సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని నలు మూలల నుంచి సేకరించిన మట్టి కలశాలు ఆదివారం ప్రత్యేక రైలులో ఢిల్లీకి చేరుకున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నా నేల నా మట్టి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వందలాది గ్రామాల నుంచి సేకరించిన మట్టిని తీసుకొచ్చారు. ఈ క్రమంలో ప్రత్యేక రైలులో ఏపీ నుంచి 800 మంది, తెలంగాణ నుంచి 150 మంది వచ్చారు.
సోమవారం ఇండియా గేట్ దగ్గర నిర్వహించే కార్యక్రమంలో ఉంచే కలశంలో ఈ మట్టిని పోస్తారు. తర్వాత ఆజాదీ కా మహోత్సవ్ గుర్తుగా చేపట్టే నిర్మాణాల్లో ఈ మట్టిని వినియోగించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి నిజాముద్దీన్ రైల్వేస్టేషన్‌లో ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ ఆధ్వర్యంలో సిబ్బంది సంప్రదాయ దుస్తులతో çఘన స్వాగతం పలికారు. ఏపీ ప్రభుత్వం వారందరికీ వసతి, బస సౌకర్యాలు ఏర్పాటు చేసింది. లైజన్ ఆఫీసర్ సురేశ్‌బాబు, ఓఎస్డీ రవిశంకర్, జీవీఆర్ మురళి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment