scheams
-
ఉచిత కరెంట్ కోసం అప్లయ్ చేశారా?, లేదంటే ఇలా చేయండి..
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. సోలార్ పవర్ వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రధాని మోదీ 'పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన' పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకంలో ప్రతి నెలా కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ను అందించనున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని అట్టడుగు స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ అధికార పరిధిలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ప్రోత్సహించాలని మోదీ అన్నారు. అదే సమయంలో, ఈ పథకం మరింత ఆదాయానికి, తక్కువ విద్యుత్ బిల్లులకు, ప్రజలకు ఉపాధి కల్పనకు దారి తీస్తుంది అని చెప్పారు. ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ఇందుకోసం ఎలాంటి పత్రాలు కావాలో తెలుసుకుందాం ♦ ముందుగా https://pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. ♦ అప్లయ్ ఫర్ రూఫ్‌టాప్ సోలార్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి ♦ మీరు ఈ వివరాలతో ముందుగా నమోదు చేసుకోవాలి - రాష్ట్రం, విద్యుత్ పంపిణీ సంస్థ, విద్యుత్ వినియోగదారు సంఖ్య, మొబైల్ నంబర్, ఇమెయిల్ వివరాల్ని నమోదు చేయాలి. ♦ పూర్తి చేసిన తర్వాత, మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ♦ మీరు ఇప్పుడు సోలార్ ప్యానల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ప్రాసెస్‌లో బ్యాంక్ వివరాలను సమర్పించాలి. ♦ మీరు ఆమోదం పొందిన తర్వాత, మీ డిస్కమ్‌లోని రిజిస్టర్డ్ విక్రేతలలో ఎవరైనా ప్లాంట్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ♦ ఇనెట్ మీటర్‌ను ఇన్స్టాల్ చేశాక, డిస్కమ్ అధికారులు తనిఖీలు చేస్తారు. అనంతరం పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. ♦ ఈ రిపోర్ట్ పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్‌ను పోర్టల్‌లో సబ్మిట్ చేయాలి. 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది. -
ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం! : మాజీ మంత్రి షబ్బీర్‌అలీ
నిజామాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని మాజీ మంత్రి, కాంగ్రెస్ నిజామాబాద్ అర్బన్ ఇన్చార్జి షబ్బీర్‌అలీ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారెంటీలు అమలు చేశామన్నారు. మరో రెండింటిని కూడా త్వరలో అమలు చేస్తామని పే ర్కొన్నారు. మున్సిపల్ వార్డుల్లో ఐదుగురు సభ్యుల బృందంతో పాటు నోడల్ అధికారులు కలిసి ఈ పథకాలను అమలు చేస్తారని చెప్పారు. అంతా పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో కేటీఆర్ ఫస్ట్రేషన్లో పిల్లచేష్టలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూంలు, రుణామాఫీ పథకాలు అమలు చే యలేదన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రజాపాలన సెంటర్లను పరిశీలించారు. నగరంలో అభయహస్తం దరఖాస్తులు లక్ష అందించగా, 88వేల వచ్చాయన్నారు. దరఖాస్తుల గడువు పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశవేణు, నాయకులు భక్తవత్సలం, వైశాక్షి సంతోష్, వేణురాజ్, మైనారిటీ జావీద్, ప్రీతమ్, రేవతి పాల్గొన్నారు. ఇవి చదవండి: ఒక్కొక్కరుగా.. ముఖ్య నేతల జంప్! -
ధరణి కొనసాగిస్తాం.. కేసీఆర్ పథకాలపై బండి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ కొత్త వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ధరణి రద్దు చేయమని స్పష్టం చేశారు. కాగా, బండి సంజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేయం. ధరణిలో సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, బీజేపీ అధికారంలోకి వస్తే.. కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు పొలిటికల్‌గా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇదే సమయంలో కేసీఆర్ సర్కార్, కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైరయ్యారు. కాంగ్రెస్‌ను హైలైట్ చేయడానికే మోదీ మాకు మిత్రుడే అని కేసీఆర్ అంటున్నారు. బీఆర్ఎస్కు జిల్లా అధ్యక్షులు లేరు. బూత్ కమిటీలు లేవన్నారు. కాగా, బీజేపీకి జిల్లా అధ్యక్షులు ఉన్నారు. అసెంబ్లీ కన్వీనర్లు ఉన్నారు. మండట కమిటీలు ఉన్నాయి. బూత్ కమిటీలు ఉన్నాయని తెలిపారు. కేసీఆర్‌కు, మోదీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కేసీఆర్ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు. మోదీ కేబినెట్‌పై ఒక్క అవినీతి మరక లేదు. ఇక, కేసీఆర్ కేబినెట్లో అవినీతి మరకలేని మంత్రి లేడు. కేసీఆర్ రోజు ఏం చేస్తున్నారు. రోజువారీ షెడ్యూల్ ఎందుకు బయటపెట్టడం లేదు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లరు. ప్రధాని వస్తే కలవరు. కాంగ్రెస్ పార్టీలో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అభ్యర్థులను కేసీఆర్ తయారు చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చిందే కేసీఆర్. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీని ఓడించడానికి కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే.. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. తెలంగాణపై కీలక నిర్ణయం! -
ఏపీ విద్యారంగ పథకాలు నచ్చి .. ప్రపంచ బ్యాంకు సాయం
-
స్థిరమైన రాబడులకు దారి..!
గడిచిన నాలుగేళ్ల కాలంలో ఈక్విటీ మార్కెట్లలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాం. కరోనా కారణంగా భారీగా పడిపోయిన స్టాక్ మార్కెట్లు తిరిగి ఏడాదిలోపే రెట్టింపునకు పైగా పెరిగి రికార్డులు సృష్టించాయి. ఈ అనిశ్చిత పరిస్థితుల్లోనూ స్థిరమైన రాబడులను అందించిన పథకాలు ఏవని పరిశీలిస్తే కేవలం కొన్నే పథకలు కనిపిస్తాయి. అటువంటి వాటిల్లో యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ కూడా ఒకటి. కరోనా కారణంగా కుదేలైన మన దేశ ఆర్థిక వ్యవస్థ.. వైరస్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత తిరిగి అంతే వేగంగా కోలుకుంటుందని నిపుణుల అంచనా. ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరు చూపించడం అన్నది ఈక్విటీ మార్కెట్లకు అనుకూలైన మైన విషయమే. దీంతో ఈక్విటీలు వచ్చే 2–3 ఏళ్లపాటు మంచి పనితీరు చూపిస్తాయన్న అంచనాలున్నాయి. చారిత్రకంగా చూస్తే స్వల్ప కాలంలోనే ఈ అస్థితరలు ఉంటాయేమో కానీ.. దీర్ఘకాలంలో (కనీసం పదేళ్లు ఆ పైన) ఈక్విటీలు మంచి రాబడులను ఇస్తాయని ఎన్నో ఆధారాలున్నాయి. కనుక ఇన్వెస్టర్లు మెరుగైన రాబడుల కోసం.. అదే సమయంలో పెట్టుబడులకు సంబంధించి పరిమిత రిస్క్ తీసుకునే వారు నాణ్యమైన లార్జ్‌క్యాప్ (మార్కెట్ విలువ పరంగా టాప్–100) పథకాలను ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. ఒకవేళ మళ్లీ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా లార్జ్‌క్యాప్ కంపెనీలు సమర్థవంతంగా అధిగమించగలవు. కనుక ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల లక్ష్యాల కోసం మంచి రాబడుల చరిత్ర కలిగిన లార్జ్‌క్యాప్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో నమ్మకమైన పనితీరు చూపిస్తున్న వాటిల్లో యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ కూడా ఒకటి. రాబడులు ఏ కాల వ్యవధికి పరిశీలించినా కానీ యాక్సిస్ లార్జ్‌క్యాప్ ఫండ్ రాబడులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. లార్జ్‌క్యాప్ విభాగంలో యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ అగ్రగామిగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో 44 శాతం రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక రాబడులు 15 శాతం, ఐదేళ్ల కాలంలో 16 శాతం చొప్పున ఉన్నాయి. ఏడేళ్లలోనూ వార్షికంగా 14 శాతం రాబడినిచ్చింది. పదేళ్ల కాలంలో వార్షిక రాబడి 14 శాతం చొప్పున ఉంది. కనుక ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల లక్ష్యాల కోసం సిప్ రూపంలో ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుందని భావించొచ్చు. ఏడాది కాలాన్ని మినహాయిస్తే మిగిలిన అన్ని కాల వ్యవధుల్లోనూ బెంచ్‌మార్క్ నిఫ్టీ 50 కంటే మెరుగైన రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. ఈ పథకం నిర్వహణలో జూన్ చివరికి రూ.28,233 కోట్ల ఇన్వెస్టర్ల ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. ఈ పథకం ఆరంభమైన నాటి నుంచి చూస్తే (2010 జనవరి) వార్షిక రాబడి 13.35 శాతం చొప్పున ఉంది. పెట్టుబడుల విధానం లార్జ్‌క్యాప్ ఫండ్ కనుక తన పెట్టుబడుల్లో కనీసం 80 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని చిన్న కంపెనీలకు కేటాయిస్తుంది. కానీ, ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ పథకం దాదాపు పెట్టుబడులన్నింటినీ లార్జ్‌క్యాప్‌నకే కేటాయించడం గమనార్హం. మెగా, లార్జ్ క్యాప్ కంపెనీల్లోనే 99 శాతం ఇన్వెస్ట్ చేయగా.. ఒక శాతాన్ని స్మాల్‌క్యాప్ కంపెనీలకు కేటాయించింది. ప్రస్తుతం ఈ పథకం తన వద్దనున్న పెట్టుబడుల్లో 95.5 శాతాన్నే ఈక్విటీలకు కేటాయించి, మిగిలిన 4.5 శాతాన్ని డెట్ సాధనాల్లో పెట్టి ఉంది. అనిశ్చిత పరిస్థితుల్లో మార్కెట్లు దిద్దుబాటుకు లోనైతే మంచి పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకునేందుకు గాను ఈ మేరకు డెట్ హోల్డింగ్స్‌ను కలిగి ఉందని భావించొచ్చు. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 36 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌లోనే 37 శాతం వరకు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీల్లో 18 శాతం ఇన్వెస్ట్ చేసి ఉంది. -
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట: మోపిదేవి
సాక్షి, అమరావతి: కరోనా వంటి విపత్తు సమయంలోనూ సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ పాలనలో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలోకి తెచ్చేందుకు సీఎం జగన్ గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. అదే విధంగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం పెద్దపీట వేశారని మోపిదేవి పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఆసరా, చేయూత, అమ్మఒడి వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని అన్నారు. అన్ని రకాల సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలనే ధృడ సంకల్పంతో ముఖ్యమంత్రి సుపరిపాలనను అందిస్తున్నారని మోపిదేవి అన్నారు. చదవండి: అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ ప్రభుత్వం: మంత్రి బొత్స -
కరోనా కష్ట కాలం లో సంక్షేమ పథకాలతో ప్రజలను ఆదుకున్నాం
-
జగనన్న వస్తే..ప్రతి రైతుకూ రూ.50 వేలు
సాక్షి, కోవెలకుంట్ల: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికీ రూ.50 వేలు పెట్టుబడి నిధి కింద అందజేయనున్నారు. ఒక్కో ఏడాదికి రూ.12,500 చొప్పున రెండవ సంవత్సరం నుంచి నాలుగేళ్లపాటు ప్రతి ఏటా మే నెలలో రైతు కుటుంబాలకు పెట్టుబడి నిధి అందనుంది. వైఎస్ఆర్ రైతు భరోసా రైతులకు చేయూతగా మారటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్లోని ఆరు మండలాల పరిధిలో 50 వేల మంది రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా లబ్ధి చేకూరనుంది. పంట సాగుకు చాలా ఉపయోగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతు కుటుంబానికీ రూ. 50వేలు పెట్టుబడి నిధి కింద అందుతుంది. ఏటా రూ. 12,500 ఇవ్వడం వల్ల ఈ నిధులతో పంట సాగుకు విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. –ఉసేనయ్య, రైతు, బిజనవేముల రుణ సమస్య తప్పుతుంది వ్యవసాయంలో పెట్టుబడే ప్రధాన సమస్య. నవరత్నాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా కింద మే నెలలోనే రూ. 12,500 ఇవ్వడం రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ముందే పెట్టుబడి సమకూరడం వల్ల రుణ సమస్య తప్పుతుంది. –ప్రతాప్‌రెడ్డి, రైతు, కోవెలకుంట్ల పెట్టుబడి సమస్య తీరుతుంది ఖరీఫ్‌కు ముందే పెట్టుబడి నిధి కింద రూ.12,500 ప్రతి రైతు కుటుంబానికీ అందటం వల్ల ఆ ఏడాది పెట్టుబడి సమస్య తీరుతుంది. రైతులకు పంటల సాగుకు పెట్టుబడికి చేతులో డబ్బులు ఉండటంతో ప్రణాళికా బద్ధంగా వ్యవసాయానికి వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించేందుకు వీలుంటుంది. –వెంకటరాముడు, రైతు, గుళ్లదూర్తి -
ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే కిశోర్
నూతనకల్ (తుంగతుర్తి) : రాష్ట్రంలో ప్రతి ఇంటికి రెండేసి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. ఆదివా రం మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో రూ.10లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా గ్రామాలను అభివృద్ధి చేశామన్నారు. రైతులకు 24గంటల విద్యుత్, పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.4వేలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, మిషన్‌భగీరథ పథకాలతో ముందుకు సాగుతున్నామన్నారు. జిల్లాలో ఎంతో వెనుకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. వచ్చే వానకాలం నుంచి ఎస్సారెస్పీ కాల్వల ద్వారా రెండు పంటలకు గోదావరి జలాలు అందిస్తామన్నారు. అనంతరం చిల్ప కుంట్ల గ్రామానికి చెందిన సీపీఎం జిల్లా నాయకులు బత్తుల విద్యాసాగర్‌తో పాటు మరో 100 మంది సీపీఎం కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎస్ఏ.రజాక్, కందాల దామోదర్‌రెడ్డి, తొనుకునూరి లక్ష్మణ్‌గౌడ్, ఎలిమినేటి కష్ణప్రశాంత్, గోరుగంటి మోహన్‌రావు, చూడి లింగారెడ్డి, బిక్కి బుచ్చయ్య, పులుసు వెంకన్న, బాణాల సత్యనారాయణరెడ్డి, భూరెడ్డి సంజీవరెడ్డి, బత్తుల విద్యాసాగర్, బద్దం వెంకటరెడ్డి, చురకంటి చంద్రారెడ్డి, బత్తుల సాయిలుగౌడ్, కనకటి వెంకన్న, కొమ్ము నాగేశ్వర్రావు, మహేశ్వరం మల్లికార్జున్, రేసు వెంకటేశ్వర్లు, సజ్జనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మన పథకాలు దేశంలోనే ఆదర్శం
బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకాలను ప్రవేశపెట్టి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంద ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన స్వగృహంలో వర్ని మండలం ఘన్పూర్ గ్రామస్తులు సర్పంచ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎకరాకు రూ. 4వేల చొప్పున ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదని, కర్ణాటక ప్రభుత్వం దీన్ని ఆదర్శంగా తీసుకొని అక్కడ ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. తమ ప్రభు త్వం గ్రామాల అభివృద్ధితో పాటు వ్యక్తిగతంగా ప్రతిఒక్కరికి సంక్షేమ ఫలాలను అందజేస్తోందని పేర్కొన్నారు. షాదీముబారక్, కల్యాణ లక్ష్మి, వృద్ధాప్య, వికలాంగ, ఒంటరి మహిళా పింఛన్లు అందిస్తోందన్నారు. ప్రతి ఒక్క గ్రామంలో మిషన్ కాకతీయ పేరుతో చెరువుల అభివృద్ధి, సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, వైకుంఠధామం నిర్మాణం చేపట్టామన్నారు. కాంగ్రెస్ సర్పంచ్ సహా 300 మంది చేరిక వర్ని మండలం ఘన్పూర్ సర్పంచ్ చందర్‌నాయక్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది గ్రామస్తులు ఆదివారం మంత్రి పోచారం సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ నిర్మాణానికి రూ. 16లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. కాగా పార్టీలో చేరిన వారిలో సర్పంచ్ చందర్‌నాయక్, ఉపసర్పంచ్ సాయగొండ, మాజీ సర్పంచ్ నర్సయ్య ఉన్నారు. కార్యక్రమంలో దేశాయిపేట సొసైటీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, వర్ని ఏఎంసీ చైర్మన్ నారోజి గంగారాం, పార్టీ మండలాధ్యక్షుడు వీర్రాజు, సొసైటీ చైర్మన్ వీర్రాజు, ఎంపీపీ బజ్యానాయక్, నాయకులు బద్యానాయక్, కిషోర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మహ్మద్ ఎజాస్, అంజిరెడ్డి, పోతురెడ్డి పాల్గొన్నారు. సమర్థమైన పాలన బీర్కూర్: సమర్థ, సుస్థిర పాలన అందించడంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన బీర్కూర్ మండలంలో పలువురు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు తాము అందించనున్న పెట్టుబడి సాయం పథకం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సహా కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించిందన్నారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని ఆదర్శంగా మార్చడానికి ఎంతో కృషి చేస్తున్నాని పేర్కొన్నారు. అనంతరం మాజీ ఎంపీపీ విజయ్‌ప్రకాశ్, కాంగ్రెస్ నాయకులు సాహెబ్రావు, ఐదుగురు వార్డు సభ్యులు, కులసంఘాల నాయకులకు, వందలాది మంది కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భారీ బైక్ ర్యాలీ దామరంచ నుంచి బీర్కూర్ వరకు ఆదివారం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయులు సురేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దామరంచ, అన్నారం, చించోలి, కిష్టాపూర్, బీర్కూర్‌లో మంత్రి టీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించారు. బీర్కూర్‌లోని బారడిపోచమ్మ, కామప్ప, హనుమాన్ మందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్లు పెర్కశ్రీనివాస్, నార్లసురేష్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్, నాయకులు బద్యానాయక్, మహ్మద్ ఎజాస్, ద్రోణవల్లి అశోక్, అప్పారావు, పల్లికొండ సాయిబాబా, రాజప్ప తదితరులు పాల్గొన్నారు. -
మన లాభాల కోడి
కంకిపాడు (పెనమలూరు): మహిళలకు ఆర్థికంగా చేయూత అందించేందుకు రూపొందించిన పథకమే ‘మనకోడి’. ఈ పథకం కింద లబ్ధిదారులకు రెయిన్బో రోస్టర్స్ జాతికి చెందిన కోడి పిల్లలను పంపిణీ చేస్తారు. మేలైన యాజమాన్య చర్యలు పాటించి వాటిని సంరక్షిస్తే కోళ్ల పెంపకం లాభదాయకంగా ఉంటుందంటున్నారు కంకిపాడు మండల పశువైద్యాధికారి డాక్టర్ కర్నాటి మాధవరావు. మన కోడి పథకం వివరాలు ఆయన మాటల్లోనే... అమలు ఇలా.. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మనకోడి పథకం అమలు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాకు 10 వేల యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కో లబ్ధిదారుకి 45 కోడి పిల్లలు పంపిణీ చేస్తారు. రెయిన్బో రోస్టర్స్ జాతికి చెందిన కోడి పిల్లలను పంపిణీచేస్తారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు మొదటి విడత 25 కోడిపిల్లలు, రెండో విడత మరో 20 పిల్లలుచొప్పున ఇస్తారు. జిల్లాకు మంజూరైన యూనిట్లలో 95 శాతం యూనిట్లు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు. మిగిలిన 5 శాతం యూనిట్లు ఇతరులకు కేటాయిస్తారు. ఒక్కో యూనిట్ విలువ రూ.4560. లబ్ధిదారులు చెల్లించాల్సి వాటా రూ.810. ఈ మొత్తాన్ని అర్జీదారు గ్రామీణ పశువైద్య కేంద్రాల్లో చెల్లించాలి. లేదా పశుసంవర్ధకశాఖ జేడీ పేరున డీడీ తీసి దరఖాస్తు చేసుకోవాలి. ఆర్థికంగా చేయూత మనకోడి పథకం కింద నెల రోజులు వయస్సు ఉన్న కోడి పిల్లలను లబ్ధిదారులకు పంపిణీచేస్తారు. పిల్లల పెంపకంలో తీసుకునే శ్రద్ధను బట్టి కోడి బరువు 4 నుంచి 5 కిలోలు వరకూ పెరుగుతాయి. మాంసంగా మార్కెట్లో విక్రయించేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఆడవి అయితే ఏడాదికి 180 వరకూ గుడ్లు పెడతాయి. మాంసం, కోడిగుడ్ల అమ్మకం ద్వారా ఆ కుటుంబానికి ఆర్థికంగా చేయూత లభిస్తుం దనటంలో ఎలాంటి సందేహం లేదు. లబ్ధిదారుడికి కోడి పిల్లలతో పాటుగా మేత పెట్టుకునేందుకు, నీరు పెట్టేందుకు గిన్నెలు, వాటి సంరక్షణకు మెస్‌లు కూడా అందిస్తారు. నిబంధనలు ఇవీ.. ♦ మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ♦ దరఖాస్తుదారులు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారై ఉండాలి. ♦ డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులై ఉండాలి. ♦ వ్యక్తిగత ధృవీకరణ పత్రాలతో దరఖాస్తులు అందించాలి. ♦ పూర్తి చేసిన దరఖాస్తులు ఈ నెల 31వ తేదీ లోపు సమీప పశువైద్య కేంద్రాల్లో అందించాలి. జాగ్రత్తలు తప్పనిసరి కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు కూడా తప్పనిసరి. ఎప్పటికప్పుడు తెగుళ్లు సోకకుండా, వ్యాధుల బారిన పడకుండా వాటిని సంరక్షించుకోవాలి. ఎక్కువగా ఒకదాన్ని ఒకటి పొడుచుకుని ఎక్కువగా గాయపడి చని పోయే అవకాశం ఉంది. కుక్కల బారిన పడకుండా చూడాలి. జాగ్రత్తలు పాటిస్తే మన కోడి లాభదాయకంగా ఉంటుంది. – డాక్టర్ కర్నాటి మాధవరావు, పశువైద్యాధికారి, కంకిపాడు -
మిమ్స్ ‘కన్నతల్లి’ పథకం భేష్
నెల్లిమర్ల: మిమ్స్ ఆసుపత్రిలో అమలుచేస్తున్న కన్నతల్లి పథకం నిరుపేద మహిళలకు వరమని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సీవీరావు అన్నారు. నెల్లిమర్ల పట్టణంలోనున్న మిమ్స్ వైద్య కళాశాలతో పాటు ఆసుపత్రిని బుధవారం ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో అమలుచేస్తున్న పథకాలు, వైద్యసేవలు గురించి ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద గర్భిణులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలనే ఉన్నత ఆశయంతో అమలుచేస్తున్న కన్నతల్లి పథకం తనకు ఎంతగానో నచ్చిందన్నారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం యాజమాన్యం ఉదారతకు నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా కన్నతల్లి పథకంద్వారా చిన్నారులకు కిట్లు అందజేశారు. కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ అల్లూరి సత్యనారాయణరాజు, డీన్ టీఏవీ నారాయణరాజు, ప్రిన్సిపాల్ లక్ష్మీకుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘురామ్, సంక్షేమాధికారి గిరిబాబు పాల్గొన్నారు. -
డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే ‘అమ్మ బైక్’
పళ్లిపట్టు: అమ్మ బైక్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగా మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన కారణంగా సోమవారం ప్రారంభమైన వినతిపత్రాల స్వీకరణ శిబిరాలు బోసిపోయాయి. ఫిబ్రవరి 24న జయలలిత జయంతి పురస్కరించుకుని ప్రయివేటు ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు 50 శాతం సబ్సిడీతో బైకులు అందజేసే పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం సోమవారం నుంచి ఫిబ్రవరి ఐదు వరకు ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేసే శిబిరాలు ఏర్పాటు చేశారు. వినతిపత్రాలు సమర్పించే మహిళలు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగిఉండాడాలనే నిబంధనల కారణంగా పలువురు దరఖాస్తులను పొందేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. దీంతో శిబిరాలు వెలవెలబోయాయి. సబ్సిడీతో బైకులు అందజేస్తామని ఆశచూపి, చివరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ప్రయివేటు సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న సర్టిఫికెట్లు, 40ఏళ్ల లోపు ఉండాలి వంటి ఆంక్షలు విధించడంతో ఎవరికి బైకులు ఇస్తారో చెప్పాలని మహిళలు ప్రశ్నిస్తున్నారు. -
అనుసంధానం అవశ్యం
కాజీపేట: అన్ని ప్రభుత్వ పథకాలు.. సేవలకు.. ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి. ఈ ఆధార్ లేకుంటే అన్నింటికీ ఇబ్బందే.. మొబైల్ నంబర్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని లేకుంటే కనెక్షన్ తొలగిస్తామంటూ వినియోగదారులకు పలు మొబైల్ నెట్వర్క్ కంపెనీలు ఇప్పటికే సందేశాలు పంపుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు వాడుతున్న మొబైల్ నంబర్ మీ ఆధార్ కార్డుకు అనుసంధానమైందో లేదో తెలుసుకోవాల్సి ఉంది. మీ ఆధార్‌కార్డుతో రిజిస్టరై ఉన్న మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత సమాచారం పరిశీలించుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి.. మీ మొబైల్ నుంచే.. స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి యూఐడీఏఐ వెబ్సైట్ జ్టి్ట htt pr//uidai.gov.i n https-//uidai.gov.in లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో తెలుగు భాషను ఎంచుకున్న తర్వాత స్క్రీన్‌పై ‘ఈ–మెయిల్, మొబైల్ నంబర్‌ను పరిశీలించుట’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఓ పేజీ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నంబర్ మాత్రమే అయితే.. ఈ–మెయిల్ / మొబైల్ నంబర్ పేజీలో మీ ఆధార్ సంఖ్యతో పాటు ఆధార్ నమోదు సమయంలో మీరిచ్చిన మొబైల్ నంబర్‌ను మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ కోడ్‌ను కూడా ఎంటర్ చేసి కింద కనిపించే గెట్ వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీరు పొందుపరిచిన వివరాలు, సరైనవైతే.. మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ కోడ్ వస్తుంది. ఆ ఓటీపీని అదే పేజీలో కుడిచేతి వైపు కనిపించే ఓటీపీ ఫీల్డ్‌లో ఎంటర్ చేయాలి. అలా చేసిన వెంటనే కంగ్రాట్యులేషన్స్ ది మొబైల్ నంబర్ మ్యాచెస్ విత్ అవర్ రికార్డ్స్ పేరుతో సిస్టంపై మెసేజ్ వస్తుంది. మెయిల్ ఐడీని మాత్రమే వెరిఫై చేసుకోవాలంటే.. వెరిఫై ఈ–మెయిల్ / మొబైల్ నంబర్ పేజీలో మీ ఆధార్ నెంబర్‌తో పాటు ఆధార్ నమోదు సమయంలో మీరిచ్చిన ఈ–మెయిల్ ఐడీని మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ కోడ్‌ను కూడా ఎంటర్ చేసి కింద కనిపించే గెట్ వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ)పై క్లిక్ చేయాలి. మీరు సబ్మిట్ చేసిన వివరాలు సరైనవైతే మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ కోడ్ అందుతుంది. ఆ ఓటీపీని అదే పేజీలో కుడి చేతి వైపు కనిపించే ఎంటర్ ఓటీపీ ఫీల్డ్‌లో నమోదు చేస్తే కంగ్రాట్యులేషన్ ది ఈ–మెయిల్ ఐడీ మ్యాచ్ విత్ ఆవర్ రికార్డ్స్ పేరుతో సిస్టంకు మెసేజ్ వస్తుంది. -
సర్కారు స్కీములన్నీ.. ఒకే క్లిక్ తో!
♦ వినూత్న సేవలందిస్తున్నఇండియన్ ఐరిస్ సోషల్ స్టార్టప్ ♦ ఒకే వేదికగా కేంద్ర రాష్ట్రాల పథకాలు, పాలసీలు ♦ పథకాల ఎంపిక, దరఖాస్తు విధానం, విశ్లేషణ కూడా.. ♦ ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో సంస్థ కో-ఫౌండర్ సాహిత్య సింధు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మీకు తెలుసా? కేరళ ప్రభుత్వం ‘ఎంటర్‌ప్రెన్యూర్స్ సపోర్ట్’ స్కీం కింద రబ్బర్, రెడీమేడ్ గార్మెంట్స్, ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ రంగాల్లో ఏర్పడే చిన్న, మధ్య తరహా కంపెనీలకు రూ.30 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది. ♦ అస్సాంలో ఎవరైనా పర్యాటక రంగంలో రూ.కోటి అంతకన్నా ఎక్కువ పెట్టుబడి పెడితే... వారు చెల్లించే పన్నుల్లో 25% ప్రభుత్వం తిరిగి ఇచ్చేస్తుంది. ♦ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులకు నర్సరీ నుంచి పీహెచ్డీ వరకు ఉచితంగా విద్యనందిస్తోంది. అలాగే ఎంపిక చేసిన 50 మంది విద్యార్థులకు విదేశాల్లో పై చదువులకయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తోంది. ♦ నిజానికివన్నీ తెలియటం కష్టం. రాష్ట్ర ప్రభుత్వాల పాలసీ వివరాల్ని స్థానిక మీడియా ద్వారా తెలుసుకోవచ్చు. కానీ పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేసే పాలసీలో? ఆయా రాష్ట్రాల వెబ్సైట్లో కూడా సమగ్రంగా ఉండటం కష్టం. పెపైచ్చు సందేహాలొస్తే తీర్చే నిపుణులు కూడా ఉండరు. మరెలా..? దీనికి పరిష్కారంగానే ఆరంభమైంది ‘ఇండియన్ ఐరిస్’!! కేంద్రం, దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, పాలసీ గురించి ఉంటుందిక్కడ. ప్రభుత్వ పథకాల గురించి గ్రామీణులను ఎడ్యుకేట్ చేయటమే తమ ప్రధాన లక్ష్యమంటున్నారు ఇండియన్ ఐరిస్ కో-ఫౌండర్, విశాఖపట్నానికి చెందిన సాహిత్య సింధు. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే... బెంగళూరులో ‘సిస్కో’లో పనిచేస్తున్నపుడు నేను ట్రిపుల్ ఐటీ అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లా. అక్కడ అచ్చం నాలాంటి ఆలోచనే ఉన్న నారాయణ్ సింగ్ రావుతో పరిచయం ఏర్పడింది. ‘‘దేశంలో కేంద్రం, స్థానిక రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, పాలసీ గురించి గ్రామీణ ప్రాంత ప్రజలకు అస్సలు అవగాహన ఉండట్లేదు. అవి నగరాలు, పట్టణాల వరకే పరిమితమవుతున్నాయి. గ్రామీణులకు సరైన విద్య, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడమే ఇందుకు కారణం. ప్రభు త్వ పథకాలు, బ్యాంకు రుణాల కోసం ఎక్కడికెళ్లాలో కూడా వారికి తెలియదు. ఎవరిని సంప్రదించాలో అర్థం కాదు. అందుకే చాలా వరకు ప్రభుత్వ పథకాలు ఆశించినంత సక్సెస్ కాలేకపోతున్నా యి. ఇంకా చెప్పాలంటే దుర్వినియోగం అవుతున్నాయి కూడా! 2015 జూన్‌లో ఇండియన్ ఐరిస్(ఠీఠీఠీ.్టజ్ఛిజీఛీజ్చీజీటజీట.ఛిౌఝ) సంస్థ ప్రారంభానికి కారణమైంది ఇదే. మా పనేంటంటే.. కేంద్రంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలు, పథకాల వివరాలను సేకరించి ఇండియన్ ఐరిస్ వెబ్సైట్లో పెట్టడమే. సంబంధిత పథకాలను ఎలా వినియోగించుకోవాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? డాక్యుమెంట్ల సేకరణ వంటి విషయాల్లోనూ సేవలందిస్తాం. అన్నీ ఉచితమే. 50కి పైగా విభాగాల్లో..: ప్రస్తుతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ), స్టార్టప్స్, సంక్షేమ పథకాలు వంటి 50కి పైగా విభాగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, పాలసీలు, ప్రోత్సాహకాల గురించి తెలుసుకోవచ్చు. హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో సేవలందిస్తున్నాం. త్వరలోనే అన్ని భారతీయ భాషల్లోనూ అనువాదం చేస్తాం. అవగాహన కోసం యాత్రలు..: మా సేవలను వినియోగించుకోవాలంటే మా వెబ్సైట్లో చూడాలి. అయితే అందరికీ ఇంటర్నెట్ ఉండదు కనక ప్రజల్లోకి నేరుగా వెళ్లి అవగాహన కల్పించాలని నిర్ణయించాం. ఇటీవలే బైకర్స్ క్లబ్‌తో కలసి రాజస్తాన్‌లో పర్యటించాం. ఇప్పుడు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో పర్యటించాలని నిర్ణయించుకున్నాం. నెలకు 40 వేల మంది..: ప్రస్తుతం మా వెబ్‌సైట్‌ను నెలకు 75-80 వేల మంది చూస్తున్నారు. 40 వేల మంది వినియోగించుకుంటున్నారు. ఇందులో దక్షిణాది వాటానే ఎక్కువ. ఇటీవలే జాయిన్ ఆర్ మొబైల్ యాప్‌ను విడుదల చేశాం. ప్రస్తుతం మా సంస్థలో 10 మంది ఉద్యోగులు, 100 మంది వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి అనూజ్, భరత్.. వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఈ ఏడాదిలో కన్సల్టెన్సీ సేవలు.. ‘‘డెయిరీ ఫాం, ఎంఎస్ఎంఈ పరిశ్రమ పెట్టాలనుకుంటున్నాం. కానీ ప్రభుత్వ సాయం, బ్యాంకు రుణాల గురించి తెలియట్లేదు. మీరు సహాయం చేయండని’’ మా సేవలు వినియోగించుకుంటున్న వారిలో చాలా మంది కోరారు. అందుకే సమాచారం ఇవ్వడంతో పాటూ పేపర్ వర్క్ నుంచి కంపెనీ ప్రారంభించే దాకా అన్ని విషయాలను దగ్గరుండి చూసుకునే కన్సల్టెన్సీ సేవల్ని ఆరంభించాలని నిర్ణయించాం. ఈ ఏడాది చివరికి అందుబాటులోకి తెస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...