ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే కిశోర్‌ | All Schemes Implemented MLA Gadari | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే కిశోర్‌

Published Mon, May 28 2018 7:15 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

All Schemes Implemented MLA Gadari - Sakshi

విద్యాసాగర్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌

నూతనకల్‌ (తుంగతుర్తి) : రాష్ట్రంలో ప్రతి ఇంటికి రెండేసి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. ఆదివా రం మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో రూ.10లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా గ్రామాలను అభివృద్ధి చేశామన్నారు.

రైతులకు 24గంటల విద్యుత్, పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.4వేలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్‌ కాకతీయ, మిషన్‌భగీరథ పథకాలతో ముందుకు సాగుతున్నామన్నారు. జిల్లాలో ఎంతో వెనుకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. వచ్చే వానకాలం నుంచి ఎస్సారెస్పీ కాల్వల ద్వారా రెండు పంటలకు గోదావరి జలాలు అందిస్తామన్నారు. అనంతరం చిల్ప కుంట్ల గ్రామానికి చెందిన సీపీఎం జిల్లా నాయకులు బత్తుల విద్యాసాగర్‌తో పాటు మరో 100 మంది సీపీఎం కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.  

ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఎస్‌ఏ.రజాక్, కందాల దామోదర్‌రెడ్డి, తొనుకునూరి లక్ష్మణ్‌గౌడ్, ఎలిమినేటి కష్ణప్రశాంత్, గోరుగంటి మోహన్‌రావు, చూడి లింగారెడ్డి, బిక్కి బుచ్చయ్య, పులుసు వెంకన్న, బాణాల సత్యనారాయణరెడ్డి, భూరెడ్డి సంజీవరెడ్డి, బత్తుల విద్యాసాగర్, బద్దం వెంకటరెడ్డి, చురకంటి చంద్రారెడ్డి, బత్తుల సాయిలుగౌడ్, కనకటి వెంకన్న, కొమ్ము నాగేశ్వర్‌రావు, మహేశ్వరం మల్లికార్జున్, రేసు వెంకటేశ్వర్లు, సజ్జనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement