jagjivan ram
-
జగ్జీవన్ రామ్‌కు వైఎస్ జగన్ నివాళులు
తాడేపల్లి, సాక్షి: అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన బాబూ జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయమని అని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇవాళ(జులై 06) జగ్జీవన్‌రామ్ వర్ధంతి సందర్భంగా ఎక్స్ ఖాతాలో నివాళులు అర్పించారాయన. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ గారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్రమంత్రిగా, దేశ ఉపప్రధానిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం. నేడు బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నా అని జగన్ సందేశం ఉంచారు.అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ గారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్రమంత్రిగా, దేశ ఉపప్రధానిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం. నేడు బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 6, 2024మరోవైపు విశాఖపట్నం వైఎస్సార్సీపీ కార్యాయంలో జరిగిన జగ్జీవన్ వర్ధంతి కార్యక్రమంలో జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్సీ కళ్యాణి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సుభద్ర తదితరులు పాల్గొని నివాళులర్పించారు. -
సంక్షోభాల పరిష్కర్త.. జగ్జీవన్ రాం
ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు, సంఘ సంస్కర్త.. జగ్జీవన్ రాం. రాజకీయవేత్త. బిహార్‌లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చారు. బాబూజీగా ప్రసిద్ధులు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించారు. ఉపప్రధానిగా కూడా చేశారు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో పాత్ర పోషించారు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారు. 1946లో ఆయన జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భారతదేశ మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రి, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు కూడా. మరీ ముఖ్యంగా ఆయన 1971 ఇండో–పాక్ యుద్ధం జరిగిన సమయంలో భారత రక్షణ మంత్రిగా ఉన్నాడు, ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారి ఏర్పడింది. భారతదేశంలో హరిత విప్లవం, భారత వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో జగ్జీవన్ రాం అందించిన సహకారం అనితర సాధ్యమైనవి. 1974 కరువు సమయంలో ఆహార సంక్షోభాన్ని నివారించటానికి ప్రత్యేకంగా అదనపు మంత్రిత్వ శాఖను నిర్వహించమని కోరినప్పుడు వెరవకుండా ఆయన అంగీకారం తెలియజేశారు. నేడు ఆయన వర్ధంతి. 1908 ఏప్రిల్ 5న జన్మించిన జగ్జీవన్ రామ్ తన 78 వ యేట 1986 జూలై 6న కన్నుమూశారు. -
సంకల్ప సభను సక్సెస్ చేయండి: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలో ఈ నెల 9న ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సంకల్పసభను విజయవంతం చేయాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయం లో ఆమె పాలేరు నియోజకవర్గానికి చెందిన యెనికే కిషోర్‌బాబు ఆధ్వర్యంలో రూపొందించిన సంకల్ప సభ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, తమ పార్టీ విధి విధానాలను ఆవిష్కరించే ఈ సభకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలిరావాలన్నారు. ఆ దిశగా ఖమ్మంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ అనుచరులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా భారీ జన సమీకరణకు నడుంబిగించారన్నారు. ఈ సభను కరోనా నిబంధనలకు అనుగుణంగా జరుపుకుందామని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని షర్మిల కోరారు. అదే విధంగా ఖమ్మం జిల్లాలో సైతం నియోజకవర్గాల వారీగా ఆయా పరిశీలకుల ఆధ్వర్యంలో సంకల్ప సభ సన్నాహాక సమావేశాలు కొనసాగుతున్నాయి. షర్మిలకు పెరుగుతున్న మద్దతు వైఎస్ షర్మిలకు రోజురోజుకీ వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది. సోమవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో లోటస్‌పాండ్‌కు తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు అచ్యుతా యాదవ్ తన పదవికి రాజీనామా చేసి షర్మిలకు మద్దతు పలికారు. నారాయణపేట్ జిల్లా మక్తల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్‌లు ఆరుగురు కూడా మద్దతు తెలిపారు. అదే విధంగా కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ లోటస్‌పాండ్‌లో షర్మిలను కలిశారు. హైదరాబాద్‌లోని సివిల్, క్రిమినల్ కోర్టులతో పాటు హైకోర్టుకు సంబంధించిన న్యాయవాదులు మతీన్ ముజాద్దది షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముందడుగు వేస్తున్న షర్మిలకు తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. షర్మిలను కలిసిన వారిలో న్యాయవాదులు సుభాన్ జావీద్, సయ్యద్ నసీబ్ ఫహీమ్, సిద్దయ్య, కోటేశ్వరావు, నాజిబా సుల్తాన, ఎస్.జె.సుజాత, వాహెబ్ అలీ, ఎ.శ్రీధర్ తదితరులు ఉన్నారు. కూకట్పల్లి ప్రాంతానికి చెందిన సర్దార్జీలు, నగరంలోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రికి చెందిన వైద్యుడు పెద్దఎత్తున అనుచర గణంతో షర్మిలకు మద్దతు తెలిపారు. జగ్జీవన్‌రామ్ చరిత్ర స్ఫూర్తిదాయకం: షర్మిల సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ చరిత్ర స్ఫూర్తిదాయకమని వైఎస్ షర్మిల అన్నారు. సోమవారం లోటస్‌పాండ్‌లో జగ్జీవన్‌రామ్ 114వ జయంతి వేడకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా షర్మిల జగ్జీవన్‌రామ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం సాగించిన ఆయన గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. సామాజిక సమానత్వం కోసం రాజీలేని పోరాటాన్ని కొనసాగించిన జగ్జీవన్.. మహనీయుడని శ్లాఘించారు. కార్యక్రమంలో షర్మిల అనుచరుడు పిట్టా రాంరెడ్డి, అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు జగ్జీవన్‌కు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు విశ్వరూప్, అదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ‘స్వాతంత్ర్యోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. పేదలు, శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. విజయవాడ: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ రామవరప్పాడులో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ శామ్యూల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. దేశానికి బాబూ జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయం అన్నారు. దళితుల సంక్షేమానికి కృషి చేసిన గొప్ప నాయకుడు జగ్జీవన్‌రామ్ అని తెలిపారు. బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. తిరుపతి: బైరాగిపట్టెడలోని జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి డా.గురుమూర్తి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కృష్ణా: గన్నవరం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విజయవాడ: గాంధీనగర్‌లోని బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే, మల్లాది విష్ణు, ఎమ్మెల్యే మెరుగ నాగార్జున, మేయర్ రాయన భాగ్య లక్ష్మీ, ఎపి ఎస్.ఎఫ్.ఎల్ చైర్మన్ గౌతం రెడ్డి, దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్ ఆయన విగ్రహాన్నికి పూలమాల వేసి నివాళులర్పించారు. చదవండి: తిరుపతిలో అత్యధిక మెజార్టీ సాధిద్దాం -
బాబూజీ.. భారత అమూల్య రత్నం
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో జరిగిన స్వాతంత్య్రోద్యమం, కుల నిర్మూలన కోసం జరిగిన సామాజిక సంస్కరణోద్యమం ఉమ్మడిగా కన్న ముద్దుబిడ్డ బాబూ జగ్జీవన్ రామ్. ఆయన్ని స్మరించుకోవడం అంటే భారతదేశ స్వాతంత్య్రం, సామాజికోద్యమ ప్రాంగణాన సంభవించిన సమున్నత ఘట్టా లను గుర్తు చేసుకోవడమే. జగ్జీవన్‌రామ్ మహోన్నత నాయ కత్వం, వ్యక్తిత్వం భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థకు మహా బలాన్ని చేకూర్చిపెట్టాయి. 1908 ఏప్రిల్ 5న జగ్జీవన్‌రామ్ బిహార్‌లో జన్మించాడు. సామాన్య చర్మకార కులం. చిన్ననాటే తండ్రి చనిపోవడంతో సాంఘిక, ఆర్థిక ఇక్కట్ల మధ్య చదువు కొనసాగించాడు. అయినా అణగారిన కులాల విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ను తీసు కోవడానికి నిరాకరించాడు. అదే సమయంలో విద్యలో ప్రతిభ కనబరిచిన ఇతర విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్పును పొందాడు. భోజ్‌పురితోపాటు హిందీ, ఇంగ్లిష్, బెంగాలి, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. ఆరా టౌన్ స్కూల్లో మంచినీళ్ల కుండని అంటుకోనివ్వని రూపంలో మొదటిసారిగా అంటరానితనం ఎదురయ్యింది. ఆయన ముట్టుకున్న కుండ లోని నీరును తాగడానికి కొందరు విద్యార్థులు నిరాకరిం చారు. దీంతో ఎస్సీ కులాల విద్యా ర్థులకు స్కూల్లో ప్రత్యేక మంచినీటి కుండను ఏర్పాటు చేశారు. ఈ అవమానాన్ని సహించలేని జగ్జీవన్, పెట్టిన ప్రతి కుండను పగలగొట్ట సాగాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న స్కూలు హెడ్మాష్టర్ చివరికి అందరికీ ఒక్కటే కుండను ఏర్పాటు చేశాడు. బిహార్‌లో 1934లో వచ్చిన భయంకరమైన భూకంపం సందర్భంగా పునరావాస చర్యలు చేపట్టాడు. తన బృందంతో ఆహోరాత్రులు శ్రమించి ఆహారం, బట్టలు, ఔషధాలు, మంచి నీరు, ఆశ్రయం మొదలైన సౌకర్యాలు బాధితులకు అందే విధంగా సహాయ శిబిరాలు నిర్వహించాడు. ఈ సందర్భంలోనే మొదటిసారిగా గాంధీజీని కలుసుకోవడం తటస్థించింది. కమ్యూనిస్టు మేనిఫెస్టో, పెట్టుబడి గ్రంథాలతో పాటు ఇతర సోషలిస్టు సాహిత్యం అధ్యయనం చేశాడు. అప్పటికే కులరహిత, వర్గరహిత భావజాలం కలిగిన ఆయనపై ఇది ఎంతగానో ప్రభావం చూపింది. బ్రిటిష్ వలసవాద సంకెళ్ళు తెంపి, దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించాలని, సామాజిక సమానత్వం నిర్మిం చాలని విద్యార్థి దశలోనే సంకల్పించుకున్నాడు. సాంఘిక సంస్కరణ కోసం ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ స్థాపించాడు. 28 ఏళ్ళ వయసులోనే శాసన జీవితం ప్రారంభించాడు. సాంఘిక సంస్కరణ కోసం చేస్తున్న ఉద్యమంలో భాగంగా అణగారిన కులాలవారికి ఓటు హక్కు ఉండాలని 1935లో హేమండ్ కమిటీ ముందు నినదించాడు. 1937లో బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ నుంచి 14 రిజర్వుడు స్థానాలకు అభ్యర్థులను పోటీకి నిలిపాడు. ఎటువంటి వ్యతిరేకత లేకుండా అందరూ గెలవడంతో ఒక రాజకీయ నిర్ణయాత్మక శక్తిగా, కింగ్ మేకర్‌గా ఎదిగాడు. 1946 ఆగస్టు 30న భారతదేశంలో మధ్యం తర ప్రభుత్వం ఏర్పాటు చెయ్యవలసిందిగా బ్రిటిష్ వైస్రాయి ఆహ్వానించిన పన్నెండుమంది దేశ నాయకుల్లో జగ్జీవన్‌రామ్ ఒకరు. ఆ మధ్యంతర ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా ఉన్నాడు. రికార్డు స్థాయిలో సుదీర్ఘ కాలం పార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా ప్రజారాజ్య నిర్మాణానికి కృషి చేశాడు. జగ్జీవన్‌రామ్ గొప్ప దార్శనికత, అనుభవం వున్న రచయిత అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయన హిందీలో, ఇంగ్లిష్‌లో రచనలు చేశారు. ప్రజలు జగ్జీవన్‌రామ్‌ను ప్రేమగా ‘బాబూజీ’ అని పిలిచేవారు. సామాజిక, రాజకీయ బానిసత్వంపై జీవితాంతం యుద్ధం చేసిన బాబూజీ ఎప్పటికీ స్ఫూర్తిప్రదాత, భారత అమూల్య రత్నం. -సంపత్ గడ్డం కామారెడ్డి జిల్లా ‘ మొబైల్ : 78933 03516 -
జగ్జీవన్‌రామ్.. నవభారత క్రాంతదర్శి
జగ్జీవన్‌రామ్ దేశ ప్రజానీకానికి ‘బాబూజీ’గా సుపరిచితుడు. బాల్యం, విద్యాభ్యాసం బిహార్‌లోని ‘అర్రా’లో కొనసాగాయి. ఇక్కడే ఆయనకు మదన్ మోహన్ మాలవీయ వంటి ఉద్దండు లతో పరిచయం ఏర్పడింది. ఉన్నత విద్యాభ్యాసానికి బెనారస్ హిందూ విశ్వ విద్యాలయానికి ఆహ్వానించాడు మాల వీయ. కలకత్తాలో చదువుకునే రోజుల్లో కార్మిక సభకు నాయకత్వం వహించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి పెద్దల దృష్టిని ఆకర్షించాడు. 1934లో బిహార్‌లో సంభ వించిన తీవ్ర భూకంప అనంతర కార్యక్రమాల వల్ల మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. రైతుల హక్కులకు మద్దతుగా ఆనాడే కేతిహార్ మజ్దూర్ సభను స్థాపించాడు. ‘ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్’ ద్వారా దళిత బహుజనుల హక్కుల కోసం ఉద్యమించాడు. 1935లో హమాండ్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన ‘డీలిమిటేషన్’ కమిటీ ముందు హాజరై దళితులకు ఓటు హక్కు కావాలని నినదించాడు. రాజ్యాంగ రచనా సంఘ సభ్యునిగా బిహార్ నుండి ఎంపిక య్యాడు. రాజ్యంగసభ మైనార్టీ హక్కుల సబ్ కమీటికి ఎంపికై సభలో వారి హక్కుల రక్షణకై మట్లాడాడు. అంటరానితనం నిర్మూలనకు, వెనుకబడిన వర్గాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వే షన్లు పొందేందుకు ఎస్సీ, ఎస్టీలకు చట్ట సభల్లో సీట్లు రిజర్వు కావడానికి విజయవంతమైన పాత్ర పోషించాడు. భారత పార్లమెంటుకు దాదాపు నాలుగు దశాబ్దాలు పార్లమెంటేరియన్‌గా కొనసాగాడు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో దేశానికి మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా కనీస వేతన చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సవరణ) చట్టం, బోనస్ చెల్లింపుల చట్టం వంటి వివిధ కార్మిక సంక్షేమ కార్యక్రమాలు రూపకల్పన చేశాడు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ వంటి చట్టాల ద్వారా ‘సామాజిక భద్రత’ అంశానికి పునాది వేశాడు. ఫ్యాక్టరీస్ చట్టం ద్వారా మహిళలు, బాలలు ప్రమాదకర పరిశ్రమల్లో, వృత్తుల్లో పని చేయడాన్ని నిషేధించాడు. కార్మికుల పనిగంటలు నిర్ధారించాడు. అదనపు పనికిగాను అదనపు చెల్లింపులకు శ్రీకారం చుట్టాడు. కాంట్రాక్ట్ లేబర్ సంక్షేమ విధానాన్ని ప్రవేశపెట్టాడు. కార్మికుల కోసం ఒక జాతీయ కమిషన్ ఏర్పాటు చేసి జస్టిస్ గజేంద్ర గట్కర్‌ను అధ్యక్షుడిగా నియమించాడు. రైల్వేశాఖా మంత్రిగా రైల్వేలను ఆధునీకరించి చార్జీల భారం పేద ప్రజానీకంపై పడకుండా సంస్కరణలు చేపట్టాడు. ఇక దేశ రక్షణ మంత్రిగా ఆయన చూపిన దీక్షా దక్షతలు నేటికీ ఆదర్శ నీయమే. పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతున్నప్పుడు సియాచిన్ పర్వత శ్రేణులలో సైనికులతో కలసి తిరిగాడు. ‘యుద్ధం పాకి స్తాన్ భూభాగంలో మాత్రమే జరగాలి’, భారత్ భూభాగంలో కాదని భారత సైన్యాన్ని ఉత్సాహపరిచాడు. భారత సైన్యం విజయం సాధించిన మొదటి యుద్ధానికి జగ్జీవన్ నాయకుడిగా ఉండటం ఒక చారిత్రక విషయం. వ్యవసాయశాఖా మంత్రిగా హరిత విప్లవానికి నాంది పలికాడు. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టి నిరు పేదల ఆకలి తీర్చేందుకు శ్రీకారం చుట్టాడు. స్వామినాథన్ వంటి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ‘జగ్జీవన్‌రామ్ గొప్ప దార్శనికుడు. ఆహార సమస్యను తీర్చేందుకు ఆయన చూపిన చొరవ, అనుసరించిన శాస్త్రీయ పద్ధతులు’ తనకు గొప్ప స్ఫూర్తి నిచ్చాయని పేర్కొ నడం బాబుజీ దార్శనికతకు నిదర్శనం. ఈ దేశ ప్రజల చేత ‘బాబూజీ’ అని పిలిపించుకున్న గౌరవం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే దక్కింది. ఒకరు మహాత్మాగాంధీ కాగా, మరొకరు జగ్జీ వన్‌రామ్. గొప్ప దేశభక్తుడు, జాతీయ నాయకుడు, మానవీయ మూర్తి, భారతమాత ముద్దుబిడ్డ అయిన బాబూ జగ్జీవన్‌రావ్‌ును ‘భారతరత్న’గా గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. - డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాసకర్త ఎమ్మెల్సీ, మాజీమంత్రి -
బడుగు వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్
సాక్షి, అనపర్తి: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి దివంగత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్ విశేష సేవలందించారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించేందుకు, కులమతాలకు అతీతంగా దేశాభివృద్ధే ధ్యేయంగా కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్‌రామ్ అన్నారు. జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దళితుల సామాజిక స్థితిగతుల మార్పునకు జగ్జీవన్‌రామ్ ఎనలేని కృషి చేశారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సత్తి రామకృష్ణారెడ్డి, పోతుల ప్రసాదరెడ్డి, వెలగల లక్ష్మీనారాయణరెడ్డి, పాదూరి డేవిడ్‌రాజు, కొండేటి భీమేష్ తదితరులు పాల్గొన్నారు. దొంతమూరులో... దొంతమూరు (రంగంపేట): మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎస్సీకాలనీలో ఉన్న జగ్జీవన్‌రామ్ విగ్రహానికి దుళ్ళపల్లి కొండ, మిరియాల దొరబాబు, కొండ్రి వీరన్న, రాయ వెంకన్న తదితరులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముత్యం వీరబాబు, మాసిపల్లి నాగేశ్వరరావు, దుప్పలపూడి చిట్టిబాబు, చెక్కపల్లి నాగేశ్వరరావు, చెక్కపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పెదరాయవరంలో... పెదరాయవరం (రంగంపేట): గ్రామంలోని అరుంధతీపేటలో యూత్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మాదిగ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు ఉందుర్తి సుబ్బారావు, స్థానిక నాయకులు మాచిన గోవిందు, మోదుకూరి గోపాలకృష్ణ తదితరులు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో దళత నాయకులు బచ్చు చినబాబు, బొత్స యేసు, పైడిమళ్ళ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. చింతపల్లిలో... చింతపల్లి (పెదపూడి): దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన గొప్ప నాయకుడు దివంగత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ సంయుక్త కార్యదర్శి మోకా సూరిబాబు అన్నారు. గ్రామంలో జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు పార్టీ గ్రామ కన్వీనర్ కొల్లు పెద్దకాపు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పిల్లి భాస్కరరావు, పెంకే ఏకాశి, స్థానిక ఎస్సీలు పాల్గొన్నారు. పెద్దాడలో నేత్ర వైద్య శిబిరం గ్రామంలోని అరుంధతీ యూత్ సేవా సంఘం ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో వైద్యులు 200 మందికి నేత్ర పరీక్షలు చేశారు. మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ సంయుక్త కార్యదర్శి మోకా సూరిబాబు, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు యార్లగడ్డ సోమరాజు చౌదరి, బొడ్డు పరమేశ్వరరావు, అరుంధతీ యూత్ సేవా సంఘం అధ్యక్షుడు పైడిమళ్ల సత్యనారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పెదపూడిలో... గ్రామంలో జగ్జీవన్‌రామ్ జయంతి కార్యక్రమం జగ్జీవన్‌రామ్, ఎమ్మార్పీఎస్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ పెద్దలు యార్లగడ్డ అమ్మన్న చౌదరి, నల్లమిల్లి గంగిరెడ్డి తదితరులు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ వేడుకలు నిర్వహించారు. ఘనంగా జగ్జీవన్‌రామ్ జయంతి బిక్కవోలు: బాబూ జగ్జీవన్‌రామ్ ఆదర్శనీయులని వైఎస్సార్ సీపీ నేత, ఏఎంసీ మాజీ చైర్మన్ జంగా వీరవెంకట సుబ్బారెడ్డి అన్నారు. రాజరావుపేటలో జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లడుతూ కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత పదవులు నిర్వహించిన మహా మేధావి జగ్గీవన్‌రామ్ అన్నారు. యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామశాఖ కన్వీనర్ తాళ్ల వీర్రాఘవరెడ్డి, మండల కన్వీనర్ పోతల ప్రసాద్‌రెడ్డి, జిల్లా నాయకులు వంగా రామ్‌గోపాలరెడ్డి, యామసాని రవీంద్రపాపారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో మాజీ ఉపప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి మండల ఎస్టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వెలగల భామిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి జంగా శ్రీనివాసప్రసాద్, నేకూరి సత్యానందం, దొనేపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పరిపాలనా దక్షుడు జగ్జీవన్‌రామ్
