సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ కొత్త వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ధరణి రద్దు చేయమని స్పష్టం చేశారు.
కాగా, బండి సంజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేయం. ధరణిలో సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, బీజేపీ అధికారంలోకి వస్తే.. కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు పొలిటికల్‌గా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఇదే సమయంలో కేసీఆర్ సర్కార్, కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైరయ్యారు. కాంగ్రెస్‌ను హైలైట్ చేయడానికే మోదీ మాకు మిత్రుడే అని కేసీఆర్ అంటున్నారు. బీఆర్‌ఎస్‌కు జిల్లా అధ్యక్షులు లేరు. బూత్ కమిటీలు లేవన్నారు. కాగా, బీజేపీకి జిల్లా అధ్యక్షులు ఉన్నారు. అసెంబ్లీ కన్వీనర్లు ఉన్నారు. మండట కమిటీలు ఉన్నాయి. బూత్ కమిటీలు ఉన్నాయని తెలిపారు. కేసీఆర్‌కు, మోదీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కేసీఆర్ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు.
మోదీ కేబినెట్‌పై ఒక్క అవినీతి మరక లేదు. ఇక, కేసీఆర్ కేబినెట్‌లో అవినీతి మరకలేని మంత్రి లేడు. కేసీఆర్ రోజు ఏం చేస్తున్నారు. రోజువారీ షెడ్యూల్ ఎందుకు బయటపెట్టడం లేదు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లరు. ప్రధాని వస్తే కలవరు. కాంగ్రెస్ పార్టీలో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అభ్యర్థులను కేసీఆర్ తయారు చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చిందే కేసీఆర్. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీని ఓడించడానికి కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే.. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. తెలంగాణపై కీలక నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment