
తాడేపల్లి, సాక్షి: అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన బాబూ జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయమని అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇవాళ(జులై 06) జగ్జీవన్‌రామ్ వర్ధంతి సందర్భంగా ఎక్స్ ఖాతాలో నివాళులు అర్పించారాయన.
అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ గారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్రమంత్రిగా, దేశ ఉపప్రధానిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం. నేడు బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నా అని జగన్ సందేశం ఉంచారు.
అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ గారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్రమంత్రిగా, దేశ ఉపప్రధానిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం. నేడు బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 6, 2024
మరోవైపు విశాఖపట్నం వైఎస్సార్‌సీపీ కార్యాయంలో జరిగిన జగ్జీవన్ వర్ధంతి కార్యక్రమంలో జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్సీ కళ్యాణి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సుభద్ర తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

Comments
Please login to add a commentAdd a comment