాడు. అదే సమయంలో విద్యలో ప్రతిభ కనబరిచిన ఇతర విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్పును పొందాడు. భోజ్‌పురితోపాటు హిందీ, ఇంగ్లిష్, బెంగాలి, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. ఆరా టౌన్ స్కూల్లో మంచినీళ్ల కుండని అంటుకోనివ్వని రూపంలో మొదటిసారిగా అంటరానితనం ఎదురయ్యింది. ఆయన ముట్టుకున్న కుండ లోని నీరును తాగడానికి కొందరు విద్యార్థులు నిరాకరిం చారు. దీంతో ఎస్సీ కులాల విద్యా ర్థులకు స్కూల్లో ప్రత్యేక మంచినీటి కుండను ఏర్పాటు చేశారు. ఈ అవమానాన్ని సహించలేని జగ్జీవన్, పెట్టిన ప్రతి కుండను పగలగొట్ట సాగాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న స్కూలు హెడ్మాష్టర్ చివరికి అందరికీ ఒక్కటే కుండను ఏర్పాటు చేశాడు. బిహార్‌లో 1934లో వచ్చిన భయంకరమైన భూకంపం సందర్భంగా పునరావాస చర్యలు చేపట్టాడు. తన బృందంతో ఆహోరాత్రులు శ్రమించి ఆహారం, బట్టలు, ఔషధాలు, మంచి నీరు, ఆశ్రయం మొదలైన సౌకర్యాలు బాధితులకు అందే విధంగా సహాయ శిబిరాలు నిర్వహించాడు. ఈ సందర్భంలోనే మొదటిసారిగా గాంధీజీని కలుసుకోవడం తటస్థించింది. కమ్యూనిస్టు మేనిఫెస్టో, పెట్టుబడి గ్రంథాలతో పాటు ఇతర సోషలిస్టు సాహిత్యం అధ్యయనం చేశాడు. అప్పటికే కులరహిత, వర్గరహిత భావజాలం కలిగిన ఆయనపై ఇది ఎంతగానో ప్రభావం చూపింది. బ్రిటిష్ వలసవాద సంకెళ్ళు తెంపి, దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించాలని, సామాజిక సమానత్వం నిర్మిం చాలని విద్యార్థి దశలోనే సంకల్పించుకున్నాడు. సాంఘిక సంస్కరణ కోసం ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ స్థాపించాడు. 28 ఏళ్ళ వయసులోనే శాసన జీవితం ప్రారంభించాడు. సాంఘిక సంస్కరణ కోసం చేస్తున్న ఉద్యమంలో భాగంగా అణగారిన కులాలవారికి ఓటు హక్కు ఉండాలని 1935లో హేమండ్ కమిటీ ముందు నినదించాడు. 1937లో బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ నుంచి 14 రిజర్వుడు స్థానాలకు అభ్యర్థులను పోటీకి నిలిపాడు. ఎటువంటి వ్యతిరేకత లేకుండా అందరూ గెలవడంతో ఒక రాజకీయ నిర్ణయాత్మక శక్తిగా, కింగ్ మేకర్‌గా ఎదిగాడు. 1946 ఆగస్టు 30న భారతదేశంలో మధ్యం తర ప్రభుత్వం ఏర్పాటు చెయ్యవలసిందిగా బ్రిటిష్ వైస్రాయి ఆహ్వానించిన పన్నెండుమంది దేశ నాయకుల్లో జగ్జీవన్‌రామ్ ఒకరు. ఆ మధ్యంతర ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా ఉన్నాడు. రికార్డు స్థాయిలో సుదీర్ఘ కాలం పార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా ప్రజారాజ్య నిర్మాణానికి కృషి చేశాడు. జగ్జీవన్‌రామ్ గొప్ప దార్శనికత, అనుభవం వున్న రచయిత అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయన హిందీలో, ఇంగ్లిష్‌లో రచనలు చేశారు. ప్రజలు జగ్జీవన్‌రామ్‌ను ప్రేమగా ‘బాబూజీ’ అని పిలిచేవారు. సామాజిక, రాజకీయ బానిసత్వంపై జీవితాంతం యుద్ధం చేసిన బాబూజీ ఎప్పటికీ స్ఫూర్తిప్రదాత, భారత అమూల్య రత్నం. -సంపత్ గడ్డం కామారెడ్డి జిల్లా ‘ మొబైల్ : 78933 03516 -
జగ్జీవన్‌రామ్.. నవభారత క్రాంతదర్శి
జగ్జీవన్‌రామ్ దేశ ప్రజానీకానికి ‘బాబూజీ’గా సుపరిచితుడు. బాల్యం, విద్యాభ్యాసం బిహార్‌లోని ‘అర్రా’లో కొనసాగాయి. ఇక్కడే ఆయనకు మదన్ మోహన్ మాలవీయ వంటి ఉద్దండు లతో పరిచయం ఏర్పడింది. ఉన్నత విద్యాభ్యాసానికి బెనారస్ హిందూ విశ్వ విద్యాలయానికి ఆహ్వానించాడు మాల వీయ. కలకత్తాలో చదువుకునే రోజుల్లో కార్మిక సభకు నాయకత్వం వహించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి పెద్దల దృష్టిని ఆకర్షించాడు. 1934లో బిహార్‌లో సంభ వించిన తీవ్ర భూకంప అనంతర కార్యక్రమాల వల్ల మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. రైతుల హక్కులకు మద్దతుగా ఆనాడే కేతిహార్ మజ్దూర్ సభను స్థాపించాడు. ‘ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్’ ద్వారా దళిత బహుజనుల హక్కుల కోసం ఉద్యమించాడు. 1935లో హమాండ్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన ‘డీలిమిటేషన్’ కమిటీ ముందు హాజరై దళితులకు ఓటు హక్కు కావాలని నినదించాడు. రాజ్యాంగ రచనా సంఘ సభ్యునిగా బిహార్ నుండి ఎంపిక య్యాడు. రాజ్యంగసభ మైనార్టీ హక్కుల సబ్ కమీటికి ఎంపికై సభలో వారి హక్కుల రక్షణకై మట్లాడాడు. అంటరానితనం నిర్మూలనకు, వెనుకబడిన వర్గాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వే షన్లు పొందేందుకు ఎస్సీ, ఎస్టీలకు చట్ట సభల్లో సీట్లు రిజర్వు కావడానికి విజయవంతమైన పాత్ర పోషించాడు. భారత పార్లమెంటుకు దాదాపు నాలుగు దశాబ్దాలు పార్లమెంటేరియన్‌గా కొనసాగాడు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో దేశానికి మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా కనీస వేతన చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సవరణ) చట్టం, బోనస్ చెల్లింపుల చట్టం వంటి వివిధ కార్మిక సంక్షేమ కార్యక్రమాలు రూపకల్పన చేశాడు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ వంటి చట్టాల ద్వారా ‘సామాజిక భద్రత’ అంశానికి పునాది వేశాడు. ఫ్యాక్టరీస్ చట్టం ద్వారా మహిళలు, బాలలు ప్రమాదకర పరిశ్రమల్లో, వృత్తుల్లో పని చేయడాన్ని నిషేధించాడు. కార్మికుల పనిగంటలు నిర్ధారించాడు. అదనపు పనికిగాను అదనపు చెల్లింపులకు శ్రీకారం చుట్టాడు. కాంట్రాక్ట్ లేబర్ సంక్షేమ విధానాన్ని ప్రవేశపెట్టాడు. కార్మికుల కోసం ఒక జాతీయ కమిషన్ ఏర్పాటు చేసి జస్టిస్ గజేంద్ర గట్కర్‌ను అధ్యక్షుడిగా నియమించాడు. రైల్వేశాఖా మంత్రిగా రైల్వేలను ఆధునీకరించి చార్జీల భారం పేద ప్రజానీకంపై పడకుండా సంస్కరణలు చేపట్టాడు. ఇక దేశ రక్షణ మంత్రిగా ఆయన చూపిన దీక్షా దక్షతలు నేటికీ ఆదర్శ నీయమే. పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతున్నప్పుడు సియాచిన్ పర్వత శ్రేణులలో సైనికులతో కలసి తిరిగాడు. ‘యుద్ధం పాకి స్తాన్ భూభాగంలో మాత్రమే జరగాలి’, భారత్ భూభాగంలో కాదని భారత సైన్యాన్ని ఉత్సాహపరిచాడు. భారత సైన్యం విజయం సాధించిన మొదటి యుద్ధానికి జగ్జీవన్ నాయకుడిగా ఉండటం ఒక చారిత్రక విషయం. వ్యవసాయశాఖా మంత్రిగా హరిత విప్లవానికి నాంది పలికాడు. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టి నిరు పేదల ఆకలి తీర్చేందుకు శ్రీకారం చుట్టాడు. స్వామినాథన్ వంటి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ‘జగ్జీవన్‌రామ్ గొప్ప దార్శనికుడు. ఆహార సమస్యను తీర్చేందుకు ఆయన చూపిన చొరవ, అనుసరించిన శాస్త్రీయ పద్ధతులు’ తనకు గొప్ప స్ఫూర్తి నిచ్చాయని పేర్కొ నడం బాబుజీ దార్శనికతకు నిదర్శనం. ఈ దేశ ప్రజల చేత ‘బాబూజీ’ అని పిలిపించుకున్న గౌరవం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే దక్కింది. ఒకరు మహాత్మాగాంధీ కాగా, మరొకరు జగ్జీ వన్‌రామ్. గొప్ప దేశభక్తుడు, జాతీయ నాయకుడు, మానవీయ మూర్తి, భారతమాత ముద్దుబిడ్డ అయిన బాబూ జగ్జీవన్‌రావ్‌ును ‘భారతరత్న’గా గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. - డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాసకర్త ఎమ్మెల్సీ, మాజీమంత్రి -
బాబూ జగ్జీవన్‌రామ్ గొప్ప మానవతావాది
సాక్షి, హైదరాబాద్/ విజయవాడ సిటీ: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవ న్రామ్ గొప్ప మానవతా వాది అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. గురు వారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన జగ్జీవన్ రామ్.. ప్రజా సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేశారన్నారు. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పద్మజ కూడా మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవరావు, తెలంగాణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగదేశి రవికుమార్ ,పలువురు పార్టీనేతలు పాల్గొన్నారు. అలాగే విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే రక్షణనిధి, పార్టీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తదితరులు పాల్గొన్నారు. -
దళిత పరిరక్షకుడు జగ్జీవన్‌రాం
ఇన్‌బాక్స్ సమాజంలో వివక్షకు గురై సామాజికంగా, ఆర్థి కంగా వెనుకబడిన వర్గాలైన దళిత గిరిజనులకు రాజ్యాం గంలో ప్రత్యేక హక్కులు కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపిన చైతన్య దీప్తి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్. ఆయన రాజ్యాంగంలో దళితులకు కల్పించిన హక్కులను పరిరక్షించేందుకు తన జీవితాంతం పోరాడిన దళిత జనో ద్ధ్ధారకుడు బాబూ జగ్జ్జీవన్రాం. ఆయన 1908 ఏప్రిల్ 5న బిహార్ రాష్ట్రంలో జన్మించారు. 82 సంవత్సరాలు జీవించి 1986 జూలై 6న పరమపదించారు. సుదీర్ఘకాలం కేంద్రమంత్రిగా దేశ ఉప ప్రధా నిగా, సీనియర్ పార్లమెంటేరియన్‌గా పనిచేసిన ఆయన తన తుదిశ్వాస వరకు దళిత హక్కుల పరి రక్షణే ధ్యేయంగా పనిచేశారు. కేంద్ర కార్మిక మంత్రిగా కార్మికుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ మంత్రిగా ఉన్న కాలంలో హరిత విప్లవం సాధించడంలో కీలక పాత్ర పోషించి రైతు పక్షపాతిగా నిలిచారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడంతో ఆ నిరంకుశ చర్యలు వ్యతిరేకించి కాంగ్రెస్ నుంచి వైదొ లిగి ‘కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ’ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. తర్వాత తన పార్టీని జనతాపార్టీలో విలీనం చేశారు. 1977లో జనతా ప్రభుత్వం ఏర్ప డినప్పుడు దేశ ప్రధాని పదవికి ఆయన ఎంపిక దాదాపుగా ఖరారైనప్పటికీ కొందరు దళిత వ్యతిరేకులు అడ్డుకోవడంతో దేశ తొలి దళిత ప్రధాని అయ్యే అవకాశం కోల్పోయారు. ఆ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా పనిచేశారు. దళితులు రాజ్యాధికారం సాధించినప్పుడే వారి పట్ల ఉన్న వివక్ష పూర్తిగా తొలగి పోతుందని భావించారు. ఆయన ఆశయ సాధనకు దళి తులు అందరూ ఏకమై పనిచేయాలి. పాలక పార్టీల చేతుల్లో పావులుగా మారకుండా, ఓటు బ్యాంకుగా రాజకీయ పార్టీలకు ఉపయోగ పడకుండా రాజ్యాధి కార సాధన కోసం దళితులు పోరాడటమే బాబు జగ్జ్జీవన్రాంకు నిజమైన నివాళి కాగలదు. (నేడు బాబూ జగ్జీవన్‌రాం వర్ధంతి) ఎస్. బాబురావు, కావలి మొబైల్ : 9573011844 ప్రపంచ శాంతికి ఉగ్రవాదం అడ్డు మొన్న బ్రస్సెల్స్, నిన్న ఢాకా, నేడు బాగ్దాద్.. ఇలా ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా వరుస పేలుళ్లతో రెచ్చిపోతున్నారు. ఈ దారుణంలో విచ్చలవిడిగా కాల్పులు జరిపి అమాయక ప్రజ లను బలితీసుకుంటున్నారు. ఇంత ఘోర మైన ఘాతుకానికి కారణం తామేనని ఉగ్ర వాద సంస్థ ఐసిస్ గొప్పలు చెప్పుకోవడం గర్హనీయం. జనం రద్దీగా ఉన్న ప్రాంతాలనే లక్ష్యం చేసుకొని పథకం ప్రకారం మూకు మ్మడి దాడులకు పాల్పడుతూ ఉగ్రవాదులు చేస్తున్న మారణహోమంలో అభంశుభం తెలి యని చిన్నారులు, మహిళలు, అమాయకులు ఎంతో మంది చనిపోతున్నారు. ఢాకాలోని ఓ బేకరీ రెస్టారెంట్లో 20 మంది విదేశీయులను మతం గురించి అడిగి మరీ హింసించి, గొంతు కోసి, కసితీరా చంపి రాక్షసకాండ సృష్టించారు. మతం పేరుతో దుండగులు ప్రజలను చంపడం, విధ్వంసాలు, దాడులకు ఒడిగట్టడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి దుశ్చర్యలను ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా ముక్తకంఠంతో ప్రతి ఘటిం చాలి. ఇలాంటి ఘటనలపై ఐక్యరాజ్యసమితి వెంటనే స్పందించి నిర్ణయాత్మకమైన మార్పు నకు నాంది పలికి ఉగ్రవాదాన్ని తుదముట్టిం చాలి. అప్పుడే శాంతి, సామరస్యాలు వర్ధిల్లు తాయి. ఉగ్రవాద సంస్థల స్థావరంగా హైదరా బాద్ తయారైంది. దేవాలయాలు, జనసమ్మ ర్థంగా ఉండే ఐటీ కారిడార్లు వంటి ముఖ్యమైన ప్రాంతాలలో, దాడులు జరిపేందుకు కుట్రలు పన్ను తున్నారు. ఉగ్రమూకలు ఏకకాలంలో పేలుళ్లకు, మార ణహోమం సృష్టించేందుకు స్కెచ్ వేస్తున్న తరు ణంలో ఐఎన్ఏ బలగాలు దానిని భగ్నం చేయడం ఎంతో గర్వించదగ్గది. పట్టుబడిన ముష్కరులను కాలయాపన చేయకుండా కఠి నంగా శిక్షించాలి. ఇలాంటి ఉగ్రమూకల పిరికి చర్యలకు బెదిరేది లేదు. ఇదే తరుణంలో భారత్‌తో సహా ప్రపంచ దేశాలన్నీ బంగ్లాదేశ్, ఇరాక్ దేశాల ప్రజలకు సంఘీభావం తెల్పాలి. దృఢ సంకల్పంతో నిలవాలి. బుర్రి శేఖర్, ధర్మన్నగూడ, రంగారెడ్డి ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు అవశ్యం ప్రపంచ దేశాల్ని నిత్యమూ వణికిస్తున్న స్థాయికి ఉగ్రవాదం పెరిగిపోవడం ఆందోళనకరం. దాదా పుగా ప్రతిరోజూ ఏదో ఒక దేశం తీవ్రవాద గాట్లతో నెత్తురోడటం సర్వసాధారణమైపోయింది. పేర్లు, వాదాలు, రూపాలు, సిద్ధాంతాలు ఏైవైనా అంతి మంగా అమాయకుల్ని బలిగొనడం, సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసి అస్తవ్యస్త పరచడమే లక్ష్యంగా ఉగ్రవాద సంస్థలు విరుచుకు పడుతు న్నాయి. ఇది నాగరిక సమాజానికి సంబంధించి ఉమ్మడి వైఫల్యంగానే చెప్పాల్సి ఉంటుంది. మానవ నాగరికతకే పెనుసవాలు విసురుతున్న ఉగ్రవాద సమస్యపై నేటికీ ప్రపంచం ఏకాభి ప్రాయంతో లేకపోవడం విచారకరం. జనావాసాలపై విరుచుకు పడుతున్న తీవ్రవాద సమస్యను తక్కువ చేసి చూడడం ద్వారా కొన్ని దేశాలు ఉదాసీనత వహి స్తుండగా, లాభనష్టాల బేరీజులతో మరికొన్ని దేశాలు ఉత్తుత్తి యుద్ద్ధం చేయడంతో చివరకు అన్ని దేశాలూ నష్టపోయే దశకు చేరు కున్నాయి. ఇంతవరకూ ఉగ్రవాదాన్ని ఎలా నిర్వచిం చాలి? ఏ స్థాయిలో ఎదుర్కోవాలి? అన్న ప్రాథమిక అంశాల పట్లనే ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలకు ఏకాభిప్రాయం కుదరలేదు. వివిధ కార ణాలతో అమెరికా, లాటిన్ అమెరికా, ఇస్లామిక్ యూనియన్ దేశాలు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు అభ్యం తరాలు వ్యక్తం చేస్తున్నాయి. కనుకనే భారత్ ప్రతిపాదించిన ’అంత ర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర విధానం’ (సీసీఐటీ) దశాబ్ద కాలంగా ఐక్యరాజ్య సమితిలో అతీగతీ లేకుండా పడి ఉంది. దాని బూజు దులపాల్సిన అవసరం గతంలో కంటే ఇప్పుడే అన్ని సభ్య దేశాలపై ఉంది. ఈ వైరస్ విషయంలో త్వరితంగా తమ భిన్నాభిప్రాయాల్ని తగ్గించుకొని, ఏకాభిప్రాయంతో ఏకోన్ముఖంగా అన్నిరూపాల తీవ్రవాదంపై ప్రపంచ దేశాలు ఉమ్మడి పోరు దిశగా ప్రణాళికల్ని రచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాసీనత, పక్షపాత పాక్షిక యుద్ధాలతో ప్రమాదం పెరగడమేగాని ఫలితం ఉండదు. డాక్టర్ డీవీజీ శంకరరావు మాజీ ఎంపీ, పార్వతీపురం