సాక్షి, అమరావతి: బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు విశ్వరూప్, అదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ‘స్వాతంత్ర్యోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. పేదలు, శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
విజయవాడ: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ రామవరప్పాడులో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ శామ్యూల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. దేశానికి బాబూ జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయం అన్నారు. దళితుల సంక్షేమానికి కృషి చేసిన గొప్ప నాయకుడు జగ్జీవన్‌రామ్ అని తెలిపారు. బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.
తిరుపతి: బైరాగిపట్టెడలోని జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి డా.గురుమూర్తి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
కృష్ణా: గన్నవరం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
విజయవాడ: గాంధీనగర్‌లోని బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే, మల్లాది విష్ణు, ఎమ్మెల్యే మెరుగ నాగార్జున, మేయర్ రాయన భాగ్య లక్ష్మీ, ఎపి ఎస్.ఎఫ్.ఎల్ చైర్మన్ గౌతం రెడ్డి, దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్ ఆయన విగ్రహాన్నికి పూలమాల వేసి నివాళులర్పించారు.
చదవండి: తిరుపతిలో అత్యధిక మెజార్టీ సాధిద్దాం
Comments
Please login to add a commentAdd a comment