► ఎమ్మెల్యే గాదరి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సామేలు
► తుంగుతుర్తిలో జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ
తుంగతుర్తి: బాబు జగ్జీవన్‌రామ్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జగ్జీవన్‌రామ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దళితుల సంక్షేమం కోసం బాబు జగ్జీవన్‌రామ్ ఎనలేని కృషి చేశారని అన్నారు. దేశంలో మొదటి ఉపప్రధానిగా దళితుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టా రని పేర్కొన్నారు.
ఐక్యంగా ఉండి మన హక్కుల సాధన కోసం కృషి చేయాలన్నారు. ఎవరు ఏపార్టీలో ఉన్నా అందరూ కలిసి ఉండాలని అన్నారు. దళితులకు రాజ్యాధికారం రావడం కోసం ఐక్యపోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుగులోతు స్వాతి తేజానాయక్, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుడిపాటి సైదులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుడిపాటి సైదులు, ఎర్ర యాదగిరి, మిట్టగడ్పుల పురుషోత్తమ్, బొంకూరి భిక్షం, దాసరి శ్రీను, బొజ్జ యాదగిరి, ఇరుగు సురేష్, భాస్కర్, శ్యాంసుందర్, నగేష్, శ్రీను, వెంకన్న, బొంకూరి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
జగ్జీవన్ ఆశయసాధనకు కృషిచేయాలి
Published Sat, Jun 24 2017 2:04 PM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM
Advertisement
Advertisement