దళితవర్గాల పెన్నిధి బాబూ జగ్జీవన్‌రామ్ బిహార్‌లో ప్రస్తుత భోజ్‌పూరి జిల్లాలోని చాందువా అనే గ్రామంలో 5 ఏప్రిల్ 1908న జన్మించారు. భారత రాజకీయాలలో ఆయనది ప్రత్యేక చరిత్ర. జాతీయోద్యమకాలం నుంచి అనేక ఉద్యమాలలో పాల్గొంటూ అంటరానితనాన్ని, వివక్షను, అవమానాలను ఎదుర్కొంటూ మొక్కవోని ధైర్యంతో ఎదుగుతూ స్వాతంత్య్రానంతరం నలభై ఏళ్ళపాటు అనేక పదవులు చేపట్టారు. సమర్థ పరిపాలనా దక్షుడిగా పేరొందారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడం వల్ల తల్లి వాసంతిదేవి అనేక కష్టాలకోర్చి చదివించింది. 1922లో ఆరాలోని మొదటి ఇంగ్లిష్ మీడి యం స్కూలులో తొలిసారి కులవివక్షను ఎదుర్కొన్నారు. పాఠశాలలో ప్రిన్సిపాల్ అంటరానివారికి వేరుగా కుండ పెట్టించిన చర్యను వ్యతిరేకిస్తూ ఆ కుండను పగులగొట్టారు. మెట్రిక్యులేషన్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై, బనారస్ హిందు విశ్వవిద్యాలయంలో 1927లో చేరారు. ఒక దళిత విద్యార్థిగా ఆయనకు హాస్టల్లో భోజనంగానీ, క్షురకర్మగానీ నిరాకరించారు. దళిత మంగలి వచ్చినప్పుడే తన తలవెంట్రుకలు తీయించుకోవాల్సి వచ్చేది. జగ్జీవన్‌రామ్ కలకత్తా వర్సిటీ నుండి 1931లో బీఎస్సీ పట్టా పుచ్చుకున్నారు. అక్కడ కూడా సామాజిక వివక్షకు గురయ్యారు. గాంధీజీ స్ఫూర్తితో అక్కడ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1928లో 50వేల మందితో వెల్డిన్ వద్ద నిర్వహించిన మజ్దూర్ ర్యాలీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ దృష్టిని ఆకర్షించింది. 1935 భారత రాజ్యాంగ చట్టం అనుసరించి ఎన్నికలు ప్రకటించినప్పుడు షెడ్యూల్ కులాల వారికి శాసన సభలో కొంత ప్రాతినిధ్యం కల్పించారు. జాతీయవాదులు, బ్రిటిష్ ఉన్నతాధికారులు జగ్జీవన్‌రామ్‌ని ప్రోత్సహించారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 1937లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1935లో అఖిల భారత డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ ఏర్పాటు చేయడంలో జగ్జీవన్‌రామ్ చురుౖకైన పాత్ర నిర్వహించారు. ఆ సభలకు నైజాంకు చెందిన వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించారు. జగ్జీవన్‌రామ్ అంబేడ్కర్, గాంధీజీ వంటి వారి కృషివల్ల 1935లో హిందూ మహాసభ సదస్సులో అంటరాని వారికి దేవాలయాల్లో, మంచినీటి బావుల్లో ప్రవేశం ఉండాలని తీర్మానించింది. 1940లో సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా రెండుసార్లు జైలుశిక్ష అనుభవించారు. భారత రాజ్యాంగ సభలో స్వతంత్య్ర రాజ్యాంగంలో దళితుల హక్కులకోసం కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా భారతీయులకు ప్రాతినిధ్యం ఉండాలని వాదించారు. అంబేడ్కర్‌కు మద్దతుగా నిలిచారు. 1946లో జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో అతి పిన్న వయస్సులో జగ్జీవన్‌రామ్ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. కార్మిక సంక్షేమం గురించిన అనేక చట్టాలు విధివిధానాలు ఆయన మంత్రిత్వ శాఖ ద్వారా రూపొందాయి. నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలో పలు శాఖల్లో మంత్రిగా పనిచేశారు. ఆయన వ్యవసాయ ఆహార మంత్రిగా పని చేస్తున్నప్పుడే గ్రీన్ రెవల్యూషన్ విజయవంతంగా కొనసాగింది. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ నుంచి విడిపోయి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీని ఏర్పాటు చేశారు జనతా పార్టీతో కలిశారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఉపప్రధానిగా కొంతకాలం సేవలందించారు. స్వతంత్ర భారతదేశ పునర్నిర్మాణంలో జగ్జీవన్‌రామ్ అవిభాజ్య భాగం. గొప్ప పాలనా దక్షుడిగా, దళిత వర్గాలతో పాటు మొత్తం సమాజానికి సేవలందించి 50 సంవత్సరాల పాటు దేశంలోని అనేక మలుపుల్లో తానై ఉన్నారు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్, లోహియా, పెరియార్ రామస్వామి నాయకర్ల కృషి మూలంగానే ఈ దేశంలో దళితులకు అన్ని రంగాల్లో అవకాశాలు, కాలక్రమంలో బీసీలకు కూడా రిజర్వేషన్లు సాధ్యపడుతూ వస్తున్నాయని మర్చిపోకూడదు. మర్చిపోతే తమకు మేలు చేసిన చారిత్రక వ్యక్తులను మరిచి తమకు తామే అన్యాయం చేసుకున్నవారవుతారు. (నేడు జగ్జీవన్‌రామ్ 112వ జయంతి సందర్భంగా) బి.ఎస్. రాములు వ్యాసకర్త చైర్మన్, తెలంగాణ బీసీ కమిషన్ మొబైల్ : 83319 66987 -
హరితవిప్లవ దార్శనికుడు జగ్జీవన్ రామ్
సాక్షి, ఖమ్మం : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 32వ వర్దంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ.. కరువు కోరల్లో చిక్కుకున్న భారతావనిని హరిత విప్లవంతో సస్యశ్యామలం చేసిన దార్శనికుడు జగ్జీవన్ రామ్ అని భట్టి కొనియాడారు. రైల్వే మంత్రిగా ఆధునీకరణకు తొలి అడుగులు వేసి రవాణా వ్యవస్థకు కొత్త జవసత్వాలు కల్పించిన మార్గదర్శి అని జగ్జీవన్ రామ్ అని ప్రశంసించారు. -
ఏపీ మంత్రులకు షాకిచ్చిన మహిళ
-
ఏపీ మంత్రులకు షాకిచ్చిన మహిళ
సాక్షి, ఏలూరు : ఏపీ మంత్రులు జవహర్, ప్రత్తిపాటి పుల్లారావులకు చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో జరిగిన బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ సభలో భాగంగా ఓ మహిళ ఇద్దరు మంత్రులకు షాకిచ్చారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి జవహార్ విమర్శలు, తప్పుడు ఆరోపణలు చేస్తుండగా కార్యక్రమంలో పాల్గొన్న ఓ మహిళ ధైర్యంగా మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అవినీతి గురించి మాట్లాడే అర్హతే మీకు లేదంటూ సభలో నిలదీశారు. దీంతో అవాక్కవ్వడం వేదిక మీదున్న మంత్రుల వంతయింది. వైఎస్ జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన ఆ మహిళ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గానీ, వైఎస్ జగన్ గానీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ నిజాయితీ పరుడు, ఆయన గురించి తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేస్తే ఊరుకునేది లేదంటూ మంత్రులను సభలోనే కడిగిపారేశారు. వైఎస్ జగన్ ఎలాంటి తప్పు చేయలేదని, జై జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో మంత్రులు జవహర్, ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే బుజ్జి సభ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. -
జగ్జీవన్ ఆశయసాధనకు కృషిచేయాలి
► ఎమ్మెల్యే గాదరి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సామేలు ► తుంగుతుర్తిలో జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ తుంగతుర్తి: బాబు జగ్జీవన్‌రామ్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జగ్జీవన్‌రామ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దళితుల సంక్షేమం కోసం బాబు జగ్జీవన్‌రామ్ ఎనలేని కృషి చేశారని అన్నారు. దేశంలో మొదటి ఉపప్రధానిగా దళితుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టా రని పేర్కొన్నారు. ఐక్యంగా ఉండి మన హక్కుల సాధన కోసం కృషి చేయాలన్నారు. ఎవరు ఏపార్టీలో ఉన్నా అందరూ కలిసి ఉండాలని అన్నారు. దళితులకు రాజ్యాధికారం రావడం కోసం ఐక్యపోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుగులోతు స్వాతి తేజానాయక్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుడిపాటి సైదులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గుడిపాటి సైదులు, ఎర్ర యాదగిరి, మిట్టగడ్పుల పురుషోత్తమ్, బొంకూరి భిక్షం, దాసరి శ్రీను, బొజ్జ యాదగిరి, ఇరుగు సురేష్, భాస్కర్, శ్యాంసుందర్, నగేష్, శ్రీను, వెంకన్న, బొంకూరి నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
బాబూ జగ్జీవన్‌రామ్‌కు వైఎస్ జగన్ ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్‌రామ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళుల ర్పించారు. జగన్ నివాసంలో బుధవారం జగ్జీవన్‌రామ్ 110వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి వైఎస్ జగన్ పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ ముఖ్య నేతలు ధర్మాన ప్రసాదరావు, సజ్జల రామకృష్ణారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, సాగి దుర్గా ప్రసాదరాజు, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ గంగుల ప్రతాప్‌రెడ్డి, ఇతర నేతలు మొండితోక అరుణ్‌కుమార్, వరుదు కల్యాణి, డా.హరికృష్ణ, నాగదేశి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దళితుల సంక్షేమానికి జగ్జీవన్‌రాం కృషి
గుంటూరు: బాబూ జగ్జీవన్‌రామ్ దళితుల కోసం ఎంతగానో పాటుపడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరులో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని మార్కెట్ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి, విశిష్టమైన నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు. కార్యక్రమంలో మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, జవహర్, ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ముస్తఫా, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు
-
మిర్యాలగూడలో శిలాఫలకాలు ధ్వంసం
మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని అద్దంకి - నార్కెట్‌పల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాల శిలాఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. శిలా ఫలకాలు ధ్వంసమైన విషయాన్ని గమనించిన దళితులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
జగ్జీవన్ గొప్ప సమతావాది: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనడంతో పాటు దేశ సామాజిక స్థితిగతులకు సరిపోయేలా భారత్‌ను తీర్చిదిద్దడంలో డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ కృషి ఎంతో ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని దేశానికి ఆయన చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, సమతావాదిగా, ప్రజా నాయకుడిగా ఆయన ప్రజలకు చిరకాలం గుర్తుండిపోతారని అన్నారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన జయంతి సందర్భంగా పలువురు వక్తలు పిలుపునిచ్చారు. రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన జగ్జీవన్‌రామ్ 109వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బషీర్‌బాగ్‌లోని ఆయన విగ్రహానికి ఉత్సవాల కమిటీ చైర్మన్, ఎస్సీ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి నివాళులర్పించారు. దళిత కల్యాణ వేదిక ఆధ్వర్యంలో ఆదర్శ, కులాంతర వివాహాలు చేసుకున్న పలు జంటలతో ప్రమాణం చేయించారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రూ.లక్ష సహాయం, రెండు పడకల గది, ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి ఈ వేదిక చైర్మన్ రేణిగుంట్ల ఎల్లయ్య విజ్ఞప్తి చేశారు. అవకాశాలను వినియోగించుకోవాలి: చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ఉపయోగించుకుని జీవిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. దళిత వర్గాల విముక్తికి చదువు ఒక్కటే మార్గమని, రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణలతో ముందుకు సాగాలన్నారు. మహనీయులకు మరణం ఉండదని సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఎస్సీలకిచ్చే రుణాలను బ్యాంకుల ద్వారా కాకుండా సిడ్బి బ్యాంక్, మండల సమాఖ్యల ద్వారా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. -
'జగ్జీవన్ రాం ఆశయ సాధనకు కృషి చేస్తాం'
బాబూజగ్జీవన్‌రాం 109వ జయంతి లోటస్ పాండ్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, రోజా, మేరుగ నాగార్జున, నల్లా సూర్యప్రకాశ్ లు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళిత హక్కులను కాలరాస్తున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి జగ్జీవన్ రాం, అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను నిర్వహించే హక్కులేదని అన్నారు. ముఖ్య మంత్రి స్థాయిలో ఉండి...చంద్రబాబునాయుడు పలుమార్లు దళితులను కించపరిచేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్జీవన్ రాం ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. -
బాబు జగజ్జీవన్రాంకు వైఎస్ జగన్ నివాళీ