ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు, సంఘ సంస్కర్త.. జగ్జీవన్ రాం. రాజకీయవేత్త. బిహార్‌లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చారు. బాబూజీగా ప్రసిద్ధులు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించారు. ఉపప్రధానిగా కూడా చేశారు.
1935లో అంటరాని వారికి సమానత్వం కోసం ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో పాత్ర పోషించారు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారు. 1946లో ఆయన జవహర్‌లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భారతదేశ మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రి, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు కూడా. మరీ ముఖ్యంగా ఆయన 1971 ఇండో–పాక్ యుద్ధం జరిగిన సమయంలో భారత రక్షణ మంత్రిగా ఉన్నాడు, ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారి ఏర్పడింది.
భారతదేశంలో హరిత విప్లవం, భారత వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో జగ్జీవన్ రాం అందించిన సహకారం అనితర సాధ్యమైనవి. 1974 కరువు సమయంలో ఆహార సంక్షోభాన్ని నివారించటానికి ప్రత్యేకంగా అదనపు మంత్రిత్వ శాఖను నిర్వహించమని కోరినప్పుడు వెరవకుండా ఆయన అంగీకారం తెలియజేశారు. నేడు ఆయన వర్ధంతి. 1908 ఏప్రిల్ 5న జన్మించిన జగ్జీవన్ రామ్ తన 78 వ యేట 1986 జూలై 6న కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment