సామాన్యులకు అర్థమయ్యే బడ్జెట్‌ | Intelligible common budget says Minister Rajendra itala | Sakshi
Sakshi News home page

సామాన్యులకు అర్థమయ్యే బడ్జెట్‌

Published Mon, Mar 20 2017 2:07 AM | Last Updated on Tue, Oct 2 2018 5:14 PM

సామాన్యులకు అర్థమయ్యే బడ్జెట్‌ - Sakshi

సామాన్యులకు అర్థమయ్యే బడ్జెట్‌

ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌
మోత్కూరు: ఇటీవల శాసన సభలో ప్రవేశపె ట్టిన బడ్జెట్‌ సామాన్య వర్గాలకు అనుకూల మైందని, వారికి అర్థమయ్యే రీతిలో ఉందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఆదివారం టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌కు పార్టీ క్రియాశీలక సభ్యత్వం అందజేశారు. గత ప్రభుత్వాల బడ్జెట్‌లను ప్రజలు పట్టించుకోలేదని ఈటల అన్నారు.

 తెలంగాణ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని, ఏయే వర్గాలకు, ఏయే వృత్తులకు ఎన్నికోట్లు కేటాయించారని ఆసక్తిగా చూస్తున్నారన్నా రు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 350 జీఓలు తెచ్చి అనేక సమస్యలను పరిష్కరించిందని మంత్రి పేర్కొన్నారు. 36 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తుందని, ఇందుకు రూ. 5వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే వివిధ కులవృత్తులకు రూ.10 వేల కోట్లు కేటాయించడంతో ఆయా వర్గాలు సంబరాలు జరుపుకుంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గిడ్డం గుల సంస్థ చైర్మన్‌ మందుల సామేల్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement