mla gadari kishore kumar
-
ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే కిశోర్
నూతనకల్ (తుంగతుర్తి) : రాష్ట్రంలో ప్రతి ఇంటికి రెండేసి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. ఆదివా రం మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో రూ.10లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా గ్రామాలను అభివృద్ధి చేశామన్నారు. రైతులకు 24గంటల విద్యుత్, పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.4వేలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, మిషన్‌భగీరథ పథకాలతో ముందుకు సాగుతున్నామన్నారు. జిల్లాలో ఎంతో వెనుకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. వచ్చే వానకాలం నుంచి ఎస్సారెస్పీ కాల్వల ద్వారా రెండు పంటలకు గోదావరి జలాలు అందిస్తామన్నారు. అనంతరం చిల్ప కుంట్ల గ్రామానికి చెందిన సీపీఎం జిల్లా నాయకులు బత్తుల విద్యాసాగర్‌తో పాటు మరో 100 మంది సీపీఎం కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎస్ఏ.రజాక్, కందాల దామోదర్‌రెడ్డి, తొనుకునూరి లక్ష్మణ్‌గౌడ్, ఎలిమినేటి కష్ణప్రశాంత్, గోరుగంటి మోహన్‌రావు, చూడి లింగారెడ్డి, బిక్కి బుచ్చయ్య, పులుసు వెంకన్న, బాణాల సత్యనారాయణరెడ్డి, భూరెడ్డి సంజీవరెడ్డి, బత్తుల విద్యాసాగర్, బద్దం వెంకటరెడ్డి, చురకంటి చంద్రారెడ్డి, బత్తుల సాయిలుగౌడ్, కనకటి వెంకన్న, కొమ్ము నాగేశ్వర్రావు, మహేశ్వరం మల్లికార్జున్, రేసు వెంకటేశ్వర్లు, సజ్జనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
జగ్జీవన్ ఆశయసాధనకు కృషిచేయాలి
► ఎమ్మెల్యే గాదరి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సామేలు ► తుంగుతుర్తిలో జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ తుంగతుర్తి: బాబు జగ్జీవన్‌రామ్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జగ్జీవన్‌రామ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దళితుల సంక్షేమం కోసం బాబు జగ్జీవన్‌రామ్ ఎనలేని కృషి చేశారని అన్నారు. దేశంలో మొదటి ఉపప్రధానిగా దళితుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టా రని పేర్కొన్నారు. ఐక్యంగా ఉండి మన హక్కుల సాధన కోసం కృషి చేయాలన్నారు. ఎవరు ఏపార్టీలో ఉన్నా అందరూ కలిసి ఉండాలని అన్నారు. దళితులకు రాజ్యాధికారం రావడం కోసం ఐక్యపోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుగులోతు స్వాతి తేజానాయక్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుడిపాటి సైదులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గుడిపాటి సైదులు, ఎర్ర యాదగిరి, మిట్టగడ్పుల పురుషోత్తమ్, బొంకూరి భిక్షం, దాసరి శ్రీను, బొజ్జ యాదగిరి, ఇరుగు సురేష్, భాస్కర్, శ్యాంసుందర్, నగేష్, శ్రీను, వెంకన్న, బొంకూరి నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
సామాన్యులకు అర్థమయ్యే బడ్జెట్
ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ మోత్కూరు: ఇటీవల శాసన సభలో ప్రవేశపె ట్టిన బడ్జెట్ సామాన్య వర్గాలకు అనుకూల మైందని, వారికి అర్థమయ్యే రీతిలో ఉందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఆదివారం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌కు పార్టీ క్రియాశీలక సభ్యత్వం అందజేశారు. గత ప్రభుత్వాల బడ్జెట్లను ప్రజలు పట్టించుకోలేదని ఈటల అన్నారు. తెలంగాణ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని, ఏయే వర్గాలకు, ఏయే వృత్తులకు ఎన్నికోట్లు కేటాయించారని ఆసక్తిగా చూస్తున్నారన్నా రు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 350 జీఓలు తెచ్చి అనేక సమస్యలను పరిష్కరించిందని మంత్రి పేర్కొన్నారు. 36 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తుందని, ఇందుకు రూ. 5వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే వివిధ కులవృత్తులకు రూ.10 వేల కోట్లు కేటాయించడంతో ఆయా వర్గాలు సంబరాలు జరుపుకుంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గిడ్డం గుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ ఉన్నారు.